తమన్నాను గ్లామర్‌గా చూపించకుంటే ఎలా! | vishal about tamanna in kathi sandai | Sakshi
Sakshi News home page

తమన్నాను గ్లామర్‌గా చూపించకుంటే ఎలా!

Published Mon, Dec 19 2016 1:25 AM | Last Updated on Mon, Sep 4 2017 11:03 PM

తమన్నాను గ్లామర్‌గా చూపించకుంటే ఎలా!

తమన్నాను గ్లామర్‌గా చూపించకుంటే ఎలా!

కలర్‌ఫుల్‌ తమన్నాను గ్లామరస్‌గా చూపించకపోతే ఎలా అని అన్నారు నటుడు విశాల్‌. ఈ జంట కలిసి నటించిన చిత్రం కత్తిసండై. మెడ్రాస్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై ఎస్‌.నందగోపాల్‌ నిర్మించిన ఈ చిత్రానికి సురాజ్‌ దర్శకుడు. హిప్‌ హాప్‌ తమిళ సంగీతాన్ని అందించిన ఇందులో చాలా గ్యాప్‌ తరువాత వడివేలు హస్య పాత్రలో నటించడం విశేషం. మరో హాస్య పాత్రలో సూరి నటించారు. ఈ చిత్రం విడుదల పలుమార్లు వాయిదా పడి చివరికి ఈ నెల 23న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్రం గురించి విశాల్‌ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కత్తిసండై చిత్రం నిర్మాణం పూర్తి అయి నెలలు అ య్యిందన్నారు.

పెద్ద నోట్ల రద్దు, ముఖ్యమంత్రి మరణం, వర్దా తుపాన్ అంటూ వరుసగా ప్రజలు పలు విషాద సంఘటనలను ఎదుర్కొనడంతో చిత్ర విడుదలను సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల చేయాలనుకున్నామని, అయితే క్రిస్మస్‌ పండగ సందర్భంగా విడుదల కావలసిన ఒక్క చిత్రం(ఎస్‌–3) వాయిదా పడడంతో తమ చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధమయ్యామన్నారు. కత్తిసండైను అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చెప్పారు. రాబిన్ హుడ్‌ కథ లాంటి చిత్రం ఇదని తెలిపారు.

ఇందులో నటి తమన్నాను గ్లామరస్‌గా చూపించారని అడుగుతున్నారని, అందమైన, కలర్‌ఫుల్‌గా, డాన్స్, నటన తెలిసిన నటి తమన్నా ఇందులో నటించారని అన్నారు. అలాంటి ఆమెలోని అన్ని అంశాలను దర్శకుడు సురాజ్‌ ఉపయోగించుకున్నారని చెప్పారు. అయినా తమన్నాను కమర్శియల్‌ చిత్రంలో గ్లామరస్‌గా చూపకపోతే ఎలా అంటూ విశాల్‌ ప్రశ్నించారు. అందుకే ఆమె పాటల సన్నివేశాల్లో అందాలారబోసేలా నటించారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement