
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన కన్నడ హీరో దర్శన్ ఇటీవలే మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చాడు. కొంతకాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సర్జరీ చేయించుకోనున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా దర్శన్‌పై మరో కన్నడ నటుడు, బిగ్‌బాస్ ఫేమ్, లాయర్ జగదీష్ సంచలన ఆరోపణలు చేశాడు. దర్శన్, అతడి అభిమానుల నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బెదిరింపు కాల్స్
దర్శన్‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు అతడి అభిమానులు తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించాడు. దాదాపు వెయ్యి బెదిరింపు కాల్స్ వచ్చాయని పేర్కొన్నాడు. ఇదంతా చేస్తున్నది అభిమానులే అయినా.. దీని వెనక ఉన్నది మాత్రం కచ్చితంగా హీరో దర్శనే అని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం దర్శన్ బెయిల్‌పై బయట ఉన్న కారణంగా తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులను కోరాడు.
Comments
Please login to add a commentAdd a comment