శింబుతో మరోసారి? | Trisha Once again act with Simbu | Sakshi
Sakshi News home page

శింబుతో మరోసారి?

Published Mon, Mar 23 2015 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 11:14 PM

శింబుతో మరోసారి?

శింబుతో మరోసారి?

 సంచలన జంట శింబు, త్రిష మరోసారి కలసి నటించడానికి సిద్ధం అవుతున్నారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్‌లో అవుననే సమాధానం వస్తోంది. శింబు, త్రిష హిట్ పెయిర్ కూడా. విన్నై తాండి వరువాయా చిత్రం వీరి కెరీర్‌లో మంచి చిత్రంగా నిలిచిపోయింది. అలాంటి ఈ సంచలన జంటను మరోసారి కలిపే ప్రయత్నం చేస్తున్నారు వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు సెల్వరాఘవన్. త్రిష, సెల్వరాఘవన్ కాంబినేషన్ కూడా హిట్టే. వీరిద్దరి కలయికలో రూపొందిన తెలుగు చిత్రం ఆడవారిమాటలకు అర్థాలే వేరులే ఘన విజయం సాధించింది. తమిళంలో తాజాగా శింబు, త్రిష, సెల్వరాఘవన్ కాంబినేషన్‌లో ఒక విభిన్న ప్రేమకథా చిత్రం తెరకెక్కడానికి సిద్ధం అవుతోంది. సెల్వరాఘవన్ గత చిత్రం ఇరండాం ఉలగం నిరాశ పరచింది. దీంతో ఈ దర్శకుడు పలు విమర్శనలకు గురయ్యారు.

 అంతేకాదు కొంతకాలంగా సినిమాకు దూరంగా వున్న సెల్వరాఘవన్ మళ్లీ మెగాఫోన్ పట్టడానికి సమాయత్తం అవుతున్నారు. శింబు హీరోగా నటించనున్న ఈ చిత్రంలో ఆయనకు జంటగా త్రిష, తాప్సీ నటించనున్నట్లు సమాచారం. దీని గురించి సెల్వరాఘవన్ తెలుపుతూ శింబుతో చిత్రం చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నానన్నారు. ఇవాళ్టికి అది తెరరూపం దాల్చనున్నం దుకు సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అం దించనున్నారని తమ ముగ్గురి కలయికలో ప్రా రంభం కానున్న ఈ చిత్రం కోసం చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నట్లు అన్నారు.

 అయితే ఇందులో నటించే హీరోయిన్ల గురించి త్రిష, తాప్సీలతో చర్చలు జరుగుతున్నాయని వివరించా రు. అందువలన వారు ఈ చిత్రం లో నటించే విషయంపై ఇంకా నిర్ణ యం జరగలేదని అ న్నారు. మరో విష యం ఏమిటంటే తన చిత్రా ల్లో కథా నా యకుడితో పాటు నాయికలకు ప్రాధాన్యత ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్నా రు. ఈ సంచలన కథా చిత్రం ఏప్రిల్‌లో సెట్‌పైకి రానున్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement