సంక్రాంతికి కాదు క్రిస్మస్‌కే! | Kattisandai will release on 23rd? | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి కాదు క్రిస్మస్‌కే!

Published Fri, Dec 16 2016 2:14 AM | Last Updated on Mon, Sep 4 2017 10:48 PM

సంక్రాంతికి కాదు క్రిస్మస్‌కే!

సంక్రాంతికి కాదు క్రిస్మస్‌కే!

కత్తిసండై చిత్రం గత దీపావళి సందర్భంగానే విడుదల చేయనున్నట్లు ఆ చిత్ర దర్శక నిర్మాతలు వెల్లడించారు. అయితే నిర్మాణాంతర కార్యక్రమాల జాప్యం కారణంగా కత్తిసండైను సంక్రాంతి బరిలోకి దించనున్నట్లు ఇదివరకు ప్రకటించారు. అలాంటిది తాజాగా చిత్ర విడుదల తేదీ మారింది. సంక్రాంతి కంటే ముందుగానే క్రిస్మస్‌ పండుగ సందర్భంగా ఈ నెల 23న తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్త వర్గాలు తెలిపారు. ఇంతకు ముందు జయంరవి, హన్సిక జంటగా రోమియో జూలియట్‌ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన మెడ్రాస్‌ ఎంటర్‌ప్రైజస్‌ అధినేత ఎస్‌.నందగోపాల్‌ అందిస్తున్న తాజా చిత్రం కత్తిసండై.

విశాల్, మిల్కీబ్యూటీ తమన్నా జంటగా నటించిన ఈ చిత్రంలో చాలా గ్యాప్‌ తరువాత వైగైపులి వడివేలు హాస్యపాత్రలో నటించడం విశేషం. జగపతిబాబు, సూరి, సౌందర్‌రాజన్, చిన్ని జయంత్, నిరోషా, దాడి బాలాజీ, ఆర్తి, పావా లక్ష్మణన్ ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రానికి హిప్‌ హాప్‌ తమిళా సంగీతాన్ని అందించారు. సురాజ్‌ దర్శకత్వం వహించిన మరో వినోదం మేళవించిన యాక్షన్ ఎంటర్‌టెయినర్‌ కథా చిత్రం కత్తిసండై. విశేషం ఏమిటంటే ఇదే బ్యానర్‌లో రూపొందిన విక్రమ్‌ప్రభు, షామిలి హీరోహీరోయిన్లుగా నటించిన వీరశివాజీ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. వారం గ్యాప్‌లోనే కత్తిసండై విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంతో విశాల్‌ నటుడు సూర్యను ఢీకొనబోతున్నారన్నది గమనార్హం. సూర్య నటించిన ఎస్‌–3 చిత్రం 23వ తేదీనే తెరపైకి రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement