సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి ఇంత వరకు తెలుగులో డైరెక్ట్‌గా ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ ఇక్కడ కూడా ఆయనకు భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్.. తెలుగు సినిమాల్లో నటించకపోవడానికి ఉన్న కారణాలను వెళ్లడించారు.
విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'మహారాజ'. క్రైం, సస్పెన్స్ థ్రిల్లర్‌గా విడుదలైన ఈ చిత్రం తెలుగులో కూడా విజయవంతంగా కొనసాగుతుంది. తెలుగు సినిమాల్లో విజయ్ నటించకపోవడానికి ఉన్న కారణాన్ని ఇలా చెప్పాడు. 'నేను తెలుగు సినిమాల్లో భాగం అవ్వాలని రెడీగా ఉన్నాను. అందుకోసం ఇప్పటికే చాలా కథలు కూడా విన్నాను. అయితే, వాటిలో కొన్ని నాకు చాలా నచ్చాయి కూడా. కానీ. ఆ ప్రాజెక్ట్‌లో వారు నాకు ఇచ్చిన పాత్ర పెద్దగా ఆకట్టుకోలేదు.
ఇక్కడి వారు అందిస్తున్న కథలు చాలా అద్భుతంగా ఉన్నాయి. వారు ఆఫర్ చేసిన పాత్రకు నేను సెట్ కానని భావించడం వంటి కారణాలతో తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నాను. భవిష్యత్‌లో నాకు సెట్ అయ్యే పాత్ర ఇక్కడ దొరుకుతుందని ఆశిస్తున్నాను.' అని విజయ్ సేతుపతి అన్నారు.
నిథిలన్- విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో వచ్చిన మహారాజ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా బాగా ఆధరిస్తున్నారు. అనురాగ్ కశ్యప్, అభిరామి,భారతీరాజా, మమతా మోహన్‌దాస్ వంటి వారు కీలక ఇందులో పాత్రలు పోషించారు. విజయ్ సేతుపతి కెరియర్‌లో 50వ చిత్రంగా జూన్ 14న మహారాజ విడుదలైంది. ఇప్పటికే సుమారు రూ.40 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment