కన్నడ హీరో దర్శన్‌పై చెప్పుల దాడిని మరో నటుడు కిచ్చా సుదీప్ ఖండించారు. ఇలా చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ చర్య తనను తీవ్ర కలవరానికి గురి చేసిందని అన్నారు. పునీత్ రాజ్ కుమార్ ఉండి ఉంటే ఇలాంటి చర్యలను సమర్థించేవారా అని ఆయన అభిమానులను సుదీప్ ప్రశ్నించారు. దర్శన్‌పై చెప్పులు విసరడాన్ని ఖండిస్తూ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఆదివారం 'క్రాంతి' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కర్ణాటకలోని హోస్పేట్‌లో సాంగ్ లాంఛ్ కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది.
కిచ్చా సుదీప్ ట్విటర్‌లో రాస్తూ.. 'మన భూమి, భాష, సంస్కృతి అనేది ప్రేమ, గౌరవానికి సంబంధించినది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ప్రతి వ్యక్తి గౌరవంగా వ్యవహరించడానికి అర్హులు. నేను చూసిన వీడియో నన్ను చాలా కలవరపెట్టింది. ఇంకా చాలా మంది అలాగే సినిమాలోని ప్రముఖ మహిళ కూడా అక్కడే నిలబడి ఉన్నారు. వారంతా ఈవెంట్‌లో నిమగ్నమై ఉన్నారు. మీరు వారిని అవమానించారు. ఇలాంటి పనులు చేసింది కన్నడిగులేనా అన్న అనుమానం వస్తోంది.' అని రాసుకొచ్చారు. దర్శన్, పునీత్ అభిమానులకు మధ్య పరిస్థితులు బాగా లేవని నేను అంగీకరిస్తున్నా.. కానీ ఇలాంటి ప్రతిచర్యను పునీత్ స్వయంగా మెచ్చుకుని మద్దతు ఇచ్చేవారా? అని ప్రశ్నించారు.
అసలేం జరిగిందంటే..: కాగా దర్శన్ ఇటీవల అదృష్ట దేవతపై చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగానే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. 'అదృష్ట దేవత ప్రతిసారీ తలుపు తట్టదు. తలుపు తట్టినప్పుడే చేయి పట్టుకుని బెడ్‌రూమ్‌లోకి లాక్కెల్లి దుస్తులు విప్పేయాలి. అప్పుడు ఆమె ఎక్కడికీ వెళ్లదు' అని దర్శన్ చేసిన కామెంట్లు ఎంతగానో వివాదాస్పదమయ్యాయి. అదృష్ట దేవతను లక్ష్మీ దేవతగా భావిస్తారు. శ్రీ విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవిపై అంత నీచంగా ఎలా మాట్లాడతావంటూ అతడిపై దారుణమైన ట్రోల్స్ వచ్చాయి.
కాగా.. దర్శన్ నటించిన చిత్రం క్రాంతి జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి వి హరికృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో దర్శన్ సరసన రచితా రామ్ నటిస్తోంది.
Rebellion isn't always an Answer.
— Kichcha Sudeepa (@KicchaSudeep) December 20, 2022
❤️🙏🏼 pic.twitter.com/fbwANDdgP0
Comments
Please login to add a commentAdd a comment