
బెంగళూర్ : కర్నాటకలో కాంగ్రెస్, జేడీ(ఎస్) సంకీర్ణ సర్కార్ మరోసారి చిక్కుల్లో పడనుందనే సందేహాలు తలెత్తాయి. కాంగ్రెస్‌లో అసమ్మతి గుబులు రేపుతోందనే ప్రచారం నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన విజయనగర ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ సోమవారం తన శాసనసభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేయడం కలకలం రేపింది.
ఆనంద్ రాజీనామాతో డీలా పడ్డ కాంగ్రెస్‌కు మరో ఏడుగురు రెబెల్ ఎమ్మెల్యేలు షాక్ ఇవ్వనున్నారనే సమాచారం ఆ పార్టీ వర్గాల్లో గుబులు రేపుతోంది. జిందాల్ కంపెనీకి భూముల విక్రయంపై హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ సర్కార్‌పై ఆనంద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు ఆనంద్ రాజీనామాపై కర్నాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ స్పందించారు. ఆనంద్ కుమార్ తనకు రాజీనామా లేఖ అందచేయలేదని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment