kissing scenes
-
ముద్దు సీన్లన్ని తాతయ్యకు చూపించండి: వర్మ
వివాదాలు, ప్రశంసలతో సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ సెట్ చేసిన అర్జున్‌రెడ్డి మూవీ మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా విడుదల నుంచి అండగా ఉన్న రామ్‌గోపాల్ వర్మ అర్జున్ రెడ్డిపై ఫేస్ బుక్ వేదికగా కాంగ్రెస్ మాజీ ఎంపీ వీహెచ్‌ను ఉద్దేశిస్తూ మరో కామెంట్ చేశారు. ‘ అర్జున్ రెడ్డి యునిట్‌కి నేనిచ్చే సలహా మీ సినిమాలో ఉన్న ముద్దు సీన్లన్నిటినీ బ్యాక్ టు బ్యాక్ కట్ చేసి ఒక పెన్ డ్రైవ్‌లో తాతయ్యకు ఇచ్చేస్తే ఆయన వాటిని ఇంట్లో తన గదిలో ఒక్కరే చూసుకొని తప్పకుండా చిల్ అవుతారు.’ అని ఓ పోస్టు పెట్టారు. ఇక మరో పోస్టులో అర్జున్ రెడ్డి సినిమాను మరోసారి చూశానని, విజయ్ దేవర కొండ టాలీవుడ్ లియోనార్డో డికాప్రియో అనడంలో ఎలాంటి సందేహం లేదని ప్రశంసించారు. డికాప్రియో హాలివుడ్లో చేసే సినిమాల ఫార్ములానే ఈ సినిమా ఫాలో అయిందని ఆర్జీవీ చెప్పుకొచ్చాడు. మిగతా హీరోలు నటించే సంప్రదాయ చిత్రాలకు భిన్నంగా తెరకెక్కిన ఈ చిత్రం విజయ్‌ని సూపర్ స్టార్ చేసిందని పేర్కొన్నారు. -
ముద్దు పెట్టనని చెప్పానా?
బాలీవుడ్ హాట్ హీరోయిన్ సన్నీ లియోన్ ఇకపై ముద్దు సన్నివేశాల్లో నటించరని తెలిస్తే ఆమె అభిమానుల గుండె ఆగినంత పనవుతుంది. కేవలం సన్నీ చేసే అలాంటి హాట్ సీన్స్ కోసమే ఆమె అభిమానులు థియేటర్లకు వస్తుంటారు. అది తెలుసుకుని దర్శకులు ముద్దు సన్నివేశాలను సృష్టిస్తుంటారు. ఇన్నాళ్లూ ఎలాంటి అభ్యంతరం తెలపకుండా ఆ తరహా సీన్స్‌లో నటించిన సన్నీ ఇప్పుడు ఉన్నట్టుండి ‘ముద్దంటే నాకు చేదు’ అంటే ఎవరికైనా ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇకపై తాను నటించే సినిమాల్లో ముద్దు సీన్లు లేకుంటేనే ఒప్పంద పత్రాలపై సంతకాలు చేస్తానని సన్నీ నిర్మాతల దగ్గర కరాఖండిగా పేర్కొన్నారనే వార్త ఇటీవల పెద్ద దుమారమే రేపింది. ఈ వార్త సన్నీ లియోన్ వరకూ వెళ్లింది. అంతే.. ‘‘ముద్దు సీన్లో నటించనని నా అంతట నేను చెప్పానా? అసలు ఇటువంటి రూమర్స్ ఎక్కడి నుంచి పుడతాయో అర్థం కావటం లేదు’’ అని వివరణ ఇచ్చేశారు. దాంతో ఇటు సినీరంగంవారూ అటు అభిమానులూ శాంతించారు. -
ముద్దులు పెట్టనని నేనెక్కడా అనలేదే
సినిమా ఒప్పందాల మీద సంతకాలు చేసేటప్పుడు.. ముద్దు సీన్లలో నటించబోనన్న కండిషన్ తానెప్పుడూ పెట్టలేదని బాలీవుడ్ హాట్ హీరోయిన్ సన్నీలియోన్ చెప్పింది. ఆన్‌స్క్రీన్ రొమాన్స్ విషయంలో తాను సొంత సెన్సార్షిప్ ఏమీ పెట్టుకోలేదని స్పష్టం చేసింది. అసలు ఇలాంటి వార్తలు ఎలా వస్తున్నాయో తనకు తెలియదని, ఈ అబద్ధాన్ని ఎవరు ప్రచారం చేశారోనని మండిపడింది. నిజానికి ఇదంతా కూడా ఆమె చేసిన ట్వీట్ వల్లే వచ్చింది. తన 35వ పుట్టినరోజు సందర్భంగా.. భర్త డేనియల్ వెబర్‌కు ఘాటైన ముద్దుపెట్టి, ఫొటో కూడా తీయించుకున్న సన్నీ, ఆ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేసింది. కెమెరా ముందు తాను ముద్దుపెట్టనని ఎవరు అన్నారంటూ దానికి కేప్షన్ పెట్టింది. దాంతో అందరూ ఆమె ముద్దు సన్నివేశాల గురించే చర్చించుకున్నారు. నిజానికి సినిమాల్లో కూడా ముద్దు సీన్ల గురించి సన్నీలియోన్ అభ్యంతరాలు ఎప్పుడూ పెట్టలేదు గానీ.. కేవలం ఆ సన్నివేశాల కోసమే ముద్దులు పెట్టడానికి మాత్రం ఆమె వ్యతిరేకం. -
'ఎక్స్ట్రా ముద్దులా.. ఎక్కువ డబ్బివ్వండి'
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఇమ్రాన్ హష్మి తాజా సినిమా 'అజార్'. ఈ సినిమా ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకుంది. తాజాగా ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ-నర్గీస్ ఫక్రీ మధ్య హాట్ హాట్ ముద్దుసీన్లను రెండోసారి తెరకెక్కించాలని దర్శక నిర్మాతలు భావించారట. ఈ సినిమాలో అజార్ రెండో భార్య సంగీత బిజ్లానీ పాత్రలో నటిస్తున్న ఈ అమ్మడికి ఇలా రెండోసారి తెరకెక్కించడం చాలా చికాకు తెప్పించిందట. అందుకే ఎక్స్ట్రా లిప్‌లాక్ సీన్లు చేయాలంటే ఎక్కువ పారితోషికం ఇవ్వాలని తాను తేల్చిచెప్పినట్టు నర్గీస్ వెల్లడించింది. 'సినిమాలో ఇన్ని ముద్దు సీన్లు ఉంటాయని నాకు తెలియదు. ఇన్ని సీన్లు ఉండటం నాకు చికాకు తెప్పించింది. ఇందుకు ఎక్కువ చార్జ్ చేయాలనిపించింది. అందులోనూ ఎన్నో రీటేక్‌లు, రీషూట్లు ఉన్నాయి. వీటిని చేయడమంటే మాటలా' అంటూ నర్గీస్ కుండబద్దలు కొట్టింది. ముద్దుసీన్లు, ఘాటైన శృంగార దృశ్యాల్లో నటించాలంటే తనకు చాలా ఇబ్బంది అనిపిస్తుందని ఆమె తెలిపింది. 'రాక్‌స్టార్' సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన ఈ 36 ఏళ్ల భామ అదే సమయంలో సహ నటుడు ఇమ్రాన్ హష్మిపై ప్రశంసల జల్లు కురిపించింది. అతను చాలా కూల్‌గా ఉంటాడని, ఎంత ఒదిగినా ఒదిగి ఉంటాడని, చాలా ప్రొఫెషనల్ అని చెప్తోంది. -
ముద్దు వద్దన్నాడు!
పాత్ర కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికైనా శ్రుతీహాసన్ సిద్ధంగా ఉంటారు. అందంగా కనిపించడం మాత్రమే కాదు.. అందవిహీనంగా కూడా కనిపించడానికి వెనకాడరు. అందుకు నిదర్శనం ‘డీ-డే’. ఆ చిత్రంలో మొహంపై కుట్లుతో కనిపిస్తారామె. అలాగే, కథానుసారం చిత్రకథానాయకుడు అర్జున్ రామ్‌పాల్‌తో చుంభన సన్నివేశంలో కూడా నటించారు. ఇప్పుడు ఆమె చేస్తున్న చిత్రాల్లో హిందీ ‘వెల్కమ్ బ్యాక్’ ఒకటి. ఇందులోనూ లిప్ లాక్ సీన్ ఉందట. అది లేకపోతే సన్నివేశం పేలవంగా ఉంటుందట. అందుకని, శ్రుతి ఆ సీన్ చేయడానికి సిద్ధపడ్డారు. కానీ, చిత్రకథానాయకుడు జాన్ అబ్రహాం మాత్రం తిరస్కరించారట. ఇప్పటివరకు బోల్డన్ని లిప్ లాక్ సీన్స్‌లో నటించిన జాన్ అబ్రహాం ఈసారి ససేమిరా అనడానికి కారణం లేకపోలేదు. ఇప్పుడాయన ఫ్యామిలీ మ్యాన్ కదా. ప్రేయసి ప్రియా రుంచల్‌ని పెళ్లి చేసుకున్నప్పట్నుంచీ వ్యక్తిగతంగా పద్ధతిగా ఉండటంతో పాటు వృత్తిపరంగా కూడా కొన్ని పద్ధతులు పాటించాలనుకున్నారట. ‘ఇక పెదవి ముద్దు సీన్స్‌లో నటించకూడదు’ అన్నది ఆయన మొదటి నిర్ణయం అని సమాచారం. తన నిర్ణయాన్ని ‘వెల్కమ్ బ్యాక్’ దర్శకుడు అనీస్ బజ్మీ దగ్గర చెప్పి, ఒప్పించారట. -
ఎలాంటి సీన్లోనైనా నటిస్తా : దీక్షాసేత్
ఒక సినిమా అంగీకరించిన తరువాత ఎలాంటి సీను చేయడానికైనా తనకు అభ్యంతరం లేదని బెంగాలీ బ్యూటీ దీక్షాసేత్ చెబుతున్నారు. సందర్భాన్ని బట్టి ముద్దు (లిప్‌లాక్ ) సీన్లు కూడా చేస్తానంటున్నారు. ఆఫర్ల కోసం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు వెళ్లింది. అక్కడా లాభంలేకపోవడంతో పట్టువదలని దీక్షతో బాలీవుడ్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అక్కడ ఏమైనా లక్కుంటుందేమోనని ప్రయత్నిస్తోంది. వేదం సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైన ఈ అందాల తార ఆ తర్వాత వాంటెడ్, రెబల్, మిరపకాయ, నిప్పు చిత్రాల్లో నటించింది. ఈ భామ తెలుగులో తనదైన గ్లామర్‌తో చెలరేగిపోయింది. దీక్షా దగ్గర గ్రామర్ ఉంది గానీ, అవకాశాలే రాలేదు పాపం. చెప్పుకోదగ్గ హిట్స్ కూడాలేవు. సుదీర్ణ ప్రయత్నాలు చేసిన తరువాత అసలు సక్సెస్ ఫార్ములాను కనుక్కున్నట్లు చెబుతోంది. దీక్షాసేత్కు ప్రస్తుతానికి తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు లేవు. హిందీలో మాత్రం ఒక్క సినిమా 'లేఖర్ హమ్ దివానా దిల్' లో నటించింది. టాలీవుడ్లో అలవాటుపడినవారు వదలడం కష్టం. తెలుగులో మళ్లీ అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీక్షాసేట్కు ఒక సినిమాలో నటించేందుకు టాలీవుడ్ నుండి హామీ లభించినట్లు తెలుస్తోంది. అల్లు శిరీష్ సరసన దీక్షాసేత్ నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈ హీరోతో లిప్‌లాక్‌కు సైతం తను సిద్ధపడినట్లుగా టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయని దీక్షాసేత్ చెబుతోంది. సినిమాలలో లిప్‌లాక్ సీన్లతోపాటు రొమాన్స్ సీన్లకు ప్రాధాన్యత పెరిగిపోయింది. అటువంటి సీన్లలో ఇప్పటికే చాలామంది హీరోయిన్లు నటించారు. మిగిలినవారిలో కూడా చాలా మంది అటువంటి సీన్లలో నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించేశారు. అదేదో గొప్ప విషమైనట్లు కూడా వారు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో అవకాశాలకు మార్గాలు తెలుసుకున్న ఈ ముద్దుగుమ్మ దీక్షాసేత్ ఇటీవల మాట్లాడుతూ ''ఒక సినిమా ఒప్పుకున్నాక సీన్ డిమాండ్‌ను బట్టి దర్శకుడు చెప్పినట్లు చేయాలి. నా వరకు నాకు ఎలాంటి సీను చేయడానికైనా అభ్యంతరం లేదు. సందర్భాన్ని బట్టి లిప్‌లాక్ సీన్లు కూడా చేస్తాను" అని చెప్పింది. స్టార్ డం హీరోలకి సరసన లిప్‌లాక్ సీన్స్‌తో పాటు, ఘూటైన రొమాన్స్ చేయటానికి సైతం ఒప్పుకోవడంతో, దీక్షాకు అవకాశాలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. సినిమాలను ఒప్పుకొనే విషయంలో తగిన జాగ్రత్తలు పాటించి తన కెరీర్‌ను సక్సెస్ వైపు నడిపించడానికి దీక్షాసేత్ అనుకుంటోంది. - శిసూర్య -
'ముద్దు సీన్లలో హీరోలు నాకు పోటీ ఇవ్వడం లేదు'
ముంబై: బాలీవుడ్ లో 'సీరియల్ కిస్సర్' అనే ట్యాగ్ ఆ హీరోకు మాత్రమే సొంతం. హిందీ చలన చిత్ర సీమలో ప్రస్తుత టాప్ హీరోయిన్ల అందర్ని దాదాపు ముద్దులతో ముంచెత్తిన ఘనత ఆయనది. ఆయన ఎవరో కాదు.. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ. ముద్దు సీన్లలో నాతో యువ హీరోలు పోటీ పడలేకపోతున్నారని తాజాగా ఇమ్రాన్ వ్యాఖ్యలు చేశారు. కొత్తగా హిందీ తెరకు పరిచయమైన హీరోలు నాతో పోటీ పడటం లేదు అని ఇమ్రాన్ అన్నారు. తెరమీద యువ హీరోలు కేవలం ముద్దు పెట్టుకుంటున్నారు. ఆ ముద్దుల్లో ఫీల్ ఉండటం లేదని తనతో ఎవరో అన్నారని ఇమ్రాన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ముద్దు సీన్లలోతన 1000 గంటల అనుభవం ముందు కుర్రకారు తేలిపోతున్నారని ఆయన అన్నారు. అ మర్దర్, జహార్, వో లమ్హే చిత్రాల్లో ముద్దలతో సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. -
ముద్దు సీన్లు ఉంటే చాలు
ముద్దు సన్నివేశాలే బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తాయని బాలీవుడ్ దర్శకుడు కర ణ్ జోహార్ అంటున్నారు. ఇందుకు కారణం కూడా ఉంది. ముద్దు సీన్ల ఫార్ములా ఆయనకు బాగా కలిసొచ్చింది. 2012లో కరణ్ జోహార్ నిర్మించిన ‘స్ట్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ చిత్రంలో ఆలియాభట్, సిద్దార్థ్ మల్హోత్రా ముద్దు సీన్‌కు ప్రేక్షకుల నుంచి బాగానే రెస్పాన్స్ వచ్చింది. అదే జోష్‌తో తన తాజా చిత్రం ‘2 స్టేట్స్’లో ఆలియా, అర్జున్ కపూర్లతో కరణ్ ముద్దు సీన్ చిత్రీకరించారట -
భారతీయ సినిమాల్లో ముద్దు సీన్లు అక్కర్లేదు: సైఫ్ అలీఖాన్
హమ్ తుమ్, సలాం నమస్తే లాంటి సినిమాల్లో హీరోయిన్లతో పెదాలు కలిపి ముద్దుసీన్లు తెగ పండించిన హీరో సైఫ్ అలీఖాన్. కానీ, ఇప్పుడు ఆయనే భారతీయ సినిమాలకు ముద్దుసీన్లు అసలు అక్కర్లేదని చెబుతున్నాడు. అలాంటి వాతావరణం అసలు మనకు సరిపడదని, అవేమీ లేకపోయినా మన సినిమాలు ఎంచక్కా ఆడతాయని అంటున్నాడు. 'ద ఫ్రంట్ రో' అనే టీవీ చాట్ షోలో సైఫ్ మాట్లాడాడు. కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ పెళ్లికి ముందు ఓప్రకటన చేశారు. తామిద్దరం కలిసి గానీ, విడివిడిగా గానీ స్క్రీన్ మీద ముద్దు సీన్లలో నటించబోమని అప్పట్లో వారిద్దరూ చెప్పిన విషయాన్ని టీవీ షో వ్యాఖ్యాత అనుపమా చోప్రా ప్రశ్నించారు. ఇవే కాక ఇద్దరూ కలిసి పెట్టుకున్న ఇతర నిబంధనలు ఏమైనా ఉన్నాయా అని చోప్రా సైఫ్‌ను ప్రశ్నించారు. అయితే, అలాంటిదేమీ లేదని సైఫ్ సమాధానమిచ్చాడు. ఆ నిబంధన కూడా లేదని, కానీ సలాం నమస్తే లాంటి సినిమాలు తాను చేసి చాలాకాలం అయ్యిందని చెప్పాడు. భారతదేశంలో అసలు మన సినిమాల్లో ముద్దుసీన్లు అక్కర్లేదని తెలిపాడు. తషాన్, జబ్ వుయ్ మెట్, 3 ఇడియట్స్, హీరోయిన్ లాంటి సినిమాల్లో కరీనా కూడా ముద్దు సీన్లలో నటించిందని గుర్తుచేశాడు. అలాంటి సీన్లు చేసేటప్పుడు గానీ, చూసేటప్పుడు గానీ ఎవరూ అంత సౌకర్యవంతంగా కనిపించరని సైఫ్ అన్నాడు. హాలీవుడ్ సినిమాల్లో చూస్తే ముద్దు సీన్లు గానీ, శృంగార సన్నివేశాలు గానీ చూసినా ఇబ్బంది అనిపించని రీతిలో ఉంటాయన్నాడు.