MLA resign
-
బీజేడీకి షాక్.. రాజీనామా చేసిన సీనియర్ ఎమ్మెల్యే
భువనేశ్వర్: పార్లమెంట్ ఎన్నికలు, ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బిజూ జనతా దళ్(బీజేడీ) నేతలు ఆ పార్టీకి షాక్ ఇస్తున్నారు. తాజాగా ఐదుసార్లు ఎమ్మెల్యే అయిన అరబింద ధాలి శనివారం అధికార బీజేడీ పార్టీకి రాజీనామా చేశారు. అయిన బీజేపీ చేరనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అరబింద ధాలి కోరాధా జిల్లాలోని జయదేవ్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. ధాలి తన రాజీనామా పత్రాన్ని బీజేడీ అధ్యక్షుడు, సీఎం నవీన్ పట్నాయక్‌కు ఇ-మెయిల్ ద్వారా పంపారు. అయితే ఆయన రాజీనామా చేయడానికి గల కారణాలను వెల్లడించలేదు. ధాలి మొదటిసారి 1992లో బీజేపీ టికెట్‌పై మల్కాక్గిరి ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం రెండు పర్యాయాలు ఆ స్థానంలోనే ధాలి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత ధాలి బీజేడీలో చేరారు. 2009లో ఆయన జయదేవ్ నియోజకవర్గంలో విజయం సాధించారు. గత 2019లో కూడా ఇదే నియోజకవర్గంలో బీజేడీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలుపొందారు. నవీన్ పట్నాయక్ కేబినెట్లో ధాలి.. ట్రాన్స్‌పోర్టు మంత్రిగా పనిచేశారు. గత నెల.. బీజేడీ నుంచి బహిష్కరణకు గురైన ఇద్దరు ఎమ్మెల్యేలు పాణిగ్రాహి, ప్రశాంత్ జగదేవ్ ప్రతిపక్ష బీజేపీలో చేరారు. మాజీ రాష్ట్ర మంత్రి దేబాసిస్ నాయక్ సైతం ఇటీవల బీజేడీ నుంచి పార్టీ మారారు. ఒడిశాలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేతల రాజీనామాలు బీజేడీకి తలనొప్పిగా మారింది. -
కాంగ్రెస్‌లో ‘అయోధ్య’ చిచ్చు..!
న్యూఢిల్లీ: అయోధ్య రామమందిర అంశం పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చిచ్చు రేపుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నెల 22న జరిగే రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై సొంత పార్టీ నేతల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా గుజరాత్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీజే చావ్డా రామ మందిరంపై పార్టీ వైఖరికి నిరసనగా తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన స్పీకర్‌కు తన రాజీనామాను కూడా సమర్పించడం సంచలనం రేపింది. చావ్డా రాజీనామాతో గుజరాత్ అసెంబ్లీలో కాంగ్రెస్ బలం కేవలం 15కు పడిపోయింది. మూడుసార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన చావ్డా ఎన్నికల్లో బీజేపీ హవాను సైతం తట్టుకొని నిలబడ్డారు. రాజీనామా సందర్భంగా చావ్డా మాట్లాడుతూ ‘నేనెప్పుడూ అధికార పార్టీ విధానాల్లో లోపాలను ఎత్తి చూపడాన్ని బలంగా నమ్ముతాను. ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్రమోదీని అనవసరంగా టార్గెట్ చేస్తోంది. బీజేపీ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజారంజకంగా ఉన్నాయి’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలతో చావ్డా త్వరలో బీజేపీలో చేరతారనే పుకార్లు జోరందుకున్నాయి. ఇక గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంబరీశ్ దేర్ రామందిరంపై పార్టీ నిర్ణయాన్ని ఇటీవల ఎక్స్(ట్విటర్)లో తప్పుపట్టారు. ఈయనతో పాటు పోర్బందర్ ఎమ్మెల్యే గుజరాత్ పీసీసీ మాజీ చీఫ్ అర్జున్ మోత్వాడా కూడా రామమందిరంపై పార్టీ వైఖరిని బహిరంగంగానే విమర్శించారు. రాముని ప్రతిష్టాపన వేడుకకు దూరంగా ఉండాలనే నిర్ణయాన్ని పార్టీ తీసుకోకుండా ఉండాల్సిందని అన్నారు. मर्यादा पुरूषोत्तम भगवान श्री राम हमारे आराध्य देव हैं इसलिए यह स्वाभाविक है कि भारत भर में अनगिनत लोगों की आस्था इस नवनिर्मित मंदिर से वर्षों से जुड़ी हुई है।@INCIndia के कुछ लोगों को उस खास तरह के बयान से दूरी बनाए रखनी चाहिए और जनभावना का दिल से सम्मान करना चाहिए। (1/2) pic.twitter.com/elzFFyRHoe — Ambarish Der (@Ambarish_Der) January 10, 2024 भगवान श्री राम आराध्य देव हैं। यह देशवासियों की आस्था और विश्वास का विषय है। @INCIndia को ऐसे राजनीतिक निर्णय लेने से दूर रहना चाहिए था। pic.twitter.com/yzDTFe9wDc — Arjun Modhwadia (@arjunmodhwadia) January 10, 2024 కాగా, ఉత్తర్‌ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నేత ప్రమోద్ కృష్ణన్ అయితే ఒక అడుగు ముందుకు వేసి అయోధ్య రామ మందిర వేడుకపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం పార్టీకి ఆత్మహత్యా సదృశమని సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా అయోధ్య రాముని గుడి ప్రారంభోత్సవం లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్‌లో పడేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదీచదవండి.. అయోధ్యకు యూపీ ప్రభుత్వ విరాళమెంత -
కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. 10సార్లు ఎమ్మెల్యే, కీలక నేత రాజీనామా
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే కీలక నేతలు పార్టీని వీడి బీజేపీలో చేరారు. తాజాగా మరో సీనియర్ నేత, 10 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్‌సింగ్ రథ్వా రాజీనామా చేశారు. రెండు దశాబ్దాలకుపైగా ప్రతిపక్షంలోనే కూర్చున్న కాంగ్రెస్‌కు ఆయన రాజీనామాతో మరింత కష్టాల్లో కూరుకుపోయినట్లయింది. మంగళవారం తన రాజీనామాను గుజరాత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగదీశ్ థాకోర్కు అందించారు. 78 ఏళ్ల మోహన్‌సింగ్ రథ్వా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన క్రమంలో బీజేపీలో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన బుధవారం బీజేపీ తీర్థ పుచ్చుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన చోటా ఉదయ్‌పుర్(గిరిజన ప్రాతం) నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గిరిజన ప్రాంతంలో ఆయనకు మంచి పట్టుంది. 2012కు ముందు పావి జెట్పూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అయితే, ఈసారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని సంచలన ప్రకటన చేశారు రథ్వా. కానీ, ఆయన కుమారుడు రాజేద్రసింగ్ రథ్వాను తన స్థానంలో నిలబెట్టాలనుకున్నారు. తన నియోజకవర్గంలో సీటు ఇవ్వాలని కాంగ్రెస్‌ను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: నోట్ల రద్దుపై రాహుల్ వీడియో.. ‘పేపీఎం’ అంటూ మోదీపై ఫైర్ -
పార్టీకి, పదవికి మరో ఎమ్మెల్యే రాజీనామా.. ఎన్నికల వేళ గోవా కాంగ్రెస్ డీలా
పణజి: నలభై సీట్లున్న గోవా అసెంబ్లీలో 17 చోట్ల గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతం అత్యంత దారుణంగా తయారైంది. ఒకరి తర్వాత మరొకరు పార్టీని వీడుతూ వలసల పర్వాన్ని జోరెత్తించారు. సోమవారం తాజాగా దక్షిణ గోవాలోని కుర్టిమ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అలెక్సో రెజినాల్డో లారెన్కో తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెబుతూ రాజీనామా సమర్పించారు. దీంతో పార్టీలో మిగిలిపోయిన ఎమ్మెల్యేల సంఖ్య సోమవారానికి కేవలం రెండుకు పడిపోయింది. ఆయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని వార్తలొచ్చాయి. బీజేపీ ప్రభుత్వానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్దతు అస్సాంలో సీఎం హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌కు బయటి నుంచి మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే శశికాంత దాస్ సోమవారం ప్రకటించారు. ఇప్పుడే కాంగ్రెస్‌ను వీడబోనన్నారు. ‘తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రహా నియోజకవర్గ అభివృద్థి కోసమే ఆయన.. రాష్ట్ర సర్కార్‌కు మద్దతు ప్రకటించారు. బీజేపీలో చేరతారో లేదో నాకు తెలియదు’ అని సీఎం హిమంత చెప్పారు. -
‘కాంగ్రెస్ మనుగడ కష్టం.. త్వరలోనే బీజేపీలో చేరతాను’
డిస్పూర్: అసోం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రూప్‌జ్యోతి కుర్మి శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే బీజేపీలో చేరతానని తెలిపారు. అలానే శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన కుర్మి.. రాజీనామా లేఖను అసోం అసెంబ్లీ స్పీకర్ బిస్వాజిత్ డైమరీకి అందజేశారు. అస్సాం జోర్హాట్ జిల్లాలోని మరియాని నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న రూప్‌జ్యోతి కుర్మి పార్టీని వీడుతున్న సమయంలో సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ యువనాయకులను పట్టించుకోవడం లేదని ఆరోపించడమేకాక రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రూప్‌జ్యోతి కుర్మి మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ యువ నాయకుల సూచనలు పట్టించుకోవడం లేదు. మా మాట వినడం లేదు. ఫలితంగా అన్ని రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. రాహుల్ గాంధీ పార్టీ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా లేరు. ఆయన నాయకత్వ బాధ్యతలు స్వీకరించకపోతే పార్టీ ముందుకు సాగడం కష్టం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. అసెంబ్లీ స్పీకర్‌ని కలిసి నా రాజీనామాను అందజేస్తాను’’ అన్నారు. ‘‘ఇక అసోం నాయకులు వయసుమళ్లిన లీడర్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ సారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందుకే ఏఐడీయూఎఫ్‌తో పొత్తు వద్దని చెప్పాం. కానీ మా మాట వినలేదు. ఫలితం ఏంటో చూశారు’’ అంటూ రూప్‌జ్యోతి సంచలన ఆరోపణలు చేశారు. చదవండి: రాజస్తాన్ కాంగ్రెస్‌లో మళ్లీ అలజడి -
మమత డీలా.. మరో ఎమ్మెల్యే బీజేపీలోకి
కోల్కత్తా: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో పశ్చిమబెంగాల్లో రాజకీయాలు రంజుగా మారాయి. ఇప్పటికే కేంద్ర బడ్జెట్లో అత్యధికంగా బెంగాల్‌కు కేటాయింపులు జరగడంతో బీజేపీ ఉత్సాహంగా ఉంది. దీంతో పాటు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు పెరగడంతో బీజేపీ జోరు మీద ఉండగా ఎమ్మెల్యేల జంపింగ్‌తో ఆ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డీలా పడ్డారు. తాజాగా మరో ఎమ్మెల్యే టీఎంసీని వీడి బీజేపీలోకి చేరారు. మమతాబెనర్జీకి అండదండగా ఉన్న సువేందు అధికారి, రాజీవ్ బెనర్జీతో సహా మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు తృణమూల్ కాంగ్రెస్‌ను వీడారు. తాజాగా మరో ఎమ్మెల్యే కూడా పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆయనే డైమండ్ హార్బర్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే దీపక్ హల్దార్. పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని చెప్పి సోమవారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మంగళవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ నాయకులు ముకుల్ రాయ్, సువేందు అధికారి సమక్షంలో దీపక్ హల్దార్ బీజేపీలో చేరారు. ఆయనతో కలిపి మొత్తం 13 మంది తృణమూల్ కాంగ్రెస్‌ను వీడడంతో మమతా బెనర్జీ డీలా పడ్డారు. తృణమూల్ కాంగ్రెస్ నిరాశలో ఉంది. -
దీదీకి షాక్.. మరో ఎమ్మెల్యే రాజీనామా
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే సీనియర్ నేత సువేందు అధికారి టీఎంసీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మంత్రి పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి లక్ష్మి రతన్ శుక్లా తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ నేతలు ఒక్కొక్కరు టీఎంసీ వీడుతూ దీదీకి షాక్ ఇస్తున్నారు. ఈ క్రమంలో రతన్ శుక్లా తన రాజీనామా లెటర్ ఒక కాపీని ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, మరో దాన్ని గవర్నర్ జగదీప్ ధంకర్‌కు అందజేశారు. గతంలో బెంగాల్ రంజీ టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన రతన్ శుక్లా హౌరా(ఉత్తర) నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. రతన్ శుక్లా రాజీనామాపై స్పందిస్తూ.. ‘పార్టీకి, నాకు మధ్య ఎలాంటి విబేధాలు లేవు. రాజకీయాల నుంచి రిటైర్ అవుదామనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అన్నారు. (చదవండి: మమతకు వరుస షాక్‌లు.. స్పీకర్ ట్విస్టు!) ఇక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెంగాల్లో పాగా వేసేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ.. మమతకు కంటికి మీద కునుకు లేకుండా చేస్తోంది. సువేంధు అధికారి పార్టీ నుంచి బయటకు వచ్చిన నాటి నుంచి టీఎంసీలో చీలికలు మొదలయ్యాయి. ఇక కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా ఎన్నికల నాటికి టీఎంసీలో దీదీ మాత్రమే మిగులుతుందని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెబెల్ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సువేందు అధికారి తమ్ముడు కూడా బీజేపీలో చేరారు. సౌమేందు అధికారి తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని మునిసిపాలిటీకి కౌన్సిలర్, చైర్‌పర్సన్‌గా ఉన్నారు. గత వారం ఆయనతో కలిసి మరో డజను మంది ఇతర పార్టీ కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. అయితే అధికారి కుటుంబానికి చెందిన మరో ఇద్దరు సభ్యులు సువేందు అధికారి తండ్రి సిసిర్, సోదరుడు దిబ్యేండుల్‌లు మాత్రం టీఎంసీలో కొనసాగుతున్నారు. -
కాంగ్రెస్-జేడీ(ఎస్) సర్కార్‌కు షాక్
బెంగళూర్ : కర్నాటకలో కాంగ్రెస్, జేడీ(ఎస్) సంకీర్ణ సర్కార్ మరోసారి చిక్కుల్లో పడనుందనే సందేహాలు తలెత్తాయి. కాంగ్రెస్‌లో అసమ్మతి గుబులు రేపుతోందనే ప్రచారం నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన విజయనగర ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ సోమవారం తన శాసనసభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేయడం కలకలం రేపింది. ఆనంద్ రాజీనామాతో డీలా పడ్డ కాంగ్రెస్‌కు మరో ఏడుగురు రెబెల్ ఎమ్మెల్యేలు షాక్ ఇవ్వనున్నారనే సమాచారం ఆ పార్టీ వర్గాల్లో గుబులు రేపుతోంది. జిందాల్ కంపెనీకి భూముల విక్రయంపై హెచ్డీ కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ సర్కార్‌పై ఆనంద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు ఆనంద్ రాజీనామాపై కర్నాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ స్పందించారు. ఆనంద్ కుమార్ తనకు రాజీనామా లేఖ అందచేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. -
‘నైతిక హక్కు కోల్పోయా.. అందుకే రాజీనామా’
భువనేశ్వర్ : అత్యాచార బాధితురాలికి న్యాయం చేయలేకపోతున్నాననే ఆవేదనతో తన శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కోరాపుట్ ఎమ్మెల్యే కృష్ణ చంద్ర సాగరియా ప్రకటించారు. బాధితురాలికి న్యాయం చేయలేని తనకు ఎమ్మెల్యేగా కొనసాగే హక్కు లేదని ఆయన వ్యాఖ్యానించారు. ‘నిరుపేద దళిత అమ్మాయికి అన్యాయం జరిగింది. ఓ నిండు ప్రాణం బలైంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా నేనేమీ చేయలేకపోయాను. అంటే ప్రజాప్రతినిధిగా ఉండే నైతిక హక్కు కోల్పోయాను అందుకే ఈ రాజీనామా’ అంటూ ఈ కాంగ్రెస్ నాయకుడు వ్యాఖ్యానించారు. కాగా గతేడాది అక్టోబరు 10న కోరాపుట్‌లోని కుండలి గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. మార్కెట్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో పొట్టంగి పోలీసు స్టేషను పరిధిలో నలుగురు వ్యక్తులు ఆమెపై అకృత్యానికి పాల్పడ్డారు. తనకు న్యాయం చేయాలని, నిందితులను అరెస్టు చేయాలంటూ బాధితురాలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవపోవడంతో.. జనవరి 22న ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. రెడ్ ఫ్లాగ్ కేసుగా ప్రాచుర్యం పొందిన కేసులో ఇంతవరకు ఒక్క నిందితుడిని కూడా అరెస్టు చేయకపోవడం గమనార్హం. -
ఎమ్మెల్యే రాజీనామా చేయాలి
చండూరు :గట్టుప్పల గ్రామాన్ని మండలంగా మొదటి ముసాయిదాలో ప్రకటించి చివరగా రద్దు చేయడం పట్ల బాధ్యత వహిస్తూ మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి రాజీనామా చేయాలని సీపీఐఎంఎల్ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి అనంతరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మండలం కోసం చేస్తున్న నిరసనకు ఆ పార్టీ నేతలు సంఘీభావం తెలిపారు. మండల సాధన కమిటీ కన్వీనర్ ఇడెం కై లాసం అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. మొదటగా ప్రకటించి తర్వాత రద్దు చేయడంపై అధికార పార్టీ నాయకులే బాధ్యత వహించాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో ఇడెం విజయ్ కుమార్, మల్లేష్, కుండే సత్యనారాయణ, సత్తయ్య, నర్సింహ, నామని బుచ్చయ్య, బీమగోని మల్లేశం, కొంగరి కోటయ్య, క్రిష్ణ, యశ్వంత్, పరదీప్, రాజశేఖర్ ఉన్నారు. -
జయ కోసం అన్నా డీఎంకే ఎమ్మెల్యే రాజీనామా?
చెన్నై: తమిళనాడులో అన్నా డీఎంకే ఎమ్మెల్యే వెట్రివేల్ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఆమోదించినట్టు అసెంబ్లీ కార్యదర్శి చెప్పారు. రాజీనామా చేయడానికి కారణమేంటన్న విషయాన్ని వెట్రివేల్ వెల్లడించలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాధాకృష్ణన్ నియోజకవర్గం నుంచి వెట్రివేల్ ఎన్నికయ్యారు. అన్నా డీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత కోసమే ఆయన రాజీనామా చేసినట్టు భావిస్తున్నారు. 2011లో శ్రీరంగం నుంచి అసెంబ్లీకి ఎన్నికై ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జయలలిత.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలడంతో ఎమ్మెల్యే పదవిని కోల్పోవడంతో పాటు సీఎం పదవికి రాజీనామా చేశారు. కాగా కర్ణాటక హైకోర్టు.. జయలలితను నిర్దోషిగా ప్రకటించింది. దీంతో ఆమె మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగుగమైంది. జయలలిత ఉత్తర చెన్నైలోని రాధాకృష్ణన్ నగర్ నుంచి పోటీ చేయవచ్చనే వార్తలు వస్తున్నాయి. ఈ నెల 22 న జరిగే ఏఐఏడీఎంకే శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. ఇందులో జయలలిత తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది.