ధర్మదురై ఘనవిజయం సాధిస్తుంది | Tamannaah hopes on darma durai movie | Sakshi
Sakshi News home page

ధర్మదురై ఘనవిజయం సాధిస్తుంది

Published Fri, May 20 2016 4:09 AM | Last Updated on Mon, Sep 4 2017 12:27 AM

ధర్మదురై ఘనవిజయం సాధిస్తుంది

ధర్మదురై ఘనవిజయం సాధిస్తుంది

వరుస విజయాలతో మంచి జోరు మీదున్న కథానాయికల్లో తమన్నా ఒకరని చెప్పవచ్చు. బాహుబలి చిత్రంలో ఒక హీరోయిన్‌గా అనుష్క ఉన్నా ఆ చిత్ర విజయాన్ని ఆసాంతం తన ఖాతాలో వేసుకుని ప్రశంసలు అందుకుని తెగ సంతోషంలో ఉన్న ఈ  మిల్కీబ్యూటీ ఆ తరువాత శ్రుతిహాసన్ కాదన్న ఊపిరి (చిత్రం)లో నటించి మరో విజయాన్ని అందుకున్నారు. బాహూబలి చిత్రానికి ముందు తమన్నా పని అయిపోయింది  అన్న ప్రచారాన్ని ఛేదించుకుని లక్కీ హీరోయిన్  పేరుతో బిజీ  అయిపోయారు. ప్రస్తుతం బాహూబలి-2 చిత్రంతో పాటు తమిళంలో విజయ్‌సేతుపతికి జంటగా ధర్మదురై, విశాల్‌తో కత్తిసండై చిత్రాలు చేస్తున్నారు.

కాగా ధర్మదురై చిత్రంలో మదురై అమ్మాయిగా మారి నటించిన తమన్నా ఆ చిత్ర యూనిట్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ధర్మదురై చిత్రం షూటింగ్ పూర్తి అయ్యిందట. దీని గురించి తమన్నా తెలుపుతూ అబ్బ ఏం చిత్ర యూనిట్ అండీ. అంతా ఒక కుటుంబంలా కలిసి పని చేశారు. ఈ చిత్రం కచ్చితంగా  ఘనవిజయం సాధిస్తుందని దృఢంగా చెప్పగలను అంటూ ధర్మదురై చిత్రంపై అపార నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ చిత్రం విడుదలైన తరువాత తమన్నా నమ్మకాన్ని ఏ మాత్రం నిలబెడుతుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement