లిప్‌లాక్‌కు ఓకే | Lakshmi Menon lip locks with Vishal? | Sakshi
Sakshi News home page

లిప్‌లాక్‌కు ఓకే

Published Wed, Jan 1 2014 4:40 AM | Last Updated on Sat, Sep 2 2017 2:09 AM

విశాల్‌

విశాల్‌

ఆన్‌స్క్రీన్ హీరో హీరోయిన్ల మధ్య లిప్‌లాక్ సన్నివేశాలిప్పుడు సర్వసాధారణం. అయినా అలాంటి సన్నివేశాలుంటే యువతకు క్యూరియాసిటీ కూడా ఎక్కువే. అందుకే అలాంటి సన్నివేశాలు రిపీట్ అవుతుంటాయి. ఇంతకుముందు ఈ తరహా లిప్‌లాక్ సన్నివేశాలకు కమలహాసన్‌ను ప్రత్యేకంగా చెప్పుకునేవారు. ఇప్పుడు చాలామంది నటులు ఇలాంటి ముద్దు సన్నివేశాలకు ఆసక్తి చూపిస్తున్నారు. కథ డిమాండ్ పేరుతో సొమ్ము చేసుకునే ప్రయత్నంగా దీన్ని భావించక తప్పదు. ఇక అసలు విషయానికొస్తే ఇప్పటి వరకు పక్కింటి అమ్మాయిగా హోమ్లీ పాత్రల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న లక్ష్మీమీనన్ ఇప్పుడు పాశ్చాత్య సంస్కృతికి చిహ్నం అయిన లిప్‌లాక్ సన్నివేశంలో నటించడానికి ఓకే చెప్పడమే కాదు నటుడు విశాల్‌కు ఘాటుగా ముద్దు లిచ్చేసిందట. 
 
 వీరిద్దరూ కలసి నటించిన పాండియనాడు మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ హిట్ పెయిర్ తాజాగా నాన్‌సిగప్పు మనిదన్ చిత్రంలో మరోసారి జత కడుతున్నారు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తిరు దర్శకుడు. ఇందులో లిప్‌లాక్ సన్నివేశం గురించి దర్శకుడు కథ వినిపించినప్పుడే నటి లక్ష్మీమీనన్‌కు చెప్పారట. కథకు అవసరం అనిపించడంతో ఈ మలయాళి బ్యూటీ కూడా మరోమాట లేకుండా ఓకే చెప్పిందట. విశాల్, లక్ష్మీమీనన్‌ల మధ్య ఈ లిప్‌లాక్ సన్నివేశాలను ఇటీవల చిత్రీకరించారట. అయితే ఎలాంటి అసభ్యత, అశ్లీలం లేకుండా ఈ సన్నివేశాలను కళాత్మకంగా చిత్రీకరించినట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement