సైఫ్ అలీఖాన్ ఫోన్లో టచ్‌లో ఉండేవారు! | Deeksha Seth confident despite feeling like outsider in Bollywood | Sakshi
Sakshi News home page

సైఫ్ అలీఖాన్ ఫోన్లో టచ్‌లో ఉండేవారు!

Published Sat, Jun 28 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 9:27 AM

సైఫ్ అలీఖాన్ ఫోన్లో టచ్‌లో ఉండేవారు!

సైఫ్ అలీఖాన్ ఫోన్లో టచ్‌లో ఉండేవారు!

అసిన్, కాజల్ అగర్వాల్, తమన్నా, చార్మి తదితరుల జాబితాలో ఇప్పుడు దీక్షా సేథ్ పేరు కూడా చేరింది. వీళ్లంతా తెలుగులో పేరు తెచ్చుకుని, హిందీ తెరపై మెరిశారు. వేదం, మిరపకాయ్, వాంటెడ్, రెబల్ తదితర చిత్రాల్లో నటించిన దీక్షాసేథ్ ‘లేకర్ హమ్ దీవానా దిల్’ చిత్రం ద్వారా హిందీ రంగానికి పరిచయం కానున్నారు. వచ్చే నెల 4న విడుదల కానున్న ఈ చిత్రం ప్రచార నిమిత్తం హైదరాబాద్  వచ్చిన దీక్షా సేథ్‌తో జరిపిన చిట్ చాట్.
 
హాయ్ దీక్షా.. ఎలా ఉన్నారు?
చాలా చాలా బాగున్నానండి.

తెలుగు పరిశ్రమ మీద అలిగారా ఏంటి... ఇక్కడ సినిమాలు చేయడంలేదు?
అయ్యో అలాంటిదేమీ లేదండి. నన్ను కథానాయికను చేసింది తెలుగు పరిశ్రమే. అలాంటప్పుడు ఈ పరిశ్రమపై అలక ఎందుకు?

మరి.. ‘రెబల్’ విడుదలై రెండేళ్లయినా తెలుగులో సినిమా కమిట్ కాలేదేంటి?
‘రెబల్’ సినిమా విడుదలైన సమయంలో నేనో పని మీద ముంబయ్ వెళ్లాను. అప్పుడు ‘లేకర్ హమ్ దీవానా దిల్’కి ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి, వెళ్లాను. వెంటనే నన్ను ఓకే చేశారు. ఇందులో నేను దక్షిణాది అమ్మాయిగా నటించాను. నా పాత్ర పేరు కరిష్మా శెట్టి. ఎలాగూ సౌత్ గాళ్‌గా చేశాను కాబట్టి, సౌత్‌ని మిస్సయిన ఫీలింగ్ లేదు.

మరి.. ఈ సినిమా చేస్తూనే తెలుగు సినిమాలు అంగీకరించవచ్చు కదా?
ఈ సినిమా చేస్తున్నప్పుడు వేరే సినిమా చేయకూడదని నిర్మాతలు నిబంధన పెట్టారు. హిందీ రంగంలో నాకిది మంచి పరిచయ చిత్రం అవుతుందనిపించి, ఆ ఒప్పందాన్ని అంగీకరించాను.

ఈ చిత్రనిర్మాతల్లో సైఫ్ అలీఖాన్ ఒకరు కదా... ఆయన నిర్మాణంలో సినిమా చేయడం ఎలా అనిపించింది?
 సైఫ్ పెద్ద స్టార్ అయినా చాలా స్నేహంగా ఉంటారు. ఒకవైపు ఈ సినిమా నిర్మిస్తూ, మరోవైపు వేరే చిత్రంలో నటించేవారు. అందుకని, మా లొకేషన్‌కి పెద్దగా వచ్చేవారు కాదు. కాకపోతే, ఫోన్‌లో టచ్‌లో ఉండేవారు.‘అంతా సౌకర్యవంతంగానే ఉంది కదా.. ఏమీ సమస్యలు లేవుగా’ అని అడిగేవారు.అది సరే.. కాజల్, తమన్నా, చార్మి తదితరులు బాలీవుడ్‌పై దృష్టి పెట్టారు కదా.. వారిని ఆదర్శంగా తీసుకున్నారా ఏంటి?

ప్రాంక్‌గా చెప్పాలంటే.. వాళ్ల కెరీర్ ఎలా ఆరంభమైందో నాకు తెలియదు. సౌత్‌లో ఎప్పుడు స్టార్ అయ్యారో, నార్త్‌కి ఎప్పుడు రావాలనుకున్నారో కూడా తెలియదు. అలాంటప్పుడు వాళ్లని ఎలా ఫాలో అవుతాను. హిందీ రంగంలోకి వెళ్లడానికి  కొంతమందిలా నేను తెలివిగా అడుగులేయలేదు. పెద్ద పెద్ద ప్రణాళికలేవీ వేసుకోలేదు. ఆ మాటకొస్తే నేను హీరోయిన్ అవుతాననే అనుకోలేదు. అనుకోకుండానే ‘వేదం’లో అవకాశం వచ్చింది. ఇప్పుడు హిందీలో కూడా అంతే. ఏదోపని మీద ముంబయ్ వెళితే.. ఈ సినిమా కుదిరింది.

ఈ చిత్ర కథానాయకుడు అర్మాన్ జైన్, గ్రేట్ రాజ్‌కపూర్ మనవడు కాబట్టి, ప్రేక్షకుల దృష్టంతా తన మీదే ఉంటుందేమో?
ఒకవేళ కథానాయిక పాత్ర బాగుండకపోతే అదే జరిగి ఉండేది. కానీ, ఈ చిత్రంలో హీరోకి దీటైన పాత్ర నాది. నటనకు అవకాశం ఉంది. కాబట్టి, అర్మాన్‌పైనే కాదు.. ప్రేక్షకుల దృష్టి నా పైనా ఉంటుంది.

ఇక హిందీలోనే కొనసాగుతారా? తెలుగు చిత్రాలు చేస్తారా?
నా మాతృభాష హిందీ అయినంత మాత్రాన అక్కడే కంటిన్యూ అవుతాననుకుంటున్నారా? నాకు భాష ముఖ్యం కాదు. ఎక్కడ మంచి పాత్ర వస్తే, అక్కడ సినిమాలు చేస్తా.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement