kannada actor Darshan
-
హీరో దర్శన్ నుంచి ప్రాణహాని.. బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఫిర్యాదు
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన కన్నడ హీరో దర్శన్ ఇటీవలే మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చాడు. కొంతకాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సర్జరీ చేయించుకోనున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా దర్శన్‌పై మరో కన్నడ నటుడు, బిగ్‌బాస్ ఫేమ్, లాయర్ జగదీష్ సంచలన ఆరోపణలు చేశాడు. దర్శన్, అతడి అభిమానుల నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.బెదిరింపు కాల్స్దర్శన్కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు అతడి అభిమానులు తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించాడు. దాదాపు వెయ్యి బెదిరింపు కాల్స్ వచ్చాయని పేర్కొన్నాడు. ఇదంతా చేస్తున్నది అభిమానులే అయినా.. దీని వెనక ఉన్నది మాత్రం కచ్చితంగా హీరో దర్శనే అని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం దర్శన్ బెయిల్‌పై బయట ఉన్న కారణంగా తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులను కోరాడు.చదవండి: మమ్మల్ని చిత్రవధ చేసింది.. నటిపై సవతి కూతురి ఆరోపణలు -
కస్టడీ పొడిగింపు.. ఆగస్టు 1 దాకా జైల్లోనే దర్శన్, పవిత్ర..
దొడ్డబళ్లాపురం: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ హీరో దర్శన్ ప్రస్తుతం పరప్పన అగ్రహార జైల్లో ఉన్నాడు. తనకు జైలు తిండి సరిపడక ఆరోగ్యం క్షీణిస్తోందని, ఇంటి భోజనం తెప్పించుకోవడానికి అనుమతి ఇప్పించాలంటూ ఇటీవల హైకోర్టులో పిటిషన్ వేశాడు. అయితే ఇందుకు ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలుపుతూ కౌంటర్ దాఖలు చేశారు. గురువారంనాడు హైకోర్టులో వీటిపై విచారణ సాగింది. ఇంటి నుంచి భోజనం, పరుపు, దిండు, చదవడానికి కొన్ని పుస్తకాలు కావాలని దర్శన్ కోరాడు. జైలు నిబంధనల ప్రకారం జైలులో పౌష్టికాహారం ఇస్తున్నామని, అవసరం మేరకు ఇంటి భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు జైళ్ల శాఖ ఐజీని కోరితే ఆయన నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. అయితే దర్శన్ ఎవరినీ సంప్రదించకుండా నేరుగా కోర్టును ఆశ్రయించడం సరికాదని పేర్కొన్నారు. ఈ కేసులో కోర్టు నిర్ణయం తీసుకోనుంది.దర్శన్ అండ్ గ్యాంగ్‌కు కస్టడీ పొడిగింపు ఇదిలా ఉంటే దర్శన్, నటి పవిత్రగౌడ, ఇతర నిందితులకు న్యాయస్థానంలో మళ్లీ చుక్కెదురైంది. వీరి బెయిలు ఆశలు నిరాశలయ్యాయి. వారి జ్యుడీషియల్ కస్టడీని కోర్టు ఆగస్టు 1వ తేదీ వరకూ పొడిగించింది. గతంలో కోర్టు విధించిన కస్టడీ గురువారంతో ముగియడంతో పోలీసులు నిందితులను కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు. ఇరువర్గాల వాదనల తరువాత కస్టడీని పొడిగించారు.చదవండి: 'డార్లింగ్' సినిమా రివ్యూ -
కన్నడ హీరో దర్శన్‌కు మరో షాక్!
దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసుకు సంబంధించి డెవిల్ సినిమా డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ అయిన మిలన ప్రకాశ్‌కు పోలీసులు మరోసారి విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చారు. శుక్రవారంనాడు ప్రకాశ్ విజయనగర ఏసీపీ ముందు హాజరయ్యారు. మరోసారి విచారణకు రావాలని శనివారం పోలీసులు ప్రకాశ్‌కు నోటీసులు ఇచ్చారు. రేణుకాస్వామి హత్య తరువాత హీరో దర్శన్ మైసూరులో డెవిల్ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఈ అంశాలపై సమాచారం కోసం ప్రకాశ్‌ను విచారించారు. 66 వస్తువుల సీజ్ రేణుకాస్వామి హత్యకేసుకు సంబంధించి దర్యాప్తు చేసిన పోలీసులు మొబైల్ఫోన్లో కలిపి మొత్తం 66 వస్తువులను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. రేణుకాస్వామి దుస్తులు, సీసీ కెమెరాల ఫుటేజీ, మొబైల్ ఫోన్లు, దాడికి వాడిన వస్తువులు తదితరాలను సేకరించారు.కరావళి నుంచి దర్శన్ ఔట్?పరప్పన అగ్రహార జైలులో ఊచలు లెక్కిస్తున్న దర్శన్‌కు మరో షాక్ తగిలింది. కొత్తగా నిర్మిస్తున్న కరావళి సినిమా నుంచి దర్శన్‌ను తొలగిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటిస్తున్న కరావళిలో దర్శన్ ముఖ్య పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల విడుదలైన పోస్టర్లో దర్శన్ కనిపించలేదు. దర్శన్ స్థానంలో కిచ్చ సుదీప్ నటిస్తున్నట్లు సమాచారం. ఇది దర్శన్ ఫ్యాన్స్‌కు మింగుడుపడడం లేదు. -
దర్శన్ రాక్షసుడు.. శాఖాహారి నటితో నాన్‌వెజ్ తినిపించాడు!
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన కన్నడ హీరో దర్శన్‌ను కఠినంగా శిక్షించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. కన్నడ బిగ్‌బాస్ 9వ సీజన్ కంటెస్టెంట్ ప్రశాంత్ సంబర్గి సైతం హీరోను ఎట్టి పరిస్థితిలోనూ వదిలిపెట్టకూడదని కోరుతున్నాడు. దర్శన్ తన గ్యాంగ్‌తో కలిసి శాఖాహారి అయిన రేణుకాస్వామి నోట్లో బలవంతంగా మాంసం ముక్కలు కుక్కి, విచక్షణారహితంగా దాడి చేసి చంపేసిన సంగతి తెలిసిందే! అయితే గతంలోనూ దర్శన్ శాఖాహారి అయిన ఓ నటితో మాంసం తినిపించాడని ప్రశాంత్ ఆరోపించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు.అతడు హీరో కాదుదర్శన్ హీరో కాదు కేవలం నటుడు మాత్రమే! అతడు చేసిన దారుణాలు ఎన్నో ఉన్నాయి. రేణుకాస్వామి తాను శాఖాహారి అని చెప్తున్నా వినకుండా ఈ రౌడీ బాస్ బలవంతంగా మాసం తినిపించాడు. మూడేళ్ల క్రితం ఇలాంటి సంఘటనే జరిగింది. దర్శన్‌తో షూటింగ్ చేస్తున్న ఓ కన్నడ నటి శాఖాహారం తెప్పించమని అడిగింది. రాక్షసుడుఆమె పూర్తిగా వెజిటేరియన్. అయినా సరే తన మాటల్ని లెక్క చేయలేదు. దర్శన్ ఆదేశించడంతో అక్కడున్న వాళ్లు భోజనంలో నాన్‌వెజ్ కలిపి తీసుకొచ్చారు. అది తెలియక నటి భోజనం చేస్తుండగా అతడు దుర్యోధనుడిలా పగలబడి నవ్వాడు. దర్శన్ మనిషి కాదు నరరూప రాక్షసుడు. అలాంటివారికే ఇలాంటి ఆలోచనలు వస్తాయి అని ఫేస్బుక్లో రాసుకొచ్చాడు. గత కొన్ని రోజుల క్రితం దర్శన్ గురించి మరో పోస్ట్ కూడా షేర్ చేశాడు.రౌడీ బాస్..'కన్నడ సినిమా ఇండస్ట్రీలోని ఓ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ నా స్నేహితుడు. అతడు ఓ టీవీ రియాలిటీ షోకి జడ్జిగా వ్యవహరించాడు. రెండేళ్ల క్రితం గుండెపోటుతో చనిపోయాడు. ఆ గుండెపోటుకు కారణం ఈ రౌడీ బాసే (డీ బాస్ ఇప్పుడు రౌడీ బాస్ అయ్యాడు)! ఈ ఆరడుగుల మృగం తనను మానసికంగా వేధించాడు.. బెదిరింపులకు పాల్పడ్డాడు. దానివల్లే ఆయన మరణించాడు' అని పేర్కొన్నాడు.చదవండి: తెలుగు సినిమాల్లో నటించకపోవడానికి కారణం ఇదే: విజయ్ సేతుపతి -
అక్రమ సంబంధం వద్దన్నందుకు అభిమానిని చంపిన నటుడు
-
Actor Darshan: ‘ఒక్క సిగరెట్ ఇవ్వండి ప్లీజ్’
లక్షలాది మందికి అభిమాన హీరో, సినిమాలలో దుర్మార్గులను చెండాడే పాత్రల్లో మెప్పించే దర్శన్ నిజ జీవితంలో సాధారణ మనిషి కంటే తక్కువగా ఆలోచించి ఇబ్బందుల్లో పడ్డాడు. పోలీస్ ఠాణాలో ఖైదీగా మారాడు. దర్శన్ ఇలా చేశాడా.. అని ఇప్పటికీ నమ్మలేకపోతున్నట్లు అభిమానులు వాపోతున్నారు.దొడ్డబళ్లాపురం: చిత్రదుర్గ ప్రముఖ నటుడు దర్శన్‌కు వ్యతిరేకంగా బుధవారంనాడు ప్రజల ధర్నాలతో అట్టుడికింది. అభిమాని రేణుకాస్వామి హత్య కేసు సీబీఐకి అప్పగించాలని కోరుతూ వందలాదిమంది ర్యాలీలు చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం ముందు చేరి దర్శన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దర్శన్ ఫోటోకు చెప్పుల హారం వేసి ఊరేగించి దగ్ధం చేశారు. ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి మాట్లాడుతూ సినిమాలలో అనేక మంచి పాత్రలు చేసిన దర్శన్ నిజ జీవితంలో విలన్ గా మారడం విషాదనీయమన్నారు. రేణుకాస్వామితో ఇబ్బందిగా ఉంటే తల్లిదండ్రులకు, పోలీసులకు తెలియజేయాల్సింది అని, ఇలా అమానుషంగా హత్య చేయడం సబబు కాదన్నారు. ఈ హత్యలో ఎవరెవరి పాత్ర ఉందో వారందరినీ కఠినంగా శిక్షించాలన్నారు. అతన్నీ ఇలాగే చంపాలి తన పుత్రున్ని ఎంత దారుణంగా చంపారో అదేరీతిలో ఆ హీరోని కూడా చంపాలి అంటూ రేణుకాస్వామి తల్లిదండ్రులు విలపించారు. గత శనివారం బెంగళూరులో హత్యకు గురైన చిత్రదుర్గవాసి రేణుకాస్వామి కుటుంబీకులు ఘోరాన్ని తలచుకుని శోకసంద్రంలో మునిగిపోయారు. భర్త మృతదేహాన్ని చూసి అతని భార్య సహన రోదిస్తుంటే ఓదార్చడం ఎవరితరం కాలేదు. చిత్రదుర్గలో బుధవారం కుటుంబ సభ్యులు,బంధువులు అంత్యక్రియలు జరిపారు. సహన ఇప్పుడు మూడో నెల గర్భంతో ఉంది. బిడ్డ పుట్టకముందే తండ్రి చనిపోవడంతో ధారగా విలపిస్తోంది. దర్శన్‌ని కూడా ఇలాగే చంపాలని కుటుంబ సభ్యులు శాపనార్థాలు పెట్టారు. సంబంధిత వార్త: బెల్ట్‌తో కొట్టి.. చితకబాది... పొట్టన పెట్టుకున్నాడు! రూ. 30 లక్షలు డీల్ హత్య కేసులో హీరో దర్శన్‌ని రెండవ నిందితునిగా చేర్చారు. హత్యా నేరాన్ని వారి మీద వేసుకోవడానికి ముగ్గురికి రూ.30 లక్షలు ఇచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. 8వ తేదీన రేణుకాస్వామిని చిత్రదుర్గ నుంచి బెంగళూరుకు తీసుకువచ్చి కామాక్షిపాళ్యలో షెడ్లో బంధించి హింసించి చంపారు. శవాన్ని ఎలా తరలించాలనేది చర్చించారు. ప్లాన్ ప్రకారం ఒక గ్యాంగ్‌కు చెందిన ముగ్గురిని పిలిపించి రూ.30 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. చిత్రదుర్గ్ దర్శన్ ఫ్యాన్ క్లబ్ కన్వీనర్ రాఘవేంద్ర(రఘు) ఇందులో ప్రధాన సూత్రధారి వ్యవహరించాడు. రేణుకాస్వామి భార్య వెల్లడించిన వివరాల ప్రకారం.. హత్య జరిగిన రాత్రి రఘు తన ఇంటికి వచ్చి తన భర్తను తీసుకెళ్లాడని చెబుతోంది. మరోవైపు తన భాగస్వామి పవిత్రపై అనుచిత కామెంట్లు చేశాడంటూ దర్శన్, రేణుకా స్వామిని బెల్ట్, కర్రలతో బాది..గొడకేసి కొట్టాడని పోలీసులు వెల్లడించారు. ఆపై శవాన్ని పారవేసి, ఒకవేళ పోలీసులు కనిపెట్టి విచారణ చేపడితే లొంగిపోయేలా ఒప్పందం చేసుకున్నారు. అనుకున్నట్టుగానే శవం లభించాక పోలీసులు విచారణ చేపట్టారు. వారి ప్రవర్తనలో తేడా ఉండడంతో పోలీసులు వారిని విడివిడిగా విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. దర్శన్ అనుచరులతో ముగ్గురు నిందితులూ రాత్రంతా ఫోన్లో మాట్లాడిన కాల్ రికార్డులు ఆధారంగా మారాయి. దొన్నె బిరియాని వద్దని ఇడ్లీలు.. దర్శన్ మంగళవారం రాత్రి కామాక్షిపాళ్య పోలీస్‌స్టేషన్‌లో నిద్రలేని రాత్రి గడిపాడు. పండ్ల జ్యూస్, ఇడ్లీలు తిని నిద్రపోకుండా మేలుకునే ఉన్నట్టు సమాచారం. దొన్నె బిరియాని ఇవ్వగా వద్దన్నారు. పవిత్ర, మిగతా నిందితులు బిరియాని ఆరగించారు. పోలీసులు 6 రోజులపాటు కస్టడీకి తీసుకుని స్టేషన్‌కు తీసుకువచ్చి 12 మంది నిందితులతో పాటు నిద్రపోవడానికి అవకాశమిచ్చారు. దర్శన్ సెలబ్రిటీ కావడం వల్ల ప్రత్యేకంగా కార్పెట్, దిండు ఇచ్చినా నిద్రపోలేదు. ఒక్క సిగరెట్ ఇవ్వండి ప్లీజ్ సినీ హీరోగా, సంపన్నుడిగా ఎంతో విలాసవంతమైన జీవితం గడిపే దర్శన్ ఠాణాలో దిగులుగా కూర్చున్నారు. ఒక్క సిగరెట్ ఇవ్వాలని పోలీసులను వేడుకున్నట్టు సమాచారం. సిగరెట్ లేక చేతులు వణుకుతున్నాయని వాపోయాడు. కానీ పోలీసులు సిగరెట్ ఇవ్వలేదు. ఈ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని, హత్య చేయమని తాను చెప్పలేదని పదేపదే చెబుతున్నాడని తెలిసింది. పవిత్ర, దర్శన్ కార్లు సీజ్ దర్శన్, పవిత్రల కార్లను పోలీసులు సీజ్ చేయడంతో పాటు వాటిలో ఉన్న మద్యం బాటిళ్లు, ఇతర సాక్ష్యాధారాలను స్వా«దీనం చేసుకున్నారు. రేణుకాస్వామిని బంధించి, హింసించి హత్య చేసిన షెడ్లోకి దర్శన్‌కు చెందిన స్కారి్పయో, పవిత్ర వాడే జీప్ ర్యాంగ్లర్ వెళ్లినట్లు సీసీ కెమెరా చిత్రాల్లో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ రెండు వాహనాలను స్వా«దీనం చేసుకున్నారు. జీప్‌లో పవిత్ర వ్యానిటీ బ్యాగ్, ఇతర వస్తువులు లభించాయి. అభిమానుల హంగామా హత్య కేసులో అరెస్టైన దర్శన్‌ను విచారిస్తున్న బెంగళూరు అన్నపూర్ణేశ్వరి నగర పోలీస్‌స్టేషన్ ముందు దర్శన్ ఫ్యాన్స్ హల్చల్ చేసారు. భారీగా చేరి నినాదాలు చేస్తూ స్టేషన్ ముందు గందరగోళం సృష్టిస్తుండడంతో పోలీసులు వారిని చెదరగొట్టడానికి లాఠీ చార్జ్ చేశారు. దీంతో అందరూ తలోదిక్కుకు పరుగులు తీశారు. ఈ గొడవలతో స్థానికులకు ఇబ్బందులు కలిగాయి.పవిత్ర వర్సెస్ రేణుకాస్వామి తన అభిమాన హీరో భార్యా పిల్లలతో సంతోషంగా ఉండాలి, చెడు తిరుగుళ్లు తిరగరాదని భావించిన ఆ అభిమాని రేణుకాస్వామి.. అందుకోసమే ప్రాణత్యాగం చేశాడు. ప్రముఖ నటుడు దర్శన్, నటి, ప్రియురాలు పవిత్రగౌడపై వాట్సాప్, ఇన్‌స్టా తదితర సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. దర్శన్ భార్య విజయలక్షి్మని పట్టించుకోకుండా పవిత్రగౌడతో సహ జీవనంపై రేణుకాస్వామి కోపం తెచ్చుకున్నాడు. ఈ ద్వేషంతో పవిత్రకు అసభ్యంగా మెసేజ్‌లు పెట్టడం ప్రారంభించాడు. ఇది తారాస్థాయికి చేరింది, తన మర్మాంగాన్ని ఫోటో తీసి పవిత్రకు పంపించి.. నేను దర్శన్ కంటే తక్కువ కాదు, నా వద్దకు కూడా రా అంటూ హేళనగా మెసేజ్ పంపాడు. దీంతో ఆమె దర్శన్‌కు గట్టిగా ఫిర్యాదు చేయడం, ఆయన అగ్గిమీద గుగ్గిలమైనట్లు తెలిసింది. పవిత్ర, రేణుకాస్వామి అకౌంట్‌ని బ్లాక్ చేసినా అతడు మరో కొత్త ఖాతాతో మెసేజ్‌లు పంపించేవాడు.దర్శన్ మహజరు దర్శన్, ఇతర నిందితులను పోలీసులు బుధవారంనాడు హత్య జరిగిన ఆర్ఆర్ నగరలోని షెడ్ వద్దకు తీసికెళ్లారు. ఎలా బంధించారు? ఎంతమంది ఎన్ని రకాలుగా హింసించారు? దాడి మీ సమక్షంలోనే జరిగిందా? మీరు అడ్డుకోలేదా? అనే ప్రశ్నలు పోలీసులు వేశారు. అక్కడ పెద్దసంఖ్యలో అభిమానులు, స్థానికులు చేరారు.ఇన్‌స్టాలో భార్య అన్‌ఫాలో గతంలో హీరో దర్శన్– భార్య విజయలక్ష్మి మధ్య తరచూ గొడవలు రేగి పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లడం తెలిసిందే. ఆ కేసుల్లోనూ దర్శన్ జైలుపాలయ్యాడు. అయితే దివంగత రెబల్‌స్టార్ అంబరీష్, కొందరు సినీ పెద్దల సర్దుబాటుతో ఇద్దరూ కలిసిపోయారు. అయితే ఈసారి హత్య కేసుతో వారి సంసారంలో పెద్ద అగాథమే ఏర్పడిందని చెప్పవచ్చు. ఎక్కువగా పవిత్రగౌడతోనే దర్శన్ ఉండిపోవడంతో వారి కాపురం కలహాలమయంగా మారింది. ప్రియురాలు పవిత్ర గౌడ కోసం ఇటువంటి కేసులో తలదరూర్చడాన్ని భార్య సహించలేకపోతోంది. బహిరంగంగా తన ఆగ్రహాన్ని వ్యక్తపరచకపోయినా ఇన్‌స్టాలో భర్త దర్శన్ ను అన్‌ఫాలో చేయడంతో పాటు డీపీని కూడా తొలగించారు. -
బెల్ట్‌తో కొట్టి.. చితకబాది... పొట్టన పెట్టుకున్నాడు!
బెంగళూరు: కర్నాటకలో సంచలనం సృష్టించిన ఫార్మసీ ఉద్యోగి రేణుస్వామి హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం కన్నడ నటుడు దర్శన్, అతని అభిమానులు రేణుస్వామిని దారుణంగా కొట్టి చంపారు! రేణుస్వామికి తగిన ‘బుద్ధి’ చెప్పాలంటూ నటి పవిత్ర దర్శన్‌ను ఉసిగొలి్పందని తెలుస్తోంది. తన అభిమాన సంఘాల సమన్వయకర్త రాఘవేంద్రను ఈ పనికి దర్శన్ పురమాయించారు. రాఘవేంద్ర తన భర్తను ఇంటి సమీపంలో వాహనం ఎక్కించుకుని తీసుకెళ్లాడని రేణుస్వామి భార్య చెప్పారు. అతన్ని బెంగళూరు సమీపంలో ఒక షెడ్డులో దర్శన్ బెల్ట్‌తో చితకబాదారు. అభిమానులు కర్రలతో కొట్టారు. ఎముకలు విరిగి, సున్నిత ప్రాంతాల్లో అంతర్గత గాయాలై రేణుస్వామి అక్కడిక్కడే మరణించారు. మృతదేహాన్ని మురికికాలువలో పడేశారు. దాన్ని వీధి కుక్కలు తినడం చూసి ఫుడ్ డెలివరీ బాయ్ పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ కేసులో దర్శన్, పవిత్రతో పాటు 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారందరినీ బుధవారం ఘటనా స్థలికి తీసుకెళ్లి సీన్ రీ కన్స్ట్రక్ట్ చేశారు. -
ఆ సంఘటన నన్ను తీవ్రంగా కలిచి వేసింది: కిచ్చా సుదీప్
కన్నడ హీరో దర్శన్‌పై చెప్పుల దాడిని మరో నటుడు కిచ్చా సుదీప్ ఖండించారు. ఇలా చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ చర్య తనను తీవ్ర కలవరానికి గురి చేసిందని అన్నారు. పునీత్ రాజ్ కుమార్ ఉండి ఉంటే ఇలాంటి చర్యలను సమర్థించేవారా అని ఆయన అభిమానులను సుదీప్ ప్రశ్నించారు. దర్శన్‌పై చెప్పులు విసరడాన్ని ఖండిస్తూ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఆదివారం 'క్రాంతి' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కర్ణాటకలోని హోస్పేట్లో సాంగ్ లాంఛ్ కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది. కిచ్చా సుదీప్ ట్విటర్లో రాస్తూ.. 'మన భూమి, భాష, సంస్కృతి అనేది ప్రేమ, గౌరవానికి సంబంధించినది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ప్రతి వ్యక్తి గౌరవంగా వ్యవహరించడానికి అర్హులు. నేను చూసిన వీడియో నన్ను చాలా కలవరపెట్టింది. ఇంకా చాలా మంది అలాగే సినిమాలోని ప్రముఖ మహిళ కూడా అక్కడే నిలబడి ఉన్నారు. వారంతా ఈవెంట్లో నిమగ్నమై ఉన్నారు. మీరు వారిని అవమానించారు. ఇలాంటి పనులు చేసింది కన్నడిగులేనా అన్న అనుమానం వస్తోంది.' అని రాసుకొచ్చారు. దర్శన్, పునీత్ అభిమానులకు మధ్య పరిస్థితులు బాగా లేవని నేను అంగీకరిస్తున్నా.. కానీ ఇలాంటి ప్రతిచర్యను పునీత్ స్వయంగా మెచ్చుకుని మద్దతు ఇచ్చేవారా? అని ప్రశ్నించారు. అసలేం జరిగిందంటే..: కాగా దర్శన్ ఇటీవల అదృష్ట దేవతపై చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగానే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. 'అదృష్ట దేవత ప్రతిసారీ తలుపు తట్టదు. తలుపు తట్టినప్పుడే చేయి పట్టుకుని బెడ్రూమ్లోకి లాక్కెల్లి దుస్తులు విప్పేయాలి. అప్పుడు ఆమె ఎక్కడికీ వెళ్లదు' అని దర్శన్ చేసిన కామెంట్లు ఎంతగానో వివాదాస్పదమయ్యాయి. అదృష్ట దేవతను లక్ష్మీ దేవతగా భావిస్తారు. శ్రీ విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవిపై అంత నీచంగా ఎలా మాట్లాడతావంటూ అతడిపై దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. కాగా.. దర్శన్ నటించిన చిత్రం క్రాంతి జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి వి హరికృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో దర్శన్ సరసన రచితా రామ్ నటిస్తోంది. Rebellion isn't always an Answer. ❤️🙏🏼 pic.twitter.com/fbwANDdgP0 — Kichcha Sudeepa (@KicchaSudeep) December 20, 2022 -
రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన సీనియర్ నటుడు
క్రైమ్ : షూటింగ్ నుంచి తన ఫ్యామిలీతో తిరిగి వెళ్తోన్న కన్నడ సీనియర్ నటుడు దేవరాజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో వారికి స్పల్వ గాయాలు అయినట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని మైసూర్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారని సమాచారం. ఈ ప్రమాదంలో కన్నడ నటుడు దర్శన్‌కు చేయి విరిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదం జరిగినప్పుడు ఎవరు డ్రైవింగ్ చేశారన్న విషయం మాత్రం ఇంకా తెలియలేదు. దేవరాజ్ తెలుగులో ప్రతినాయక పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్గా వచ్చిన ‘భరత్ అనే నేను’లో కూడా ఓ పాత్రను పోషించారు. ‘యజ్ఞం’ సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. -
'అందుకే సినిమాకో కొత్త హీరోయిన్'
బెంగళూరు: హీరోల ఎత్తుకు తగ్గ హీరోయిన్లు దొరకడం కొంచెం కష్టమే. తాజాగా కన్నడ స్టార్ హీరో దర్శన్ కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాడు. తన హైటుకు సరిపడా హీరోయిన్లు దొరకడం లేదని, అయితే ఉన్నవారితోనే వరుసగా సినిమాలు చేస్తే అనవసర పుకార్లు సృష్టిస్తున్నారని వాపోయాడు. అందుకే సినిమా, సినిమాకు కొత్త హీరోయిన్లతో నటించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. కాగా దర్శన్ తాజా చిత్రం జగ్గుదాదా జూన్ 10న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా అతడు మైసూరులో సినిమా ప్రచారాన్ని నిర్వహించి మీడియాతో మాట్లాడాడు. కాగా ఈ చిత్రంలో దర్శన్ సరసన దీక్షాసేథ్ హీరోయిన్గా నటించింది.