ముద్దులు పెట్టనని నేనెక్కడా అనలేదే
సినిమా ఒప్పందాల మీద సంతకాలు చేసేటప్పుడు.. ముద్దు సీన్లలో నటించబోనన్న కండిషన్ తానెప్పుడూ పెట్టలేదని బాలీవుడ్ హాట్ హీరోయిన్ సన్నీలియోన్ చెప్పింది. ఆన్‌స్క్రీన్ రొమాన్స్ విషయంలో తాను సొంత సెన్సార్‌షిప్ ఏమీ పెట్టుకోలేదని స్పష్టం చేసింది. అసలు ఇలాంటి వార్తలు ఎలా వస్తున్నాయో తనకు తెలియదని, ఈ అబద్ధాన్ని ఎవరు ప్రచారం చేశారోనని మండిపడింది. నిజానికి ఇదంతా కూడా ఆమె చేసిన ట్వీట్ వల్లే వచ్చింది.
తన 35వ పుట్టినరోజు సందర్భంగా.. భర్త డేనియల్ వెబర్‌కు ఘాటైన ముద్దుపెట్టి, ఫొటో కూడా తీయించుకున్న సన్నీ, ఆ ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. కెమెరా ముందు తాను ముద్దుపెట్టనని ఎవరు అన్నారంటూ దానికి కేప్షన్ పెట్టింది. దాంతో అందరూ ఆమె ముద్దు సన్నివేశాల గురించే చర్చించుకున్నారు. నిజానికి సినిమాల్లో కూడా ముద్దు సీన్ల గురించి సన్నీలియోన్ అభ్యంతరాలు ఎప్పుడూ పెట్టలేదు గానీ.. కేవలం ఆ సన్నివేశాల కోసమే ముద్దులు పెట్టడానికి మాత్రం ఆమె వ్యతిరేకం.