Varun Sandesh To Play Key Role In Pan India Michael Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Varun Sandesh: రూటు మార్చిన వరుణ్‌.. కానీ హీరో మాత్రం కాదు!

Published Sun, Mar 13 2022 4:17 PM | Last Updated on Sun, Mar 13 2022 5:41 PM

Varun Sandesh Plays Key Role In Michael Movie - Sakshi

Varun Sandesh Plays Key Role In Michael Movie: హ్యాపీడేస్‌, కొత్త బంగారు లోకం సినిమాలతో బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్‌ అందుకున్న హీరో వరుణ్‌ సందేశ్‌. చాలాకాలంగా సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్న ఈ యంగ్‌ హీరో ఇటీవలె ఇందువధన చిత్రంతో ప్రేక్షకుల మందుకు వచ్చాడు. అయితే ఈ చిత్రం కూడా బాక్సాఫీస్‌ వద్ద నిరాశ పరిచింది. తాజాగా రూటు మార్చిన ఈ యంగ్‌ హీరో ఇప్పుడు యాక్షన్‌ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. అది కూడా పాన్‌ ఇండియా సినిమా.

సందీప్‌ కిషన్‌, విజయ్‌ సేతుపతి ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న మైఖేల్‌ సినిమాలో వరుణ్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని మూవీ టీం అఫీషియల్‌గా అనౌన్స్‌ చేసింది. రంజిత్‌ జయకోడి దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ ,మలయాళ భాషల్లో విడుదల కానుంది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement