సండకోళికి కొనసాగింపు | Vishal and Lingusamy Team Up for Sandakozhi Sequel | Sakshi
Sakshi News home page

సండకోళికి కొనసాగింపు

Published Mon, Dec 15 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 6:10 PM

సండకోళికి కొనసాగింపు

సండకోళికి కొనసాగింపు

 సండకోళి చిత్రానికి కొనసాగింపునకు గ్రీన్ సిగ్నల్ పడింది. నటుడు విశాల్‌కు కమర్షియల్ హీరో ఇమేజ్‌ను తెచ్చిపెట్టిన చిత్రం సండకోళి. మీరాజాస్మిన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి లింగుస్వామి దర్శకుడు. 2005లో తెరపైకి వచ్చిన ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ పందెంకోడి పేరుతో విశేష ప్రజాదరణ పొందింది. అలాంటి చిత్రానికి తొమ్మిదేళ్ల తరువాత సీక్వెల్ రూపొందడానికి సన్నాహాలు చేస్తున్నారు. సండకోళి చిత్రంలో విశాల్ తండ్రి పాత్రలో రాజ్‌కిరణ్, ప్రతి నాయకుడి పాత్రలో మలయాళ దర్శకుడు రాల్ నటించారు. దీనికి కొనసాగింపు చిత్రంలోనూ వీరిద్దరూ నటించనున్నారు. హీరోయిన్‌గా ఒక ప్రముఖ నటి నటించనున్నట్లు విశాల్ స్పష్టం చేశారు.
 
 దీన్ని విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించనున్నట్లు తెలిపారు. సండకోళి చిత్ర దర్శకుడు లింగుస్వామినే ఈ కొనసాగింపునకు దర్శకత్వం వహించనున్నారు. దర్శకుడు చెప్పిన కథ చాలా నచ్చిందని విశాల్ పేర్కొన్నారు. ఈ చిత్రం పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు చెప్పారు. ఈ చిత్రంలో కథానాయకిగా బాలీవుడ్ బ్యూటీ అలియూభట్ నటించే అవకాశం ఉన్నట్టు కోలీవుడ్ టాక్. అయితే దర్శకుడు లింగుస్వామి తమిళం, తెలుగు భాషల్లో ప్రాచుర్యం పొందిన నటి మాత్రమే ఉంటారని అంటున్నారు.
 
 దీంతో శ్రుతి హాసన్ పేరు వినిపిస్తోంది. ఇప్పటికే విశాల్, శృతిహాసన్ పూజై చిత్రంలో హిట్ పెరుుర్ పేరు తెచ్చుకున్నారు. అదే విధంగా విశాల్ చిత్రాలకు తమిళంతోపాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. అందువలన శ్రుతిహాసన్ మరోసారి విశాల్‌తో జతకట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం విశాల్ సుందర్ సి దర్శకత్వంలో ఆంబళ చిత్రంలో నటిస్తున్నారు. తరువాత సుశీంద్రన్ దర్శకత్వంలో చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు. ఆ తరువాతనే లింగుస్వామితో చేసే చిత్రం ఉంటుందని సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement