దర్శన్‌ రాక్షసుడు.. శాఖాహారి నటితో నాన్‌వెజ్‌ తినిపించాడు! | Prashanth Sambargi Reacts On Darshan Thoogudeepa, Calls The Latter Six Feet Monster | Sakshi
Sakshi News home page

Darshan Thoogudeepa Case: దర్శన్‌ ఆరడుగుల రాక్షసుడు.. నటికి తెలియకుండా నాన్‌వెజ్‌ తినిపించి..

Published Wed, Jun 19 2024 12:53 PM | Last Updated on Wed, Jun 19 2024 1:26 PM

Prashanth Sambargi Calls Darshan Six Feet Monster

అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన కన్నడ హీరో దర్శన్‌ను కఠినంగా శిక్షించాలని పలువు‌రు విజ్ఞప్తి చేస్తున్నారు. కన్నడ బిగ్‌బాస్‌ 9వ సీజన్‌ కంటెస్టెంట్‌ ప్రశాంత్‌ సంబర్గి సైతం హీరోను ఎట్టి పరిస్థితిలోనూ వదిలిపెట్టకూడదని కోరుతున్నాడు. దర్శన్‌ తన గ్యాంగ్‌తో కలిసి శాఖాహారి అయిన రేణుకాస్వామి నోట్లో బలవంతంగా మాంసం ముక్కలు కుక్కి, విచక్షణారహితంగా దాడి చేసి చంపేసిన సంగతి తెలిసిందే! అయితే గతంలోనూ దర్శన్‌ శాఖాహారి అయిన ఓ నటితో మాంసం తినిపించాడని ప్రశాంత్‌ ఆరోపించాడు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు.

అతడు హీరో కాదు
దర్శన్‌ హీరో కాదు కేవలం నటుడు మాత్రమే! అతడు చేసిన దారుణాలు ఎన్నో ఉన్నాయి. రేణుకాస్వామి తాను శాఖాహారి అని చెప్తున్నా వినకుండా ఈ రౌడీ బాస్‌ బలవంతంగా మాసం తినిపించాడు. మూడేళ్ల క్రితం ఇలాంటి సంఘటనే జరిగింది. దర్శన్‌తో షూటింగ్‌ చేస్తున్న ఓ కన్నడ నటి శాఖాహారం తెప్పించమని అడిగింది. 

రాక్షసుడు
ఆమె పూర్తిగా వెజిటేరియన్‌. అయినా సరే తన మాటల్ని లెక్క చేయలేదు. దర్శన్‌ ఆదేశించడంతో అక్కడున్న వాళ్లు భోజనంలో నాన్‌వెజ్‌ కలిపి తీసుకొచ్చారు. అది తెలియక నటి భోజనం చేస్తుండగా అతడు దుర్యోధనుడిలా పగలబడి నవ్వాడు. దర్శన్‌ మనిషి కాదు నరరూప రాక్షసుడు. అలాంటివారికే ఇలాంటి ఆలోచనలు వస్తాయి అని ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చాడు. గత కొన్ని రోజుల క్రితం దర్శన్‌ గురించి మరో పోస్ట్‌ కూడా షేర్‌ చేశాడు.

రౌడీ బాస్‌..
'కన్నడ సినిమా ఇండస్ట్రీలోని ఓ ఫేమస్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ నా స్నేహితుడు. అతడు ఓ టీవీ రియాలిటీ షోకి జడ్జిగా వ్యవహరించాడు. రెండేళ్ల క్రితం గుండెపోటుతో చనిపోయాడు. ఆ గుండెపోటుకు కారణం ఈ రౌడీ బాసే (డీ బాస్‌ ఇప్పుడు రౌడీ బాస్‌ అయ్యాడు)! ఈ ఆరడుగుల మృగం తనను మానసికంగా వేధించాడు.. బెదిరింపులకు పాల్పడ్డాడు. దానివల్లే ఆయన మరణించాడు' అని పేర్కొన్నాడు.

చదవండి: తెలుగు సినిమాల్లో నటించకపోవడానికి కారణం ఇదే: విజయ్‌ సేతుపతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement