kattisandai
-
అందుకు చావడానికి, చంపడానికైనా సిద్ధమే!
అందుకోసం చంపడానికైనా, చావడానికైనా సిద్ధమే అంటున్నారు మిల్కీ బ్యూటీ. ఏమిటీ సినిమా డైలాగ్‌లా ఉందా? అయితే తమన్నా మాత్రం రీల్ కోసం కాకుండా రియల్‌గానే అన్నారు. కొన్ని చిత్రాలు కొందరి తారల జీవితాలపై చాలా పెద్ద ప్రభావాన్నే చూపుతాయి. అదే విధంగా కొందరు తారలు వెనక్కి తిరిగి చూసుకుంటే తప్పకుండా ఒక్క చిత్రం అయినా గర్వపడేలా ఉండాలి. లేకపోతే అలాంటి వారి నట జీవితానికి అర్థం ఉండదు. నటి అనుష్కనే తీసుకుంటే అరుంధతి ఒక్కటి చాలు తనకు ఆత్మసంతృప్తిని కలిగించడానికి. అదే విధంగా తమన్నాకు బాహుబలి తన కెరీర్లో మైలురాయిగా నిలిచి పోతుంది. ఈ చిత్రం గురించి ఎప్పుడు మాట్లాడినా మిల్కీబ్యూటీ చాలా ఎమోషనల్ అయిపోతారు. బాహుబలి చిత్రంలో నటించడాన్ని చాలా సందర్భాల్లో చాలా గర్వంగా చెప్పారు. తాజాగా బాహుబలి చిత్రంలో అవంతిక పాత్రను జీవితంలో మరచిపోలేనన్నారు. అలాంటి అవకాశం రావడం తన అదృష్టంగా పేర్కొన్నారు. తన కెరీర్ పూర్తిగా డౌన్ అయిన సమయంలో బాహుబలి చిత్రంలో నటించే అవకాశం వచ్చిందన్నారు. అలాంటి అవకాశం వస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. ఆ చిత్రం కోసం చావడానికైనా, చంపడానికైనా రెడీ అని చాలా ఎమోషన్ గా అన్నారు. ప్రస్తుతం బాహుబలి–2 చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందేనని, ఈ చిత్రం షూటింగ్ ఈ నేలాఖరుకు పూర్తి అవుతుందని తమన్నా చెప్పారు. తమన్నా తాజాగా విశాల్‌తో నటించిన కత్తిసండై చిత్రం తెలుగులో ఒక్కడొచ్చాడు పేరుతో విడుదల కానుంది. రెండు భాషల్లోనూ 23న తెరపైకి రానుంది. -
తమన్నాను గ్లామర్‌గా చూపించకుంటే ఎలా!
కలర్‌ఫుల్ తమన్నాను గ్లామరస్‌గా చూపించకపోతే ఎలా అని అన్నారు నటుడు విశాల్. ఈ జంట కలిసి నటించిన చిత్రం కత్తిసండై. మెడ్రాస్ ఎంటర్ప్రైజెస్ పతాకంపై ఎస్.నందగోపాల్ నిర్మించిన ఈ చిత్రానికి సురాజ్ దర్శకుడు. హిప్ హాప్ తమిళ సంగీతాన్ని అందించిన ఇందులో చాలా గ్యాప్ తరువాత వడివేలు హస్య పాత్రలో నటించడం విశేషం. మరో హాస్య పాత్రలో సూరి నటించారు. ఈ చిత్రం విడుదల పలుమార్లు వాయిదా పడి చివరికి ఈ నెల 23న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్రం గురించి విశాల్ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కత్తిసండై చిత్రం నిర్మాణం పూర్తి అయి నెలలు అ య్యిందన్నారు. పెద్ద నోట్ల రద్దు, ముఖ్యమంత్రి మరణం, వర్దా తుపాన్ అంటూ వరుసగా ప్రజలు పలు విషాద సంఘటనలను ఎదుర్కొనడంతో చిత్ర విడుదలను సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల చేయాలనుకున్నామని, అయితే క్రిస్మస్ పండగ సందర్భంగా విడుదల కావలసిన ఒక్క చిత్రం(ఎస్–3) వాయిదా పడడంతో తమ చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధమయ్యామన్నారు. కత్తిసండైను అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చెప్పారు. రాబిన్ హుడ్ కథ లాంటి చిత్రం ఇదని తెలిపారు. ఇందులో నటి తమన్నాను గ్లామరస్‌గా చూపించారని అడుగుతున్నారని, అందమైన, కలర్ఫుల్గా, డాన్స్, నటన తెలిసిన నటి తమన్నా ఇందులో నటించారని అన్నారు. అలాంటి ఆమెలోని అన్ని అంశాలను దర్శకుడు సురాజ్ ఉపయోగించుకున్నారని చెప్పారు. అయినా తమన్నాను కమర్శియల్ చిత్రంలో గ్లామరస్‌గా చూపకపోతే ఎలా అంటూ విశాల్ ప్రశ్నించారు. అందుకే ఆమె పాటల సన్నివేశాల్లో అందాలారబోసేలా నటించారని చెప్పారు. -
సంక్రాంతికి కాదు క్రిస్మస్కే!
-
విజయ్ వర్సెస్ అరుణ్‌విజయ్
చిత్ర విచిత్రాలు జరగడం సినీప్రపంచంలో షరా మామూలే. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి రేస్‌లో ఏఏ తమిళ చిత్రాలు ఢీకొనబోతున్నాయన్నది ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. దీపావళి పండగకే తెరపైకి రావలసిన విశాల్ కత్తిసండై వాయిదా పడి సంక్రాంతికి విడుదల కానుందని ప్రకటించారు. అలాంటిది అనూహ్యంగా మూడు వారాల ముందుగానే క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 23న తెరపైకి దూసుకొస్తోంది. ఇక ఈ నెల 16న విడుదల కావలసిన సూర్య ఎస్–3 చిత్రం 23కు వాయిదా పడినట్లు చిత్ర వర్గాలు వెల్ల డించాయి. అయితే ఇప్పుడు ఈ తేదీకీ తెరపైకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. సంక్రాంతి తరువాతేననే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. అయితే ఇళయదళపతి విజయ్ నటిస్తున్న ఆయన 60వ చిత్రం భైరవా మాత్రం ముందుగా ప్రకటించిన విధంగా సంక్రాంతి సందర్భంగా తెరపైకి రానుంది. దీనికి పోటీగా అనూహ్యంగా అరుణ్‌విజయ్ హీరోగా నటించిన కుట్రమ్ 23 చిత్రం తెరపైకి రానుంది. ఈ చిత్రం వర్గాలు అధికారికంగా శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. అరుణ్ విజయ్‌కి జంటగా మహిమా నంబియార్ నటించిన ఈ చిత్రానికి అరివళగన్ దర్శకుడు. రెదర్ ది సినిమా పీపుల్ పతాకంపై ఇందర్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి విశాల్‌చంద్రశేఖర్ సంగీతాన్ని, కేఎం.భాస్కరన్ ఛాయాగ్రహణం, భువనశ్రీనివాస్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఇంద్రకుమార్ తెలుపుతూ ఇది మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రం అని తెలిపారు. ఒక మంచి సందర్భంలో కుట్రం 23 చిత్రాన్ని విడుదల చేయనుండడం సంతోషంగా ఉందన్నారు.ఈ చిత్రం ప్రేక్షకులకు కచ్చితంగా డబుల్ సంతోషాన్నిస్తుందనే నమ్మకం ఉందన్నారు. -
సంక్రాంతికి కాదు క్రిస్మస్కే!
కత్తిసండై చిత్రం గత దీపావళి సందర్భంగానే విడుదల చేయనున్నట్లు ఆ చిత్ర దర్శక నిర్మాతలు వెల్లడించారు. అయితే నిర్మాణాంతర కార్యక్రమాల జాప్యం కారణంగా కత్తిసండైను సంక్రాంతి బరిలోకి దించనున్నట్లు ఇదివరకు ప్రకటించారు. అలాంటిది తాజాగా చిత్ర విడుదల తేదీ మారింది. సంక్రాంతి కంటే ముందుగానే క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ నెల 23న తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్త వర్గాలు తెలిపారు. ఇంతకు ముందు జయంరవి, హన్సిక జంటగా రోమియో జూలియట్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన మెడ్రాస్ ఎంటర్‌ప్రైజస్ అధినేత ఎస్.నందగోపాల్ అందిస్తున్న తాజా చిత్రం కత్తిసండై. విశాల్, మిల్కీబ్యూటీ తమన్నా జంటగా నటించిన ఈ చిత్రంలో చాలా గ్యాప్ తరువాత వైగైపులి వడివేలు హాస్యపాత్రలో నటించడం విశేషం. జగపతిబాబు, సూరి, సౌందర్‌రాజన్, చిన్ని జయంత్, నిరోషా, దాడి బాలాజీ, ఆర్తి, పావా లక్ష్మణన్ ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళా సంగీతాన్ని అందించారు. సురాజ్ దర్శకత్వం వహించిన మరో వినోదం మేళవించిన యాక్షన్ ఎంటర్టెయినర్ కథా చిత్రం కత్తిసండై. విశేషం ఏమిటంటే ఇదే బ్యానర్లో రూపొందిన విక్రమ్‌ప్రభు, షామిలి హీరోహీరోయిన్లుగా నటించిన వీరశివాజీ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. వారం గ్యాప్‌లోనే కత్తిసండై విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంతో విశాల్ నటుడు సూర్యను ఢీకొనబోతున్నారన్నది గమనార్హం. సూర్య నటించిన ఎస్–3 చిత్రం 23వ తేదీనే తెరపైకి రానుంది. -
ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు!
నాకు వివాహబంధం అంటే నమ్మకం, గౌరవం ఉన్నారుు కానీ.. అంటున్నారు నటి తమన్నా. ఆమె ఉద్దేశం ఏమిటో చూద్దాం. ఇటీవల ముఖ్యంగా కోలీవుడ్‌లో నటిగా తమన్నా స్థారుుని పెం చిన చిత్రాల్లో బాహుబలి, తోళా(తెలుగులో ఊపిరి) ధర్మదురై, ఇటీవల విడుదలైన దేవీ చిత్రాలను చెప్పుకోవచ్చు. తాజాగా విశాల్‌తో జత క ట్టిన కత్తిసండై త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఈ మిల్కీబ్యూటీని పలకరిస్తే చాలానే చెప్పుకొచ్చారు. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. అలాంటి చిత్రాలకు ప్రాధాన్యం ఇస్తానని అంటున్నారు. ఇటీవల తాను నటించిన చిత్రాల్లో తన పాత్రలకు మంచి ప్రాముఖ్యత లభించిందన్నారు. బాహుబలి చిత్రాన్నే తీసుకుంటే అందులో పోషించిన అవంతిక పాత్ర చాలా బోల్డ్ అండ్ ఫోకసింగ్ యువతి పాత్ర అని తెలిపారు. ఇంకా చెప్పాలంటే ఆ పాత్రతోనే బాహుబలి చిత్ర కథ ముందుకు సాగుతుందన్నారు. అదే విధంగా దేవీ చిత్రంలో చాలా ఛాలెంజిగ్ పాత్రను చేశానని చెప్పారు. ఇకపై అలాంటి పాత్రలను కోరుకుం టున్నానన్నారు. ఇప్పుడు పాత్రల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా స్త్రీ పాత్రకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించాలని చెప్పారు. అలాగని కమర్శియల్ కథా చిత్రాల్లో నటించనని చెప్పనన్నారు. ఎం దుకంటే ప్రేక్షకులు కమర్శియల్ చిత్రాలను బాగా ఎంజాయ్ చేస్తారని అన్నారు. ఈ క్రమంలో పెళ్లి ప్రస్థావన తీసుకురాగా వివాహబంధంపై తనకు అపార గౌరవం, నమ్మకం ఉన్నాయని.. అరుుతే ప్రస్తుతానికి మాత్రం తనకు పెళ్లి ఆలోచన లేదన్నారు.సమయం వచ్చినప్పుడు ఆ విషయం గురించి చెబుతానని, ఇప్పుడు తన దృష్టంతా నటన మీదేననీ, దాన్నే ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పారు. -
ఈ దీపావళి కుటుంబ సభ్యులతోనే..
అందరి జీవితాల్లోనూ వెలుగులు జిమ్మే పండగ దీపావళి. కొత్తబట్టలు, పిండివంటలు, విశేష పూజలు, దీపపు కాంతులు, పటాసుల వెలుగులు, ఆనందపు నవ్వులు అంటూ ప్రతి ఇల్లు కళకళలాడే పర్వదినం దీపావళి. అలంటి దీపావళి పండుగను కుటుంబసభ్యులతోనే జరుపుకోనున్నానని నటి తమన్నా తెలిపారు.చీకటి తరువాత వెలుగు వస్తుందంటారు. తమన్నా నట జీవితంలోనూ మధ్యలో అపజయాలు దొర్లాయి.అవే నిరంతరం కావు అన్నట్లు బాహుబలి మిల్కీబ్యూటీకి నటిగా పునర్జన్మనిచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా తమిళంలో ఈ భామకు రీఎంట్రీ ఇచ్చింది.ఇక్కడ బాహుబలి, తోళా, ధర్మదురై,దేవి అంటూ వరుస విజయాలతో తమన్నా వెలిగిపోతున్నారు. తాజాగా ఈ లక్కీనటి విశాల్‌తో రొమాన్స చేస్తున్న కత్తిసండై చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీపావళి పండగ ప్రస్తావన తీసుకురాగా చాలా సంతోషంగా తాను దీపావళి పండగను తన కుటుంబ సభ్యులతో వేడుకగా జరుపుకోనున్నట్లు తెలిపారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఉదయాన్నే లేచి లక్ష్మిదేవి ఆలయానికి కుటుంబసభ్యులతో సహా వెళ్లి విశేష పూజార్చనలు నిర్వహిస్తామన్నారు.ఆ తరువాత బాణసంచా కాల్చడం మొదలెడతానని చెప్పారు.అయితే ఈ మధ్య బాణసంచా కాల్చడం ఆపేశానని చెప్పారు. కారణం పటాసుల తయారీ వృత్తిలో చిన్న పిల్లలు పని చేయడం, అదే విధంగా బాణసంచా కాల్చడం వల్ల పర్యావరణం కాలష్యమవుతుందని తెలుసుకున్నానని అన్నారు.ఈ సందర్భంగా అందరినీ తాను కోరుకునేదేమిటంటే సాధ్యమైనంత వరకూ టపాసులు కాల్చడానికి దూరంగా ఉండండి అని అన్నారు. పండుగను సురక్షితంగా జరుపుకోండి. ఈ దీపావళి అందరికీ కలర్‌ఫుల్‌గానూ ప్రేమాభిమానాలు పంచుకునే విధంగానూ అమరాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.తన అభిమానులందరీకీ దీపావళి శుభాకాంక్షలు అంటూ ముగించారు తమన్నా భాటియా. -
త్వరలో కత్తిసండై ఆడియో ఆవిష్కరణ
కత్తిసండై చిత్రం కోసం 12 కెమెరాలతో 7 రోజుల పాటు పోరాట దృశ్యాలను చిత్రీకరించినట్లు ఆ చిత్ర దర్శకుడు సురాజ్ తెలిపారు. నటుడు విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కత్తిసండై. ఆయనతో తమన్నా రొమాన్స్ చేస్తున్న ఈ చిత్రంలో వడివేలు, సూరి వినోదాన్ని పండిస్తున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ జగపతిబాబు, బాలీవుడ్ నటుడు తరుణ్ ఆరోరా విలనిజాన్ని రక్తికట్టిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో చరణ్ దీప్, జయప్రకాశ్, చిన్ని జయంత్, నిరోషా, దాడి బాలాజీ, ఆర్తీ, పావ లక్ష్మణన్ నటిస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతాన్ని, రిచర్డ్ ఎం.నాథన్ చాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి కనల్‌కన్నన్, దళపతి దినేష్, యాక్షన్ గణేశ్ మొదలగు ముగ్గురు స్టంట్‌మాస్టర్స్ పోరాట దృశ్యాలను కంపోజ్ చేయడం విశేషం. ఇంతకు ముందు జయంరవి, హన్సిక జంటగా రోమియో జూలియట్ వంటి విజయవంతైమైన చిత్రాన్ని నిర్మించిన మెడ్రాస్ ఎంటర్‌ప్రైజస్ సంస్థ అధినేత ఎస్.నందగోపాల్ నిర్మిస్తున్న తాజా చిత్రం కత్తిసండై. ఆయన దీనితో పాటు విక్రమ్‌ప్రభు, శాలిని జంటగా వీరశివాజీ చిత్రాన్ని ఏకకాలంలో నిర్మించడం మరో విశేషం. కత్తిసండై చిత్ర వివరాలను దర్శకుడు సురాజ్ తెలుపుతూ ఈ చిత్రం కోసం ఇటీవల ఈసీఆర్ రోడ్డులో భారీ పోరాట దృశ్యాలను చిత్రీకరించినట్లు చెప్పారు. ముఖ్యంగా విలన్లు జగపతిబాబు, తరుణ్ఆరోరాలను హీరో విశాల్ వేటాడి పట్టుకునే కారు, బైక్ చేజింగ్ సన్నివేశాలను 12 కెమెరాలతో 7 రోజుల పాటు చిత్రీకరించినట్లు తెలిపారు. బైక్ చేజింగ్ సన్నివేశాలు చాలా థ్రిల్లింగ్‌గా ఉంటాయన్నారు. జెట్ స్పీడ్‌గా సాగే కథ, కథనాలతో కూడిన కత్తిసండై చిత్రం షూటింగ్ పూర్తి అయ్యిందని తెలిపారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. -
ధర్మదురై ఘనవిజయం సాధిస్తుంది
వరుస విజయాలతో మంచి జోరు మీదున్న కథానాయికల్లో తమన్నా ఒకరని చెప్పవచ్చు. బాహుబలి చిత్రంలో ఒక హీరోయిన్గా అనుష్క ఉన్నా ఆ చిత్ర విజయాన్ని ఆసాంతం తన ఖాతాలో వేసుకుని ప్రశంసలు అందుకుని తెగ సంతోషంలో ఉన్న ఈ మిల్కీబ్యూటీ ఆ తరువాత శ్రుతిహాసన్ కాదన్న ఊపిరి (చిత్రం)లో నటించి మరో విజయాన్ని అందుకున్నారు. బాహూబలి చిత్రానికి ముందు తమన్నా పని అయిపోయింది అన్న ప్రచారాన్ని ఛేదించుకుని లక్కీ హీరోయిన్ పేరుతో బిజీ అయిపోయారు. ప్రస్తుతం బాహూబలి-2 చిత్రంతో పాటు తమిళంలో విజయ్‌సేతుపతికి జంటగా ధర్మదురై, విశాల్‌తో కత్తిసండై చిత్రాలు చేస్తున్నారు. కాగా ధర్మదురై చిత్రంలో మదురై అమ్మాయిగా మారి నటించిన తమన్నా ఆ చిత్ర యూనిట్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ధర్మదురై చిత్రం షూటింగ్ పూర్తి అయ్యిందట. దీని గురించి తమన్నా తెలుపుతూ అబ్బ ఏం చిత్ర యూనిట్ అండీ. అంతా ఒక కుటుంబంలా కలిసి పని చేశారు. ఈ చిత్రం కచ్చితంగా ఘనవిజయం సాధిస్తుందని దృఢంగా చెప్పగలను అంటూ ధర్మదురై చిత్రంపై అపార నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ చిత్రం విడుదలైన తరువాత తమన్నా నమ్మకాన్ని ఏ మాత్రం నిలబెడుతుందో చూడాలి.