Sandip Kishan
-
పాన్ ఇండియా సినిమాలో వరుణ్ సందేశ్.. పోస్టర్ రిలీజ్
Varun Sandesh Plays Key Role In Michael Movie: హ్యాపీడేస్, కొత్త బంగారు లోకం సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్ అందుకున్న హీరో వరుణ్ సందేశ్. చాలాకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ యంగ్ హీరో ఇటీవలె ఇందువధన చిత్రంతో ప్రేక్షకుల మందుకు వచ్చాడు. అయితే ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. తాజాగా రూటు మార్చిన ఈ యంగ్ హీరో ఇప్పుడు యాక్షన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అది కూడా పాన్ ఇండియా సినిమా. సందీప్ కిషన్, విజయ్ సేతుపతి ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న మైఖేల్ సినిమాలో వరుణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని మూవీ టీం అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ ,మలయాళ భాషల్లో విడుదల కానుంది. -
స్టేజ్‌పైనే..హీరోను 'అన్నా' అని పిలిచిన నటి
సాక్షి, హైదరాబాద్ : హీరోయిన్ లావణ్య త్రిపాఠి, సందీప్ కిషన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎ 1 ఎక్స్‌ప్రెస్’. మార్చి 5న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గతరాత్రి (ఫిబ్రవరి28)న హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు రామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుక చివర్లో స్టేజ్ పైకి వచ్చిన హీరోయిన్ లావణ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చాలా కష్టాలు పడి ఈ సినిమాను పూర్తి చేశామని, దీనికోసం ప్రత్యేకంగా హాకీ నేర్చుకున్నానని తెలిపింది. ఇక హీరో సందీప్‌తో వర్క్ చేయడం గురించి మాట్లాడుతూ..సందీప్ 'అన్నా' గురించి చెప్పాలంటే .. అంటూ నాలుక కరుచుకుంది. దీంతో సందీప్ సహా అక్కడున్న వారందరిలో నవ్వులు విరిశాయి. వెంటనే తేరుకున్న లావణ్య..సందీప్ ఫ్యాన్స్‌కి అన్న..తనకి ఫ్రెండ్ అంటూ కవర్ చేసేసింది. ఇక లావణ్య..సందీప్‌ను అన్నా అని పిలవడంపై నెట్టింట జోకులు పేలుతున్నాయి. పాపం సందీప్ అంటూ మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. మరోవైపు స్పీచ్ మొత్తం తడబడుతూ, తెలుగులో మాట్లాడిన లావణ్యపై కొందరు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని తెలుగు సినిమాలు చేసినా ఇప్పటికీ తెలుగు సరిగ్గా మాట్లాడకపోవడంపై ఏంటని కొందరు పెదవి విరుస్తున్నారు. చదవండి : (బిగ్‌బాస్ బ్యూటీ హిమజకు పవన్ కళ్యాణ్ లేఖ) (శృతి ప్రియుడికి థాంక్స్ చెప్పిన కమల్!) -
సినిమా రివ్యూ: జోరు
తారాగణం: సందీప్ కిషన్, రాశీఖన్నా, సుష్మా, ప్రియాబెనర్జీ, కథ: విక్రమ్రాజ్, సంగీతం: భీవ్‌ు సిసిరోలియా, నిర్మాతలు: అశోక్, నాగార్జున, కథ, కథనం, మాటలు, దర్శకత్వం: కుమార్ నాగేంద్ర బలాలు: ఒకరికి ముగ్గురు హీరోయిన్లు ఉండడం మాస్ మెచ్చే ఐటెమ్ సాంగ్ మెలొడీ పాట ‘పువ్వు లకు రంగెయ్యాల...’ చిత్రీకరణ బలహీనతలు: పాత చిత్రాల్ని గుర్తుచేస్తూ గజి బిజిగా అల్లుకున్న కథ పాత్రల మధ్య సమన్వయ లేమి పాత్రల కన్ఫ్యూజన్ ప్రేక్షకులకూ విస్తరించడం ఎడిటింగ్ ఒకరి స్థానంలోకి మరో పాత్ర వచ్చి, విలన్‌ను బురిడీ కొట్టించడమనే బాక్సాఫీస్ ఫార్ములా విజయానికి మంచి సూత్రమే. కాకపోతే, స్క్రిప్టును సమర్థంగా రాసుకోకపోతే, ప్రేక్షకులు కన్విన్స అయ్యేలా చెప్పలేకపోతే అది గుదిబండగా మారే ప్రమాదం ఉంటుంది. ఒకరి స్థానంలో మరొకరిని పెట్టడమనే సూత్రంలోనే వచ్చిన సినిమా - ‘జోరు’. కథ ఏమిటంటే: విశాఖపట్నం ఎమ్మెల్యే సదాశివం (సాయాజీ షిండే). అతని కుమార్తె (రాశీ ఖన్నా) అమెరికా నుంచి వస్తుంది. ఆమె కిడ్నాప్‌కు గురయ్యే టైవ్‌ులో సందీప్ (సందీప్ కిషన్) రక్షిస్తాడు. తన వెంట తీసుకువెళతాడు. ఆ క్రమంలో ఆమె తండ్రి గురించి ఒక నిజం తెలుస్తుంది. అప్పుడు హీరోయిన్ స్థానంలో మరొకర్ని ప్రవేశపెట్టి, హీరో ఆడిన నాటకమేంటి? అదెలా ముగిసిందన్నది సినిమా. ఎలా నటించారంటే: ఉడికీ ఉడకని కథతో చేసిన ఈ చిత్రంలో హీరో పాత్ర అన్నీ తెలిసిన సూపర్‌మాన్‌లా ప్రవర్తిస్తుంటుంది. సందీప్‌కు కావాల్సినంత ఎనర్జీ ఉన్నా అతనికే మాత్రం సరిపడని పాత్ర ఇది. అతని నటనలో సొంత శైలి కంటే ఇతర హీరోల ప్రభావం కనిపించింది. ఒకరికి ముగ్గురు హీరోయిన్లు ఉండడం చూడడానికే తప్ప, కథకు పనికొచ్చింది తక్కువ. బ్రహ్మానందం, సప్తగిరి ఒకటి రెండు చోట్లే వినోదింపజేశారు. ఎలుగుబంటికి సంగీతం నేర్పించే ఎపిసోడ్ లాంటివి పెద్ద ఫార్సు. సాయాజీ షిండేకు కొడుకు పాత్ర (నటుడు అజయ్)... చిత్ర దర్శకుడు అనుకున్నప్పుడల్లా వచ్చి, అర్ధంతరంగా అదృశ్యమైపోతుంటుంది. ఎలా ఉందంటే: విషయం లేకుండానే ఫస్టాఫ్ అంతా నడుస్తుంది. అయితే, ఆసక్తికరమైన ట్విస్ట్ దగ్గర ఇంటర్వెల్ వస్తుంది. ఆ ట్విస్ట్ ముడివిప్పి, విలన్‌ను హీరో మట్టికరిపించడమనే కీలకమంతా సెకండాఫ్ లోనే. అక్కడే దర్శక, రచయిత విఫలమయ్యారు. ఎంచుకున్న కథలోనే కాక, కథనంలో కూడా విషయలేమి తెలిసిపోతుంటుంది. పతాక సన్నివేశంలో అది మరీ కనిపిస్తుంది. దాంతో, ప్రేక్షకులకు చివరకు అసంతృప్తి మిగులుతుంది. పాత్రలు వాటి మధ్య కాకుండా, మనల్ని చూస్తూ మనసులో మాట్లాడుకోవడమే ఈ సినిమాలో ఎక్కువ. అనవసరమైన కార్టూన్ యానిమేషన్లు, సందర్భం లేకుండా అడ్డంగా వచ్చే పాటలు సరేసరి. కథలు రాసుకొని సినిమా తీయడమనే పద్ధతి కన్నా సినిమాలు చూసి సినిమాలు తీయడమనే పాపులర్ పద్ధతిలోని సౌకర్యాన్ని చిత్ర రూపకర్తలు చక్కగా వినియోగించుకున్నారు. కథలో పాత్రల మధ్య ఉన్న గందరగోళం అంతకన్నా ఎక్కువగా దాన్ని తెరపై చూస్తున్న ప్రేక్షకులకు కలుగుతుంది. కొన్ని సినిమాలకు కథ ఏమిటని అడగకూడదు. సినిమా చూసినా, అది గుర్తూ ఉండదు. గుర్తుంచుకోవడానికీ ఏమీ ఉండదు. బహుశా, ఆ జాబితాలో ఒకటిగా ‘జోరు’ను ప్రేక్షకులు వర్గీకరిస్తే తప్పుపట్టలేం. ఇది ‘గుండెల్లో గోదారి’ లాంటి మంచి చిత్రం రూపొందించిన దర్శకుడి ద్వితీయ ప్రయత్నం కావడం వాణిజ్య సూత్రాల బరిలో బందీ అవుతున్న సినీ సృజనాత్మకతకు విషాద తార్కాణం. ►రెంటాల జయదేవ Follow @sakshinews -
విడుదలకు సిద్ధమైన 'జోరు'
-
లిప్ లాక్స్ లో రెజీనా టాప్!
చెన్నై నుంచి టాలీవుడ్‌కి దిగుమతి అయిన హీరోయిన్ రెజీనా ఇక్కడ ప్రతి హీరోతో లిప్‌లాక్ సీన్లలో నటిస్తూ దుమ్ముదులిపేస్తోంది. వరుసపెట్టి సినిమాలు చేస్తూ బిజీబిజీ అయిపోయింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని అనుకూలంగా ఉపయోగించుకుంటోంది. ప్రతి చిత్రంలో లిప్ లాక్ సీన్స్‌కు గ్రీన్ సిగ్నెల్స్ ఇచ్చేస్తోంది. ప్రతి హీరోకి లిప్ లాక్స్ వేసి యువ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దాంతో హిట్, ఫ్లాఫ్లతో సంబంధం లేకుండా అవకాశాలు దక్కించుకుంటుంది. రొటీన్ లవ్ స్టోరీ, రా..రా..కృష్ణయ్య, పవర్ చిత్రాలలో ఈ అమ్మడు సందీప్ కిషన్, రవితేజల లిప్ కిస్‌లు అందుకుంది. ఇక తన అప్ కమింగ్ మూవీస్‌లో కూడా అదే తరహాలో రొమాన్స్‌ని ఘాటుగా పండించడానికి సిద్ధంగా ఉంది. చిన్న సినిమాల్లో నటిస్తూ ఈ బ్యూటీ అభిమానుల గుండెల్లో పెద్ద స్థానాన్ని సంపాదించుకుంది. లో బడ్జెట్, హై బడ్జెట్ అని తేడా లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని ఫుల్ క్రేజ్ కొట్టేసింది. ఇప్పటి వరకు ఈ ముద్దుల గుమ్మ నటించిన ఏ మూవీకి సక్సెస్ టాక్ రాలేదు. అయినా రెజీనా అందం మాత్రం కుర్రకారుకి తెగ నచ్చేసింది. ప్రస్తుతం టాలీవుడ్లో ఎక్కువ సినిమాలు చేస్తున్న హీరోయిన్స్ జాబితాలో రెజీనా చేరిపోయింది. **