Vedam Actress Deeksha Seth: Here's About What She Was Doing Now - Sakshi
Sakshi News home page

Deeksha Seth: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన అల్లు అర్జున్‌ హీరోయిన్‌! ఇప్పుడెం చేస్తుందో తెలుసా?

Published Sat, Apr 8 2023 12:57 PM | Last Updated on Sat, Apr 8 2023 1:34 PM

Here Is About Vedam Actress Deeksha Seth What She Do Now - Sakshi

సెలబ్రెటీల లైఫ్‌ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఈ రంగుల ప్రపంచాన్ని ఏలి.. ఆ వెంటనే కనుమరగైపోతారు. అలాంటి వారిలో అల్లు అర్జున్‌ ‘వేదం’ బ్యూటీ దిక్షాసేథ్‌ ఒకరు. చేసింది సింగిల్‌ డిజిట్‌ చిత్రాలే అయినా తనదైన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. వేదంలో అల్లు అర్జున్‌ రిచ్‌ గర్ల్‌ఫ్రెండ్‌గా పరిచయమైన దిక్షాసేథ్‌ తొలి చిత్రంతోనే ఎనలేని క్రేజ్‌ సొంతం చేసుకుంది. ‘వేదం’ తర్వాత ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి.

అప్పట్లో దిక్షాసేత్‌దే హావా అనేంతగా వరుస పెట్టి సినిమాలు చేస్తూ పోయింది. ఈ క్రమంలో గోపిచంద్‌ వాంటెడ్‌, రవితేజ సరసన నిప్పు, మిరపకాయ, ప్రభాస్‌ రెబల్‌ ఇలా వెంట వెంటనే సినిమాలు చేసి వాంటెడ్‌ హీరోయిన్‌గా మారింది. ఆమె నటించిన చిత్రాలు పెద్దగా విజయం సాధించకపోయినా ధిక్షా గ్లామర్‌కు మాత్రం ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. అంతేకాదు ఆమెను టాలీవుడ్‌ కత్రినా అని కూడా ముద్దుగా పిలుచుకునే వారు. తెలుగులో ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా సినిమాలో కనిపించిన ఆమెకు తెలుగులో అవకాశాలు కరువయ్యాయి.

దీంతో  బాలీవుడ్‌కు వెళ్లిన ఆమెకు అక్కడ కూడా నిరాశే ఎదురైంది. లేకర్‌ హమ్‌ దివానా దిల్‌, ది హౌస్‌ ఆఫ్‌ ది డెడ్‌ 2, సాత్‌ కడమ్‌ వంటి హిందీ సినిమాలు చేసినా సక్సెస్‌ కాలేకపోయింది. కన్నడలో దర్శన్‌ సరసన జగ్గూబాయ్‌ సినిమాలో నటించినా ఫెయిల్యూర్‌గానే మిగిలింది. ఆమె సినీ కెరీర్‌లో మొత్తం ప్లాప్స్‌ చిత్రాలే ఉన్నాయి. దీంతో ఆమెకు ఆఫర్లు రాకపోవడం ధిక్షా ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం ఆమె లండన్‌లో నివసిస్తుంది. అక్కడ ఐటీ ఉదోగ్యం చేస్తున్నట్లు సమాచారం.

అయితే తన స్నేహితులు, కొలిగ్స్‌తో కలిసి వెకేషన్లో ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోలను తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటుంది. అలా ఇన్‌స్టా వేదికగా దిక్షా నెట్టింట ఫ్యాన్స్‌ని పలకరిస్తుంది. ఈ క్రమంలో దిక్షా రీసెంట్‌గ్‌ షేర్‌ చేసిన ఫొటోలు చూసి ఫ్యాన్స్‌ షాకవుతున్నారు. ఇందులో ఆమె పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. సినిమాల్లో కాస్తా బుగ్గలతో ముద్దుగా ఉండే దిక్షా బక్కచిక్కి కనిపించడంతో ఆమెను గుర్తు పట్టలేకపోతున్నారు. దీంతో మరి ఇంతలా మారిపోయిందేంటని, సినిమాల్లో ఉన్నప్పుడే బాగుందంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement