భారతీయ సినిమాల్లో ముద్దు సీన్లు అక్కర్లేదు: సైఫ్ అలీఖాన్ | Kissing scenes not required in Indian films, says Saif ali khan | Sakshi
Sakshi News home page

భారతీయ సినిమాల్లో ముద్దు సీన్లు అక్కర్లేదు: సైఫ్ అలీఖాన్

Published Fri, Nov 22 2013 5:19 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

భారతీయ సినిమాల్లో ముద్దు సీన్లు అక్కర్లేదు: సైఫ్ అలీఖాన్ - Sakshi

భారతీయ సినిమాల్లో ముద్దు సీన్లు అక్కర్లేదు: సైఫ్ అలీఖాన్

హమ్ తుమ్, సలాం నమస్తే లాంటి సినిమాల్లో హీరోయిన్లతో పెదాలు కలిపి ముద్దుసీన్లు తెగ పండించిన హీరో సైఫ్ అలీఖాన్. కానీ, ఇప్పుడు ఆయనే భారతీయ సినిమాలకు ముద్దుసీన్లు అసలు అక్కర్లేదని చెబుతున్నాడు. అలాంటి వాతావరణం అసలు మనకు సరిపడదని, అవేమీ లేకపోయినా మన సినిమాలు ఎంచక్కా ఆడతాయని అంటున్నాడు. 'ద ఫ్రంట్ రో' అనే టీవీ చాట్ షోలో సైఫ్ మాట్లాడాడు. కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ పెళ్లికి ముందు ఓప్రకటన చేశారు. తామిద్దరం కలిసి గానీ, విడివిడిగా గానీ స్క్రీన్ మీద ముద్దు సీన్లలో నటించబోమని అప్పట్లో వారిద్దరూ చెప్పిన విషయాన్ని టీవీ షో వ్యాఖ్యాత అనుపమా చోప్రా ప్రశ్నించారు.

ఇవే కాక ఇద్దరూ కలిసి పెట్టుకున్న ఇతర నిబంధనలు ఏమైనా ఉన్నాయా అని చోప్రా సైఫ్ను ప్రశ్నించారు. అయితే, అలాంటిదేమీ లేదని సైఫ్ సమాధానమిచ్చాడు. ఆ నిబంధన కూడా లేదని, కానీ సలాం నమస్తే లాంటి సినిమాలు తాను చేసి చాలాకాలం అయ్యిందని చెప్పాడు. భారతదేశంలో అసలు మన సినిమాల్లో ముద్దుసీన్లు అక్కర్లేదని తెలిపాడు. తషాన్, జబ్ వుయ్ మెట్, 3 ఇడియట్స్, హీరోయిన్ లాంటి సినిమాల్లో కరీనా కూడా ముద్దు సీన్లలో నటించిందని గుర్తుచేశాడు. అలాంటి సీన్లు చేసేటప్పుడు గానీ, చూసేటప్పుడు గానీ ఎవరూ అంత సౌకర్యవంతంగా కనిపించరని సైఫ్ అన్నాడు. హాలీవుడ్ సినిమాల్లో చూస్తే ముద్దు సీన్లు గానీ, శృంగార సన్నివేశాలు గానీ చూసినా ఇబ్బంది అనిపించని రీతిలో ఉంటాయన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement