lip locks
-
ముద్దులు పెట్టనని నేనెక్కడా అనలేదే
సినిమా ఒప్పందాల మీద సంతకాలు చేసేటప్పుడు.. ముద్దు సీన్లలో నటించబోనన్న కండిషన్ తానెప్పుడూ పెట్టలేదని బాలీవుడ్ హాట్ హీరోయిన్ సన్నీలియోన్ చెప్పింది. ఆన్‌స్క్రీన్ రొమాన్స్ విషయంలో తాను సొంత సెన్సార్షిప్ ఏమీ పెట్టుకోలేదని స్పష్టం చేసింది. అసలు ఇలాంటి వార్తలు ఎలా వస్తున్నాయో తనకు తెలియదని, ఈ అబద్ధాన్ని ఎవరు ప్రచారం చేశారోనని మండిపడింది. నిజానికి ఇదంతా కూడా ఆమె చేసిన ట్వీట్ వల్లే వచ్చింది. తన 35వ పుట్టినరోజు సందర్భంగా.. భర్త డేనియల్ వెబర్‌కు ఘాటైన ముద్దుపెట్టి, ఫొటో కూడా తీయించుకున్న సన్నీ, ఆ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేసింది. కెమెరా ముందు తాను ముద్దుపెట్టనని ఎవరు అన్నారంటూ దానికి కేప్షన్ పెట్టింది. దాంతో అందరూ ఆమె ముద్దు సన్నివేశాల గురించే చర్చించుకున్నారు. నిజానికి సినిమాల్లో కూడా ముద్దు సీన్ల గురించి సన్నీలియోన్ అభ్యంతరాలు ఎప్పుడూ పెట్టలేదు గానీ.. కేవలం ఆ సన్నివేశాల కోసమే ముద్దులు పెట్టడానికి మాత్రం ఆమె వ్యతిరేకం. -
లిప్ లాక్ లకు వ్యతిరేకం.. కానీ రిజెక్ట్ చేయలేదు!
ముంబై: తాను లిప్ లాక్ సన్నివేశాలకు ఎప్పుడూ వ్యతిరేకమే అంటున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అయితే తన సినిమాల్లో ఆ సన్నివేశాలను రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా లేవన్నాడు. గతంలో తాను చేసిన సినిమాల్లో ఆ తరహా శృంగారపరమైన సన్నివేశాలు ఉన్నా.. కథ మధ్యలో మాత్రమే ఉండేవని అర్జున్ పేర్కొన్నాడు. లిప్ లాక్ సీన్లతో కుటుంబ సమేతంగా వచ్చే ప్రేక్షకులు ఇబ్బంది పడతారన్నాడు. ఒకొనొక సందర్భంలో తాను కూడా కుటుంబంతో సినిమాకు వెళ్లి ఈ రకంగానే ఇబ్బంది పడ్డానన్న సంగతిని గుర్తు చేసుకున్నాడు. ఇక నుంచి తన రాబోయే సినిమాల్లో లిప్ లాక్ పరిమితంగానే ఉంటాయన్నాడు. అయితే ఇక మీరు లవర్ బోయ్ పాత్రలకు దూరంగా ఉండదలుచుకున్నారా?అన్న ప్రశ్నకు మాత్రం అర్జున్ తనదైన శైలిలో జవాబిచ్చాడు. లిప్ లాక్ సన్నివేశాలు పెద్దగా చేయకుండా కూడా బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడని అల్లు అర్జున్ కౌంటర్ ఇచ్చాడు. -
లిప్ లాక్స్ లో రెజీనా టాప్!
చెన్నై నుంచి టాలీవుడ్‌కి దిగుమతి అయిన హీరోయిన్ రెజీనా ఇక్కడ ప్రతి హీరోతో లిప్‌లాక్ సీన్లలో నటిస్తూ దుమ్ముదులిపేస్తోంది. వరుసపెట్టి సినిమాలు చేస్తూ బిజీబిజీ అయిపోయింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని అనుకూలంగా ఉపయోగించుకుంటోంది. ప్రతి చిత్రంలో లిప్ లాక్ సీన్స్‌కు గ్రీన్ సిగ్నెల్స్ ఇచ్చేస్తోంది. ప్రతి హీరోకి లిప్ లాక్స్ వేసి యువ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దాంతో హిట్, ఫ్లాఫ్లతో సంబంధం లేకుండా అవకాశాలు దక్కించుకుంటుంది. రొటీన్ లవ్ స్టోరీ, రా..రా..కృష్ణయ్య, పవర్ చిత్రాలలో ఈ అమ్మడు సందీప్ కిషన్, రవితేజల లిప్ కిస్‌లు అందుకుంది. ఇక తన అప్ కమింగ్ మూవీస్‌లో కూడా అదే తరహాలో రొమాన్స్‌ని ఘాటుగా పండించడానికి సిద్ధంగా ఉంది. చిన్న సినిమాల్లో నటిస్తూ ఈ బ్యూటీ అభిమానుల గుండెల్లో పెద్ద స్థానాన్ని సంపాదించుకుంది. లో బడ్జెట్, హై బడ్జెట్ అని తేడా లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని ఫుల్ క్రేజ్ కొట్టేసింది. ఇప్పటి వరకు ఈ ముద్దుల గుమ్మ నటించిన ఏ మూవీకి సక్సెస్ టాక్ రాలేదు. అయినా రెజీనా అందం మాత్రం కుర్రకారుకి తెగ నచ్చేసింది. ప్రస్తుతం టాలీవుడ్లో ఎక్కువ సినిమాలు చేస్తున్న హీరోయిన్స్ జాబితాలో రెజీనా చేరిపోయింది. ** -
పెదవి ముద్దుకి సిద్ధం
తెలుగు ప్రేక్షకులు ఆదరించి స్టార్‌ని చేయడం, ఆ ఇమేజ్‌ని అడ్డం పెట్టుకొని కోలీవుడ్‌లో ఎదగడానికి ప్రయత్నాలు చేయడం.. కొన్నాళ్లుగా హీరోయిన్లకు పరిపాటైపోయింది. శ్రీయ, తమన్నా, అనుష్క, ఇప్పుడు కాజల్. వీరందరూ ఇలా చేసిన వారే. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి సమంత కూడా చేరబోతోంది. తెలుగు ప్రేక్షకులు ఈ ముద్దుగుమ్మకు ‘నంబర్‌వన్ హీరోయిన్’ అనే కిరీటాన్ని కట్టబెట్టేశారు. కానీ ఆ విషయాన్ని కూడా విస్మరించి తమిళ సినిమాల కోసం వెంపర్లాడుతోంది సమంత. ఇటీవలే.. కోలీవుడ్‌లో కాజల్‌కు దక్కిన ఓ భారీ ఛాన్స్‌ని సైతం సమంత కొట్టేసిందని అక్కడ టాక్. వివరాల్లోకెళితే... విజయ్ కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో తమిళంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో ముందు అనుకున్న కథానాయిక కాజల్. కోటిన్నర రూపాయలు పారితోషికంగా కూడా కాజల్‌కి అందించారట సదరు చిత్ర నిర్మాతలు. అయితే... కథ రీత్యా ఇందులో కథానాయిక గ్లామర్‌ని కాస్తంత ఎక్కువగా వలికించాలి. దాంతో పాటు ఓ భారీ లిప్ లాక్ సన్నివేశం కూడా ఉంది. ఈ విషయం తెలిసి కాజల్ ససేమిరా అందట. ఇచ్చిన పారితోషికాన్ని వెనక్కు ఇవ్వడానికి కూడా సిద్ధపడిందట. దీంతో షాక్‌కి గురైన దర్శక, నిర్మాతలకు సమంత కొండంత అండగా నిలిచిందని కోలీవుడ్ సమాచారం. గ్లామర్ విషయంలో ‘నో’ చెప్పినా... లిప్ లాక్ విషయంలో మాత్రం ‘ఓకే’ అనేసిందట సమంత. దాంతో చివరకు సమంతను ఈ సినిమాకు కథానాయికగా ఖరారు చేశారు మురుగదాస్. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది. మరి విజయ్‌తో అధర చుంబనానికి సమంత అంగీకరించిన విషయంపై ఆమె బోయ్‌ఫ్రెండ్ సిద్దార్థ్ స్పందన ఏంటో మరి. -
లిప్‌లాక్‌కు ఓకే
ఆన్‌స్క్రీన్ హీరో హీరోయిన్ల మధ్య లిప్‌లాక్ సన్నివేశాలిప్పుడు సర్వసాధారణం. అయినా అలాంటి సన్నివేశాలుంటే యువతకు క్యూరియాసిటీ కూడా ఎక్కువే. అందుకే అలాంటి సన్నివేశాలు రిపీట్ అవుతుంటాయి. ఇంతకుముందు ఈ తరహా లిప్‌లాక్ సన్నివేశాలకు కమలహాసన్‌ను ప్రత్యేకంగా చెప్పుకునేవారు. ఇప్పుడు చాలామంది నటులు ఇలాంటి ముద్దు సన్నివేశాలకు ఆసక్తి చూపిస్తున్నారు. కథ డిమాండ్ పేరుతో సొమ్ము చేసుకునే ప్రయత్నంగా దీన్ని భావించక తప్పదు. ఇక అసలు విషయానికొస్తే ఇప్పటి వరకు పక్కింటి అమ్మాయిగా హోమ్లీ పాత్రల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న లక్ష్మీమీనన్ ఇప్పుడు పాశ్చాత్య సంస్కృతికి చిహ్నం అయిన లిప్‌లాక్ సన్నివేశంలో నటించడానికి ఓకే చెప్పడమే కాదు నటుడు విశాల్‌కు ఘాటుగా ముద్దు లిచ్చేసిందట. వీరిద్దరూ కలసి నటించిన పాండియనాడు మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ హిట్ పెయిర్ తాజాగా నాన్‌సిగప్పు మనిదన్ చిత్రంలో మరోసారి జత కడుతున్నారు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తిరు దర్శకుడు. ఇందులో లిప్‌లాక్ సన్నివేశం గురించి దర్శకుడు కథ వినిపించినప్పుడే నటి లక్ష్మీమీనన్‌కు చెప్పారట. కథకు అవసరం అనిపించడంతో ఈ మలయాళి బ్యూటీ కూడా మరోమాట లేకుండా ఓకే చెప్పిందట. విశాల్, లక్ష్మీమీనన్‌ల మధ్య ఈ లిప్‌లాక్ సన్నివేశాలను ఇటీవల చిత్రీకరించారట. అయితే ఎలాంటి అసభ్యత, అశ్లీలం లేకుండా ఈ సన్నివేశాలను కళాత్మకంగా చిత్రీకరించినట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి.