లక్ష్మీమీనన్‌తో లవ్వా?
లక్ష్మీమీనన్‌తో లవ్వా?
Published Mon, Mar 31 2014 1:37 AM | Last Updated on Sat, Sep 2 2017 5:22 AM
నటుడు విశాల్, లక్ష్మీమీనన్‌కు మధ్య లవ్వాట యమజోరుగా సాగుతోందని కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఇందుకు పలు కారణాలు చెబుతున్నారు. విశాల్, లక్ష్మీమీనన్ పాండియనాడు చిత్రంలో తొలిసారిగా రొమాన్స్ చేశారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ సెంటిమెంట్‌నో లేక ప్రేమతోనో తదుపరి చిత్రంలోను విశాల్ తనకు జంటగా లక్ష్మీమీనన్‌నే హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు. నాన్ శిగప్పు మనిదన్ చిత్రం షూటింగ్‌లో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగిందనే గుసగుసలు ప్రచారం అయ్యాయి. అంతేకాదు ఈ చిత్రంలో వీరిద్దరూ గాఢమైన పెదవి చుంబనాలు చేసుకోవడం విశేషం.
మరో విషయం ఏమిటంటే విశాల్ సన్నిహిత మిత్రులే లక్ష్మీమీనన్‌తో లవ్ అంటూ ఆట పట్టిస్తున్నారు. షూటింగ్‌లో ఆమెను తమ కంట పడకుండా కాపాడుకుంటూ వచ్చారంటూ ఆడియో ఆవిష్కరణ వేదిక పైనే విశాల్ మిత్ర బృందం పరిహాసమాడడంతో నిజంగానే వీరిద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం జోరందుకుంది. అయితే విశాల్ ఈ వదంతులను కొట్టి పారేశారు. లక్ష్మీమీనన్‌కు తనకు మధ్య ఉన్నది మంచి స్నేహమే అంటూ స్పష్టం చేశారు. వీరిద్దరూ నటించిన రెండో చిత్రం నాన్ శిగప్పు మనిదన్ ఏప్రిల్ 11న విడుదల కానుంది.
Advertisement
Advertisement