ముద్దు వద్దన్నాడు! | Hero Refused to Kiss Shruti Hassan! | Sakshi
Sakshi News home page

ముద్దు వద్దన్నాడు!

Published Sat, Mar 14 2015 11:08 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ముద్దు వద్దన్నాడు! - Sakshi

ముద్దు వద్దన్నాడు!

 పాత్ర కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికైనా శ్రుతీహాసన్ సిద్ధంగా ఉంటారు. అందంగా కనిపించడం మాత్రమే కాదు.. అందవిహీనంగా కూడా కనిపించడానికి వెనకాడరు. అందుకు నిదర్శనం ‘డీ-డే’. ఆ చిత్రంలో మొహంపై కుట్లుతో కనిపిస్తారామె. అలాగే, కథానుసారం చిత్రకథానాయకుడు అర్జున్ రామ్‌పాల్‌తో చుంభన సన్నివేశంలో కూడా నటించారు. ఇప్పుడు ఆమె చేస్తున్న చిత్రాల్లో హిందీ ‘వెల్‌కమ్ బ్యాక్’ ఒకటి. ఇందులోనూ లిప్ లాక్ సీన్ ఉందట. అది లేకపోతే సన్నివేశం పేలవంగా ఉంటుందట.
 
 అందుకని, శ్రుతి ఆ సీన్ చేయడానికి సిద్ధపడ్డారు. కానీ, చిత్రకథానాయకుడు జాన్ అబ్రహాం మాత్రం తిరస్కరించారట. ఇప్పటివరకు బోల్డన్ని లిప్ లాక్ సీన్స్‌లో నటించిన జాన్ అబ్రహాం ఈసారి ససేమిరా అనడానికి కారణం లేకపోలేదు. ఇప్పుడాయన ఫ్యామిలీ మ్యాన్ కదా. ప్రేయసి ప్రియా రుంచల్‌ని పెళ్లి చేసుకున్నప్పట్నుంచీ వ్యక్తిగతంగా పద్ధతిగా ఉండటంతో పాటు వృత్తిపరంగా కూడా కొన్ని పద్ధతులు పాటించాలనుకున్నారట. ‘ఇక పెదవి ముద్దు సీన్స్‌లో నటించకూడదు’ అన్నది ఆయన మొదటి నిర్ణయం అని సమాచారం. తన నిర్ణయాన్ని ‘వెల్‌కమ్ బ్యాక్’ దర్శకుడు అనీస్ బజ్మీ దగ్గర చెప్పి, ఒప్పించారట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement