లిప్‌లాక్‌కు రెడీ | Deeksha Seth ready to lip-lock Vikram? | Sakshi
Sakshi News home page

లిప్‌లాక్‌కు రెడీ

Published Mon, Jun 23 2014 12:48 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

లిప్‌లాక్‌కు రెడీ - Sakshi

లిప్‌లాక్‌కు రెడీ

 టీ.నగర్ : లిప్‌లాక్ సీన్‌లో నటించేందుకు సిద్ధం అంటున్నారు దీక్షాసేథ్. తమిళంలో విక్రమ్‌కు జంటగా రాజబాటై చిత్రంలో నటించారు. శింబుతో వేట్టై మన్నన్ చిత్రంలోను నటించారు. పలు తెలుగు చిత్రాల్లోనూ నటించిన దీక్ష ప్రస్తుతం హిందీలో నటిస్తున్నారు. ఆమె మాట్లాడుతూ దక్షిణ భారత చిత్రాల్లో నటించిన తనకు బాలీవుడ్ చిత్రాల్లో నటించడం విభిన్నంగా ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారని తనకు ఎటువంటి వ్యత్యాసం తెలియడం లేదన్నారు. రెండు చోట్లా పని చేయడం ఒకే విధంగా ఉందన్నారు. తనకు హిందీ తెలుసని, భాషా పరమైన సమస్య లేదన్నారు. తెలుగు చిత్రాల్లో నటిస్తుండగా అర్థం తెలియకపోవడంతో అవస్థలు పడ్డానన్నారు.
 
 అందుచేత తెలుగు శిక్షణ తరగతిలో చేరానన్నారు. ప్రతి రోజూ రెండు గంటల సేపు తరగతులు ఉంటాయన్నారు. ఇలా ఉండగా హఠాత్తుగా హిందీ చిత్రంలో నటించేందుకు ఆహ్వానం అందిందన్నారు. దీంతో బాలీవుడ్ ప్రవేశం చేశానన్నారు. లేహర్ కం దివనా, దిల్ చిత్రంలో నటిస్తున్నానని, ఈ చిత్రం ట్రైలర్ ను చూసిన దక్షిణ భారతీయ చిత్ర రంగ ప్రముఖులు, స్నేహితులు తనకు ప్రశంసలు అందిస్తున్నట్లు తెలిపారు. గ్లామరస్‌గాను, లిప్ టు టిప్ సీన్లలో నటిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారని, చిత్రానికి అవసరమైన పక్షంలో ఆ విధంగా నటించేందుకు అభ్యంతరం లేదని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement