శ్రుతికి ప్రత్యేక రక్షణ | Shruti Haasan harassed by a drunkard in Dehradun! | Sakshi
Sakshi News home page

శ్రుతికి ప్రత్యేక రక్షణ

Published Tue, Jun 17 2014 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 8:54 AM

శ్రుతికి ప్రత్యేక రక్షణ

శ్రుతికి ప్రత్యేక రక్షణ

 సెలబ్రిటీలకు స్వేచ్ఛ కరువవుతోందా? వారి జీవితం దిన దిన గండంగా భయభ్రాంతులమయంగా మారుతోందా? నటి శ్రుతి హాసన్ ఇక్కట్లు చూస్తే ఇలాంటి సందేహాలే కలుగుతాయి. ఎందుకంటే ఆమెకిప్పుడు స్వేచ్ఛే కరువవుతోంది. బయట ప్రపంచంలోకి ప్రవేశిస్తే రక్షణ వలయంతో గడపాల్సిన పరిస్థితి. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ భారతీయ నటిగా గుర్తింపు పొందిన శ్రుతి హాసన్ ముంబాయిలో నివశిస్తున్నారు. శ్రుతి గ్లామర్ విషయాల్లో పరిధులు దాటి నటిస్తున్నారనే అపవాదు ఉంది. ఆ మధ్య హిందీలో డి-డే అనే చిత్రంలో వేశ్యగా నటించి పలు విమర్శలను మూటగట్టుకున్నారు.
 
 ఆ సమయంలో ఒక అగంతకుడు శ్రుతి అద్దెకుంటున్న ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడికి చేసే ప్రయత్నం చేశాడు. శ్రుతి ఫిర్యాదుతో ముంబాయి పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. అలాగే ఎవడు అనే తెలుగు చిత్రంలో శ్రుతిమించి అందాలార బోసిన ఫొటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేశాయి. ఇది అంతా నిర్మాత దుశ్చర్యే నంటూ శ్రుతి ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. ఇటీవల డెహ్రాడూన్‌లోని హోటల్లో బస చేసిన శ్రుతిహాసన్ గది తలుపు తట్టి ఒక తాగుబోతు అల్లరి చేసే ప్రయత్నం చేశాడు.
 
 అతనిపై శ్రుతి హాసన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి అల్లరోళ్ల చిల్లర ప్రవర్తనతో శ్రుతి భయభ్రాంతులకు గురవుతున్నారు. దీంతో ఆమెకు ప్రత్యేక భద్రత అవసరం అయ్యింది. ప్రస్తుతం శ్రుతిహాసన్ తమిళంలో విశాల్ సరసన పూజై చిత్రంతోపాటు హిందీలో యారా అనే చిత్రంలో నటిస్తున్నారు. షూటింగ్ ప్రాంతాల్లో శ్రుతికి ప్రత్యేక రక్షణ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆమె షూటింగ్ ముగించుకుని హోటల్ రూమ్‌కు వెళ్లే వరకు భద్రతా వలయంలోనే గడపాల్సిన పరిస్థితి నెలకొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement