లిప్ లాక్ లకు వ్యతిరేకం.. కానీ రిజెక్ట్ చేయలేదు!
ముంబై: తాను లిప్ లాక్ సన్నివేశాలకు ఎప్పుడూ వ్యతిరేకమే అంటున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అయితే తన సినిమాల్లో ఆ సన్నివేశాలను రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా లేవన్నాడు. గతంలో తాను చేసిన సినిమాల్లో ఆ తరహా శృంగారపరమైన సన్నివేశాలు ఉన్నా.. కథ మధ్యలో మాత్రమే ఉండేవని అర్జున్ పేర్కొన్నాడు. లిప్ లాక్ సీన్లతో కుటుంబ సమేతంగా వచ్చే ప్రేక్షకులు ఇబ్బంది పడతారన్నాడు. ఒకొనొక సందర్భంలో తాను కూడా కుటుంబంతో సినిమాకు వెళ్లి ఈ రకంగానే ఇబ్బంది పడ్డానన్న సంగతిని గుర్తు చేసుకున్నాడు. ఇక నుంచి తన రాబోయే సినిమాల్లో లిప్ లాక్ పరిమితంగానే ఉంటాయన్నాడు.
అయితే ఇక మీరు లవర్ బోయ్ పాత్రలకు దూరంగా ఉండదలుచుకున్నారా?అన్న ప్రశ్నకు మాత్రం అర్జున్ తనదైన శైలిలో జవాబిచ్చాడు. లిప్ లాక్ సన్నివేశాలు పెద్దగా చేయకుండా కూడా బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడని అల్లు అర్జున్ కౌంటర్ ఇచ్చాడు.