మరోసారి విశాల్‌తో.. | Lakshmi Menon replaces Shruti Hassan in Vishal's next | Sakshi
Sakshi News home page

మరోసారి విశాల్‌తో..

Published Sun, Sep 21 2014 12:08 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 PM

మరోసారి విశాల్‌తో..

మరోసారి విశాల్‌తో..

నటుడు విశాల్, నటి లక్ష్మీమీనన్‌ల కాంబినేషన్ బాగానే వర్క్‌అవుట్ అయ్యింది. వీరి మధ్య కెమిస్ట్రీ, ఫిజిక్ లాంటివికూడా బాగా కుదిరాయని చెప్పవచ్చు. కారణం ఈ జంట తొలిసారిగా నటించిన పాండియనాడు, మలిసారి నటించిన నాన్ శివప్పు మనిదన్ చిత్రాలు మంచి విజయాన్నే సాధించాయి. దీంతో ఈ సంచలన జోడి ముచ్చటగా మూడోసారి కలిసి నటించడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం హరి దర్శకత్వంలో పూజై చిత్రంలో నటిస్తున్న విశాల్ ఆ చిత్ర నిర్మాణం పూర్తి కానుండడంతో తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఇంతకుముందు ఈయన హీరోగా నటించి, సొం తంగా నిర్మించిన తొలిచిత్రం పాండియనాడు.
 
  చిత్రాన్ని తెరకెక్కించిన సుశీంద్రన్ ఈ తాజా చిత్రానికి దర్శకత్వం వహించనుండడం విశేషం. కాగా ప్రస్తుతం పూజై చిత్రంలో విశాల్‌కు జంటగా నటిస్తున్న శ్రుతిహాసన్‌నే ఈ చిత్రంలో నూ నటింప చేయడానికి ప్రయత్నించారు. అయితే వెంటవెంటనే విశాల్‌తో నటించడం బాగుండదనో, కాల్‌షీట్స్ సమస్య కారణంగానో శ్రుతిహాసన్ ఈ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం.
 
  దీంతో లక్ష్మీమీనన్ నటించడానికి రెడీ అవుతోంది. దీనిపై విశాల్ మాట్లాడుతూ పాండియనాడు వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తరువాత మళ్లీ సుశీంద్రన్ దర్శకత్వంలో నటించనున్నట్లు తెలిపారు.  హీరోయిన్‌కు మంచి అవకాశం ఉన్న పాత్ర కావడంతో శ్రుతి హాసన్ నటిస్తే బాగుంటుందని భావించిన మాట నిజమేనన్నారు. ఆమె ఈ చిత్రంలో పాత్రకు అంతగా నొప్పదనిపించిందన్నారు.  తాను, లక్ష్మీమీనన్, సుశీంద్రన్‌లది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అని పేర్కొన్నారు. అయినా చాలామంది నటీమణుల పేర్లు పరిశీలించిన తరువాత లక్ష్మీమీనన్‌నే బెటర్ అని, ఆమెను ఎంపిక చేసినట్లు నటుడు విశాల్ వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement