
త్వరలో కత్తిసండై ఆడియో ఆవిష్కరణ
కత్తిసండై చిత్రం కోసం 12 కెమెరాలతో 7 రోజుల పాటు పోరాట దృశ్యాలను చిత్రీకరించినట్లు ఆ చిత్ర దర్శకుడు సురాజ్ తెలిపారు. నటుడు విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కత్తిసండై. ఆయనతో తమన్నా రొమాన్స్ చేస్తున్న ఈ చిత్రంలో వడివేలు, సూరి వినోదాన్ని పండిస్తున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ జగపతిబాబు, బాలీవుడ్ నటుడు తరుణ్ ఆరోరా విలనిజాన్ని రక్తికట్టిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో చరణ్ దీప్, జయప్రకాశ్, చిన్ని జయంత్, నిరోషా, దాడి బాలాజీ, ఆర్తీ, పావ లక్ష్మణన్ నటిస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతాన్ని, రిచర్డ్ ఎం.నాథన్ చాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి కనల్‌కన్నన్, దళపతి దినేష్, యాక్షన్ గణేశ్ మొదలగు ముగ్గురు స్టంట్‌మాస్టర్స్ పోరాట దృశ్యాలను కంపోజ్ చేయడం విశేషం.
ఇంతకు ముందు జయంరవి, హన్సిక జంటగా రోమియో జూలియట్ వంటి విజయవంతైమైన చిత్రాన్ని నిర్మించిన మెడ్రాస్ ఎంటర్‌ప్రైజస్ సంస్థ అధినేత ఎస్.నందగోపాల్ నిర్మిస్తున్న తాజా చిత్రం కత్తిసండై. ఆయన దీనితో పాటు విక్రమ్‌ప్రభు, శాలిని జంటగా వీరశివాజీ చిత్రాన్ని ఏకకాలంలో నిర్మించడం మరో విశేషం. కత్తిసండై చిత్ర వివరాలను దర్శకుడు సురాజ్ తెలుపుతూ ఈ చిత్రం కోసం ఇటీవల ఈసీఆర్ రోడ్డులో భారీ పోరాట దృశ్యాలను చిత్రీకరించినట్లు చెప్పారు.
ముఖ్యంగా విలన్లు జగపతిబాబు, తరుణ్‌ఆరోరాలను హీరో విశాల్ వేటాడి పట్టుకునే కారు, బైక్ చేజింగ్ సన్నివేశాలను 12 కెమెరాలతో 7 రోజుల పాటు చిత్రీకరించినట్లు తెలిపారు. బైక్ చేజింగ్ సన్నివేశాలు చాలా థ్రిల్లింగ్‌గా ఉంటాయన్నారు. జెట్ స్పీడ్‌గా సాగే కథ, కథనాలతో కూడిన కత్తిసండై చిత్రం షూటింగ్ పూర్తి అయ్యిందని తెలిపారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.