ఆరడుగులుంటే ... | Lakshmi Menon says that she does not love Vishal but not love | Sakshi

ఆరడుగులుంటే ...

Jan 22 2015 2:29 AM | Updated on Sep 2 2017 8:02 PM

ఆరడుగులుంటే ...

ఆరడుగులుంటే ...

కోలీవుడ్‌లో అతి తక్కువ మంది లక్కీ కథా నాయికల్లో లక్ష్మీమీనన్ ఒకరు. ఈ కేరళ కుట్టి సొంతగడ్డపై కూడా పొందలేనంత వరుస విజయాలను

కోలీవుడ్‌లో అతి తక్కువ మంది లక్కీ కథా నాయికల్లో లక్ష్మీమీనన్ ఒకరు. ఈ కేరళ కుట్టి సొంతగడ్డపై కూడా పొందలేనంత వరుస విజయాలను కోలీవుడ్‌లో సొంతం చేసుకున్నారు. తొలి చిత్రం కుంకితోనే దర్శకుడు ప్రభుసాల్మన్ ఈ అమ్మడి జాతకాన్ని మార్చేశారు. ఆ తరువాత పాండియనాడు, నాన్ సిగప్పు మనిదన్, మంజాపై అంటూ వరుస విజయాలతో లక్కీ హీరోయిన్‌గా గుర్తింపు పొందారు. నటుడు విశాల్‌తో చెట్టాపట్టాలంటూ వదంతులను ఎదుర్కొన్నా అవకాశాలు మాత్రం లక్ష్మీమీనన్‌ను వెతుక్కుంటూ వస్తున్నాయి.
 
 విశాల్‌తో ముచ్చటగా మూడోసారి కూడా నటించాల్సింది. అయితే ప్లస్-2 పరీక్షలు దగ్గర పడుతున్నాయంటూ ఆ అవకాశాన్ని వదులుకున్నట్లు లక్ష్మీమీనన్ చెబుతున్నారు. కానీ విశాల్‌తో వదంతుల కారణంగానే ఆ చిత్ర అవకాశం చేయిజారిందన్నది కోలీవుడ్ సమాచారం. ప్రస్తుతం కార్తీతో కొంబన్ చిత్రంలో నటించనున్న లక్ష్మీమీనన్ తనది ప్రేమ వివాహమే అవుతుందని ఇప్పటికే ప్రకటించారు. కాబోయే వరుడెలా ఉండాలన్న ప్రశ్నకు ఆరడుగుల అందగాడు, తన కంటే అధికంగా చదువుకున్న వాడు, సినీ పరిశ్రమకు చెందని వ్యక్తి అయివుండాలని బదులిచ్చారు. ఆరడగుల అందగాడు, సినిమా వాడై ఉండరాదన్న వ్యాఖ్యలను నటుడు విశాల్‌తో కలుపుతూ జరుగుతున్న ప్రచారానికి పుల్‌స్టాఫ్ పెట్టాలనే ఉద్దేశంతో ఆమె చెప్పారన్న టాక్ వినిపిస్తోందిప్పుడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement