dharmadurai
-
విలన్ గానే పరిపూర్ణ నటన ప్రదర్శించా..
తాను ప్రతినాయకుడిగానే పరిపూర్ణ నటనను ప్రదర్శించానని సూపర్‌స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యానించారు. యువ నటుడు విజయ్‌సేతుపతి, తమన్నా జంటగా నటించిన చిత్రం ధర్మదురై. శీనురామసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నటుడు, నిర్మాత ఆర్కే.సురేశ్ నిర్మించారు. కాగా ఈ చిత్రం మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ రోజుల్లో ఎంత మంచి చిత్రం అయినా రెండు వారాలు ఆడడం గగనంగా మరిదన్న విషయం తెలిసిందే. అలాంటిది ధర్మదురై చిత్రం ఇటీవల శతదినోత్సవ వేడుకను కూడా జరుపుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కలిసి చిత్ర వందరోజుల జ్ఞాపికను అందించి ఆయన అభినందనలు అందుకున్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్ ధర్మదురై చిత్రంలో కథానాయకుడు విజయ్‌సేతుపతి, తమన్నా, రాధికాశరత్‌కుమార్, ఎంఎస్.భాస్కర్ల నటన తనను ఎంతగానో ఆకట్టుకుందని ప్రశంసించారు. అదే విధంగా దర్శకుడు శీనురామసామి తన ప్రతి చిత్రంలోనూ చక్కని సందేశం ఉండేలా కథలను తయారు చేసుకుంటున్నారని అభినందించారు. తాను విలన్ గా నటిస్తున్న సమయంలోనే సంపూర్ణ నటనను ప్రదర్శించగలిగానని, అదే విధంగా ధర్మదురై, మరుదు చిత్రాల్లో చక్కని విలనిజాన్ని ప్రదర్శించి ఈ చిత్ర నిర్మాత ఆర్కే.సురేశ్ మంచి నటుడిగానూ ఎదుగుతున్నారని ప్రశంసించారు. దర్శకుడు శీనురామసామి తన స్పందనను తెలియజేస్తూ, రజనీకాంత్ నటించిన ముల్లుం మలరుం, కాళీ వంటి చిత్రాల ప్రభావంతో తాను సినీరంగంలోకి వచ్చానన్నారు. అలాంటిది ఇవాళ రజనీకాంత్‌ను ప్రత్యక్షంగా కలుసుకోవడం, తమ చిత్ర వంద రోజుల జ్ఞాపికను ఆయనకు అందించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. -
తమిళ నిర్మాత ఫిర్యాదు?! అసలేం జరిగింది?
మిల్క్ బ్యూటీ తమన్నాకు దర్శక-నిర్మాతల హీరోయిన్ అనే పేరుంది. చెప్పిన టైమ్‌కి షూటింగ్‌కి రావడం, సినిమా విడుదల సమయంలో ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొనడం.. ఇలా బాగా సహకరిస్తారనే పేరు తమన్నాకు ఉంది. అంత మంచి పేరు తెచ్చుకున్న ఈ మిల్క్ బ్యూటీ తమిళ నిర్మాత ఆర్.కె.సురేశ్ ఆగ్రహానికి గురైందనే వార్త ప్రచారంలోకి వచ్చింది. సురేశ్ నిర్మించిన తమిళ చిత్రం ‘ధర్మదురై’లో తమన్నా కథానాయికగా నటించారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. అంతా హ్యాపీ. కానీ, త్వరలో విడుదల కానున్న ‘అభినేత్రి’ ప్రచార కార్యక్రమాల్లో తమన్నా జోరుగా పాల్గొనడం నిర్మాత ఆర్.కె. సురేశ్‌ని ఆగ్రహానికి గురి చేసిందట. ‘ధర్మదురై’ ప్రచార కార్యక్రమాల సమయంలో తమన్నా సరిగ్గా సహకరించలేదంటూ తమిళ నటీనటుల సంఘంలో ఆయన ఫిర్యాదు చేశారనే వార్త బయటికొచ్చింది. గురువారం చెన్నైలో ఇదే హాట్ టాపిక్. శుక్రవారం ఈ వార్త గురించి నిర్మాత ఆర్.కె. సురేశ్ వివరణ ఇచ్చారు. ‘‘తమన్నా నా ఫేవరెట్ ఆర్టిస్ట్. తనంటే నాకు చాలా గౌరవం. నా లక్కీ హీరోయిన్. ‘ధర్మదురై’ కోసం నేను అడగ్గానే కథ విని వెంటనే ఒప్పుకుంది. ‘బాహుబలి’ షూటింగ్లో ఉండి కూడా ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలకు వచ్చింది. వాస్తవానికి నేను నిర్మించే తదుపరి సినిమాలో కూడా తనను కథానాయికగా తీసుకోవాలనుకుంటున్నాను. అలాంటిది తమన్నా గురించి నేనెందుకు ఫిర్యాదు చేస్తాను’’ అని పేర్కొన్నారు. దాంతో గాసిప్పురాయుళ్ల నోటికి తాళం పడింది. -
ధర్మదురై ఘనవిజయం సాధిస్తుంది
వరుస విజయాలతో మంచి జోరు మీదున్న కథానాయికల్లో తమన్నా ఒకరని చెప్పవచ్చు. బాహుబలి చిత్రంలో ఒక హీరోయిన్గా అనుష్క ఉన్నా ఆ చిత్ర విజయాన్ని ఆసాంతం తన ఖాతాలో వేసుకుని ప్రశంసలు అందుకుని తెగ సంతోషంలో ఉన్న ఈ మిల్కీబ్యూటీ ఆ తరువాత శ్రుతిహాసన్ కాదన్న ఊపిరి (చిత్రం)లో నటించి మరో విజయాన్ని అందుకున్నారు. బాహూబలి చిత్రానికి ముందు తమన్నా పని అయిపోయింది అన్న ప్రచారాన్ని ఛేదించుకుని లక్కీ హీరోయిన్ పేరుతో బిజీ అయిపోయారు. ప్రస్తుతం బాహూబలి-2 చిత్రంతో పాటు తమిళంలో విజయ్‌సేతుపతికి జంటగా ధర్మదురై, విశాల్‌తో కత్తిసండై చిత్రాలు చేస్తున్నారు. కాగా ధర్మదురై చిత్రంలో మదురై అమ్మాయిగా మారి నటించిన తమన్నా ఆ చిత్ర యూనిట్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ధర్మదురై చిత్రం షూటింగ్ పూర్తి అయ్యిందట. దీని గురించి తమన్నా తెలుపుతూ అబ్బ ఏం చిత్ర యూనిట్ అండీ. అంతా ఒక కుటుంబంలా కలిసి పని చేశారు. ఈ చిత్రం కచ్చితంగా ఘనవిజయం సాధిస్తుందని దృఢంగా చెప్పగలను అంటూ ధర్మదురై చిత్రంపై అపార నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ చిత్రం విడుదలైన తరువాత తమన్నా నమ్మకాన్ని ఏ మాత్రం నిలబెడుతుందో చూడాలి.