
శింబూ సరసన!
తెలుగులో నాలుగైదు చిత్రాల్లో నటించిన దీక్షాసేథ్ ‘రాజపాట్టై’ చిత్రం ద్వారా తమిళ తెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రం విడుదలై, మూడేళ్లకు పైనే అవుతున్నా దీక్షాకి తమిళంలో అవకాశాలు రాలేదు. ఇప్పుడో అవకాశం దక్కించుకున్నారని సమాచారం. ‘7/జి బృందావన కాలనీ’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ తదితర చిత్రాల ద్వారా దర్శకునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సెల్వరాఘవన్
ఓ తమిళ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. శింబు హీరోగా రూపొందనున్న ఈ చిత్రంలో దీక్షాని కథానాయికగా తీసుకున్నారట.