భువనేశ్వర్ : ఒడిశాకు కాబోయే ముఖ్యమంత్రి? ఎవరనే ఉత్కంఠతకు బీజేపీ అధిష్టానం తెరదించింది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీని ఎంపిక చేసింది.
ఇటీవల రాష్ట్రానికి చెందిన ఇద్దరు సీనియర్ రాష్ట్ర నాయకులు ధర్మేంద్ర ప్రధాన్, జోయల్ ఓరంలకు కేంద్ర నాయకత్వం కేబినెట్ పదవుల్ని కట్టబెట్టింది. దీంతో ఒడిశా కొత్త సీఎంగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన,పార్టీ గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీ ఎంపిక ఖరారైంది. మోహన్ చరణ్ మాఝీతో పాటు డిప్యూటీ సీఎంలగా కేవీ సింగ్ డియో,ప్రవతి పరిదాలకు అవకాశం కల్పించింది. కియోంఝర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మాఝీ ప్రజా సేవ, సంస్థాగత నైపుణ్యాలు ముఖ్యమంత్రి పదవి వరించేలా చేశాయి.
డిప్యూటీ సీఎంలుగా
కేవీ సింగ్ డియో బోలంగీర్ నియోగజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా,బీజేపీ-బిజూ జనతాదళ్ కూటమి 2009 వరకు నవీన్ పట్నాయక్ ప్రభుత్వంలో తొమ్మిదేళ్లపాటు మంత్రిగా పనిచేశారు.
తీవ్ర కసరత్తు
ఇక 24ఏళ్ల తర్వాత ఒడిశా కొత్త ముఖ్యమంత్రి నియామకంపై కేంద్రం తీవ్ర కసరత్తు చేసేంది. సీఎం నియామకంపై కమలం అధిష్టానం పరిశీలకులుగా కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్‌లను పంపింది. భువనేశ్వర్‌లోని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి కీలక నేతలు, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, జువల్ ఓరమ్ కూడా హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment