క్రేజీ ఆఫర్‌ కొట్టేసిన మీనాక్షి చౌదరి! | Meenakshi Chaudhary To Play Key Role In Simbu Upcoming Movie, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

వరుస సినిమాలతో దూసుకెళ్తున్న మీనాక్షి చౌదరి.. ఈ సారి శింబుకు జోడీగా!

Published Sat, Oct 26 2024 7:52 AM | Last Updated on Sat, Oct 26 2024 8:42 AM

Meenakshi Chaudhary Play Key Role In Simbu Upcoming Movie

హీరోయిన్‌ మీనాక్షీ చౌదరి కెరీర్‌ జెట్‌ స్పీడ్‌తో దూసుకెళుతోంది. ఇప్పటికే ఈ బ్యూటీ నటించిన ‘గుంటూరు కారం, సింగపూర్‌ సెలూన్, ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ చిత్రాలు రిలీజ్‌ అయ్యాయి. మీనాక్షి నటించిన ఇతర చిత్రాలు ‘లక్కీ భాస్కర్, మెకానిక్‌ రాకీ, మట్కా’ కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్‌కు ముస్తాబు అవుతున్నాయి. ఇక తాను హీరోయిన్‌గా కమిటైన సినిమాల చిత్రీకరణలు దాదాపు పూర్తి కావడంతో మీనాక్షీ చౌదరి కొత్త సినిమాలు సైన్‌ చేసేందుకు కథలు వింటున్నారు. 

ఈ క్రమంలోనే ఇటీవల దర్శకుడు అశ్వత్‌ మారిముత్తు చెప్పిన కథ విన్నారట మీనాక్షి. కథ నచ్చడంతో శింబు హీరోగా నటించనున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని కోలీవుడ్‌ సమాచారం. అలాగే చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’లో కూడా మీనాక్షీ చౌదరి ఓ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా కనిపిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement