భువనేశ్వర్: పార్లమెంట్ ఎన్నికలు, ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బిజూ జనతా దళ్(బీజేడీ) నేతలు ఆ పార్టీకి షాక్ ఇస్తున్నారు. తాజాగా ఐదుసార్లు ఎమ్మెల్యే అయిన అరబింద ధాలి శనివారం అధికార బీజేడీ పార్టీకి రాజీనామా చేశారు. అయిన బీజేపీ చేరనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అరబింద ధాలి కోరాధా జిల్లాలోని జయదేవ్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. ధాలి తన రాజీనామా పత్రాన్ని బీజేడీ అధ్యక్షుడు, సీఎం నవీన్ పట్నాయక్‌కు ఇ-మెయిల్ ద్వారా పంపారు. అయితే ఆయన రాజీనామా చేయడానికి గల కారణాలను వెల్లడించలేదు.
ధాలి మొదటిసారి 1992లో బీజేపీ టికెట్‌పై మల్కాక్‌గిరి ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం రెండు పర్యాయాలు ఆ స్థానంలోనే ధాలి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత ధాలి బీజేడీలో చేరారు. 2009లో ఆయన జయదేవ్ నియోజకవర్గంలో విజయం సాధించారు. గత 2019లో కూడా ఇదే నియోజకవర్గంలో బీజేడీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలుపొందారు.
నవీన్ పట్నాయక్ కేబినెట్‌లో ధాలి.. ట్రాన్స్‌పోర్టు మంత్రిగా పనిచేశారు. గత నెల.. బీజేడీ నుంచి బహిష్కరణకు గురైన ఇద్దరు ఎమ్మెల్యేలు పాణిగ్రాహి, ప్రశాంత్ జగదేవ్ ప్రతిపక్ష బీజేపీలో చేరారు. మాజీ రాష్ట్ర మంత్రి దేబాసిస్ నాయక్ సైతం ఇటీవల బీజేడీ నుంచి పార్టీ మారారు. ఒడిశాలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేతల రాజీనామాలు బీజేడీకి తలనొప్పిగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment