మిల్కీబ్యూటీ కోసం శ్రుతి పాట | shruti haasan lends voice for tamanna | Sakshi
Sakshi News home page

మిల్కీబ్యూటీ కోసం శ్రుతి పాట

Published Mon, Aug 29 2016 2:28 AM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM

మిల్కీబ్యూటీ కోసం శ్రుతి పాట

మిల్కీబ్యూటీ కోసం శ్రుతి పాట

 పులికి పులిబిడ్డే పుడుతుందన్న సామెత అందరికీ వర్తించకపోయినా నటి శ్రుతిహాసన్‌కు మాత్రం కచ్చితంగా వర్తిస్తుంది. తండ్రి కమలహాసన్‌లోని చాలా లక్షణాలు శ్రుతికి వచ్చాయి. శ్రుతిహాసన్‌లో ఒక నటి, సంగీతదర్శకురాలు, గాయని అంటూ చాలా కోణాలు ఉన్నాయి. తొలుత సంగీతదర్శకురాలిగా పరిచయమై ఆ తరువాత నటిగా స్థిరపడిపోయిన ఈమె అడపాదడపా గాయగిగా కూడా గొంతును శృతి చేస్తుంటారు.
 
 అంతే కాదు కోరితే ప్రత్కేక గీతాల్లోనూ ఆడి దుమ్మురేపుతున్న ఇమేజ్ అన్న పదాన్ని తుంగలో తొక్కుతున్నారు. తమిళంలో కథానాయకిగా నటించిన తొలి చిత్రం 7అమ్ అరివు చిత్రం నుంచి పాడుతూ వస్తున్న శ్రుతి 3, ఎన్నమో ఏదో, మాన్‌కరాటే, పులి, వేదాళం చిత్రాల్లో పాడిన పాటలు విశేష ప్రేక్షకాదరణ పొందాయి. అయితే ఎవరైనా పాడమని అడిగితేనే పాడడానికి ముందుకొచ్చే శ్రుతిహసన్ తాజాగా నటి తమన్నా కోసం ఒక పాట పాడడానికి రెడీ అవుతున్నారు. విశాల్, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం కత్తిసండై.
 
 ఇంతకు ముందు రోమియో జూలియట్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన నిర్మాత ఎస్.నందగోపాల్ రూపొందిస్తున్న తాజా చిత్రం కత్తిసండై. సురాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నాకో పాట ఉందట. ఈ పాటను నటి శ్రుతిహాసన్‌తో పాడిస్తే బాగుంటుందని భావించారట. ఇదే విషయాన్ని శ్రుతిహసన్ వద్ద వెల్లడించగా ఆమె పాడడానికి సై అన్నారట. హిప్ హాప్ తమిళ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలోని పాటను త్వరలో రికార్డ్ చేయనున్నారట. ఈ చిత్ర ఆడియోను సోమవారం విడుదల చేయనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement