
Nani And Krithi Shetty Lip Lock Scene Goes Viral: రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న సినిమా 'శ్యామ్ సింగ రాయ్'. ఈ సినిమాలో కృతిశెట్టి, సాయిపల్లవి, మడోన్నాసెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోల్‌కతా బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతుంది. నిన్న(గురువారం) తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైన టీజర్‌కు అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది.
24 గంటల్లోనే ఈ టీజర్ 6.3 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోవడం విశేషం. ఇక టీజర్‌లో నాని, కృతిశెట్టి మధ్య వచ్చే లిప్‌లాక్ సీన్ ఇప్పుడు నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. టీజర్ మొత్తంలో కృతి శెట్టి ఎక్కడ కనపడలేదు కానీ.. చివర్లో నానికి లిప్‌లాక్ సీన్‌లో మాత్రమే కనిపించింది.
ఇక తొలి సినిమా ఉప్పెనతో యూత్‌లో మాంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ వరుస ప్రాజెక్టులతో యమ జోరు మీదుంది. ప్రస్తుతం నాగ చైతన్యతో బంగార్రాజు, రామ్-లింగుస్వామి కాంబినేషన్‌లో తమిళ సినిమా, సుధీర్ బాబుతో ఓ సినిమాకు కూడా సైన్ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment