సారీ.. మీ అవార్డ్ నాకొద్దు.. క్షమాపణలు చెప్పిన కిచ్చా సుదీప్‌ | Sandalwood Hero Sudeep Rejects Award From the Government | Sakshi
Sakshi News home page

Sudeep: కిచ్చా సుదీప్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్.. వద్దంటూ క్షమాపణలు చెప్పిన హీరో

Published Thu, Jan 23 2025 5:22 PM | Last Updated on Thu, Jan 23 2025 5:52 PM

Sandalwood Hero Sudeep Rejects Award From the Government

శాండల్‌వుడ్‌ హీరో కిచ్చా సుదీప్‌ను ప్రతిష్టత్మక అవార్డ్ వరించింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఉత్తమ నటుడిగా పురస్కారం ప్రకటించింది. ఉత్తమ నటుడి కేటగిరీ కిచ్చా సుదీప్‌కు అవార్డ్ దక్కింది. ఈ ఘనత దక్కడం పట్ల హీరో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం, జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

కిచ్చా సుదీప్ తన ట్వీట్‌లో రాస్తూ..' ఉత్తమ నటుడి కేటగిరీ కింద రాష్ట్రస్థాయి అవార్డును అందుకోవడం ఆనందంగా ఉంది. ఈ గౌరవం కల్పించిన జ్యూరీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను చాలా సంవత్సరాలుగా అవార్డులు అందుకోవడం ఆపివేయాలని నిర్ణయించుకున్నా. వివిధ వ్యక్తిగత కారణాల వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకున్నా. కానీ ఇప్పుడు అదే మాటకు కట్టుబడి ఉన్నా. చాలా మంది టాలెంటెడ్ నటీనటులు ఉ‍న్నారు. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు ఇస్తే నా కంటే చాలా ఎక్కువగా అభినందిస్తారు. వారిలో ఒకరు దానిని స్వీకరించడం నాకు మరింత సంతోషాన్నిస్తుంది. ఎలాంటి అవార్డులు ఆశించకుండా అభిమానులను అలరించడమే నా ధ్యేయం.' ‍అని పోస్ట్ చేశారు.

అవార్డ్‌కు ఎంపిక చేసినందుకు ప్రతి జ్యూరీ సభ్యునికి కృతజ్ఞతలు.. ఎందుకంటే నా ప్రతిఫలానికి దక్కిన గుర్తింపని కిచ్చా సుదీప్ పోస్ట్ చేశారు. నా నిర్ణయం ఏదైనా నిరాశ కలిగించినందుకు జ్యూరీ సభ్యులకు, రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నట్లు రాసుకొచ్చారు. మీరు నా అభిప్రాయాన్ని గౌరవిస్తారని.. నేను ఎంచుకున్న మార్గంలో మద్దతు ఇస్తారని  విశ్వసిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. నా కృషిని గుర్తించి ఈ అవార్డుకు నన్ను పరిగణనలోకి తీసుకున్నందుకు జ్యూరీ సభ్యులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా.. కిచ్చా సుదీప్‌ కేవలం శాండల్‌వుడ్‌లోనే కాదు.. టాలీవుడ్‌లోనూ ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. రాజమౌళి ఈగ మూవీతో తెలుగులో ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం కన్నడ బిగ్‌బాస్‌ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. కిచ్చా సుదీప్ చివరిసారిగా మ్యాక్స్ చిత్రంతో అభిమానులను అలరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement