
తమిళసినిమా: రోబో గెటప్‌లో ఉన్న బ్యూటీ ఎవరో కని పెట్టారా? కొంచెం కష్టమేనంటారా? అయితే మేమే రివీల్ చేస్తున్నాం.ఈ బ్యూటీ రోబో ఎవరో కాదు మిల్కీబ్యూటీ తమన్నా. ఏమిటీ గెటప్, కొంపదీసి రజనీకాంత్ నటిస్తున్న 2.ఓ చిత్రంలో అతిథిగా ఈ గెటప్‌లో మెరవనుందా? అన్న సందేహం కలు గుతోందా? మీ లాగా చాలా కొందరు అలాంటి అపోహనే పడ్డారు. శుక్రవారం దుబాయిలో రజనీకాంత్ నటించిన 2.ఓ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే.
ఆ కార్యక్రమంలో ఆడి పాడడానికే మిల్కీ బ్యూటీ రోబో గెటప్‌కు రెడీ అయ్యిందనే ప్రచారం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి జరిగింది వేరే. ఒక టీవీ ప్రొగ్రాం కోసం నటి తమన్నా రోబోలా మారింది. స్టార్‌ప్లస్ టీవీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్రికెట్ క్రీడాకారుడు ఇఫ్రాన్ బదాన్‌తో కలిసి తమన్నా ఇలా మెరిసింది. ప్రముఖ నృత్యదర్శకురాలు ఫరాఖాన్ సమకూర్చిన నృత్యరీతుల్లో తమన్నా ఇఫ్రాన్ బాదాన్‌తో కలిసి ఆడి పాడింది.
ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారు తమకు ఇష్టమయిన నటుడి గెటప్‌లో కనిపించవచ్చునట. దీంతో తనకు ఇష్టమైన నటుడు రజనీకాంత్ కావడంతో తమన్నా ప్రస్తుతం ఆయన నటిస్తున్న 2.ఓ చిత్రంలోని గెటప్‌నకు మారిందట. దీని గురించి ఈ బ్యూటీ తెలుపుతూ చిన్నతనం నుంచి నటిగా తనకు స్ఫూర్తి రజనీకాంత్‌నేనని, అందుకే ఆ గెటప్‌ను ఆయనకు సమర్పిస్తున్నానని చెప్పింది. తన అభిమానాన్ని ఇలా కూడా చూపించవచ్చునని ఈ ముద్దుగుమ్మ నిరూపించిందన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment