ఇతర రంగాలకు కాస్త భిన్నం సినిమా రంగం. ఇక్కడు ఎవరు ఎప్పుడు అందలం ఎక్కుతారో చెప్పలేం. అసలు వారు కూడా ఊహించలేరు. తన పరిస్థితి అంతేనంటోంది నటి మీనాక్షి చౌదరి. ఈ కన్నడ భామలో అందం, అభినయం ఉన్నా, అదృష్టం మాత్రం కాస్త ఎక్కువే అని చెప్పక తప్పదు. టాలీవుడ్‌లో వర్థమాన హీరోలతో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న ఈమెకు ఒక్క సారిగా స్టార్ హీరోలతో నటించే అవకాశాలు రావడం మొదలెట్టాయి. అలా ఆమె నటించిన తొలి భారీ చిత్రం గుంటూరు కారం. మహేశ్‌బాబు హీరోగా నటించిన ఈ చిత్రం కమర్శియల్‌గా మంచి విజయాన్ని సాధించింది.
అదే విధంగా తమిళ చిత్ర పరిశ్రమకు కొలై అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయినప్పటికీ నటుడు విజయ్ సరసన గోట్ చిత్రంలో నటించే అవకాశం వరించింది. ఈ చిత్రం తరువాత ద్విభాషా చిత్రం (తెలుగు, తమిళం)గా తెరకెక్కిన లక్కీభాస్కర్ చిత్రం మంచి విజయాన్ని అందించింది. ఇప్పుడు టాలీవుడ్‌లో ఈ అమ్మడు బిజీగా ఉన్నారు.
కాగా ఇటీవల నటి మీనాక్షీ చౌదరి ఒక భేటీలో తన తండ్రి సైనికుడు కావడంతో చాలా క్రమశిక్షణతో పెరిగానని చెప్పింది. స్కూల్, కాలేజ్ రోజుల్లోనే తనను స్పోర్ట్స్‌లో పాల్గొనేలా చేశారని చెప్పింది. తాను టెన్సీస్ క్రీడలో రాష్ట స్థాయిలో పాల్గొన్నానని చెప్పింది. తన తండ్రి తనను క్రీడాకారిణిగా చూడాలని ఆశించారని పేర్కొంది. అలా తాను హీరోయిన్‌ని అవుతానని అస్సలు ఊహించలేదని నటి మీనాక్షీ చౌదరి చెప్పుకొచ్చింది. కాగా ఈమె ఇప్పుడు కథానాయకిగానే కాకుండా వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తూ బిజీగా ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment