లిప్ లాక్స్ లో రెజీనా టాప్!
చెన్నై నుంచి టాలీవుడ్‌కి దిగుమతి అయిన హీరోయిన్ రెజీనా ఇక్కడ ప్రతి హీరోతో లిప్లాక్ సీన్లలో నటిస్తూ దుమ్ముదులిపేస్తోంది. వరుసపెట్టి సినిమాలు చేస్తూ బిజీబిజీ అయిపోయింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని అనుకూలంగా ఉపయోగించుకుంటోంది. ప్రతి చిత్రంలో లిప్ లాక్ సీన్స్‌కు గ్రీన్ సిగ్నెల్స్ ఇచ్చేస్తోంది. ప్రతి హీరోకి లిప్ లాక్స్ వేసి యువ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దాంతో హిట్, ఫ్లాఫ్లతో సంబంధం లేకుండా అవకాశాలు దక్కించుకుంటుంది. రొటీన్ లవ్ స్టోరీ, రా..రా..కృష్ణయ్య, పవర్ చిత్రాలలో ఈ అమ్మడు సందీప్ కిషన్, రవితేజల లిప్ కిస్‌లు అందుకుంది. ఇక తన అప్ కమింగ్ మూవీస్లో కూడా అదే తరహాలో రొమాన్స్ని ఘాటుగా పండించడానికి సిద్ధంగా ఉంది.
చిన్న సినిమాల్లో నటిస్తూ ఈ బ్యూటీ అభిమానుల గుండెల్లో పెద్ద స్థానాన్ని సంపాదించుకుంది. లో బడ్జెట్, హై బడ్జెట్ అని తేడా లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని ఫుల్ క్రేజ్ కొట్టేసింది. ఇప్పటి వరకు ఈ ముద్దుల గుమ్మ నటించిన ఏ మూవీకి సక్సెస్ టాక్ రాలేదు. అయినా రెజీనా అందం మాత్రం కుర్రకారుకి తెగ నచ్చేసింది. ప్రస్తుతం టాలీవుడ్లో ఎక్కువ సినిమాలు చేస్తున్న హీరోయిన్స్ జాబితాలో రెజీనా చేరిపోయింది.
**