'అందుకే సినిమాకో కొత్త హీరోయిన్' | Jaggu dada kannada movie to release on tomorrow | Sakshi
Sakshi News home page

'అందుకే సినిమాకో కొత్త హీరోయిన్'

Published Thu, Jun 9 2016 11:57 AM | Last Updated on Mon, Sep 4 2017 2:05 AM

Jaggu dada kannada movie to release on tomorrow

బెంగళూరు: హీరోల ఎత్తుకు తగ్గ హీరోయిన్లు దొరకడం కొంచెం కష్టమే. తాజాగా కన్నడ స్టార్ హీరో దర్శన్ కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాడు. తన హైటుకు సరిపడా హీరోయిన్లు దొరకడం లేదని, అయితే ఉన్నవారితోనే వరుసగా సినిమాలు చేస్తే అనవసర పుకార్లు సృష్టిస్తున్నారని వాపోయాడు.

అందుకే సినిమా, సినిమాకు కొత్త హీరోయిన్లతో నటించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. కాగా దర్శన్ తాజా చిత్రం జగ్గుదాదా జూన్ 10న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా అతడు మైసూరులో సినిమా ప్రచారాన్ని నిర్వహించి మీడియాతో మాట్లాడాడు. కాగా ఈ చిత్రంలో దర్శన్ సరసన దీక్షాసేథ్ హీరోయిన్గా నటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement