Deeksha Seth
-
‘వేదం’ బ్యూటీ దిక్షాసేథ్ ఇప్పుడు ఎలా ఉంది, ఎం చేస్తుందో తెలుసా?
సెలబ్రెటీల లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఈ రంగుల ప్రపంచాన్ని ఏలి.. ఆ వెంటనే కనుమరగైపోతారు. అలాంటి వారిలో అల్లు అర్జున్ ‘వేదం’ బ్యూటీ దిక్షాసేథ్ ఒకరు. చేసింది సింగిల్ డిజిట్ చిత్రాలే అయినా తనదైన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. వేదంలో అల్లు అర్జున్ రిచ్ గర్ల్‌ఫ్రెండ్‌గా పరిచయమైన దిక్షాసేథ్ తొలి చిత్రంతోనే ఎనలేని క్రేజ్ సొంతం చేసుకుంది. ‘వేదం’ తర్వాత ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. అప్పట్లో దిక్షాసేత్దే హావా అనేంతగా వరుస పెట్టి సినిమాలు చేస్తూ పోయింది. ఈ క్రమంలో గోపిచంద్ వాంటెడ్, రవితేజ సరసన నిప్పు, మిరపకాయ, ప్రభాస్ రెబల్ ఇలా వెంట వెంటనే సినిమాలు చేసి వాంటెడ్ హీరోయిన్గా మారింది. ఆమె నటించిన చిత్రాలు పెద్దగా విజయం సాధించకపోయినా ధిక్షా గ్లామర్‌కు మాత్రం ఆడియన్స్ ఫిదా అయ్యారు. అంతేకాదు ఆమెను టాలీవుడ్ కత్రినా అని కూడా ముద్దుగా పిలుచుకునే వారు. తెలుగులో ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా సినిమాలో కనిపించిన ఆమెకు తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. దీంతో బాలీవుడ్‌కు వెళ్లిన ఆమెకు అక్కడ కూడా నిరాశే ఎదురైంది. లేకర్ హమ్ దివానా దిల్, ది హౌస్ ఆఫ్ ది డెడ్ 2, సాత్ కడమ్ వంటి హిందీ సినిమాలు చేసినా సక్సెస్ కాలేకపోయింది. కన్నడలో దర్శన్ సరసన జగ్గూబాయ్ సినిమాలో నటించినా ఫెయిల్యూర్‌గానే మిగిలింది. ఆమె సినీ కెరీర్లో మొత్తం ప్లాప్స్ చిత్రాలే ఉన్నాయి. దీంతో ఆమెకు ఆఫర్లు రాకపోవడం ధిక్షా ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం ఆమె లండన్‌లో నివసిస్తుంది. అక్కడ ఐటీ ఉదోగ్యం చేస్తున్నట్లు సమాచారం. అయితే తన స్నేహితులు, కొలిగ్స్‌తో కలిసి వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటుంది. అలా ఇన్‌స్టా వేదికగా దిక్షా నెట్టింట ఫ్యాన్స్‌ని పలకరిస్తుంది. ఈ క్రమంలో దిక్షా రీసెంట్గ్ షేర్ చేసిన ఫొటోలు చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఇందులో ఆమె పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. సినిమాల్లో కాస్తా బుగ్గలతో ముద్దుగా ఉండే దిక్షా బక్కచిక్కి కనిపించడంతో ఆమెను గుర్తు పట్టలేకపోతున్నారు. దీంతో మరి ఇంతలా మారిపోయిందేంటని, సినిమాల్లో ఉన్నప్పుడే బాగుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Deeksha Seth (@deeksha721) View this post on Instagram A post shared by Deeksha Seth (@deeksha721) -
'నిప్పు' హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా?
దీక్షా సేత్.. ఈ పేరు చెప్తే గుర్తుపడతారో లేదో కానీ వేదం, నిప్పు, మిరపకాయ్, వాంటెడ్ సినిమాల హీరోయిన్ అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. కాలేజీ రోజుల్లోనే మోడలింగ్‌లో అడుగుపెట్టిందీ బ్యూటీ. హైదరాబాద్‌లో ఓ మోడలింగ్ అసైన్మెంట్ కోసం పని చేస్తున్న సమయంలో డైరెక్టర్ క్రిష్ కంట పడింది దీక్ష. వెంటనే ఆమెను వేదం సినిమాలో కేబుల్ రాజు(అల్లు అర్జున్) గర్ల్‌ఫ్రెండ్ రోల్ కోసం తీసుకున్నారు. ఆ సినిమా క్లిక్ అవ్వడంతో వెంటనే ఆమె మరో రెండు సినిమాలకు సంతకం చేసింది. అందులో మిరపకాయ్ బాక్సాఫీస్ దగ్గర బాగానే ఆడింది, కానీ అందులో దీక్షా సేత్ సైడ్ హీరోయిన్. ఇక గోపీచంద్‌తో చేసిన వాంటెడ్లో తొలిసారి కథానాయికగా నటించింది. కానీ ఆమె అంచనాలు తలకిందులు చేస్తూ వాంటెడ్ పెద్ద ఫెయిల్యూర్‌గా నిలిచిపోయింది. అలా ఆమె హీరోయిన్గా చేసిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. దీంతో ఆమె నెమ్మదిగా టాలీవుడ్‌కు దూరమైపోయింది. ఆమె చివరగా తెలుగులో రెబల్(2012)లో, హిందీలో సాత్ కడమ్ (2016)లో నటించింది. ఆ తర్వాత సినిమాల్లో కనిపించకుండా పోయిన ఈ హీరోయిన్ సోషల్ మీడియాకు కూడా నెలల తరబడి దూరంగా ఉండేది. అప్పుడప్పుడు మాత్రమే తన ఫొటోలను పంచుకునేది. ఈ క్రమంలో దీక్ష తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇందులో బీచ్‌లో ఎంజాయ్ చేస్తోందీ హీరోయిన్. ఈ పోస్ట్ చూసిన సందీప్ కిషన్ 'సేత్ మళ్లీ వచ్చేసిందోచ్' అంటూ కామెంట్ చేశాడు. కొందరు మాత్రం దీక్ష ఇలా అయిపోయిదేంటని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఆమె సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తే బాగుండు అంటున్నారు ఫ్యాన్స్. View this post on Instagram A post shared by Deeksha Seth (@deeksha721) View this post on Instagram A post shared by Deeksha Seth (@deeksha721) చదవండి: ఏడాది తిరిగేసరికి ఇల్లు అమ్మేసిన హీరో! ఆ సినిమా కోసం నాలుగేళ్లుగా గెడ్డం తీయలేదు : శరత్ కుమార్ -
హీరోయిన్ దీక్షాసేత్ క్యూట్ ఫోటోలు
-
'అందుకే సినిమాకో కొత్త హీరోయిన్'
బెంగళూరు: హీరోల ఎత్తుకు తగ్గ హీరోయిన్లు దొరకడం కొంచెం కష్టమే. తాజాగా కన్నడ స్టార్ హీరో దర్శన్ కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాడు. తన హైటుకు సరిపడా హీరోయిన్లు దొరకడం లేదని, అయితే ఉన్నవారితోనే వరుసగా సినిమాలు చేస్తే అనవసర పుకార్లు సృష్టిస్తున్నారని వాపోయాడు. అందుకే సినిమా, సినిమాకు కొత్త హీరోయిన్లతో నటించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. కాగా దర్శన్ తాజా చిత్రం జగ్గుదాదా జూన్ 10న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా అతడు మైసూరులో సినిమా ప్రచారాన్ని నిర్వహించి మీడియాతో మాట్లాడాడు. కాగా ఈ చిత్రంలో దర్శన్ సరసన దీక్షాసేథ్ హీరోయిన్గా నటించింది. -
శింబూ సరసన!
తెలుగులో నాలుగైదు చిత్రాల్లో నటించిన దీక్షాసేథ్ ‘రాజపాట్టై’ చిత్రం ద్వారా తమిళ తెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రం విడుదలై, మూడేళ్లకు పైనే అవుతున్నా దీక్షాకి తమిళంలో అవకాశాలు రాలేదు. ఇప్పుడో అవకాశం దక్కించుకున్నారని సమాచారం. ‘7/జి బృందావన కాలనీ’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ తదితర చిత్రాల ద్వారా దర్శకునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సెల్వరాఘవన్ ఓ తమిళ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. శింబు హీరోగా రూపొందనున్న ఈ చిత్రంలో దీక్షాని కథానాయికగా తీసుకున్నారట. -
ఎలాంటి సీన్లోనైనా నటిస్తా : దీక్షాసేత్
ఒక సినిమా అంగీకరించిన తరువాత ఎలాంటి సీను చేయడానికైనా తనకు అభ్యంతరం లేదని బెంగాలీ బ్యూటీ దీక్షాసేత్ చెబుతున్నారు. సందర్భాన్ని బట్టి ముద్దు (లిప్‌లాక్ ) సీన్లు కూడా చేస్తానంటున్నారు. ఆఫర్ల కోసం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు వెళ్లింది. అక్కడా లాభంలేకపోవడంతో పట్టువదలని దీక్షతో బాలీవుడ్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అక్కడ ఏమైనా లక్కుంటుందేమోనని ప్రయత్నిస్తోంది. వేదం సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైన ఈ అందాల తార ఆ తర్వాత వాంటెడ్, రెబల్, మిరపకాయ, నిప్పు చిత్రాల్లో నటించింది. ఈ భామ తెలుగులో తనదైన గ్లామర్‌తో చెలరేగిపోయింది. దీక్షా దగ్గర గ్రామర్ ఉంది గానీ, అవకాశాలే రాలేదు పాపం. చెప్పుకోదగ్గ హిట్స్ కూడాలేవు. సుదీర్ణ ప్రయత్నాలు చేసిన తరువాత అసలు సక్సెస్ ఫార్ములాను కనుక్కున్నట్లు చెబుతోంది. దీక్షాసేత్కు ప్రస్తుతానికి తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు లేవు. హిందీలో మాత్రం ఒక్క సినిమా 'లేఖర్ హమ్ దివానా దిల్' లో నటించింది. టాలీవుడ్లో అలవాటుపడినవారు వదలడం కష్టం. తెలుగులో మళ్లీ అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీక్షాసేట్కు ఒక సినిమాలో నటించేందుకు టాలీవుడ్ నుండి హామీ లభించినట్లు తెలుస్తోంది. అల్లు శిరీష్ సరసన దీక్షాసేత్ నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈ హీరోతో లిప్‌లాక్‌కు సైతం తను సిద్ధపడినట్లుగా టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయని దీక్షాసేత్ చెబుతోంది. సినిమాలలో లిప్‌లాక్ సీన్లతోపాటు రొమాన్స్ సీన్లకు ప్రాధాన్యత పెరిగిపోయింది. అటువంటి సీన్లలో ఇప్పటికే చాలామంది హీరోయిన్లు నటించారు. మిగిలినవారిలో కూడా చాలా మంది అటువంటి సీన్లలో నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించేశారు. అదేదో గొప్ప విషమైనట్లు కూడా వారు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో అవకాశాలకు మార్గాలు తెలుసుకున్న ఈ ముద్దుగుమ్మ దీక్షాసేత్ ఇటీవల మాట్లాడుతూ ''ఒక సినిమా ఒప్పుకున్నాక సీన్ డిమాండ్‌ను బట్టి దర్శకుడు చెప్పినట్లు చేయాలి. నా వరకు నాకు ఎలాంటి సీను చేయడానికైనా అభ్యంతరం లేదు. సందర్భాన్ని బట్టి లిప్‌లాక్ సీన్లు కూడా చేస్తాను" అని చెప్పింది. స్టార్ డం హీరోలకి సరసన లిప్‌లాక్ సీన్స్‌తో పాటు, ఘూటైన రొమాన్స్ చేయటానికి సైతం ఒప్పుకోవడంతో, దీక్షాకు అవకాశాలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. సినిమాలను ఒప్పుకొనే విషయంలో తగిన జాగ్రత్తలు పాటించి తన కెరీర్‌ను సక్సెస్ వైపు నడిపించడానికి దీక్షాసేత్ అనుకుంటోంది. - శిసూర్య -
ప్రచారంలో దుమ్మురేపుతున్న లీడ్ పెయిర్
-
అభద్రతా భావం లేదు
సహనటుడు అర్మాన్‌జైన్ రాజ్‌కుమార్... నిర్మాత రాజ్‌కపూర్ మనవడే అయినప్పటికీ తానేమీ అభద్రతా భావానికి లోనవడం లేదని నటి దీక్షాసేథ్ చెప్పింది. అర్మాన్తో కలసి ‘లేకర్ హమ్ దిల్ దీవానా’ సినిమాతో బాలీవుడ్లో తొలిసారిగా నటిస్తున్న ఈ సుందరి... గతంలో ‘వేదం’ అనే తెలుగు సినిమాలో కూడా నటించింది. ఆ తర్వాత కొన్ని తమిళ సినిమాల్లోనూ నటించింది. ‘అతడు కూడా కపూరేనని తెలిసిన తర్వాత కూడా నేనేమీ అభద్రతా భావానికి లోనవడం లేదు. ఈ సినిమాలో నా పాత్ర సరైనది కాకపోతే మాత్రమే నాకు కచ్చితంగా ఆ భావన కలుగుతుంది. ఈ సినిమా చూసినట్టయితే పని విభజన సరిగ్గా జరిగిందని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. అర్మాన్... కరీనాకపూర్, కరిష్మా కపూర్లకు సోదరుడి వరుస. కొత్త నటుడు బాలీవుడ్‌లోకి అడుగిడితే అతగాడు ఎవరి కుమారుడనే విషయం తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. సినిమా కుటుంబం నుంచి వచ్చిన వారిని గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం అత్యంత సహజమనేది నా భావన. అసలేం జరుగుతోందనే విషయం తెలుసుకోవాలనే తొందరపాటు కూడా సహజమే’ అని అంది. ‘లేకర్ హమ్ దిల్ దీవానా’ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఇల్యూమినాటి, ఇరోస్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి అరిఫ్ అలీ దర్శకత్వం వహిస్తున్నాడు. మిస్ ఇండియా పోటీల్లో తలపడ్డ దీక్షాసేథ్ బాలీవుడ్లో తాను నటిస్తున్న తొలి సినిమాలో సంభాషణలు ఎలా చెప్పాననే విషయం తెలుసుకునేందుకు తెగ తొందరపడిపోతోంది. ‘మాతృభాషలో తొలిసారిగా నటించిన సినిమా కావడంతో సినిమా విడుదల కోసం నేను కూడా ఆత్రంగా ఎదురుచూస్తున్నానని తెలి పింది. -
సైఫ్ అలీఖాన్ ఫోన్లో టచ్‌లో ఉండేవారు!
అసిన్, కాజల్ అగర్వాల్, తమన్నా, చార్మి తదితరుల జాబితాలో ఇప్పుడు దీక్షా సేథ్ పేరు కూడా చేరింది. వీళ్లంతా తెలుగులో పేరు తెచ్చుకుని, హిందీ తెరపై మెరిశారు. వేదం, మిరపకాయ్, వాంటెడ్, రెబల్ తదితర చిత్రాల్లో నటించిన దీక్షాసేథ్ ‘లేకర్ హమ్ దీవానా దిల్’ చిత్రం ద్వారా హిందీ రంగానికి పరిచయం కానున్నారు. వచ్చే నెల 4న విడుదల కానున్న ఈ చిత్రం ప్రచార నిమిత్తం హైదరాబాద్ వచ్చిన దీక్షా సేథ్తో జరిపిన చిట్ చాట్. హాయ్ దీక్షా.. ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నానండి. తెలుగు పరిశ్రమ మీద అలిగారా ఏంటి... ఇక్కడ సినిమాలు చేయడంలేదు? అయ్యో అలాంటిదేమీ లేదండి. నన్ను కథానాయికను చేసింది తెలుగు పరిశ్రమే. అలాంటప్పుడు ఈ పరిశ్రమపై అలక ఎందుకు? మరి.. ‘రెబల్’ విడుదలై రెండేళ్లయినా తెలుగులో సినిమా కమిట్ కాలేదేంటి? ‘రెబల్’ సినిమా విడుదలైన సమయంలో నేనో పని మీద ముంబయ్ వెళ్లాను. అప్పుడు ‘లేకర్ హమ్ దీవానా దిల్’కి ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి, వెళ్లాను. వెంటనే నన్ను ఓకే చేశారు. ఇందులో నేను దక్షిణాది అమ్మాయిగా నటించాను. నా పాత్ర పేరు కరిష్మా శెట్టి. ఎలాగూ సౌత్ గాళ్‌గా చేశాను కాబట్టి, సౌత్‌ని మిస్సయిన ఫీలింగ్ లేదు. మరి.. ఈ సినిమా చేస్తూనే తెలుగు సినిమాలు అంగీకరించవచ్చు కదా? ఈ సినిమా చేస్తున్నప్పుడు వేరే సినిమా చేయకూడదని నిర్మాతలు నిబంధన పెట్టారు. హిందీ రంగంలో నాకిది మంచి పరిచయ చిత్రం అవుతుందనిపించి, ఆ ఒప్పందాన్ని అంగీకరించాను. ఈ చిత్రనిర్మాతల్లో సైఫ్ అలీఖాన్ ఒకరు కదా... ఆయన నిర్మాణంలో సినిమా చేయడం ఎలా అనిపించింది? సైఫ్ పెద్ద స్టార్ అయినా చాలా స్నేహంగా ఉంటారు. ఒకవైపు ఈ సినిమా నిర్మిస్తూ, మరోవైపు వేరే చిత్రంలో నటించేవారు. అందుకని, మా లొకేషన్‌కి పెద్దగా వచ్చేవారు కాదు. కాకపోతే, ఫోన్లో టచ్‌లో ఉండేవారు.‘అంతా సౌకర్యవంతంగానే ఉంది కదా.. ఏమీ సమస్యలు లేవుగా’ అని అడిగేవారు.అది సరే.. కాజల్, తమన్నా, చార్మి తదితరులు బాలీవుడ్‌పై దృష్టి పెట్టారు కదా.. వారిని ఆదర్శంగా తీసుకున్నారా ఏంటి? ప్రాంక్‌గా చెప్పాలంటే.. వాళ్ల కెరీర్ ఎలా ఆరంభమైందో నాకు తెలియదు. సౌత్‌లో ఎప్పుడు స్టార్ అయ్యారో, నార్త్‌కి ఎప్పుడు రావాలనుకున్నారో కూడా తెలియదు. అలాంటప్పుడు వాళ్లని ఎలా ఫాలో అవుతాను. హిందీ రంగంలోకి వెళ్లడానికి కొంతమందిలా నేను తెలివిగా అడుగులేయలేదు. పెద్ద పెద్ద ప్రణాళికలేవీ వేసుకోలేదు. ఆ మాటకొస్తే నేను హీరోయిన్ అవుతాననే అనుకోలేదు. అనుకోకుండానే ‘వేదం’లో అవకాశం వచ్చింది. ఇప్పుడు హిందీలో కూడా అంతే. ఏదోపని మీద ముంబయ్ వెళితే.. ఈ సినిమా కుదిరింది. ఈ చిత్ర కథానాయకుడు అర్మాన్ జైన్, గ్రేట్ రాజ్‌కపూర్ మనవడు కాబట్టి, ప్రేక్షకుల దృష్టంతా తన మీదే ఉంటుందేమో? ఒకవేళ కథానాయిక పాత్ర బాగుండకపోతే అదే జరిగి ఉండేది. కానీ, ఈ చిత్రంలో హీరోకి దీటైన పాత్ర నాది. నటనకు అవకాశం ఉంది. కాబట్టి, అర్మాన్పైనే కాదు.. ప్రేక్షకుల దృష్టి నా పైనా ఉంటుంది. ఇక హిందీలోనే కొనసాగుతారా? తెలుగు చిత్రాలు చేస్తారా? నా మాతృభాష హిందీ అయినంత మాత్రాన అక్కడే కంటిన్యూ అవుతాననుకుంటున్నారా? నాకు భాష ముఖ్యం కాదు. ఎక్కడ మంచి పాత్ర వస్తే, అక్కడ సినిమాలు చేస్తా. -
రాజ్ కపూర్ మనవడు, దీక్షసేత్ ల మూవీ ప్రెస్ మీట్
-
లిప్‌లాక్‌కు రెడీ
టీ.నగర్ : లిప్‌లాక్ సీన్లో నటించేందుకు సిద్ధం అంటున్నారు దీక్షాసేథ్. తమిళంలో విక్రమ్‌కు జంటగా రాజబాటై చిత్రంలో నటించారు. శింబుతో వేట్టై మన్నన్ చిత్రంలోను నటించారు. పలు తెలుగు చిత్రాల్లోనూ నటించిన దీక్ష ప్రస్తుతం హిందీలో నటిస్తున్నారు. ఆమె మాట్లాడుతూ దక్షిణ భారత చిత్రాల్లో నటించిన తనకు బాలీవుడ్ చిత్రాల్లో నటించడం విభిన్నంగా ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారని తనకు ఎటువంటి వ్యత్యాసం తెలియడం లేదన్నారు. రెండు చోట్లా పని చేయడం ఒకే విధంగా ఉందన్నారు. తనకు హిందీ తెలుసని, భాషా పరమైన సమస్య లేదన్నారు. తెలుగు చిత్రాల్లో నటిస్తుండగా అర్థం తెలియకపోవడంతో అవస్థలు పడ్డానన్నారు. అందుచేత తెలుగు శిక్షణ తరగతిలో చేరానన్నారు. ప్రతి రోజూ రెండు గంటల సేపు తరగతులు ఉంటాయన్నారు. ఇలా ఉండగా హఠాత్తుగా హిందీ చిత్రంలో నటించేందుకు ఆహ్వానం అందిందన్నారు. దీంతో బాలీవుడ్ ప్రవేశం చేశానన్నారు. లేహర్ కం దివనా, దిల్ చిత్రంలో నటిస్తున్నానని, ఈ చిత్రం ట్రైలర్ ను చూసిన దక్షిణ భారతీయ చిత్ర రంగ ప్రముఖులు, స్నేహితులు తనకు ప్రశంసలు అందిస్తున్నట్లు తెలిపారు. గ్లామరస్గాను, లిప్ టు టిప్ సీన్లలో నటిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారని, చిత్రానికి అవసరమైన పక్షంలో ఆ విధంగా నటించేందుకు అభ్యంతరం లేదని తెలిపారు. -
టాలీవుడ్ అన్‌లక్కీ గాళ్ దీక్షా సేథ్
-
వీరికి దారేదీ..?