ఈ దీపావళి కుటుంబ సభ్యులతోనే..
అందరి జీవితాల్లోనూ వెలుగులు జిమ్మే పండగ దీపావళి. కొత్తబట్టలు, పిండివంటలు, విశేష పూజలు, దీపపు కాంతులు, పటాసుల వెలుగులు, ఆనందపు నవ్వులు అంటూ ప్రతి ఇల్లు కళకళలాడే పర్వదినం దీపావళి. అలంటి దీపావళి పండుగను కుటుంబసభ్యులతోనే జరుపుకోనున్నానని నటి తమన్నా తెలిపారు.చీకటి తరువాత వెలుగు వస్తుందంటారు. తమన్నా నట జీవితంలోనూ మధ్యలో అపజయాలు దొర్లాయి.అవే నిరంతరం కావు అన్నట్లు బాహుబలి మిల్కీబ్యూటీకి నటిగా పునర్‌జన్మనిచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా తమిళంలో ఈ భామకు రీఎంట్రీ ఇచ్చింది.ఇక్కడ బాహుబలి, తోళా, ధర్మదురై,దేవి అంటూ వరుస విజయాలతో తమన్నా వెలిగిపోతున్నారు.
తాజాగా ఈ లక్కీనటి విశాల్‌తో రొమాన్‌స చేస్తున్న కత్తిసండై చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీపావళి పండగ ప్రస్తావన తీసుకురాగా చాలా సంతోషంగా తాను దీపావళి పండగను తన కుటుంబ సభ్యులతో వేడుకగా జరుపుకోనున్నట్లు తెలిపారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఉదయాన్నే లేచి లక్ష్మిదేవి ఆలయానికి కుటుంబసభ్యులతో సహా వెళ్లి విశేష పూజార్చనలు నిర్వహిస్తామన్నారు.ఆ తరువాత బాణసంచా కాల్చడం మొదలెడతానని చెప్పారు.అయితే ఈ మధ్య బాణసంచా కాల్చడం ఆపేశానని చెప్పారు.
కారణం పటాసుల తయారీ వృత్తిలో చిన్న పిల్లలు పని చేయడం, అదే విధంగా బాణసంచా కాల్చడం వల్ల పర్యావరణం కాలష్యమవుతుందని తెలుసుకున్నానని అన్నారు.ఈ సందర్భంగా అందరినీ తాను కోరుకునేదేమిటంటే సాధ్యమైనంత వరకూ టపాసులు కాల్చడానికి దూరంగా ఉండండి అని అన్నారు. పండుగను సురక్షితంగా జరుపుకోండి. ఈ దీపావళి అందరికీ కలర్‌ఫుల్‌గానూ ప్రేమాభిమానాలు పంచుకునే విధంగానూ అమరాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.తన అభిమానులందరీకీ దీపావళి శుభాకాంక్షలు అంటూ ముగించారు తమన్నా భాటియా.