Karnataka govt
-
కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత
-
కర్నాటకలో యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ మృతి
-
కంపెనీలు వెళ్లిపోతాయ్..!
ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు రిజర్వేషన్ ఉండాలంటూ కర్ణాటక ప్రభుత్వం ఇటీవల తెచ్చిన బిల్లుపై నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ బిల్లు 2024ను వెంటనే వెనక్కి తీసుకోవాలని సూచించింది. దీని వల్ల కంపెనీలు రాష్ట్రాన్ని విడిచివెళ్లే ప్రమాదం ఉందని తెలిపింది.నాస్కామ్ తెలిపిన వివరాల ప్రకారం..కర్ణాటక రాష్ట్రం సాంకేతిక రంగంలో ఎంతో వృద్ధి చెందింది. రాష్ట్ర జీడీపీలో ఈ రంగం వాటా 25 శాతంగా ఉంది. భారతదేశ డిజిటల్ టాలెంట్‌లో నాలుగింట ఒక వంతు ఇక్కడి నుంచే సమకూరుతుంది. 1,100 స్టార్టప్‌లు స్థానికంగా ఆవిష్కరణలు చేస్తున్నాయి. మొత్తం గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ)లో 30 శాతం కర్ణాటకలోనే కొలువు తీరాయి. ప్రభుత్వం తాజాగా స్థానికులకే ఉద్యోగాలు కేటాయించేలా బిల్లు తీసుకొచ్చింది. దాంతో దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు, వేరే దేశాలకు చెందినవారు కర్ణాటకలో పనిచేసే పరిస్థితులుండవు. టెక్ కంపెనీలు రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. భారీగా టెక్నాలజీ ఎగుమతులు చేస్తున్న రాష్ట్రంలో ఈ బిల్లు వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపై విస్తృతంగా సమీక్ష జరిపే విరమించుకోవాలి.కర్ణాటక స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ బిల్లు 2024 ప్రకారం..రాష్ట్రంలోని ప్రైవేట్ కంపెనీల్లో స్థానికులకు యాజమాన్య స్థాయిలో 50 శాతం, ఇతర పొజిషన్లలో 75 శాతం రిజర్వేషన్లు ఉండాలని నిర్ణయించారు. దీనివల్ల సాంకేతిక రంగంలో రాష్ట్రానికి ఉన్న అనుకూల వాతావరణంపై, ప్రతికూల ప్రభావం ఉంటుందని, పరిశ్రమ తిరోగమన బాట పడుతుందన్న పలువురు నిపుణుల హెచ్చరికలకు నాస్కామ్ కూడా గొంతు కలపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల కొరత ఉందని పలు నివేదికలు వెలువడుతున్న తరుణంలో ఇలాంటి బిల్లు విడుదల చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇదీ చదవండి: ఏసీ ఆన్ చేయమంటే క్యాబ్ డ్రైవర్ ఏం చేశాడో తెలుసా..?ప్రైవేట్ టెక్ కంపెనీల్లో గ్రేడ్ సీ, డీ ఉద్యోగాల్లో కన్నడిగులకు 100 శాతం రిజర్వ్ చేస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గతంలో ప్రకటించారు. స్థానిక అభ్యర్థులకు ప్రైవేట్ సంస్థలు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. -
ఏపీ బాటలో కర్ణాటక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషా సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు వైఎస్ జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన పిక్టోరియల్(»ొమ్మలతో కూడిన) డిక్షనరీల విధానాన్ని కర్ణాటక ప్రభుత్వం కూడా అమలు చేయబోతోంది. ఏపీ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల ఇంగ్లిష్ నైపుణ్యాన్ని పరిశీలించిన కర్ణాటక రాష్ట్ర అధికారులు తమ విద్యార్థులకు కూడా ఇదే తరహా డిక్షనరీలు ఇవ్వాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఏపీ ఎస్సీఈఆర్టీ) సాయంతో కన్నడ–ఇంగ్లిష్ భాషల్లో డిక్షనరీల తయారీని చేపట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ డిక్షనరీలను తమ విద్యార్థులకు అందించాలని భావిస్తోంది. పాఠాల్లోని పదాలతోనే డిక్షనరీ.. ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లిష్ మీడియం అమలుతో పాటు ప్రాథమిక స్థాయి విద్యార్థుల కోసం ఎస్సీఈఆర్టీ ఇంగ్లిష్–తెలుగు పిక్టోరియల్ డిక్షనరీని రూపొందించింది. 2021–22లో జగనన్న విద్యా కానుకలో భాగంగా ఒకటి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న 23,72,560 మంది విద్యార్థులకు ఈ డిక్షనరీలను ప్రభుత్వం అందించింది. అలాగే 2022–23లో ఒకటో తరగతిలో 3,55,280 మందికి, ఈ ఏడాది కేవీకే–4లో 3,08,676 మందికి కలిపి మొత్తం 30,36,516 డిక్షనరీలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న పాఠాల ఆధారంగానే ఏపీ ఎస్సీఈఆర్టీ రంగురంగుల బొమ్మలతో పిక్టోరియల్ డిక్షనరీని రూపొందించింది. దీంతో పాటు ‘లెర్న్ ఏ వర్డ్’ పేరుతో విద్యార్థులకు కొత్త ఇంగ్లిష్ పదాలు నేర్పేలా చర్యలు తీసుకుంది. వాటిని ఎలా పలకాలో, ఎప్పుడు వాడాలో కూడా ఉపాధ్యాయులు శిక్షణ ఇస్తున్నారు. ఈ విధానం కర్ణాటక అధికారులను ఆకర్షించింది. దీంతో వారు కూడా ఏపీఎస్సీఈఆర్టీ సహకారంతో తమ రాష్ట్రంలో కూడా పిక్టోరియల్ డిక్షనరీ రూపకల్పనకు చర్యలు చేపట్టారు. పూర్తి శాస్త్రీయంగా తయారీ ప్రాథమిక స్థాయి విద్యార్థులు సులభంగా ఇంగ్లిష్ నేర్చుకునేలా తగిన చర్యలు తీసుకున్నాం. ఒకటి నుంచి ఐదు తరగతులకు సంబంధించిన పాఠాల్లోని పదాలతోనే పిక్టోరియల్ డిక్షనరీని ఇంగ్లిష్–తెలుగు భాషల్లో పూర్తి శాస్త్రీయంగా రూపొందించాం. ప్రతిరోజు ఒక పదం నేర్పేలా స్కూళ్లకు ప్రణాళిక ఇచ్చాం. ఈ విధానం కర్ణాటక అధికారులకు నచ్చింది. తమ రాష్ట్రంలో కూడా అమలు చేస్తామన్నారు. డిక్షనరీ రూపకల్పనకు తగిన సహకారం అందిస్తున్నాం. – డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి, ఏపీ ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ -
రాజకీయ రంగంలో ఒకేరోజు రెండు విషాదాలు
బెంగళూరు: రాజకీయ రంగంలో ఒకేరోజు రెండు విషాదాలు చోటు చేసుకున్నాయి. కర్ణాటక, ఒడిశా మాజీ స్పీకర్లు మంగళవారం తుదిశ్వాస విడిచారు. కర్ణాటక శాసనసభ మాజీ స్పీకర్ దారదహళ్లి బైరేగౌడ చంద్రేగౌడ(87) ఈరోజు తెల్లవారుజామున చిక్కమగళూరు జిల్లా ముదిగెరె తాలూకా దారదహళ్లిలోని తన నివాసంలో కన్నుమూయగా, ఒడిశా మాజీ స్పీకర్ మహేశ్వర్ మొహంతి(67) భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1936 ఆగస్టు 26న జన్మించిన దారాదహళ్లి బైరేగౌడ.. రాజకీయంగా సుధీర్ఘసేవలు అందించారు. కర్ణాటక స్పీకర్‌గా మాత్రమే కాకుండా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా, రెండుసార్లు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. ప్రజా సోషలిస్టు పార్టీ నుంచి ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం.. జనతా దళ్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో కొనసాగింది. 1983-85 వరకు స్పీకర్‌గా పనిచేసిన ఆయన.. 1986లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. Former Speaker of Karnataka Legislative Assembly Daradahalli Byregowda Chandregowda passed away at his residence in Mudigere Taluk's Daradahalli in Chikmagalur District early morning today: Karnataka DIPR (file pic) pic.twitter.com/pk7texGTVG — ANI (@ANI) November 7, 2023 ఒడిశా మాజీ స్పీకర్ మహేశ్వర్ మొహంతి(67) బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందారు. భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మొహంతి కన్నుమూశారు. 2004-08 మధ్య ఒడిశా ప్రభుత్వంలో స్పీకర్‌గా పనిచేసిన మెహంతీ.. పూరి నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. సీఎం నవీన్ పట్నాయక్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. 2014లో దుండగుల కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడి కోలుకున్నారు. Odisha | Former Speaker and ex-minister Mahwswar Mohanty passed away while undergoing treatment at a private hospital in Bhubaneswar. (File photo) pic.twitter.com/ABrQkF7YgN— ANI (@ANI) November 7, 2023 ఇదీ చదవండి: మాజీ డ్రైవరే హంతకుడు -
కర్ణాటక విజయం... తెలంగాణలో సీతక్క సంబరాలు
-
కర్ణాటకలో "గృహ జ్యోతి" ఉచిత విద్యుత్ పథకం ప్రారంభం
కర్ణాటక: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన ఐదు ప్రధాన వాగ్దానాల్లో గృహ జ్యోతి కూడా ఒకటి. ఈ పథకం కింద లబ్దిదారులైన వారికి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు సబ్సీడీ అందించనుంది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మేరకు పథకానికి అర్హులైనవారిని ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్ లైన్లోనూ దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆహారం, విద్య, ఆరోగ్యం తోపాటు ఇతర నిత్యావసరాల ధరలు మిన్నంటుతున్న నేపథ్యంలో ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉచిత విద్యుత్ సబ్సీడీని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. మిగతా నాలుగు వాగ్దానాలతో పాటు ఉచిత విద్యుత్ సబ్సీడీ పాచిక కూడా పారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సొంతం చేసుకుంది. ఎన్నికల్లో చెప్పినట్లుగానే కర్ణాటక ప్రభుత్వం గృహ జ్యోతి పథకానికి శ్రీకారం చుట్టింది. లబ్దిదారులైన వారికి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును అందించనుంది. జూన్ 18 న మొదలైన దరఖాస్తు ప్రక్రియలో ఇప్పటికే 51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. సగటు నెలవారీ వినియోగం కంటే విద్యుత్తు వినియోగం తక్కువగా ఉన్న వినియోగదారులు అందరూ ఈ పథకానికి అర్హులేనని.. 200 యూనిట్ల కంటే తక్కువ వినియోగించుకునే వారికందరికీ ఈ సబ్సీడీ లభిస్తుందని.. 200 యూనిట్ల కంటే ఎక్కువగా వినియోగించుకునేవారు మాత్రం పూర్తి బిల్లును చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది ప్రభుత్వం. దరఖాస్తు చేసుకోవడమెలా? కర్ణాటక సేవాసంధు పోర్టల్ లోకి వెళ్లి కరెంటు బిల్లులో ఉన్నట్లుగా ఆధార్ కార్డు, కస్టమర్ ఐడి స్కాన్ చేసిన కాపీలను అప్లోడ్ చెయ్యాలి. ఆఫ్‌లైన్‌లో కూడా గృహ జ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. "బెంగుళూరు వన్", "గ్రామ వన్", "కర్ణాటక వన్" సెంటర్లకు వెళ్లి అక్కడ కూడా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది కర్ణాటక ప్రభుత్వం. ఇది కూడా చదవండి: డ్యూటీ టైమైపోయిందని విమానాన్ని మధ్యలోనే వదిలేసిన పైలెట్లు -
Karnataka Results: ఏ జిల్లాలో ఎవరు కింగ్?
బనశంకరి: అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్, కొన్ని జిల్లాల్లో బీజేపీ పట్టు కనబరిచాయి. మెజారిటీ జిల్లాల్లో హస్తం హవా కనిపించింది. తానూ ఉన్నానంటూ జేడీఎస్ కొన్ని చోట్ల సీట్లను సాధించింది. వివరాలు... -
కర్ణాటక రాజకీయాల్లో మఠాల ప్రభావం
-
జర్నలిస్టులకు లక్షల్లో ‘క్యాష్ గిఫ్ట్‌లు’.. బొమ్మై మెడకు మరో వివాదం!
బెంగళూరు: కర్ణాటక అధికార బీజేపీ ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. దీపావళి సందర్భంగా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కార్యాలయానికి చెందిన అధికారి ఒకరు జర్నలిస్టులకు ‘క్యాష్ గిఫ్ట్‌లు’ ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. పలువురు జర్నలిస్టులకు మిఠాయి బాక్సులతో పాటు రూ.లక్ష నుంచి రూ.2.50లక్షల వరకు నగదు పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సీఎంఓ స్వీట్ బాక్సులతో లంచాలు ఇచ్చిందని ఆరోపించింది. దీపావళి పండగను పురస్కరించుకుని పలు మీడియా సంస్థలకు చెందిన 10 మందికిపైగా సీనియర్ జర్నలిస్టులకు సీఎంఓ నుంచి స్వీటు బాక్సులు గిఫ్ట్‌లుగా వెళ్లాయి. అయితే అందులో మిఠాయిలతో పాటు రూ.లక్షల్లో డబ్బులు ఉన్నట్లు కొన్ని మీడియా కథనాలు వెల్లడించాయి. స్వీటు బాక్సుల్లో నగదు ఉన్నట్లు ముగ్గురు జర్నలిస్టులు స్వయంగా అంగీకరించినట్లు పేర్కొన్నాయి. సీఎం కార్యాలయం నుంచి వచ్చిన డబ్బును తిప్పి పంపించినట్లు అందులోని ఇద్దరు జర్నలిస్టులు వెల్లడించినట్లు ద న్యూస్ మినట్ పేర్కొంది. ‘సీఎం కార్యాలయం నుంచి నాకు స్వీట్ బాక్సు వచ్చింది. తెరిచి చూడగా అందులో రూ.1 లక్ష క్యాష్ ఉంది. ఈ విషయాన్ని మా ఎడిటర్స్‌కు తెలియజేశాను. ఆ నగదును తాను తీసుకోనని సీఎంఓ అధికారులకు తెలిపాను. ఇది చాలా తప్పు.’ అని మరో జర్నలిస్టు పేర్కొన్నారు. జర్నలిస్టులకు క్యాష్ గిఫ్ట్‌ల వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర దుమారానికి దారితీసింది. దీనిపై అవినీతికి వ్యతిరేకంగా పని చేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ.. కర్ణాటక లోకాయుక్తకు ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి బొమ్మై మీడియా అడ్వైజర్ పలు మీడియా సంస్థల చీఫ్ రిపోర్టర్లకు ఈ గిఫ్ట్‌లు అందించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ విమర్శలు.. జర్నలిస్టులకు నగదు గిఫ్ట్‌ల నేపథ్యంలో బీజేపీ సర్కారుపై ట్విటర్ వేదికగా కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.‘సర్కారు రూ.లక్షల్లో లంచాలు ఇచ్చేందుకు ప్రయత్నించింది. ఇది సీఎం ఆపర్ చేసిన లంచం కాదా? ఈ లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రభుత్వ ఖజానా నుంచా లేదా సీఎం వ్యక్తిగత ఖాతా నుంచా? దీనిపై ఈడీ/ఐటీ చర్యలు తీసుకుంటుందా? ఈ ప్రశ్నలకు బొమ్మై సమాధానం చెప్పగలరా?’ అని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా ట్విటర్లో విమర్శించారు. దీనిపై జ్యుడిషియల్ దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇదీ చదవండి: సీఎం ముఖచిత్రంతో ‘పేసీఎం’.. కర్ణాటక సర్కార్‌పై కాంగ్రెస్ అస్త్రం! -
సంచలనం: ఓలా, ఉబెర్, ర్యాపిడో ఆటో సర్వీసులపై నిషేధం
బెంగళూరు: క్యాబ్ సర్వీసుల సంస్థలపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్‌లైన ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటో సర్వీసులపై నిషేధం విధించింది. నిబంధనలు పాటించకుండా, చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ సర్కార్ మూడు రోజుల్లో సేవలను నిలిపివేయాలని ఓలా, ఉబెర్, ర్యాపిడోలను ఆదేశించింది. కర్ణాటక రవాణా శాఖ వాహన అగ్రిగేటర్లకు నోటీసులు జారీ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఓలా, ఉబెర్‌లు రెండు కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ఉన్నప్పటికీ కనీసం రూ. 100 వసూలు చేస్తున్నాయని పలువురు ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ఈ మేరకు రవాణా శాఖ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనలను ధిక్కరించి అగ్రిగేటర్లు సేవలను నిర్వహిస్తున్నారు. అదనంగా, ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే ఎక్కువ ధరలను వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ టిహెచ్ఎం కుమార్ నోటీసులో పేర్కొన్నారు. ఆటో సర్వీసులను నిలిపివేయాలని, ప్రభుత్వం నిర్దేశించిన ఛార్జీల కంటే ఎక్కువ చార్జీలను ప్రయాణికుల నుంచి వసూలు చేయకూడదని పేర్కొన్నారు. రాష్ట్రంలో కనీస ఆటో ఛార్జీ మొదటి 2 కి.మీకి రూ.30, ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు రూ.15గా నిర్ణయించారు. ప్రభుత్వం నిర్దేశించిన ఛార్జీల కంటే క్యాబ్‌లలో ప్రయాణికుల నుంచి ఎక్కువ ఛార్జీలు వసూలు చేయవద్దని నోటీసులో సూచించారు. ఆదేశాలను పాటించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటా మని కూడా ఆయన హెచ్చరించారు. -
కర్ణాటక మంత్రి ఉమేష్ కత్తి హఠాన్మరణం
-
కర్ణాటక మంత్రి ఆడియో కలకలం.. సీఎం బొమ్మైకి కొత్త చిక్కులు!
బెంగళూరు: కర్ణాటకలో మరోమారు ముఖ్యమంత్రి మార్పు ఉండనుందనే ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర మంత్రి ఆడియో లీక్ కావటం కలకలం సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. ‘తాము ప్రభుత్వాన్ని నడపటం లేదు.. మేనేజ్ చేస్తున్నాం’ అంటూ న్యాయ, పార్లమెంటరీ వ్యవహరాలశాఖ మంత్రి జేసీ మధుస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే మంత్రి వ్యాఖ్యలతో జరిగిన నష్టాన్ని పూడ్చే ప్రయత్నం చేశారు బొమ్మై. ఆ వ్యాఖ్యలు వేరే ఉద్దేశంతో చేసినవిగా సీఎం పేర్కొన్నారు. కాగా మంత్రి జేసీ మధుస్వామి చేసిన వ్యాఖ్యలతో కొందరు మంత్రులు విమర్శలు గుప్పించారు. పదవి నుంచి మధుస్వామి తప్పుకోవాలని ఉద్యానవన శాఖ మంత్రి మునిరత్నం సూచించారు. ఈ క్రమంలో మంత్రులతో తాను మాట్లాడనున్నట్లు సీఎం చెప్పారు. మధుస్వామిపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఆయన(మధుస్వామి) వేరే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారు. ఆయనతో మాట్లాడతాను. తన ఉద్దేశం వేరు. ఆ మాటలను తప్పుడు ఉద్దేశంతో చూడకూడదు. పరిస్థితులు సరిగానే ఉన్నాయి. ఎలాంటి సమస్య లేదు. ఇతర మంత్రులతోనూ మాట్లాడతాను.’ అని పేర్కొన్నారు. కర్ణాటక మంత్రి మధుస్వామి, చెన్నపట్నానికి చెందిన సామాజిక కార్యకర్త భాస్కర్ మధ్య జరిగిన సంభాషణ ఆడియో శనివారం వైరల్‌గా మారింది. రైతుల సమస్యలను సూచిస్తూ కోఆపరేటివ్ బ్యాంకుపై భాస్కర్ ఫిర్యాదు చేసిన క్రమంలో..‘ఇక్కడ మేము ప్రభుత్వాన్ని నడపటం లేదు, కేవలం మేనేజ్ చేస్తున్నాం. మరో 7-8 నెలలు లాక్కొస్తాం.’ అని మధుస్వామి పేర్కొన్నారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మరోమారు ముఖ్యమంత్రి మార్పు చేసేందుకు బీజేపీ ఆలోచిస్తోందన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ ఆడియో లీక్ కలకలం సృష్టిస్తోంది. ఇదీ చదవండి: బాలుడి హత్య.. కాంగ్రెస్‌లో ముసలం, ఎమ్మెల్యే రాజీనామా -
హిజాబ్ వివాదం : హైకోర్టులో కర్ణాటక ప్రభుత్వం ఏం చెప్పిందంటే..?
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం కర్ణాటక ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్(ఏజీ) ప్రభులింగ్ నవాద్గీ వాదనలకు ప్రాధాన్యత సంతరించుకుంది. కేసు విచారణలో భాగంగా ఏజీ.. హిజాబ్ ఇస్లాం మతానికి అవసరమైన మతపరమైన ఆచారం కాదని, దాని ఉపయోగాన్ని నిరోధించడం మత స్వేచ్ఛను అడ్డుకున్నట్టు కాదన్నారు. మత స్వేచ్ఛకు హామీనిచ్చే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-25ను ఉల్లంఘించినట్టుకాదని చెప్పారు. హిజాబ్ లేదా కాషాయ కండువాలు ధరించకుండా నిషేధిస్తూ ఫిబ్రవరి 5న కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేసిన కొంతమంది ముస్లిం బాలికల చేసిన ఆరోపణలను ఏజీ తిరస్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారమే ఉత్తర్వులు జారీ చేసిందని కోర్టుకు తెలిపారు. వారు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఈ క్రమంలో అన్ని వర్గాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు తీర్పును వెల్లడించనుంది. ఈ వివాదంలో హైకోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
కరోనాకు బ్రేకులు, ప్రగతిలో పరుగులు
సాక్షి, బెంగళూరు: కరోనా వైరస్ కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుందని గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ పేర్కొన్నారు. విద్య, ఆరోగ్యం, జలవనరులు ఇలా అన్ని రంగాల్లో ప్రభుత్వం ప్రగతి సాధించిందని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదట గవర్నర్ గెహ్లాట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. కోవిడ్ సవాళ్లను ప్రభుత్వం స్వీకరించి ఎదుర్కొందన్నారు. కరోనా నిర్వహణ, టీకా పంపిణీ సక్రమంగా చేసినట్లు చెప్పారు. ఆయన కన్నడ భాషలో ప్రసంగం ఆరంభించి తర్వాత హిందీలో మాట్లాడారు. వందేమాతరం గీతంతో సమావేశాలు ప్రారంభించారు. బెంగళూరులో మెరుగ్గా వసతులు.. ఆరోగ్య రంగానికి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇచ్చిందని గవర్నర్ అన్నారు. బెంగళూరు మెట్రో రైలు ఫేజ్ –2 పనులు 2022– 23 నాటికి పూర్తయి, ప్రజలకు సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు బెంగళూరుకు తాగునీటిని అందించేందుకు తిప్పగొండనహళ్లి జలాశయం పునఃప్రారంభించి నీటి శుద్ధీకరణ చేయనున్నట్లు తెలిపారు బెంగళూరు నగర మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.8 వేల కోట్లు కేటాయింపు. రాజధానిలో మెట్రో, బీఎంటీసీ, తాగునీరు, విద్యుత్ వసతులు మెరుగ్గా ఉన్నాయన్నారు. దివంగత ప్రముఖులకు సంతాపం.. గవర్నర్‌కు అసెంబ్లీ వద్ద రాచ లాంఛనాలతో ఘన స్వాగతం పలికారు. సీఎం బొమ్మై, ఉభయ సభల స్పీకర్లు, మంత్రులు ఆయనకు స్వాగతం పలికి అసెంబ్లీలోకి తోడ్కొని వెళ్లారు. భారతరత్న లతా మంగేష్కర్తో పాటు ఇటీవల కాలంలో మరణించిన ప్రముఖులకి అసెంబ్లీలో సంతాపం తెలిపారు. నల్లగుడ్డలతో కాంగ్రెస్ సభ్యులు.. ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు చేతికి నల్ల బట్ట కట్టుకుని అసెంబ్లీకి వచ్చారు. హిజాబ్ – కేసరి శాలువా వివాదాన్ని నిరసిస్తూ నల్లగుడ్డ కట్టినట్లు తెలిపారు. రాజకీయాల కోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం సరికాదన్నారు. -
కాయిన్ వేస్తే బియ్యం..
సాక్షి, బెంగళూరు: నగదు డ్రా చేసుకునే ఏటీఎం తరహాలో బియ్యం కోసం ఏటీఎంలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం బీపీఎల్ కార్డు కలిగిన వారికి ఉచితంగా, ఏపీఎల్ కార్డు కలిగిన వారికి నిర్ధిష్ట మొత్తంలో నగదు చెల్లించి బియ్యం, పప్పులు పొందే పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తూ వస్తోంది. అయితే సరుకుల కోసం రేషన్ దుకాణాలు తెరిచే సమయానికి వెళ్లి గంటల కొద్దీ క్యూలో నిల్చోవాల్సి వస్తోంది. ఈ సమస్యలన్నింటికి చెక్ పెడుతూ ఏ సమయంలోనైనా బియ్యం తీసుకునేలా ఏటీఎంలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విధానం ప్రపంచంలోని ఇండోనేసియా, వియత్నాం దేశాల్లో మాత్రమే అమలులో ఉంది. కరోనా నేపథ్యంలో వినియోగదారులు క్యూలో నిల్చోకుండా ఈ విధానాన్ని ఆయా దేశాల్లో అమలు చేస్తున్నారు. దీన్ని కర్ణాటకలో కూడా అమలు చేస్తే ఎలా ఉంటుందనే విషయంపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి కె.గోపాలయ్య కూడా ఇటీవల ధ్రువీకరించారు. ఏటీఎం రైస్ వ్యవస్థపై చర్చ సాగుతోందని, ఈ కార్యక్రమ సాధ్యాసాధ్యాలపై సమగ్రంగా యోచిస్తున్నట్లు మంత్రి తెలిపారు. -
ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తివేత
సాక్షి, అమరావతి/ శ్రీశైలం ప్రాజెక్ట్/ బెంగళూరు: కృష్ణా, ఉప నదులు మలప్రభ, ఘటప్రభల నుంచి శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు 1,41,389 క్యూసెక్కులు చేరుతుండటం, వరద ఉద్ధృతి గంట గంటకూ పెరుగుతుండటంతో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) మార్గదర్శకాల మేరకు కర్ణాటక సర్కార్ ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తివేసింది. దిగువకు 1.80 లక్షల క్యూసెక్కులు వదిలేస్తున్నారు. ఆ ప్రవాహం నారాయణపూర్ డ్యామ్‌లోకి చేరుతుండటంతో.. ముందు జాగ్రత్త చర్యగా డ్యామ్‌ను ఖాళీ చేస్తూ దిగువకు 1,87,678 క్యూసెక్కులు వదిలేస్తున్నారు. ► ఈ నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు నుంచి వరద ప్రవాహాన్ని విడుదల చేస్తున్నారు. దాంతో శ్రీశైలంలోకి గంట గంటకూ వరద ప్రవాహం పెరుగుతోంది. ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి కొనసాగిస్తూ 38,140 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ► అప్పర్ తుంగ, భద్ర డ్యామ్‌లు నిండటంతో వరద నీటిని విడుదల చేస్తుండటంతో నీటి నిల్వ 49.78 టీఎంసీలకు చేరుకుంది. మరో 51 టీఎంసీల ప్రవాహం వస్తే తుంగభద్ర డ్యామ్ నిండిపోతుంది. ► పశ్చిమ కనుమల్లో శుక్రవారం విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో కృష్ణా, ఉప నదులకు శనివారం వరద ప్రవాహం పెరుగుతుందని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అంచనా వేసింది. -
మందు బంద్.. 50మంది మాత్రమే
బెంగళూరు: పెళ్లి అంటే ఒకప్పుడు బంధువుల హడావుడి.. డీజే సందడి, మందు-విందు కనిపించేవి. కానీ కరోనా దెబ్బతో ఇలాంటి వేడుకల స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఇప్పటికే ఇలాంటి వేడుకల మీద అన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. తాజాగా కర్ణాటక ప్రభుత్వం కూడా ఇందుకు సంబంధించి నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. పెళ్లి, ఇతర శుభకార్యాల్లో మందుకు అనుమతిలేదని.. 50 మందికి మించి ఈ వేడుకలకు హాజరు కాకుడదని తెలియజేసింది. ఈ నెల 17న దేశవ్యాప్తంగా మూడో దశ లాక్డౌన్ ముగియనుండటంతో కర్ణాటక ప్రభుత్వం ఈ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. (మాస్క్ ధరించడం ‘బలహీనతకు సంకేతం’! ) పెళ్లి, ఇతర ప్రైవేట్ ఫంక్షన్లకు 50మందికి మించి అనుమతి లేదని కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. అలానే ప్రతి ఒక్కరి మొబైల్లో ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరి అంది. పదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్ల పైబడిన వారిని ఈ వేడుకలకు అనుమతించేది లేదని స్పష్టం చేసింది. వేడుకకు హాజరయ్యే వారి పూర్తి వివరాలను సేకరించాలని సూచించింది. అంతేకాక వేడుక జరిగే చోట శానిటైజర్, థర్మల్ స్క్రీనింగ్, మాస్క్‌లు ఖచ్చితంగా ఉండాలని ఆదేశించింది. మరి ముఖ్యంగా ఈ వేడుకల్లో మద్యపానానికి ఎట్టి పరిస్థితుల్లోను అనమతిచ్చేది లేదని కర్ణటక హోం శాఖ తెలిపింది. అలానే కంటైన్మెంట్ జోన్లలోని ప్రజలు ఈ వేడుకలకు ఎట్టి పరిస్థితుల్లో హాజరుకాకుడదని పేర్కొంది.(లాక్డౌన్: ముంబై నుంచి బిహార్‌కు ఆటోలో) -
సద్దుమణిగిన సరిహద్దు
పలమనేరు/గంగవరం (చిత్తూరు జిల్లా): కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో చిక్కుకుపోయిన మత్స్యకారులను ఏపీలోకి అనుమతించే విషయమై తలెత్తిన వివాదం ఏపీ ప్రభుత్వం చొరవతో సద్దుమణిగింది. వారిని ఆంధ్రప్రదేశ్‌లోకి అనుమతించడానికి తమకేమీ అభ్యంతరం లేదని.. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా 14 రోజులపాటు వారిని అక్కడే క్వారంటైన్లో ఉంచి ఇక్కడకు పంపిస్తే మంచిదని ఏపీ ప్రభుత్వం సూచించడంతో కర్ణాటక ప్రభుత్వం అందుకు ఆమోదం తెలిపింది. ఇందుకు మత్స్యకారులు కూడా అంగీకరించటంతో సమస్య పరిష్కారమైంది. ఇదీ జరిగింది : మన రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విజయవాడ, ప్రకాశం, నెల్లూరు తదితర జిల్లాలకు చెందిన సుమారు 1,400 మంది మత్స్యకారులు ఉపాధి నిమిత్తం కొన్ని రోజుల క్రితం మంగళూరు హార్బర్లో చేపలు పట్టేందుకు వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో వీరంతా అక్కడే తలదాచుకున్నారు. గురువారం అక్కడి అధికారులు మీ ఊళ్లకు వెళ్లొచ్చని చెప్పి వారందరినీ పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండలం సమీపంలోని ఏపీ–కర్ణాటక సరిహద్దుకు చేర్చారు. ఈ విషయాన్ని కర్ణాటక–ఏపీ సరిహద్దులో గస్తీ కాస్తున్న ఏపీ పోలీసులు చిత్తూరు కలెక్టర్ భరత్ నారాయణ్‌గుప్తకు తెలియజేయగా.. ఆయన కర్ణాటక అధికారులతో మాట్లాడారు. దీంతో కర్ణాటకలోని కోలారు జిల్లా కలెక్టర్ సత్యభామ, ఎస్పీ కార్తీక్‌రెడ్డి అక్కడకు చేరుకుని వీరిని ఎక్కడ ఉంచాలనే విషయంపై చర్చలు జరిపారు. హెల్త్ ప్రొటోకాల్‌ను అనుసరించి వారందరినీ కర్ణాటకలోని ముళబాగిళు వద్ద ఉంచి.. వైద్య పరీక్షలు నిర్వహించి 14 రోజుల తరువాత ఏపీకి పంపిస్తామని కర్ణాటక అధికారులు చెప్పారు. ఇందుకు ససేమిరా అన్న మత్స్యకారులు తమను ఆంధ్రాలోకి పంపించాల్సిందేనంటూ భీష్మించారు. అధికారుల మాటను ఖాతరు చేయకుండా సరిహద్దు దాటి ఏపీలోకి చొరబడేందుకు యత్నించారు. ఫలించిన చర్చలు : పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ కర్ణాటకలోని కోలారు ఎంపీ మునస్వామి, ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ, ముళబాగిళు ఎమ్మెల్యే నాగేష్తో మాట్లాడారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు శుక్రవారం రాత్రి చర్చలు జరిపాయి. మత్య్సకారులను ఆంధ్రప్రదేశ్‌లోకి అనుమతించడానికి తమకు అభ్యంతరం లేదని.. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో హెల్త్ ప్రొటోకాల్‌ను దృష్టిలో ఉంచుకుని 14 రోజులపాటు వారిని అక్కడే క్వారంటైన్లో ఉంచి ఏపీకి పంపిస్తే మంచిదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో మత్స్యకారులను కర్ణాటకలోనే క్వారంటైన్లో ఉంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించింది. ఇందుకు మత్స్యకారులు కూడా అంగీకరించడంతో కర్ణాటక నుంచి ప్రత్యేక బలగాలు సరిహద్దు ప్రాంతానికి చేరుకుని వారిని ప్రత్యేక వాహనాల్లో వెనక్కి తీసుకెళ్లాయి. మత్స్యకారులను కోలార్, ముళబాగిళు ప్రాంతాలకు తరలించి అక్కడి కల్యాణ మండపాలు, పాఠశాలలు, కళాశాలల్లో కర్ణాటక ప్రభుత్వం వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తోందని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్–2 చంద్రమౌళి మీడియాకు తెలిపారు. వారందరికీ అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తారని ఆయన చెప్పారు. -
కాంగ్రెస్-జేడీ(ఎస్) సర్కార్‌కు షాక్
బెంగళూర్ : కర్నాటకలో కాంగ్రెస్, జేడీ(ఎస్) సంకీర్ణ సర్కార్ మరోసారి చిక్కుల్లో పడనుందనే సందేహాలు తలెత్తాయి. కాంగ్రెస్‌లో అసమ్మతి గుబులు రేపుతోందనే ప్రచారం నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన విజయనగర ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ సోమవారం తన శాసనసభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేయడం కలకలం రేపింది. ఆనంద్ రాజీనామాతో డీలా పడ్డ కాంగ్రెస్‌కు మరో ఏడుగురు రెబెల్ ఎమ్మెల్యేలు షాక్ ఇవ్వనున్నారనే సమాచారం ఆ పార్టీ వర్గాల్లో గుబులు రేపుతోంది. జిందాల్ కంపెనీకి భూముల విక్రయంపై హెచ్డీ కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ సర్కార్‌పై ఆనంద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు ఆనంద్ రాజీనామాపై కర్నాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ స్పందించారు. ఆనంద్ కుమార్ తనకు రాజీనామా లేఖ అందచేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. -
కర్ణాటక కరుణించె
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ దౌత్యం ఫలించింది. కర్ణాటక ప్రభుత్వం కరుణించింది. భానుడి ప్రతాపానికి ప్రియదర్శిని జూరాలలో నీటిమట్టం డెడ్‌స్టోరేజీకి పడిపోయి.. తాగునీటి ప్రమాద ఘంటికలు మోగుతోన్న ఉమ్మడి పాలమూరు జిల్లాకు నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక ఒప్పుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర అధికారులతో చర్చించిన సీఎం కుమారస్వామి శుక్రవారం రాత్రి నారాయణపూర్ జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌తో ఫోన్లో మాట్లాడారు. ఆదివారం తెల్లవారుజాము వరకు నీరు జూరాల ప్రాజెక్టులో చేరనుంది. జూరాల నుంచి రామన్‌పాడు, బీమా, కోయిల్‌సాగర్, కేఎల్ఐ తదితర ప్రాజెక్టుల్లో నీరు చేరనుంది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లావాసుల తాగునీటి సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలు నెలకొన్నాయి. ఇదీలా ఉంటే కర్ణాటక విడుదల చేసే 2.5 టీఎంసీలలో ఒక టీఎంసీ నీరు మధ్యనే ఆవిరైపోతుందని, కేవలం 1.5 టీఎంసీ మాత్రమే జూరాలకు చేరుకుంటుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ప్రతిరోజూ 100క్యూసెక్కుల నీరు ఆవిరి ఉమ్మడి పాలమూరు జిల్లాలో 60శాతానికి పైగా గ్రామాలకు జూరాల ప్రాజెక్టు నుంచే తాగునీరు సరఫరా అవుతోంది. అయితే ఈ సారి భానుడు నిప్పులు చెరుగుతుం డడంతో ప్రతిరోజూ సుమారు వంద క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం గణనీయంగా తగ్గుతూ వచ్చింది. 9.66 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో 3 టీఎంసీల నీరు ఉంటే దాన్ని డెడ్‌స్టోరేజీగా పరిగణిస్తారు. కానీ ప్రస్తుతం జలాశయంలో 1.93 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉంది. అంటే డెడ్‌స్టోరేజీ కంటే ఒక టీఎంసీకి పైగా నీళ్లు తక్కువగా ఉందన్న మాట. నీటి లభ్యత లేకపోవడంతో ప్రధాన గ్రిడ్ ద్వారా ఆవాసా ప్రాంతాలకు తాగునీటి సరఫరాకు ఇబ్బందులు మొదలయ్యాయి. చాలా చోట్ల నీటి కోసం ప్రజలు కష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో జూరాలలో తగ్గుతోన్న నీటి మట్టంపై ఆందోళన చెందిన ఇరిగేషన్ అధికారులు సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 3 టీఎంసీల నీటిని విడుదల చేసి.. పాలమూరు జిల్లా ప్రజల దాహార్తిని తీర్చాలని గత నెలలోనే కర్ణాటక సీఎం కుమారస్వామికి లేఖరాశారు. లేఖపై స్పందించిన కర్ణాటక సీఎం అధికారులతో చర్చించి ప్రాజెక్టు నుంచి రెండున్నర టీఎంసీల నీటి విడుదలకు అంగీకారం తెలిపారు. జూరాలే కీలకం.. ప్రస్తుతం జూరాల వద్ద ఉన్న ప్రధాన గ్రిడ్ నుంచి జోగుళాంబ గద్వాల జిల్లాలోని 319 గ్రామాలకు మిషన్ భగీరథ తాగునీరు ప్రతి రోజూ 50ఎంఎల్డీ సరఫరా అవుతోంది. ప్రస్తుతం నీటిమట్టం తగ్గిన నేపథ్యంలో అధికారులు అప్రోచ్ కెనాల్‌ను జేసీబీలతో సరి చేస్తూ నీరు సరఫరా చేస్తున్నారు. మరోవైపు జూరాల ఎడమ కాల్వ ద్వారా విడుదలయ్యే నీటిని వనపర్తిలో ఉన్న రామన్‌పాడు ప్రాజెక్టుకు నీటిని తరలిస్తారు. ప్రస్తుతం అక్కడి నుండి వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో ఉన్న 500 గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. అయితే రామన్‌పాడులోనూ నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది. రానున్న రోజుల్లో ఆయా గ్రామాలకు తాగునీటి సరఫరా ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కావడం ఆయా ప్రాంతాల్లో నెలకొననున్న నీటి ఎద్దడికి పరిష్కారం లభించింది. వీటితో పాటు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతల పథకానికి నీటిని తరలించి కల్వకుర్తి, కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో సుమారు 300 గ్రామాల ప్రజల దాహార్తిని తీరుస్తారు. ఎవరిదీ పాపం? మూడు నెలల క్రితం వరకు జూరాలలో తాగునీటి అవసరాలకు సరిపడేంత నీటి లభ్యత ఉంది. తర్వాత పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా జలాశయంలో నీరు ఆవిరవుతూ వచ్చింది. దీంతో అధికారులు రబీ పంటకు క్రాప్ హాలిడే ప్రకటించారు. అయితే జూరాల, బీమా ప్రాజెక్టుల పరిధిలోని పెబ్బేరు, కొల్లాపూర్ ప్రాంతాల్లో ఖరీఫ్‌లో ఆలస్యంగా సాగు చేసిన వరి, వేరుశనగ పంటలు ఎండిపోతున్నాయంటూ ఓ ప్రజాప్రతినిధి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషికి లేఖరాశారు. దీనిపై స్పందించిన ఆయన నీటి విడుదలకు ఆదేశించారు. దీంతో జనవరి 6న సాగు కోసం జూరాల ఎడమ కాలువ నుంచి 0.7టీఎంసీల నీటిని తరలించారు. ఆ సమయంలో నీటిని తరలించకపోతే ఈ రోజు ఈ స్థాయిలో తాగునీటి కష్టాలు ఉండేవి కావని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇదీలా ఉంటే ప్రతి సంవత్సరం జూరాల ప్రాజెక్టులో నీళ్లు అయిపోగోట్టుకోవడం, కర్ణాటకను అడుక్కోవడం నాలుగేళ్లుగా ఓ తంతుగా మారింది. తాగు, సాగునీటి అవసరాలకు సంబంధించి ముందుచూపు లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని.. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు ముందుచూపుతో వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. -
ఎన్నికల ఇంకు.. కథా.. కమీషు..
సాక్షి, కొదాడ : ఎన్నికల సమయంలో దొంగ ఓట్లను నివారించడానికి, ఒకరు ఒకటి కంటే ఎక్కువ ఓట్లు వేయకుండా ఉండడానికి ఎన్నికల సంఘం ప్రతి ఓటరు ఎడమ చేతి చూపుడు వేలిపై ఇంకు గుర్తును వేస్తారు. ఇది దాదాపు నెల రోజుల వరకు చెరిగిపోకుండా ఉంటుంది. మరీ ఈ ఇంకుకు పెద్ద చరిత్రే ఉంది. దేశంలో జరిగిన 3వ సాధారణ ఎన్నికల నుంచి దీన్ని ఉపయోగిస్తున్నారు. దేశం మొత్తానికి అవసరమైన ఈ ఇంకును ఒక కంపెనీ మాత్రమే తయారు చేస్తుంది. 1937 సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ పట్టణంలో ఈ ఇంకు తయ్యారీ పరిశ్రమను ‘‘ మైసూర్ ల్యాక్ అండ్ పెయింట్స్ ’’ పేరుతో స్థాపించారు. మహరాజ నల్వాడీ కష్ణరాజ వడయార్ దీని వ్యవస్థాపకులు.తరువాత దీన్ని మైసూర్ పెయింట్స్ వార్నిష్‌గా పేరు మార్చారు. ప్రస్తుతం ఈ కంపెనీ కర్ణాటక ప్రభుత్వ అధీనంలో నడుస్తోంది. 1962 నుంచి ఎన్నికల సంఘం తమకు అవసరమయ్యే ఇంకును ఈ పరిశ్రమ నుంచి మాత్రమే కొనుగోలు చేస్తుంది. ఇది 5, 7,5, 20, 50 మిల్లీలీటర్ల బాటిళ్లలో దొరుకుతుంది. 5 ఎంఎల్ బాటిల్ 300 మంది ఓటర్లకు సరిపోతుంది. ఈ పరిశ్రమ ఈ ఇంకును ఇతర దేశాలకు కూడా సరఫరా చేస్తుంది. మారుతున్న కాలంతో పాటు ఈ పరిశ్రమ కూడా ఆధునికీకరణ చెందింది. ఈ ఇంకుతో సులువుగా ఉపయోగించడానికి మార్కర్‌పెన్నులను కూడ తయారీ చేస్తుంది. ఇతర దేశాల్లో వీటిని వాడుతున్నారు. కానీ మనదేశంలో మాత్రం ఇంకా ఇంకును మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఈ ఇంకు తయారీ అత్యంత రహస్యంగా సాగుతుంది. దీని తయారీలో ఉపయోగించే రసాయన ఫార్ములాను నేషనల్ ఫిజికల్ లాబోరేటరీ ఆప్ ఇండియా అత్యంత రహస్యంగా రూపొందిస్తుంది. ఇతరులకు దీని తయారీ గురించి తెలియనీయరు. -
మోదీ టెన్ పర్సెంట్ వ్యాఖ్యలకు సిద్ధూ కౌంటర్
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక సర్కార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ టెన్‌పర్సెంట్ (కమీషన్) ప్రభుత్వంగా అభివర్ణించడంపై సీఎం సిద్ధరామయ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని స్థాయి వ్యక్తి రాజకీయ కోణంలో ఇంతలా దిగజారడం తగదని హితవు పలికారు. తమ ప్రభుత్వాన్ని పదిశాతం సర్కార్‌గా మోదీ మాట్లాడటం బాధ్యతారాహిత్యమని, ఆయన వ్యాఖ్యలు నిరాధారమైనవని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ‘యడ్యూరప్ప సీఎంగా పనిచేసిన కాలంలో ఏం జరిగిందో మోదీ ఆయనను అడగాల్సింది...బీజేపీ కర్ణాటకను దోచుకుంది..మైనింగ్ స్కామ్‌లో జనార్ధన్రెడ్డిలా యడ్యూరప్ప జైలుకు వెళ్లా’ రని సిద్ధూ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ తొమ్మిదేళ్లు గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు లోకాయుక్తను నియమించారా అని నిలదీశారు. గోద్రా అల్లర్లు ఆయన హయాంలోనే జరిగాయన్న సంగతి గుర్తెరగాలన్నారు. తమపై మోదీ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయపూరితమైనవని అన్నారు.యడ్యూరప్ప స్ధాయికి దిగజారి మోదీ మాట్లాడటం కర్ణాటక ప్రజలను అవమానించినట్టేనని సిద్ధూ ఆరోపించారు. -
ఆ ఎస్టేట్‌పై ప్రభుత్వానికి హక్కు లేదు: సుప్రీం
న్యూఢిల్లీ: బెంగళూరు నడిబొడ్డున ఉన్న ప్రఖ్యాత బోల్యూ ఎస్టేట్‌పై కర్ణాటక ప్రభుత్వానికి హక్కు లేదని, దీన్ని 117 ఏళ్ల కిందట అప్పటి మైసూర్ యువరాణి తరఫున దివాన్ కొన్నారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎస్టేట్‌లోని వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం పునరుద్ధరించింది. ఎస్టేట్ కొనుగోలు ఒప్పందం అమల్లోకి వచ్చి వందేళ్లయిందని, ఇప్పుడు అది మోసపూరితమని ప్రభుత్వం వాదించజాలదని పేర్కొంది. ‘ఎస్టేట్ కోసం యువరాణి తన సొంత డబ్బులు చెల్లించారు.. ఆ ఆస్తి మీదే అయితే మీరు ఎందుకు మళ్లీ స్వాధీనం చేసుకుంటున్నారు?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.24 ఎకరాల విస్తీర్ణమున్న చారిత్రక బోల్యూలో ఒక హోటల్, పలు వాణిజ్య భవనాలు, నివాసగృహాలు ఉన్నాయి.