Tamil re-entry
-
హలో! ఇప్పుడే క్లారిటీకి రాకండి
హీరో జీవా నటించిన తమిళ సినిమా ‘ముంగమూడి’తో(2012) సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటి పూజా హెగ్డే. ఆ తరువాత ఇప్పటివరకు మళ్లీ కోలీవుడ్‌లో నటించలేదు. అయినప్పటికీ తమిళ్లో బుట్టబొమ్మకు ఫాలోయింగ్ బాగానే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సినిమాతో పూజా కోలీవుడ్‌లో రీఎంట్రీ ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. హీరో సూర్య నటిస్తున్న ‘అరువా’ సినిమాలో పూజా నటిస్తుందని సమాచారం. ఈ మూవీలో మొదట రష్మిక మందన్నను సంప్రదించగా.. కొన్ని కారణాలతో ఆమె నో చెప్పడంతో ఈ అవకాశం పూజాను వరించినట్లు వార్తలు వెలువడ్డాయి. సింగం డైరెక్టర్ హరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను స్టూడియోగ్రీన్ సంస్థలో జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. (సూర్య సినిమాలో పూజకు ఆఫర్!) ఇక ఈ విషయంపై పూజా స్పందించారు. తమిళంలో ప్రస్తుతం ఏ సినిమాలో నటించడం లేదని ట్విటర్ ద్వారా స్పష్టం చేశారు. ‘‘హలో హలో! నేను తమిళంలో సినిమా చేస్తున్నానని ఇప్పుడే క్లారిటీకి రాకండి. ఇప్పటి వరకు ఏ తమిళ సినిమాను ఒప్పుకోలేదు. ప్రస్తుతానికి కొన్ని కథలు వింటున్నాను. కానీ ఈ ఏడాది ఖచ్చితంగా ఒక తమిళ సినిమా చేయాలని ఎదురు చూస్తున్నాను. అన్ని సవ్యంగా జరిగితే తప్పకుండా చేస్తాను. థ్యాంక్యూ’’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం పూజా.. రాధాకృష్ణ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలో నటిస్తున్నారు. అలాగే అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలోనూ కనిపించనున్నారు. (మరో చాన్స్ కొట్టేసిన బుట్ట బొమ్మ!) ‘బాధపడకు అమలాపాల్! నీ పంజాబీ భర్త..’ Hello hello. Let’s not jump to conclusions of me doing Tamil films right now. As of now I haven’t signed anything and I have a couple of narrations lined up, but I am definitely looking forward to doing a Tamil film this year...if all goes well...fingers crossed 🤞🏼 Thank you ❤️ — Pooja Hegde (@hegdepooja) March 31, 2020 -
ఈ దీపావళి కుటుంబ సభ్యులతోనే..
అందరి జీవితాల్లోనూ వెలుగులు జిమ్మే పండగ దీపావళి. కొత్తబట్టలు, పిండివంటలు, విశేష పూజలు, దీపపు కాంతులు, పటాసుల వెలుగులు, ఆనందపు నవ్వులు అంటూ ప్రతి ఇల్లు కళకళలాడే పర్వదినం దీపావళి. అలంటి దీపావళి పండుగను కుటుంబసభ్యులతోనే జరుపుకోనున్నానని నటి తమన్నా తెలిపారు.చీకటి తరువాత వెలుగు వస్తుందంటారు. తమన్నా నట జీవితంలోనూ మధ్యలో అపజయాలు దొర్లాయి.అవే నిరంతరం కావు అన్నట్లు బాహుబలి మిల్కీబ్యూటీకి నటిగా పునర్జన్మనిచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా తమిళంలో ఈ భామకు రీఎంట్రీ ఇచ్చింది.ఇక్కడ బాహుబలి, తోళా, ధర్మదురై,దేవి అంటూ వరుస విజయాలతో తమన్నా వెలిగిపోతున్నారు. తాజాగా ఈ లక్కీనటి విశాల్‌తో రొమాన్స చేస్తున్న కత్తిసండై చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీపావళి పండగ ప్రస్తావన తీసుకురాగా చాలా సంతోషంగా తాను దీపావళి పండగను తన కుటుంబ సభ్యులతో వేడుకగా జరుపుకోనున్నట్లు తెలిపారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఉదయాన్నే లేచి లక్ష్మిదేవి ఆలయానికి కుటుంబసభ్యులతో సహా వెళ్లి విశేష పూజార్చనలు నిర్వహిస్తామన్నారు.ఆ తరువాత బాణసంచా కాల్చడం మొదలెడతానని చెప్పారు.అయితే ఈ మధ్య బాణసంచా కాల్చడం ఆపేశానని చెప్పారు. కారణం పటాసుల తయారీ వృత్తిలో చిన్న పిల్లలు పని చేయడం, అదే విధంగా బాణసంచా కాల్చడం వల్ల పర్యావరణం కాలష్యమవుతుందని తెలుసుకున్నానని అన్నారు.ఈ సందర్భంగా అందరినీ తాను కోరుకునేదేమిటంటే సాధ్యమైనంత వరకూ టపాసులు కాల్చడానికి దూరంగా ఉండండి అని అన్నారు. పండుగను సురక్షితంగా జరుపుకోండి. ఈ దీపావళి అందరికీ కలర్‌ఫుల్‌గానూ ప్రేమాభిమానాలు పంచుకునే విధంగానూ అమరాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.తన అభిమానులందరీకీ దీపావళి శుభాకాంక్షలు అంటూ ముగించారు తమన్నా భాటియా. -
అంజలి రీ ఎంట్రీ షురూ
‘నా తమిళ రీ ఎంట్రీని ఎవరూ ఆపలేరు’ ఇది నటి అంజలి ప్రకటన. ‘అడ్డుకుని తీరతా. నా చిత్రం పూర్తి చేయ కుండా అంజలిని తమిళంలో ఇతర చిత్రాల్లో నటించనిచ్చే ప్రసక్తే లేదు’ ఇది దర్శకుడు కలైంజియం ప్రకటన. మరో పక్క అంజలిని కలైంజియం చిత్రాన్ని పూర్తి చేసేలా తమిళ దర్శకుల సంఘం సామరస్య చర్చలు, ఇంకోపక్క తమిళనాడు ఫిలిం, టీవీ నిర్మాతల గిల్డ్ నటి అంజలికి అవకాశాలివ్వద్దని తెలుగు, మలయాళం, కన్నడం నిర్మాత సంఘాలకు లేఖలు రాసింది. ‘నా చిత్రంలో హీరోయిన్ అంజలినే’ ఇది దర్శకుడు సూరజ్ నిర్ణయం. ఇన్ని అనుకూల, ప్రతికూల అంశాల మధ్య నటి అంజలి ఏడాది గ్యాప్ తరువాత కోలీవుడ్‌లో రీ ఎంట్రీకి సిద్ధమైంది. గురువారం జయం రవి హీరోగా నటిస్తున్న చిత్రంలో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు సూరజ్ స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ తన చిత్రంలో హీరోయిన్ పాత్రకు అంజలి సూటబుల్ అన్నారు. చిత్ర కథను వినిపించగానే ఆమె నటించడానికి అంగీకరించారని చెప్పారు. చిత్ర షూటింగ్ గురువారం నుంచి చెన్నైలో జరగనున్నట్లు ఈ షెడ్యూల్లో అంజలి పాల్గొననున్నట్లు దర్శకుడు సూరజ్ వెల్లడించారు. ఈ వ్యవహారం కోలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.