
సాక్షి, హైదరాబాద్ : హీరోయిన్ లావణ్య త్రిపాఠి, సందీప్ కిషన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎ 1 ఎక్స్‌ప్రెస్’. మార్చి 5న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గతరాత్రి (ఫిబ్రవరి28)న హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు రామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుక చివర్లో స్టేజ్ పైకి వచ్చిన హీరోయిన్ లావణ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చాలా కష్టాలు పడి ఈ సినిమాను పూర్తి చేశామని, దీనికోసం ప్రత్యేకంగా హాకీ నేర్చుకున్నానని తెలిపింది.
ఇక హీరో సందీప్‌తో వర్క్ చేయడం గురించి మాట్లాడుతూ..సందీప్ 'అన్నా' గురించి చెప్పాలంటే .. అంటూ నాలుక కరుచుకుంది. దీంతో సందీప్ సహా అక్కడున్న వారందరిలో నవ్వులు విరిశాయి. వెంటనే తేరుకున్న లావణ్య..సందీప్ ఫ్యాన్స్‌కి అన్న..తనకి ఫ్రెండ్ అంటూ కవర్ చేసేసింది. ఇక లావణ్య..సందీప్‌ను అన్నా అని పిలవడంపై నెట్టింట జోకులు పేలుతున్నాయి. పాపం సందీప్ అంటూ మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. మరోవైపు స్పీచ్ మొత్తం తడబడుతూ, తెలుగులో మాట్లాడిన లావణ్యపై కొందరు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని తెలుగు సినిమాలు చేసినా ఇప్పటికీ తెలుగు సరిగ్గా మాట్లాడకపోవడంపై ఏంటని కొందరు పెదవి విరుస్తున్నారు.
చదవండి : (బిగ్‌బాస్ బ్యూటీ హిమజకు పవన్ కళ్యాణ్ లేఖ)
(శృతి ప్రియుడికి థాంక్స్ చెప్పిన కమల్!)
Comments
Please login to add a commentAdd a comment