ఎలాంటి సీన్లోనైనా నటిస్తా : దీక్షాసేత్ | Ready to liplock seen: deeksha seth | Sakshi
Sakshi News home page

ఎలాంటి సీన్లోనైనా నటిస్తా:దీక్షాసేత్

Published Wed, Aug 6 2014 6:27 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

దీక్షాసేత్ - Sakshi

దీక్షాసేత్

ఒక సినిమా అంగీకరించిన తరువాత ఎలాంటి సీను చేయడానికైనా తనకు అభ్యంతరం లేదని బెంగాలీ బ్యూటీ దీక్షాసేత్ చెబుతున్నారు. సందర్భాన్ని బట్టి ముద్దు (లిప్లాక్ ) సీన్లు కూడా చేస్తానంటున్నారు.  ఆఫర్ల కోసం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ నుంచి కోలీవుడ్కు వెళ్లింది. అక్కడా లాభంలేకపోవడంతో పట్టువదలని దీక్షతో బాలీవుడ్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అక్కడ ఏమైనా లక్కుంటుందేమోనని ప్రయత్నిస్తోంది.  వేదం సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైన ఈ అందాల తార  ఆ తర్వాత వాంటెడ్, రెబల్, మిరపకాయ, నిప్పు చిత్రాల్లో నటించింది. ఈ భామ తెలుగులో తనదైన గ్లామర్తో చెలరేగిపోయింది. దీక్షా దగ్గర గ్రామర్ ఉంది గానీ, అవకాశాలే రాలేదు పాపం. చెప్పుకోదగ్గ హిట్స్ కూడాలేవు. సుదీర్ణ ప్రయత్నాలు చేసిన తరువాత  అసలు సక్సెస్ ఫార్ములాను కనుక్కున్నట్లు చెబుతోంది.

దీక్షాసేత్కు ప్రస్తుతానికి  తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు లేవు. హిందీలో మాత్రం ఒక్క సినిమా 'లేఖర్ హమ్ దివానా దిల్' లో నటించింది. టాలీవుడ్లో అలవాటుపడినవారు వదలడం కష్టం. తెలుగులో మళ్లీ  అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.  దీక్షాసేట్కు ఒక సినిమాలో నటించేందుకు టాలీవుడ్ నుండి హామీ లభించినట్లు తెలుస్తోంది. అల్లు శిరీష్ సరసన దీక్షాసేత్ నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.  అంతే కాకుండా ఈ హీరోతో లిప్లాక్కు సైతం తను సిద్ధపడినట్లుగా టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయని  దీక్షాసేత్ చెబుతోంది.

సినిమాలలో లిప్లాక్ సీన్లతోపాటు రొమాన్స్ సీన్లకు ప్రాధాన్యత పెరిగిపోయింది. అటువంటి సీన్లలో ఇప్పటికే  చాలామంది  హీరోయిన్లు నటించారు. మిగిలినవారిలో కూడా చాలా మంది అటువంటి సీన్లలో నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించేశారు. అదేదో గొప్ప విషమైనట్లు కూడా వారు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో అవకాశాలకు మార్గాలు తెలుసుకున్న ఈ ముద్దుగుమ్మ దీక్షాసేత్ ఇటీవల మాట్లాడుతూ ''ఒక సినిమా ఒప్పుకున్నాక సీన్ డిమాండ్ను బట్టి దర్శకుడు చెప్పినట్లు చేయాలి. నా వరకు నాకు ఎలాంటి సీను చేయడానికైనా అభ్యంతరం లేదు. సందర్భాన్ని బట్టి లిప్లాక్ సీన్లు కూడా చేస్తాను" అని చెప్పింది. స్టార్‌ డం హీరోలకి సరసన లిప్లాక్ సీన్స్తో పాటు, ఘూటైన రొమాన్స్ చేయటానికి సైతం ఒప్పుకోవడంతో, దీక్షాకు అవకాశాలు  పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. సినిమాలను ఒప్పుకొనే విషయంలో తగిన జాగ్రత్తలు పాటించి  తన కెరీర్ను సక్సెస్ వైపు నడిపించడానికి దీక్షాసేత్ అనుకుంటోంది.

- శిసూర్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement