Indian cinema
-
స్త్రీ పాత్రల రూపశిల్పి శ్యామ్ బెనగళ్.. అల్విదా!
భారతీయ సినిమా పరిశ్రమలో తీరని విషాదం నెలకొంది. భారతీయ పార్లల్ సినిమాకు దశదిశలా ఖ్యాతిని తెచ్చి పెట్టిన తొలి తరం దర్శకులు శ్యామ్ బెనగళ్ (90) ఇకలేరు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగి ముంబైలో స్థిరపడిన బెనగళ్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ముంబైలోని ఓ ఆసుపత్రిలో సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని శ్యామ్ బెనగళ్ కుమార్తె పియా బెనగళ్ వెల్లడించారు. బెనగళ్ దర్శకత్వం వహించిన చివరి చిత్రం ‘ముజిబ్: ది మేకింగ్ ఆఫ్ ఏ నేషన్. బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం 2023 అక్టోబరు 13న విడుదలైంది. శ్యామ్ బెనగళ్‌కు భార్య నీరా బెనగళ్, కుమార్తె పియా బెనెగళ్ ఉన్నారు. లెజెండరీ దర్శకుడిగా పేరొందిన శ్యామ్ బెనగళ్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. జన్మతః కన్నడిగ అయినప్పటికీ తెలంగాణలో పుట్టి పెరగడం వల్ల తెలంగాణ చైతన్యం ఆయనలో చివరికంటా ఉంది.శ్యామ్ బెనగళ్( ShyamBenegal) తన సినిమాల్లో శక్తిమంతమైన స్త్రీపాత్రలకు రూపకల్పన చేశాడు. ‘అంకుర్’ (1974)తో మొదలెట్టి ‘జుబేదా’ (2001) వరకు దాదాపుగా ప్రతి సినిమాలో స్త్రీ పాత్రలకు చైతన్యాన్ని, శక్తిని ఇచ్చిన దర్శకుడు శ్యామ్ బెనగళ్. సత్యజిత్ రే వాస్తవిక సినిమాను ప్రవేశపెట్టి ఆ పరంపరను మృణాళ్ సేన్ అందుకున్నాక శ్యామ్ బెనగళ్ ఆ ఛత్రాన్ని గట్టిగా పట్టుకుని నిలబెట్టాడు. 1973లో విడుదలైన రెండు సినిమాలు ‘అంకుర్’, ‘గరమ్ హవా’ నవ సినిమాల పతాకాన్ని పట్టుకున్నాయి. అయితే ‘గరమ్ హవా’ తీసిన ఎం.ఎస్.సత్యు ఎక్కువ సినిమాలు చేయలేదు. శ్యామ్ బెనగళ్ నిరంతరం పని చేశాడు. ‘సినిమా కచ్చితంగా సామాజిక మాధ్యమం. అది సమాజాన్ని పట్టించుకోవాల్సిందే. నేను సికింద్రాబాద్‌లో పుట్టి పెరగడం వల్ల రైతాంగ పోరాటం, విప్లవ పోరాటాల ప్రభావం నా మీద ఉంది. ప్రజల పక్షం నిలబడాలి సినిమా అనుకున్నాను’ అంటారాయన. కంటోన్మెంట్ ఏరియాలోని టెంట్ హాలులో వారానికి మూడు ఇంగ్లిష్ సినిమాలు చూస్తూ తన అన్నయ్యతో కలిసి సినిమాలు తీసేందుకు ప్రయోగాలు చేసిన శ్యామ్ బెనగళ్ యాడ్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీల తర్వాత ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్ అయ్యాడు. ఇంకా చెప్పాలంటే పార్లల్ సినిమా అంటే చిత్రోత్సవాల్లో ప్రదర్శించేది కాదు నేరుగా హాల్లో రిలీజ్ చేసి హిట్ చేయదగ్గది అని నిరూపించిన తొలి భారతీయ దర్శకుడు శ్యామ్ బెనగళ్. ‘అంకుర్’ హైదరాబాద్‌లో 100 రోజులు ఆడటమే ఉదాహరణ. భూస్వాముల దోపిడిని ఆ సినిమాలో చూపి కొనసాగింపుగా ‘నిషాంత్’ తీశాడు బెనగళ్. ఇక ‘మంథన్’ చిన్న మనుషులు ఒక్కటైతే సహకార వ్యవస్థ ద్వారా ఎలా స్వయం సమృద్ధి సాధించ వచ్చో ఆ రోజుల్లోనే తీశాడు బెనగళ్. దీని నిర్మాణానికి పాడిరైతులు తలా రెండురూపాయల వాటా వేయడం నభూతో నభవిష్యతి.ఎన్నో ప్రయోగాలు:శ్యామ్ బెనగళ్ తన సినిమాల్లో ఎన్నో ప్రయోగాలు చేశాడు. కొత్త నటీనటులకు అవకాశం ఇచ్చాడు. బెనగళ్ సినిమాలతో షబానా, స్మితా పాటిల్ గొప్ప పాత్రలు పోషించదగ్గ నటీమణులుగా గుర్తింపు పొందారు. షబానాకు మొదటి సినిమాతోటే జాతీయ పురస్కారం వచ్చింది. ఔట్డోర్కు తన యూనిట్‌తో వెళ్లి అక్కడే ఉండిపోయి సినిమా తీసే పరంపరను బెనగళ్ ప్రవేశపెట్టాడు. అందరూ కలిసి ఆలోచనలు పంచుకోవడానికి ఇది మంచి మార్గం అంటాడాయన. ఆయన దర్శకత్వ ప్రతిభ తెలిసి కేవలం ఆయన దర్శకత్వంలో నటించాలనే అభిలాషతో ‘అనుగ్రహం’లో వాణిశ్రీ నటించింది. వ్యభిచార వ్యవస్థ మీద ‘మండి’, వ్యాపార సామ్రాజ్యాల ఎత్తుగడల మీద ‘కల్యుగ్’, గోవాలో పోర్చుగీసు పాలన సమాప్త సమయంలో చెలరేగిన భావోద్వేగాలను ‘త్రికాల్’ లో, నాలుగు కాలాల అంతరంలో ఒక సినీ నాయిక జీవితం, సినిమా జీవితం ఎలా మారిందో చూపిన ‘భూమిక’... ఇవన్నీ ప్రయోగాత్మక కథలు. ‘త్రికాల్’లో రాత్రి సన్నివేశాలు క్యాండిళ్ల వెలుతురులో తీసి ఒక గాంభీర్యం తెచ్చాడు బెనగళ్.దేశం కోసం:దేశం కోసం దేశ వాసుల కోసం బెనగళ్ పని చేస్తూనే వెళ్లాడు. ఎన్నో డాక్యుమెంటరీలు తీశాడు. వాటిలో సత్యజిత్ రే మీద తీసిన డాక్యుమెంటరీ ముఖ్యమైనది. ఇక నెహ్రూ ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ను ‘భారత్ ఏక్ ఖోజ్’ పేరుతో ఇచ్చిన దృశ్యరూపం కష్టతరమైనది. దూరదర్శన్‌లో దీనికి విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. అదే సమయంలో సుభాష్ చంద్రబోస్ మీద పరిశోధన చేసి ‘నేతాజీ సుభాష్ చంద్రబోస్’ తీశాడు. ‘మేకింగ్ ఆఫ్ మహాత్మా’కు దర్శకత్వం వహించాడు. జీలాని బానో రాసిన ‘నర్సయ్య కీ బావ్డీ’ (నర్సయ్య బావి)ని చాలా కాలం తర్వాత ‘వెల్డన్ అబ్బా’గా తీశాడాయన.ఆయన నిష్క్రమణంతో గొప్ప వెలుగు వీడ్కోలు తీసుకున్నట్టయ్యింది. అవార్డులు... శ్యామ్ బెనగళ్ భారత ప్రభుత్వం నుంచి 8 జాతీయ చలన చిత్ర అవార్డులు అందుకున్నారు. అవి ‘అంకుర్’(1975), ‘నిశాంత్’(1976), ‘మంథన్ ’(1977), ‘భూమిక: ది రోల్’(1978), ‘జునూన్’(1979), ‘ఆరోహణ్’(1982), ‘నేతాజీ సుభాష్ చంద్రబోస్’(2005), ‘వెల్డన్ అబ్బా’ (2009). అలాగే సినీ రంగంలో కనబరచిన అత్యుత్తమ ప్రతిభకుగానూ 1976లో పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్, 2003లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత పురస్కారం, 2013లో ఏఎన్ఆర్ జాతీయ అవార్డులు అందుకున్నారు. అదేవిధంగా 2005 సంవత్సరానికిగాను 2007 ఆగస్టు 8న అత్యంత ప్రతిష్ఠాత్మమైన ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అందుకున్నారు. తెలుగు సినిమా ‘అనుగ్రహం’కు నంది అవార్డు అందుకున్నారు. -
ఊహించని కలెక్షన్స్‌తో భారతీయ సినిమాని ఏలుతున్న అల్లు అర్జున్
-
బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల ఓపెనర్స్ (భారత హీరోలు) ఎంతమందో తెలుసా..?
-
దాదాకు ఫాల్కే
బాలీవుడ్లో తెల్లరంగు హీరోల మధ్య మొదటిసారి ఒక నల్లరంగు హీరో జెండా ఎగరేశాడు. పంజాబీ హీరోల మధ్య మొదటిసారి ఒక బెంగాలీ సూపర్‌స్టార్ అవతరించాడు. దక్షిణాదిలో కమల్ హాసన్, చిరంజీవి డాన్స్‌ను అట్రాక్షన్ గా పూర్తిగా మలచక ముందే ‘డిస్కో డాన్సర్’తో మిథున్ చక్రవర్తి డాన్సింగ్ సూపర్‌స్టార్ అయ్యాడు. వెండితెర మెరుపులను పూర్తిగా నమ్మక ‘మోనార్క్’ బ్రాండ్‌తో హోటెలింగ్ సామ్రాజ్యాన్ని నిర్మించి స్థిరపడ్డాడు. ఇండస్ట్రీకి అతను ‘మిథున్‌దా’! దాదాకు దాదాసాహెబ్ ఫాల్కే!! నటించిన తొలి సినిమాకే నేషనల్ అవార్డు వస్తుందా ఎవరికైనా? మిథున్ చక్రవర్తికి వచ్చింది. మృణాల్‌సేన్ దర్శకత్వంలో మిథున్ నటించిన బెంగాలీ చిత్రం ‘మృగయా’ (1976) అతనికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు తెచ్చి పెట్టింది. అందులో అతను నేర విచారణను ఎదుర్కొనే అమాయక గిరిజనుడిగా నటించాడు. ఈ అవార్డు అందుకోవడానికి ఢిల్లీ వెళ్లిన మిథున్, అవార్డు అందుకున్నాక బయటకు రాగానే జర్నలిస్టులు చుట్టుముట్టి ఇంటర్వ్యూ అడిగారు. ‘ఇస్తాను.. ఇస్తాను.. ముందు నాకు భోజనం పెట్టించండి’ అన్నాడు మిథున్ . జేబులో రూపాయి దారి ఖర్చులు లేని పేదరికం అతడి చేతి అవార్డు కంటే ఆకలి తీరడమే ముఖ్యమనిపించింది.∙∙ మిథున్ చక్రవర్తికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. మిథున్ ఇప్పుడు వందల కోట్ల ఆస్తి కలిగినవాడు. కాని అతను పుట్టిన ఇల్లు ఎలా ఉంటుంది అని నార్త్ కోల్‌కతాలో ఇప్పటికీ అలాగే ఉన్న ఆ ఇంటిని రెండో కొడుకు ఉష్‌మయ్ చక్రవర్తి సందర్శించాడు. ‘ఇంటి వాకిలిలోనే మురుగునీటి కాలువ ఉంది. దానిని దాటి లోపలికి వెళితే ఆయన పెరిగిన ఇంట్లో కనీసం సూర్యకాంతి రావడం లేదు. ఈ చీకటి కొట్టం నుంచి వచ్చిన మా నాన్న అంత పెద్ద స్వ΄్నాన్ని కన్నాడా అని ఆయన పట్ల నా గౌరవం వందరెట్లు పెరిగింది’ అన్నాడతను.∙∙ మిథున్ చక్రవర్తి అసలు పేరు వేరు. అదేంటనేది మనకు అక్కర్లేదు. కాని అతను కాలేజీ రోజుల్లో రాడికల్ స్టూడెంట్‌గా మారాడు. ఆ సమయంలో నక్సలైట్ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఈ ఉద్యమంలోనే అతడి సొంత తమ్ముణ్ణి పోగొట్టుకున్నాడు. ఇక కోల్‌కతాలో ఉండేందుకు ఏ మాత్రం వీలు లేని పరిస్థితి వచ్చింది. ఉద్యమంలో ఉన్నప్పుడు మిథున్ చక్రవర్తి వీథి నాటకాలు హుషారుగా వేసేవాడు. అది గమనించిన ఒక మిత్రుడు నువ్వు దాక్కున్నట్టు ఉంటుంది, నటన నేర్చుకున్నట్టు ఉంటుంది అని పూణె ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్లో చేర్పించాడు. అక్కడే అతను సొంతపేరు దాచి మిథున్ గా మారాడు. కోర్సు పూర్తయిన వెంటనే సినిమా కూడా దొరికింది. విడుదలైంది. నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది. ఇక దిగుల్లేదు... బాలీవుడ్లో బతికిపోవచ్చు అని ముంబై చేరుకున్నాడు మిథున్ . అక్కడ అతి కర్కశమైన జీవితం అతడికి ఎదురుపడింది.∙∙ ‘నలుపు నలుపు అనేరు నలుగురు నవ్వేరు నలుపు నారాయణమూర్తే గాదా’ అనే పాట మనం పాడుకుంటాంగానీ బాలీవుడ్ వాళ్లు విని అర్థం చేసుకునే అవకాశం లేదు. బాలీవుడ్లో హీరోలంటే తెల్లరంగు పంజాబీవారు. అంతే! దక్షిణాదిలో బాలచందర్ ఎలాగో అప్పటికే రజనీకాంత్‌ను ప్రవేశపెట్టాడు కాని బాలీవుడ్లో నల్లరంగు హీరో అసాధ్యం. మిథున్ నల్లగా ఉంటాడు. పైగా హిందీ కూడా సరిగ్గా రాదు. దానికి తోడు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఒకటి తెచ్చుకున్నాడు. ఇక ఎవరు రానిస్తారు? తినడానికి తిండి, ఉండటానికి గది ఏమీ లేని దారుణమైన రోజులు చూశాడు. చాలారోజులు పార్కుల్లో పడుకున్నాడు. ఒక స్నేహితుడు మాతుంగాలోని జిమ్‌ఖానాలో మెంబర్షిప్ ఇప్పిస్తే ఉదయాన్నే కాలకృత్యాల కోసం అక్కడకు వెళ్లేవాడు. మిగిలిన సమయం అంతా రోడ్డు మీదే. ప్రసిద్ధ దర్శకుడు మన్ మోహన్ దేశాయ్ దగ్గరకు వెళితే ఆయన తన జేబులో ఉన్న పది రూపాయల నోటు ఇచ్చి పంపించేయడం ఇప్పటికీ చెప్పుకుంటారు. మరో దర్శకుడు ‘ఇతను కనుక హీరో అయితే నేను ఇండస్ట్రీ వదిలేసి పోతాను’ అని ముఖానే చె΄్పాడు. 1980ల కాలం అది. అప్పటికే అమితాబ్ సూపర్‌స్టార్ అయ్యాడు. యువ ప్రేక్షకుల కోసం రిషికపూర్ లాంటి వారు ఉన్నారు. నె΄÷టిజం ఉంది. ఏ తలాతోకా లేని మిథున్ ఎలా హీరో అవుతాడు? ∙∙ కాని దేవుడు కూడా ఏదో ఒక వేళలో ఎదురు పడతాడు. ఈసారి దేవుడు బి.సుభాష్ అనే పేరుతో వచ్చాడు. ‘నేను నీతో సినిమా తీస్తాను. దాని పేరు డిస్కో డాన్సర్’ అన్నాడు బి.సుభాష్. అప్పటికే బప్పి లాహిరి కూడా ఇండస్ట్రీకి వచ్చి మంచి అవకాశం కోసం చూస్తున్నాడు. బి.సుభాష్, మిథున్, బప్పి లాహిరి కలిసి ‘డిస్కో డాన్సర్’ తయారు చేశారు. డిసెంబర్ నెల 1982లో విడుదల అయిన ఆ సినిమా దేశమంతా అగ్గి పుట్టించింది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకూ కుర్రకారు నుంచి గృహిణుల వరకూ అందరి నోటా ‘ఐయామే డిస్కో డాన్సర్’ పాటే. ఏ పెళ్లిలో కాలేజీ ఫంక్షన్ లో చూసినా ఆ పాటే. రష్యాలో ఆ సినిమా 1000 ప్రింట్లతో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఆ రోజుల్లో 100 కోట్లు సంపాదించిన తొలి సినిమా అది. ఇప్పటి లెక్కల ప్రకారం 1200 కోట్లు! మిథున్ ఇప్పుడు సూపర్‌స్టార్ అయ్యాడు. ఆ తర్వాత బి.సుభాష్‌తోనే తీసిన ‘కసమ్ పైదా కర్నేవాలేకీ’, ‘డాన్స్ డాన్స్’ కూడా భారీ హిట్లే. అమితాబ్, జితేంద్ర, శశి కపూర్, వినోద్ ఖన్నా అందరూ ఇప్పుడు మిథున్ వైపు కళ్లప్పగించి చూస్తున్నారు. అమితాబ్‌కు ప్రధాన పోటీదారు వచ్చినట్టే.∙∙ మిథున్ చక్రవర్తి బాలీవుడ్లో మాస్ పాత్రలు పోషించినా బెంగాలీలో తనకు నచ్చిన పాత్రలు పోషిస్తూ అక్కడా తన ప్రాభవం కాపాడుకున్నాడు. ‘స్వామి వివేకానంద’ (1998)లో రామకృష్ణ పరమహంసగా నటిస్తే దానికి మళ్లీ నేషనల్ అవార్డ్ వచ్చింది. మరోవైపు ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చేలా తీసిన ‘΄్యార్ ఝక్తా నహీ’ (1985) సంవత్సరాల తరబడి ఆడింది. ఇది తెలుగులో కృష్ణ, శ్రీదేవిలతో ‘పచ్చని కాపురం’ పేరుతో రీమేక్ అయ్యింది. పద్మినీ కొల్హాపురి, రంజిత, శ్రీదేవిలతో మిథున్ చేసిన సినిమాలు ప్రేక్షకులకు హిట్ జోడీగా నచ్చాయి. ∙∙ మిథున్ చక్రవర్తి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా హిట్ అయ్యాడు. అమితాబ్ ‘అగ్నిపథ్’లో వేసిన అయ్యర్ పాత్ర అతడికి చాలా పేరు తెచ్చింది. మణిరత్నం తీసిన ‘గురు’లో పత్రికాధిపతిగా (గోయెంకా) నటించి ఆశ్చర్యపరిచాడు. ‘ఓ మైగాడ్’ (గోపాల గోపాల)లో స్వామీజీగా వేసిన పాత్ర మిథున్ లోని మరో పార్శా్వన్ని చూపింది. టెలివిజన్ షోస్ చేస్తూ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ మిథున్ అనుక్షణం బిజీగా ఉండటానికి ప్రయత్నిస్తాడు.∙∙ ప్రారంభాలు మర్చిపోనివాడి గమనం స్థిరంగా ఉంటుంది. ఒకరోజు ఊటీలో షూట్ జరుగుతుంటే అక్కడొక మురికి కాలువ పారుతూ ఉంది. పక్కన ఉన్న నటిని పిలిచి ‘నా ఫ్లాష్‌బ్యాక్ చెప్పమని అడుగుతావుగా. ఇదే నా ఫ్లాష్‌బ్యాక్’ అన్నాడతను ఆ కాలువ చూపుతూ.మురుగు నీటి నుంచి వెలిసిన వెండితెర వేల్పు మిథున్ . కుప్పతొట్టిలో ఉన్న అమ్మాయిని కూతురిగా1996 డిసెంబర్ 1న కోల్‌కతాలో న్యూస్ పేపర్ చదువుతున్న మిథున్ కి ఒక వార్త కలుక్కుమనిపిం చింది. తన భార్య యోగితా బాలి (ఒకప్పటి హీరోయిన్ )ని పిలిచి ఆ వార్త చూపించాడు. అందులో కుప్పతొట్టిలో ఎవరో ఆడపిల్లను వదిలేసి పోయారు అని ఉంది. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకున్నారు. బాధపడ్డారు. ఆ పాపను తెచ్చి పెంచుకోవాలని వెంటనే నిశ్చయించుకున్నారు. ఒక ఎన్ .జి.ఓ ద్వారా ప్రయత్నిస్తే కుప్పతొట్టిలో ఉండటం వల్ల పాప చాలా సీరియస్ కండిషన్ లో ఉందని చె΄్పారు. అయినా సరే మిథున్, యోగితా ఆ పాపను తెచ్చుకుని కంటికి రెప్పలా కాపాడారు. చట్ట ప్రకారం దత్తత తీసుకున్నారు. దిశానీ చక్రవర్తి అని పేరు పెట్టారు. అమెరికాలో చదివించారు. మిథున్ కు ఎంతో ప్రాణం ఈ కూతురు.నవ్వలేను...సంతోషంతో ఏడవలేను‘దాదాసాహెబ్ వచ్చిందన్న వార్త నన్ను చేష్టలుడిగేలా చేసింది. నేను నవ్వలేను... ఆనందంతో ఏడ్వలేను. ఫుట్‌పాత్ నుంచి వచ్చిన నేను ఇక్కడ దాకా చేరుకున్నానంటే ఈ పురస్కార ప్రకటన నాలో ఇంకా రిజిస్టర్ అవ్వాల్సి ఉంది. ఒకటి మాత్రం నిజం. నేను ఈ అవార్డు ΄÷ందానంటే ప్రతిభ, అంకితభావం ఉన్న ఎవరైనా ΄÷ందవచ్చు’ అన్నారు మిధున్ చక్రవర్తి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటన తర్వాత! కేంద్ర సమాచార, ప్రసార శాఖామంత్రి అశ్విని వైష్ణవ్ ‘ఎక్స్’ వేదికగా ఈ వార్తను సోమవారం ప్రకటించారు. దాదాసాహెబ్ పురస్కారం సందర్భంగా మిథున్ చక్రవర్తికి ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ట్వీట్ చేశారు. -
సీన్ హై జపానీ..సినిమా హై హిందుస్థానీ
భారతీయ సినిమా పాటలకు విదేశీయులు డ్యాన్స్ చేయడం కొత్త కాదు. అయితే జపాన్‌లో మాత్రం బాలీవుడ్ హిట్ సినిమాల ఐకానిక్ సీన్లను రీక్రియేట్ చేసే కొత్త ట్రెండ్ మొదలైంది. బాలీవుడ్ మూవీ ‘కభీ ఖుషీ కభీ ఘమ్’ (కె3జి)లో అంజలిగా కాజోల్, రాహుల్‌గా షారుఖ్ ఖాన్ నటించారు. రాహుల్, అంజలి వేషధారణలో జపనీస్ ఇన్ఫ్లూయెన్సర్లు మాయో, కకే టకులు ‘కె3జి’లోని ‘బడే మజాకీ హో’ కామెడీ సీన్‌ను రీక్రియేట్ చేశారు. ‘లెర్నింగ్ హిందీ ఇన్ 2024 ఈజ్ లైక్ బడే మజాకీ హో’ కాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. హిందీలో ్రపావీణ్యం సంపాదించిన మాయో, కకే టకుల లిప్ సింక్ బాగా కుదిరింది. ‘క్రాస్–కల్చరల్ అడ్మిరేషన్ అనేది భౌగోళిక సరిహద్దులను చెరిపేసి అందరినీ ఒక గొడుగు కిందికి తీసుకువస్తుంది. పర్యాటక ఆసక్తి పెంచుతుంది’... లాంటి కామెంట్స్ ఎన్నో యూజర్ల నుంచి వచ్చాయి. -
ఇండియన్ సినిమాను రూల్ చేయనున్న రష్మిక..!
-
G20 Summit: ఆర్ఆర్ఆర్ అద్భుతం: బ్రెజిల్ అధ్యక్షుడు
న్యూఢిల్లీ: గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించిన తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్’పై బ్రెజిల్ అధ్యక్షుడు లూలా మనసు పారేసుకున్నారు. తనకెంతో నచ్చిన సినిమా అని మెచ్చుకున్నారు. జీ20 సదస్సు కోసం ఢిల్లీకి వచ్చిన లూయిజ్ ఒక ఆన్లైన్ పోర్టల్‌కు ఇచి్చన ఇంటర్వ్యూ వివరాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఆ ఇంటర్వ్యూలో ‘ మీకు నచి్చన భారతీయ సినిమా పేరు చెప్పండి’ అన్న ప్రశ్నకు ఆయన ఠక్కున ఆర్ఆర్ఆర్ అని చెప్పారు. ‘ఇది చక్కని ఫీచర్ ఫిల్మ్. సరదా సన్నివేశాలు, అలరించే డ్యాన్స్‌లతో కట్టిపడేస్తుంది. బ్రిటిషర్లు భారతీయులను ఎంతగా అణచివేశారనేది కళ్లకు కట్టింది’అని అన్నారు. -
సరిగ్గా 127 ఏళ్ల క్రితం.. భారత్‌లో అడుగు పెట్టిన 'సినిమా'
సినిమా చూపిస్త మావా.. నీకు సినిమా చూపిస్త మామా.. అంటూ తొలిసారి భారతీయులకు చలనచిత్రాన్ని పరిచయం చేశారు లూమియర్ సోదరులు. సరిగ్గా 127 ఏళ్ల క్రితం ఇదే రోజు(జూలై 7న) ఈ అన్నదమ్ములు భారతీయులకు మొట్టమొదటి సారి సినిమా వీక్షించే అవకాశం కల్పించారు. అది కూడా ఒకటో, రెండో అనుకునేరు.. ఏకంగా ఆరు సినిమాలు. అవి ‘ఎంట్రీ ఆఫ్ సినిమాటోగ్రాఫ్’, ‘ద సీ బాత్’, ‘అరైవల్ ఆఫ్ ఎ ట్రైన్’, ‘ఎ డిమాలిషన్’, ‘లేడీస్ అండ్ సోల్జర్స్ ఆన్ వీల్స్’, ‘లీవింగ్ ద ఫ్యాక్టరీ’. 1896లో ముంబైలోని వాట్సన్ హోటల్లో ఈ సినిమాలను ప్రదర్శించారు. అప్పుడు టికెట్ ధర ఎంతనుకునేరు? కేవలం ఒక్క రూపాయి మాత్రమే! ఇండియాలోకి సినిమా అడుగుపెట్టిన ఈ అద్భుత క్షణాలను టైమ్స్ ఆఫ్ ఇండియా 'మిరాకిల్ ఆఫ్ ద సెంచరీ'గా అభివర్ణించింది. ఫ్రెంచ్ సినిమాటోగ్రాఫర్లు అయిన ఈ లూమియర్ సోదరులు సినిమాలపై తమకున్న పట్టుకున్న పారిస్‌లో నిరూపించుకున్నాకే భారత్‌లో అడుగుపెట్టారు. 1896 జూలై 7న తొలిసారి సినిమా ప్రదర్శించగా దీనికి అద్భుత స్పందన లభించింది. వెంటనే వాళ్లు కోల్‌కతా, చెన్నై నగరాల్లోనూ సినిమా షోలు వేయడం ప్రారంభించారు. రెండో స్క్రీనింగ్ ముంబైలోని నొవాల్టీ థియేటర్లో జూలై 14న జరగ్గా ఒకేరోజు ఏకంగా 24 సినిమాలు ప్రదర్శించారు. ఆగస్టు 15 వరకు ఈ షోల ప్రదర్శన ఒక పండగలా జరిగింది. ఇండియన్స్ తీసిన సినిమాలు.. ఈ ఉత్సాహంతో హీరాలాల్ సేన్ అనే ఇండియన్ ఫోటోగ్రాఫర్ స్టీవెన్సన్స్ కెమెరా ఉపయోగించి స్టేజీ షోను చిత్రీకరించాడు. ఈ షోకి ద ఫ్లవర్స్ ఆఫ్ పర్షియా అని నామకరణం చేశారు. హెచ్ఎస్. భటవ్దేకర్ 1899లో ద రెజ్లర్స్ అనే డాక్యుమెంటరీ చిత్రీకరించాడు. ముంబైలోని హ్యాంగింగ్ గార్డెన్స్‌లో ఇద్దరు రెజ్లర్స్ తలపడ్డ పోటీని ఆయన లైవ్‌లో చిత్రీకరించాడు. ఇండియాలో ఇదే తొలి డాక్యుమెంటరీ సినిమాగా గుర్తింపు పొందింది. చలనచిత్ర పితామహుడు పూర్తి స్థాయిలో సినిమాను తీసి రిలీజ్ చేసింది మాత్రం దాదా సాహెబ్ ఫాల్కే. ఈయన 1913లో మరాఠీ భాషలో రాజా హరిశ్చంద్ర అనే మూకీ(సైలెంట్) సినిమా తీశాడు. అప్పట్లో ఇది సంచలన విజయం నమోదు చేసుకుంది. భారతీయ సినిమాకు ప్రాణం పోసిన ఈయనను చలనచిత్ర పితామహుడిగా చెప్పుకుంటారు. ఇండియాలో తొలి టాకీ సినిమా ఆలం అరా. అర్దేశిర్ ఇరానీ తెరకెక్కించిన ఈ సినిమా 1931 మార్చి 14న విడుదలైంది. అదే ఏడాది తొలి తెలుగు టాకీ సినిమా భక్త ప్రహ్లాద కూడా రిలీజైంది. చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లో ముద్దులాట.. తప్పు మీదైతే నన్నంటారేంటి? నటి ఫైర్ -
బాక్సాఫీస్ కింగ్...దేశంలోనే ఒకే ఒక్కడు
-
Cannes 2023: కాన్స్ లో ‘కెన్నెడీ’కి
ఆదరణ ఫ్రాన్స్‌లో జరుగుతున్న 76వ కాన్స్ చలన చిత్రోత్సవాల్లో మెరిశారు సన్నీ లియోన్ . అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రాహుల్ భట్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కెన్నెడీ’. కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఈ సినిమా ప్రీమియర్‌ను ప్రదర్శించింది యూనిట్. ‘కెన్నెడీ’ పూర్తయిన తర్వాత వీక్షకుల నుంచి ఐదు నిమిషాలకు పైగా స్టాండింగ్ ఒవేషన్ చిత్ర యూనిట్‌కు దక్కినట్లు తెలిసింది. ఇక కాన్స్ రెడ్ కార్పెట్‌పై సన్నీ లియోన్ నడవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ‘‘కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఇండియన్ సినిమాను రిప్రజెంట్ చేయడం చాలా గౌరవంగా ఉంది’’ అన్నారు సన్నీ లియోన్ . సన్నీకి హెల్ప్ చేసిన అనురాగ్ కాన్స్ రెడ్ కార్పెట్‌పై పొడవాటి గౌనులో సన్నీ లియోన్ మెరిశారు. అయితే నడుస్తున్నప్పుడు ఆ గౌను ఆమె షూలో చిక్కుకోవడంతో ఇబ్బందిపడ్డారు. పక్కనే ఉన్న అనురాగ్ కశ్యప్ ఈ విషయాన్ని గ్రహించి సన్నీకి హెల్ప్ చేశారు. అలాగే మౌనీ రాయ్, అదితీరావ్ హైదరీలు కూడా రెడ్ కార్పెట్‌పై నడిచారు. కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఇండియన్ పెవిలియన్ లో ‘లయనీస్’ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో అదితీ రావ్ హైదరి, సంధు ముఖ్య తారలు. -
మోగింది వీణ... నెటిజనుల గుండెలలోనా!
పాటలలో వీణ పాటల తీయదనం వేరయా! మన తెలుగులోనైతే ‘లీలాకృష్ణా నీ లీలలు’ ‘ఈ వీణపైన పలికిన రాగం... నాలో విరిసిన అనురాగం’లాంటి ఎన్నో పాటలు గుర్తు వస్తాయి. హిందీలోనైతే ‘మేరీ వీణ తుమ్ బిన్ రోయే’ (దేఖ్ కబిర రోయా–1957)లాంటివి ఎన్నో గుర్తు వస్తాయి. ఇక అసలు విషయానికి వస్తే... వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటించిన హిందీ సినిమా ‘బేడియా’ లోని ‘అప్నా బనా లే పియా’ సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. సచిన్–జిగర్ ద్వయం కంపోజ్ చేసిన ఈ పాటను కుశాల అనే మెడిసిన్ స్టూడెంట్ వీణపై అద్భుతంగా ప్లే చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో వేలాది లైకులను సొంతం చేసుకుంది. ఈ వీడియో నేపథ్యంలో నెటిజనులు భారతీయ సినిమాలలోని ప్రసిద్ధ వీణ పాటలను గుర్తు తెచ్చుకున్నారు. రాగాల గురించి వివరంగా మాట్లాడుకున్నారు. కొందరు మాత్రం ‘మన సినిమాలో వీణ పాటలు బొత్తిగా కరువయ్యాయి’ అంటూ కడు విచారం వ్యక్తం చేశారు. -
1000 కోట్లు లోడింగ్..బాక్సాఫీస్‌కు కలెక్షన్ల సునామీ
-
చైనాను ఊపేస్తున్న మన పాట!
బీజింగ్: కరోనా కట్టడి పేరుతో కఠిన ఆంక్షలు.. తీరా కేసులు తగ్గుముఖం పడుతున్నాయనే టైంకి కొత్త వేరియెంట్ కేసులు.. ఆపై మళ్లీ ఆంక్షల విధింపు.. చైనాలో గత రెండేళ్లుగా ఇదే రిపీట్ అవుతోంది. అక్కడి పౌరులు కఠిన లాక్డౌన్ ప్రభావంతో మానసికంగా కుంగిపోతున్నారు. చివరికి ఆ నిబంధనల దెబ్బకు ప్రాణాలు తీసుకునేంత స్థాయికి పరిస్థితి చేరుకుందంటే అర్థం చేసుకోవచ్చు. అయితే.. ఇప్పుడా ఫ్రస్ట్రేషన్ మరో స్థాయికి చేరుకుంది. మళ్లీ బీజింగ్ సహా ప్రధాన నగరాల్లో లాక్డౌన్లు విధిస్తుండడంతో జనాలు పిచ్చెక్కి పోతున్నారు. లాక్డౌన్ నుంచి తప్పించుకునేందుకు ఊళ్లు విడిచి పారిపోతున్నారు కొందరు. అయితే మరోవైపు కఠిన లాక్డౌన్లకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఉద్యమిస్తూ.. తమ కోపాన్ని, అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మన పాట అక్కడ హవా చూపిస్తోంది. అందుకు ఒక చిత్రమైన కారణం కూడా ఉంది. 1982లో మిథున్ చక్రవర్తి హీరోగా వచ్చిన బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘డిస్కో డ్యాన్సర్’. దానికి బప్పీలహరి మ్యూజిక్. అందులో పార్వతి ఖాన్ ఆలపించిన ‘జిమ్మీ జిమ్మీ.. ఆజా ఆజా’ ఇప్పుడు డ్రాగన్ కంట్రీ సోషల్ మీడియాను విపరీతంగా కుదిపేస్తోంది. అక్కడి షార్ట్ వీడియో మేకింగ్ యాప్‌లలో ఇప్పుడు ఈ పాటదే హవా. ముఖ్యంగా చైనీస్ వెర్షన్ టిక్‌టాక్ ‘డౌయిన్’ను ఈ పాట ఊపేస్తోంది. And another…. And there are thousands more! pic.twitter.com/z7fqu0KUFC — Ananth Krishnan (@ananthkrishnan) October 31, 2022 మాండరిన్ భాషలో ‘జియ్ మీ, జియ్ మీ’ అంటే అర్థం ‘బియ్యం ఇవ్వమ’ని(గివ్ మీ రైస్). లాక్డౌన్ దెబ్బకు లక్షల మంది అర్థాకలితో అలమటిస్తున్నారని, వాళ్ల కోసం కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలని కోరుతూ ఇలా సెటైరిక్‌గా ఈ జియ్ మీ జియ్ మీ (జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా) సాంగ్‌పై చిన్నాపెద్దా అంతా షార్ట్ వీడియోస్ తీసి వదులుతున్నారు. వాళ్ల నిరసనకు అదొక థీమ్‌గా మారిపోయింది. దీంతో ఆ వీడియోలు ట్విట్టర్ ద్వారా వైరల్ అవుతున్నాయి. సాధారణంగా అక్కడ ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్న ఎలాంటి కంటెంట్ అయినా సరే.. వెంటనే సెన్సార్ కిందకు వెళ్లి సోషల్ మీడియా నుంచి మాయమైపోతుంటుంది. అయితే.. ఈ పాట మాత్రం ఎందుకనో ఇప్పటిదాకా ఇంకా సెన్సార్‌షిప్‌కు గురి కాలేదు మరి. In #China, Bappi Lahri’s Jimmy Jimmy song is going #viral because Jie Mi means “Give Me Rice” in Mandarin Zero #Covid Policy has left people food-less pic.twitter.com/50vBwVBJ5x — विनीत ठाकुर 🚩 (@yep_vineet) November 1, 2022 Perhaps the most evocative one yet capturing the situation… pic.twitter.com/z2sxspHTEk — Ananth Krishnan (@ananthkrishnan) November 1, 2022 ఇక భారతీయ చిత్రాలకు చైనా గడ్డపై లభించే ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా 50, 60వ దశకాల్లో బాలీవుడ్ చిత్రాలకు అక్కడ విపరీతమైన ఆదరణ దక్కింది. ఆపై అమీర్ ఖాన్ త్రీ ఇడియట్స్, దంగల్ తో పాటు హిందీ మీడియం, అంధాధూన్ చిత్రాలు విపరీతమైన క్రేజ్ దక్కించుకున్నాయి. -
ఆస్కార్ బరిలో గుజరాతీ ఫిల్మ్ 'ఛెల్లో షో'
ఆస్కార్ అవార్డుల సందడి మొదలైంది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న 95వ ఆస్కార్ అవార్డ్స్ వేడుకలకు ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ (అంతర్జాతీయ ఉత్తమ చిత్రం) విభాగంలో నామినేషన్ ఎంట్రీ పోటీ కోసం మన దేశం తరఫున గుజరాతీ మూవీ ‘ఛెల్లో షో’ (ఇంగ్లీష్‌లో ‘లాస్ట్ ఫిల్మ్ షో’) ఎంపికైంది. ఈ విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మంగళవారం ప్రకటించింది. పాన్ నలిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భవిన్ రాబరి, భవేష్ శ్రీమాలి, రిచా మీనా, డిపెన్ రావల్ ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రకథ విషయానికి వస్తే... గుజరాత్‌లోని సౌరాష్ట్రలో గల చలాలా గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల సమయ్ (భవిన్ రాబరి) సినిమా ప్రొజెక్టర్ టెక్నీషియన్ ఫజల్ (భవేష్ శ్రీమాలి)ని మచ్చిక చేసుకుని, సినిమా హాల్ ప్రొజెక్షన్ బూత్‌లోకి ప్రవేశిస్తాడు. అలా వేసవిలో చాలా సినిమాలు చూస్తాడు. ఆ తర్వాత అతనే సొంతంగా ఓ ప్రొజెక్షన్ని తయారు చేయాలనుకుంటాడు. సినిమా అతని జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేసిందనే కథతో ఈ చిత్రం సాగుతుంది. చిత్రదర్శకుడు నలిన్ నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. ‘‘ఛెల్లో షో’పై నమ్మకం ఉంచి, మా చిత్రాన్ని ఆస్కార్‌కు ఎంపిక చేసినందుకు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ధన్యవాదాలు. ఇప్పుడు నేను మళ్లీ ఊపిరి తీసుకోగలుగుతున్నాను. అలాగే సినిమా అనేది వినోదాన్ని, స్పూర్తిని, విజ్ఞానాన్ని అందిస్తుందని నమ్ముతున్నాను’’ అని ట్వీట్ చేశారు దర్శకుడు పాన్ నలిన్ . ఈ సంగతలా ఉంచితే.. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ‘ఆర్ఆర్ఆర్’ని ఎంపిక చేయకపోవడంపట్ల సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శిస్తూ, ట్వీట్లు చేశారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ని చిత్రబృందం ఆస్కార్ నామినేషన్ ఎంట్రీకి పంపించిందా? లేదా అనే విషయంపై స్పష్టత లేదు. -
బబ్లీ చాన్స్ రావడం నా అదృష్టం
‘‘తెలుగు సినిమా అంటే గర్వంగా ఫీలవుతాను. ఎందుకంటే నా ప్రయాణం తెలుగు నుంచే మొదలైంది. రాజమౌళి, సుకుమార్‌గార్లతో పాటు చాలామంది దర్శకులు మన భారతీయ మూలాలకు చెందిన కథలనే తీసుకుంటుంటారు. ఇప్పటికీ మన భారతీయ సినిమాను ఎమోషన్సే నడిపిస్తున్నాయి’’ అన్నారు తమన్నా. మధూర్ భండార్కర్ దర్శకత్వంలో తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బబ్లీ బౌన్సర్’. స్టార్ స్టూడియోస్, జంగిలీ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో తమన్నా మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో హరియానాకు చెందిన యువతిగా నటించాను. తొలిసారి లేడీ బౌన్సర్ కాన్సెప్ట్‌తో ఉన్న ఈ సినిమా చేసే చాన్స్ నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా కెరీర్లో ఇది బెస్ట్ సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. మధూర్ బండార్కర్ చిత్రాల్లో నటించిన హీరోయిన్లకు జాతీయ అవార్డ్స్ వస్తాయి. నాకు కూడా ఈ చిత్రానికి అవార్డ్స్ రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను’’ అన్నారు. ‘‘ఉత్తరాదిలో కొంతమంది లేడీ బౌన్సర్స్ స్ఫూర్తితో ఈ సినిమా కథ రాసుకున్నాను. లేడీ బౌన్సర్‌గా తమన్నా ది బెస్ట్ అనిపించింది’’ అన్నారు మధూర్ భండార్కర్. -
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ చాలా ప్రాబ్లమ్స్లో ఉంది: అల్లు అరవింద్
Allu Arvind About Indian Cinema, Movie Industries: ప్రస్తుతం భారత సినీ పరిశ్రమ చాలా ప్రాబ్లమ్స్లో ఉందని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ఎంత పెద్ద స్టార్ హీరోల సినిమాలు విడుదలైన ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా రీసెంట్గా విడుదలైన యంగ్ హీరో విశ్వక్సేన్ ‘అశోకవనంలో అర్జుణ కళ్యాణం’ మూవీ సెక్సెస్ మీట్ నిన్న నిర్వహించారు. ఈ వెంట్‌కు ఆయన ముఖ్య అథితిగా వచ్చారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఈ సినిమా తాను కూడా చూశానని, చాలా బాగుందని చెప్పారు. చదవండి: స్టార్ హీరో సల్మాన్‌కు వింత వ్యాధి.. ‘ఆత్మహత్య చేసుకోవాలనిపించేది’ అనంతరం ‘గతంలో కుటుంబం మొత్తం థియేటర్‌కు వచ్చి సినిమాలు చూసేవారు. ప్రస్తుతం థియేటర్లకు వచ్చి సినిమా చూసే అలవాటు పోయింది. శని, ఆదివారాలు వస్తే భార్య, భర్తతో ఏ సినిమాకు వెళ్దామండి అని అడిగేవారు. కానీ ఇప్పుడు ఆ కల్చర్ కనిపించడం లేదు. ఓటీటీలు వచ్చాక అది పూర్తిగా మారింది. సినిమా విడుదలయ్యాక ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూసే కాలం వచ్చింది’ అన్నారు. కేవలం కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులను థియేటర్లోకి రప్పిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. చదవండి: నయనతార పెళ్లిపై ప్రముఖ ఆస్ట్రాలజర్ సంచలన వ్యాఖ్యలు ‘ఒకప్పుడు ఎలాంటి హీరో సినిమా అయినా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చేవాడు. కానీ ఇప్పుడు పెద్ద హీరో సినిమా అయిన ప్రేక్షకులు అంత థియేటర్లకు రావడం లేదు. దీనికంతటికి కారణం ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో చాలా మరడమే. ఇప్పటికైన ఇలాంటి డేంజరస్ ట్రెండ్ నుంచి మనం బయటపడాలి. అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు తీస్తేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. ఇప్పటికైన ఇండస్ట్రీ అది గ్రహించారు. ప్లిజ్ మీరందరు సినిమాకు వచ్చి చూస్తేనే ఈ సినిమాలు బ్రతకుతాయి’ అని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. ఇక బాలీవుడ్ పరిస్థితి అయితే మరి దారుణంగా ఉందని, అక్కడి స్టార్లు నటించిన చిత్రాలు కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోతున్నాయని అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు. -
పుష్ప, RRR, ఆచార్య : ఆర్టిస్ట్ సమంతా అద్భుతమైన పాట వింటే..
సాక్షి, హైదరాబాద్: భారతీయ సినిమాలో గొప్ప గొప్ప సినిమాలన్నీ ఆర్ట్ రూపంలో దర్శనమిస్తే ఎలా ఉంటుంది. వెండి తెరపై ఒక మూవీని అవిష్కరించే అన్ని క్రమాలను ఒక థీమ్‌గా ఎంచుకుని కళాకారులు పనిచేస్తే. ఈ ఆలోచనే అద్భుత కళాఖండాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రముఖ కార్టూనిస్టు, దర్శకులు బాపు, రమణలు సినిమా మొత్తాన్ని పర్ఫెక్ట్గా బొమ్మలు గీసుకొని ఆ తరువాత సినిమా తీసేవారట. అలాగే తెలుగు, హిందీ భాషల్లో బ్లాక్ బస్టర్ సినిమాలు, సినిమా తయారయ్యేందుకు సంబంధించి వివిధ దశలు, రంగాలు, స్టార్ హీరోలు, లెజెంట్రీ నటీ నటుల పట్ల గౌరవ సూచకంగా ఆర్ట్ క్యూరేటర్ అన్నపూర్ణ మడిపడగ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఆర్ట్ ఎగ్జిబిషన్లో కొలువు దీరిన వినూత్నమైన , అద్భుతమైన చిత్రాలను ‘చిత్రం’ షోలో చూద్దాం. ఆర్టిస్టులు రకరకాల థీమ్‌లతో బొమ్మలు వేయడం, వాటిని ప్రదర్శనకు పెట్టడం అందరికీ తెలుసు. ఇందులో ప్రతీ ఆర్టిస్టుకు వారికంటూ ఒక ప్రత్యేక శైలి( సిగ్నేచర్) ఉంటుంది. దాని ఆధారంగా తమ ప్రతిభకు అద్దంపడుతూ అద్భుతమైన ఆర్ట్స్‌ను ప్రదర్శించారు. వీటిని పరిశీలిస్తే.. ఇలా కూడా ఆర్ట్ వర్క్‌ను రూపొందించవచ్చా అని ఆశ్చర్యపోవడం మన వంతవుతుంది. అనేక ఆర్ట్ ఎగ్జిబిషన్స్‌ను సక్సెస్ చేస్తూ, ఔరా అనిపించే ఎగ్జిబిషన్స్‌తో ఆకట్టుకుంటూ, గొప్ప మహిళా ఆర్ట్ క్యూరేటర్‌గా పాపులర్ అయిన అన్నపూర్ణ మడిపడగ ఎగ్జిబిషన్ విశేషాలను సాక్షి.కామ్‌తో పంచుకున్నారు. భారతీయ సినిమాకు సంబంధించిన థీమ్‌తో దీన్ని రూపొందించడం విశేషం. సినిమాలోని 24 క్రాప్ట్స్ ఇన్స్పిరేషన్తో ఆ ఆర్ట్స్‌ను రూపొందించామని అన్నపూర్ణ వివరించారు. యాక్రిలిక్, ఆయిల్, వుడ్, సీడీలు, ఫ్లోర్ టైల్స్, 24 కారెట్స్ గోల్డ్, పెన్సిల్ స్కెచ్, ఇలా విభిన్న మీడియమ్స్పై దేశవ్యాప్తంగా 30 మంది గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఇందులో పాల్గొన్నారని ఆమె తెలిపారు. ఈ ఎగ్జిబిషన్‌కోసం ఆర్టిస్ట్‌ల తపన గురించి వివరించారు. అలాగే కళకు జెండర్ లేదని, చాలామంది మహిళా ఆర్టిస్టులు కూడా అద్బుతమైన ఆర్ట్స్ రూపొందించారని అన్నారామె. అలాగే తమ ఎగ్జిబిషన్‌కు అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని, రెండేళ్ల తమ శ్రమ ఫలించిందంటూ అన్నపూర్ణ సంతోషం వ్యక్తం చేశారు. కోలకతా బైస్డ్ ఆర్టిస్ట్ దెబాషిస్ సమంత బాలీవుడ్ లెజెండ్రీ మూవీ ‘పాకీజా’ కి ట్రిబ్యూట్‌గా ఒక కళాఖండాన్ని రూపొందించారు. అంతేకాదు తన అభిమాన హీరోయిన్ మీనాకుమారీపై ప్రేమతో సమంతా పాట పాడి మరీ మ్యూజికల్ ట్రిబ్యూట్ అందించారు. సంవత్సరన్నర నుంచి 40 రోజుల పాటు శ్రమించి తమ బుర్రకు, కుంచెకు పదును పెట్టి అద్బుతమైన కళా ఖండాలను ప్రదర్శించారు. ముఖ్యంగా టాలీవుడ్ సెన్సేషన్ మూవీలు, పుష్ప, ఆర్ఆర్ఆర్, ఆచార్య థీమ్‌లను తీసుకుని డిఫరెంట్ ఆర్ట్ వర్క్ తీర్చిదిద్దారు. హ్యాండ్ మేడ్ పోస్టర్స్ థీమ్‌తో వీటిని ప్రదర్శించడం హైలైట్. ఫస్ట్ విమెన్ ఆఫ్ ఇండియన్ విమెన్ అనే కాన్సెప్ట్‌తో సినిమా రంగంలో మహిళ సేవలకు గౌరవ సూచకంగా నిలిచిన ఆర్ట్‌పీస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సాక్షి కార్టూనిస్ట్ శంకర్ రూపొందించిన కార్టూన్స్ మరో ఆకర్షణ. ముఖ్యంగా సినిమాలోని స్టోరీ బోర్డును ఎంచుకుని నగేష్ గౌడ్ అలనాటి రెండు బ్టాక్ బస్టర్ మూవీలు అడవి రాముడు, భక్తకన్నప్ప పెయింటింగ్స్ రూపొందించారు. ఒక స్టోరీ బోర్డులాగా తీర్చి దిద్దినట్టు నగేష్ గౌడ్ వెల్లడించారు. ఎంతో కమిట్మెంట్, డెడికేషన్, తపన ఉంటే ఇలాంటి అద్భుతాలు వెలుగులోకి రావు నిజంగా ఆర్టిస్టులకు ధన్యవాదాలు అంటూ విజిటర్స్ ఎంజాయ్ చేశారు. -
Oscar 2022: ఆస్కార్స్ నుంచి జై భీం ఔట్!
-
గాన కోకిల లతా మంగేష్కర్ కన్నుమూత
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ (92) ఇక లేరు. ముంబై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ఈ ఉదయం 8గం.12ని. తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. గత 29రోజులుగా ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. గత నెల 8వ తేదీన కరోనాతో ఆమె ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆపై కరోనా నుంచి రికవరీ అయిన ఆమె.. వెంటిలేటర్‌పై కొన్నాళ్లు చికిత్స పొందారు. ఈ క్రమంలో ఆమె కోలుకుంటున్నట్లు వైద్యులు ఈమధ్యే ప్రకటించారు కూడా. అయితే పరిస్థితి విషమించడంతో ఆమెకు మళ్లీ వెంటిలేటర్ మీదే చికిత్స అందించారు. 1942లో గాయనిగా ఆమె కెరీర్ ప్రారంభించారు. నౌషాద్ నుంచి ఏఆర్ రెహమాన్ వరకు.. ఎందరి సంగీతంలో ఆమె పాటలు పాడారు. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరున్న ఆమె.. దాదాపు 20 భాషల్లో 50 వేలకుపైగా పాటలు పాడారు. హిందీ చిత్రసీమలో లతా పాటలు నాటికి నేటికి శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. ఆమె లేరనే వార్తతో శోక సముద్రంలో మునిగిపోయారు సినీ సంగీత అభిమానులు. తెలుగు సినీ పరిశ్రమతో అనుబంధం తెలుగులో 1955 లో ఏఎన్నార్ ‘సంతానం’ కోసం నిదుర పోరా తమ్ముడా.. 1965 లో ఎన్టీఆర్ దొరికితే దొంగలు సినిమాలో శ్రీ వేంకటేశ పాట. 1988 లో నాగార్జున ఆఖరి పోరాటం సినిమాలో తెల్ల చీర కు పాట పాడారు. గానమే పరమావధిగా.. 1929 సెప్టెంబరు 28 తేదీన సుప్రసిద్ధ సంగీతకారుడు దీనానాథ్ మంగేష్కర్‌కు పెద్ద కుమార్తెగా జన్మించారు లత. అయిదవ ఏటనే తండ్రివద్ద సంగీత శిక్షణ ప్రారంభించిన లత సంగీతమే మరోలోకంగా జీవించారు. చిన్న తనంలోనే తండ్రి మరణించడంతో పదమూడేళ్ళ వయసుకే కుటుంబ పోషణ బాధ్యత లతపై పడింది. దీంతో సినీరంగంలోకి ప్రవేశించి 1942లో మరాఠీ చిత్రం పహ్లా మంగళ గౌర్లో కథానాయిక చెల్లెలుగా నటించి రెండు పాటలు పాడారు. ఆ తరువాత పలు చిత్రల్లో నటించారు కూడా. గిన్నిస్ బుక్‌లోకి.. 1947లో మజ్ బూర్ చిత్రంతో గాయనిగా లత ప్రస్థానంమొదలైంది. మహల్‌తో స్టార్డమ్ సంపాదించుకున్నారు. అతి తక్కువకాలంలోనే తన ప్రతిభతో ఉన్న శిఖరాల్ని అధిరోహించారు. పలు భాషల్లో పాటలు పాడిన ఆమె జనం గుండెల్లో లెజెండరీ సింగర్‌గా చెరగని ముద్ర వేసుకున్నారు. తొలిసారిగా 1955లో రామ్ రామ్ పవ్హనే అనే మరాఠా సినిమాకు సంగీత సారధ్యం వహించారు లతా. సాధి మనసే సినిమాకు గాను ఆమె ఉత్తమ సంగీత దర్శకురాలిగా మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ అవార్డును గెలుచుకున్నారు. ఈ సినిమాలోని ఐరనించియా దేవ తులా పాటకు ఉత్తమ గాయినిగా కూడ అవార్డు అందుకున్నారు లతా. 1948- 1978 వరకు 30వేల పాటలు పాడిన ఏకైక గాయనిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు సంపాదించుకున్నారు. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు దక్కించుకున్న లతాజీ భారతీయ సినీ రంగానికి చేసినవిశిష్ట సేవలకు భారత అత్యున్నత పురస్కారమైన భారత రత్న అవార్డుతో సత్కరించింది . అలాగే పద్మ భూషణ్ , పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు పలు జాతీయ అవార్డులు ఆమెను వరించాయి. ఎంఎస్ సుబ్బులక్ష్మి తరువాత భారత ప్రభుత్వం నుండి ఎక్కువ అత్యుత్తమ పురస్కారాలు అందుకున్న అరుదైన గాయకురాలిగా కీర్తి గడించారు. -
అందాల తార జయప్రద గురించి ఈ విషయాలు తెలుసా..?
ఆమె ఆరేసుకుంటే ప్రేక్షకుడు మనసు పారేసుకున్నాడు. ఈమెతోనే రజనీకాంత్ ‘ఇంక ఊరేల.. సొంత ఇల్లేల ఓ చెల్లెలా’ అన్నది. కమలహాసన్ కళ మద్యపు మురుక్కాలవలో పారుతుంటే ఈమె కదూ దానిని ‘సాగర సంగమం’ చేయించింది. ‘భారతీయ వెండితెర మీద అంత అందమైన ముఖం మరొకటి లేదు’ అని సత్యజిత్ రే పొగిడిన ఏకైక తెలుగు అందం జయప్రదది. ఆమె రాజకీయ ప్రస్థానం ఒకదారి. ఆమె నటనదే ప్రేక్షకుల గుండెదారి. జయప్రద... జయసుధ.. శ్రీదేవి తెలుగు సినీ జగత్తును ఏలిన ఈ ముగ్గురు హీరోయిన్లు ఒకటి రెండు సంవత్సరాల తేడాతో స్టార్లు అయ్యారు. తెలుగు మాట, తెలుగు ఆట, తెలుగు సౌందర్యం తెర మీద చూపారు. శ్రీదేవి గ్లామర్‌లో బెస్ట్. జయసుధ యాక్టింగ్‌లో బెస్ట్. జయప్రద ఇటు గ్లామర్, అటు యాక్టింగ్ రెంటిలోనూ బెస్ట్ అనిపించుకున్నారు. రాజమండ్రికి చెందిన లలిత రాణి ‘భూమి కోసం’ (1974)లో మొదటిసారి తెర మీద రెండు మూడు నిమిషాల సేపు కనిపించారు. ఒక పాట మధ్యలో ఒక వితంతువు తనను చెరబట్టే కామందును హతమారుస్తుంది. ఆ వితంతువు జయప్రద. మొట్టమొదటి వేషం అలాంటిది ఎవరూ వేయరు. కాని జయప్రద చేశారు. ఆ సినిమాలోనే పేరు మార్చుకుని అప్పట్లో ‘జయ’ ట్రెండ్ నడుస్తున్నందున జయప్రదగా మారారు. ఆమె పెదవి మీద పుట్టుమచ్చ ఉంటుంది. వెండితెర మీద ఒక అందమైన పుట్టుమచ్చగా ఆమె ప్రేక్షకులకు నచ్చింది. తరం మారుతున్నప్పుడు కొత్త తరం వస్తుంది. వాణిశ్రీ, లక్ష్మి, మంజుల, లత... వీరు సీనియర్లు అవుతున్న కొద్దీ కొత్తవాళ్లు కావాల్సి వచ్చారు. జయప్రద ఆ సమయంలోనే మద్రాసులో అడుగుపెట్టారు. ఏకంగా కె.బాలచందర్ దృష్టిలో పడ్డారు. ఆమె తమిళంలో తీసిన ‘అవల్ ఒరు తోడర్ కథై’లో సుజాత చేసిన పాత్రను జయప్రదకు ఆఫర్ చేశారాయన. సుజాతకు అప్పటికి తెలుగు రాదు. అచ్చతెలుగు అమ్మాయి ఉంటేనే బాగుంటుందని బాలచందర్ ఆలోచన. అందుకు జయప్రద సరైనది అని ఆయన భావించారు. ఒక మధ్యతరగతి గంపెడు సంసారాన్ని తన భుజాల మీద మోసే, తన కలలను చిదిమేసుకుని కుటుంబం కోసం బతికే ఒక సగటు ఆడపిల్ల కథ అది. దాని బరువు ఎక్కువ. జయప్రదది ఆ సమయానికి చిన్న వయసు. కాని ఆమె ఆ పాత్రను అర్థం చేసుకొని పోషించడంతో... ఒక్క కేరెక్టర్లోనే ప్రేమ, కోపం, ఆర్తి, అసహనం చూపడంతో జయప్రద స్టార్ అయ్యారు. ఆ సినిమాయే తెలుగులో రజనీకాంత్‌కు కూడా తొలి సినిమా. ఆ సినిమాలో ‘దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి పాట’... ఏసుదాస్‌కు, జయప్రదకు, రజనీకాంత్‌కు నేటికీ మిగిలిపోయింది. కె.బాలచందర్ దర్శకత్వంలో ఆమె ‘47 రోజులు’, ‘అందమైన అనుభవం’ చేశారు. కేన్సర్ పేషెంట్‌గా చేయడానికి ఎవరు ఒప్పుకుంటారు? జయప్రద తప్ప. ‘అడవి రాముడు’తో కె.రాఘవేంద్రరావు జయప్రదను కమర్షియల్ హీరోయిన్ను చేశారు. అప్పటికే జయప్రద కుటుంబం ఎన్.టి.ఆర్కు పరిచయం ఉంది. కొన్నాళ్ల క్రితం సెలవుల్లో వచ్చి ఆయన దగ్గర కూచుని కబుర్లు చెప్పిన స్కూల్ గర్ల్ ఇప్పుడు ఆయన పక్కనే హీరోయిన్ అయ్యింది. వేటూరి రాయగా కె.వి.మహదేవన్ స్వరపర్చగా బాలూ, సుశీల పాడిన ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ పాట జయప్రదను సకల ప్రేక్షకులకు పరిచయం చేసేసింది. జయప్రద అంటే ఒక సుందరమైన సౌందర్యవంతమైన రూపం. ప్రేక్షకులు అలానే కోరుకున్నారు. ఆమె నేటికీ అలానే ఉన్నారు. ఇప్పుడు ఆమె ఒక తెలుగు సినిమా లో నటిస్తున్నారు. మరోసారి జయప్రద జయప్రదంగా మన ముందుకు రావాలని కోరుకుందాం. – సాక్షి ఫ్యామిలీ -
వాల్తేరులో పుట్టిన అగ్గిబరాటా
ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియన్ సినిమాగా అందరూ కీర్తించే దేవికా రాణి మన వాల్తేరులో పుట్టింది. మరణించే నాటికి బెంగళూరులో 450 ఎకరాల విలువైన ఎస్టేట్‌ను వారసులు లేకపోవడం వల్ల ఎవరికి చెందాలో తేల్చక వదిలిపెట్టింది. ఆమె 1933లోనే తెర మీద ముద్దు సన్నివేశంలో నటించింది. దిలీప్ కుమార్‌ను స్టార్‌ను చేసింది. ఈ రాణి గురించి చాలామందికి తెలియని కొన్ని విశేషాలు... సాధారణంగా మగవాళ్లు లిఖించే చరిత్రలే నమోదవుతూ ఉండే సందర్భంగా హిందీ చిత్ర పరిశ్రమకు సంబంధించి కొత్తదార్లు, వేర్లూ వేసిన దేవికా రాణిని మాత్రం అందరూ మార్గదర్శిగా గుర్తించి గౌరవిస్తారు. ఆమెను ‘ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియన్ సినిమా’గా అభివర్ణిస్తారు. అందుకు కారణం ఆమె చేసిన ఘనమైన పనులే. వాల్తేరులో సంపన్న బెంగాలీ కుటుంబానికి దేవికా రాణి జన్మించింది. ఆమె తండ్రి కల్నల్ మన్మథనాథ్ చౌదరి జన్మతః జమీందార్. తల్లి లీలాదేవి చౌదరి సాక్షాత్ రవీంద్రనాథ్ టాగూర్‌కు మేనకోడలు. అందుకని దేవికా రాణి 9 ఏళ్లకే లండన్ వెళ్లి అక్కడి బోర్డింగ్ స్కూల్లో చదువుకుంది. అక్కడే పరిచయమైన బారిస్టర్ చదువు చదివి సినిమా దర్శకుడైన హిమాంశును ప్రేమించింది. అతని కోరిక మేరకు సినిమా నటిగా మారింది. దానికి ముందే ఆమె సినిమా కళను అభ్యసించింది. మొత్తం మీద సినిమాకు సంబంధించిన అన్ని క్రాఫ్ట్‌ల అధ్యయనం తర్వాత ఆ జంట ఇండియా తిరిగి వచ్చి ముంబైలో ‘బాంబే టాకీస్’ను ప్రారంభించి సినిమాలు తీసి చరిత్ర సృష్టించారు. తెర మీద ముద్దు వెండి తెర మీద తొలి ముద్దు సన్నివేశంలో నటించిన భారతీయ నటి దేవికా రాణీయే. 1933లో తీసిన ‘కర్మ’ సినిమా కోసం భర్త హిమాంశును ఆమె నాలుగు నిమిషాలు ముద్దు పెట్టుకుంది. ఇప్పటికీ కూడా ఇది రికార్డు. ఆ తర్వాత అశోక్ కుమార్‌తో కలిసి ఆమె నటించిన ‘అఛూత్ కన్య’ సూపర్‌హిట్ అయ్యింది. ఆ తర్వాత అశోక్ కుమార్‌తో ఆమె చాలా సినిమాల్లో యాక్ట్ చేసింది. అశోక్ కుమార్ ఆ సంస్థలో భాగస్వామి కూడా అయ్యాడు. దేవికా రాణి నటుడు దిలీప్ కుమార్‌ను హీరోను చేసింది. ఆ రోజుల్లో (1944) దిలీప్ కుమార్‌కు 250 రూపాయలు జీతం ఆఫర్ చేస్తే అతను అది నెలకా సంవత్సరానికా తేల్చుకోలేక సతమతమయ్యాడు. కాని ఆమె ఇచ్చింది నెలకే! అప్పటికి రాజ్ కపూర్‌కు సంవత్సరమంతా కలిపి ఆర్.కె. స్టూడియోలో 150 రూపాయల జీతం వచ్చేది. అలాంటి ప్రభావం దేవికా రాణిది. అశోక్ కుమార్, దేవికారాణి భర్తతో విడిపోయి భర్త హిమాంశు జీవించి ఉండగానే అతనితో వైవాహిక బంధంలో ఉండకుండా కేవలం ప్రొఫెషనల్ బంధంలోనే ఉండిపోయింది దేవికా రాణి. భర్త చనిపోయాక కొన్నాళ్లకు ఆమె రష్యన్ చిత్రకారుడు శ్వెతోస్లవ్ రోరిచ్‌ను వివాహం చేసుకుని మనాలిలో ఉండిపోయింది. ఆ సమయంలో ఆమెకు నెహ్రూ కుటుంబం సన్నిహితమైంది. ఆ తర్వాత ఆ జంట బెంగళూరు వచ్చి 450 ఎకరాల ఎస్టేట్ కొని అందులో ఎవరినీ కలవక జీవించారు. ఆమె దగ్గర పని చేసిన మేనేజర్ ఒకామె ఆమె ఎస్టేట్ విషయాలు గోల్మాల్ చేసిందనే విమర్శలు వచ్చాయి. దేవికా రాణి మరణించాక ఆ ఎస్టేట్‌ను సొంతం చేసుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం పెద్ద యుద్ధమే చేసింది. చివరకు సొంతం చేసుకుంది. వెండితెర గతిని మార్చిన దేవికా రాణి ముంబైకి, వెండితెర వ్యక్తులకు దూరంగా జీవించడం ఒక విచిత్రం. 1994లో ఆమె మరణించాక ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. -
పైడి జయరాజ్ సేవలు మరువలేనివి
‘‘తెలంగాణ ముద్దుబిడ్డ, తొలి తరం ఇండియన్ సూపర్ స్టార్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుగ్రహీత పైడి జయరాజ్ భారతీయ సినిమాకు అందించిన సేవలు మరువలేనివి. ఆయన పేరు తెలుగు చిత్ర పరిశ్రమలో మరింత మారుమ్రోగేందుకు నా వంతు కృషి చేస్తా’’ అని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పైడి జయరాజ్ 111వ జయంతి ఉత్సవాలు హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ‘జై తెలంగాణ ఫిల్మ్ జేఏసీ’ చైర్మన్ పంజాల జైహింద్ గౌడ్ సారధ్యంలో జరిగాయి. ఈ సందర్భంగా పంజాల జైహింద్ గౌడ్ మాట్లాడుతూ– ‘‘తెలంగాణ లో సినిమా పరిశ్రమకు ఇచ్చే అవార్డులు పైడి జయరాజ్ పేరిట ఇవ్వాలి. అంతేకాకుండా హైదరాబాద్–కరీంనగర్ హైవేకి పైడి జయరాజ్ హైవేగా నామకరణం చేయాలి’’ అని డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవడు ఎన్.వి. సుభాష్, ఎం.ఎల్.సి. నారపురాజు రామచంద్రరావు, నటుడు బాబూమోహన్, ‘తెలుగు నిర్మాతల మండలి’ ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్, ‘ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్’ అధ్యక్షులు మోహన్ గౌడ్, హీరో పంజాల శ్రావణ్ కుమార్ గౌడ్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. -
నంబర్ వన్
ఇండియన్ సినిమా అండ్ టెలివిజన్ సిరీస్‌కు సంబంధించి ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎమ్‌డీబీ) వెబ్సైట్ ఈ ఏడాదికి సంబంధించిన ఇండియన్ సెలబ్రిటీస్ జాబితాను విడుదల చేసింది. ఇందులో తొలి స్థానంలో నిలిచారు హీరోయిన్ ప్రియాంకా చోప్రా. రెండో స్థానంలో దిశా పటానీ, మూడో స్థానాన్ని హృతిక్ రోషన్ కైవసం చేసుకున్నారు. కియారా అద్వానీ, అక్షయ్ కుమార్, సల్మాన్‌ఖాన్, ఆలియా భట్, కత్రినా కైఫ్, రకుల్‌ప్రీత్ సింగ్, కత్రినా కైఫ్ వరుస క్రమంలో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. దక్షిణాది నుంచి కథానాయిక రకుల్‌ప్రీత్ సింగ్ ఒక్కరే ఈ జాబితాలో చోటు సంపాదించుకోవడం విశేషం. ఐఎమ్‌డీబీ ప్రోస్టార్ మీటర్ ర్యాంకింగ్స్, ఐఎమ్‌డీబీ పేజ్ వ్యూయర్స్ వంటి అంశాలను ఆధారంగా తీసుకుని ఈ జాబితాను విడుదల చేయడం జరిగిందని ఐఎమ్‌డీబీ ప్రతినిధి పేర్కొన్నారు. -
‘భారతీయ సినిమాలను నిషేధిస్తున్నాం’
ఇస్లామాబాద్ : పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం మెరుపు దాడులు చేయడాన్ని పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతోంది. అంతర్జాతీయ సమాజం నుంచి తమకు మద్దతు లభించకపోవడంతో ఇప్పటికే సరిహద్దులో.. పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా భారతీయ సినిమాలపై మరోసారి నిషేధం విధించాలని పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మెరుపు దాడుల నేపథ్యంలో తమ దేశంలో భారత సినిమాలను ఆడనివ్వబోమని పాక్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ హుస్సేన్ ప్రకటించారు. ఈ మేరకు... ‘ సినిమా ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ఇండియన్ సినిమాను బాయ్‌కాట్ చేసింది. ఇకపై పాకిస్తాన్లో ఒక్క భారతీయ సినిమా కూడా విడుదల కాదు. అదేవిధంగా భారత్‌లో నిర్మించిన ప్రకటనల ప్రదర్శన వ్యతిరేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు’ అని ట్వీట్ చేశారు. కాగా 40 మందికి పైగా భారత జవాన్లను పొట్టబెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడిని నిరసిస్తూ.. పాక్ నటులపై బాలీవుడ్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇక మెరుపుదాడుల అనంతరం పాక్ నటుల వీసాలను నిరాకరించాలని సినీ వర్కర్ల సంఘం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశారు. అజయ్ దేవగణ్ వంటి కొంతమంది హీరోలు తమ సినిమాలను పాకిస్తాన్లో విడుదల చేయమని స్వచ్ఛందంగానే ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ తాజా నిర్ణయం కారణంగా పాకిస్తాన్ నటులకే ఎక్కువ నష్టం ఉంటుంది గానీ భారతీయ సినిమాకు పెద్దగా ఇబ్బంది కలిగే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. Cinema Exhibitors Association has boycotted Indian content, no Indian Movie ll be released in Pakistan. Also have instructed PEMRA to act against Made in India Advertisements. #PakistanTayarHai https://t.co/9BPo6LIsVB — Ch Fawad Hussain (@fawadchaudhry) February 26, 2019 -
నేనూ.. మృణాల్‌దా
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన భారతీయ సినీదర్శకులు మృణాల్ సేన్ డిసెంబర్ 30న తొంభై ఐదేళ్ల వయసులో కన్నుమూశారు. అప్పటికి కొన్నాళ్లుగా ఆయన నడవలేని స్థితిలో ఉన్నారు. సేన్ చివరి శ్వాసకు కొన్ని రోజుల ముందు నటి నందితాదాస్ ఆయన్ని ఇంటికి వెళ్లి కలిశారు. ఈ సంగతిని ఆయన మరణానంతరం.. నివాళిలో రాస్తూ, ‘నిశ్శబ్ద ఆత్మీయత’ అంటూ ఆయనతో తనకున్న ఇరవై ఏళ్ల అనుబంధం గురించి నందిత వెల్లడించారు. ఆ నివాళిలోని విశేషాంశాలివి. ‘‘మృణాల్సేన్ని కలవకపోతే నా కోల్‌కతా ట్రిప్ పూర్తి అయినట్లు అనిపించదు నాకు. చివరిసారిగా ఆయనను నేను 2018 నవంబరు 11 న ఇంటికి వెళ్లి కలిశాను. అది కూడా మా అబ్బాయిని వెంట తీసుకుని వెళ్లాను. అప్పుడు కోల్‌కతాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతోంది. నన్ను చూసిన ఆయన నా వైపు వచ్చి ఆప్యాయంగా నా చేతిని గట్టిగా పట్టుకున్నారు. ఆ రోజంతా ఆయన సమక్షంలోనే గడిపాను. ఇప్పుడిక ఇటువంటి ఆప్యాయతతో కూడిన నిశ్శబ్దాలు లేవు. ఆ రోజున నన్ను.. నేను నటించిన ‘మంటో’ సినిమా గురించి అడిగారు. మా అబ్బాయి చదువు గురించి తెలుసుకున్నారు. ఆయన దగ్గర సెలవు పుచ్చుకుని బయలుదేరడానికి ముందు, ఆయనతో ఫొటోలు తీయించుకున్నాను. అవే ఆయనతో గడిపే ఆఖరి క్షణాలు అవుతాయని నేనెలా ఊహించగలను? ఆయన మౌనంగా నిశీధిలోకి వెళ్లిపోయారని తెలిసి నా మనసు మూగబోయింది. ప్రేమ మీద నమ్మకం కలిగేది మృణాల్దాతో 20 సంవత్సరాలుగా నా హృదయం ఆప్యాయతను పెనవేసుకుని ఉంది. ఆయన జీవిత భాగస్వామి ‘గీతాదీ’ నిజంగానే ఆయన జీవితంలో భాగస్వామ్యం వహించారు. ఆయనకు బలమైన సహచరిగా నిలిచారు. ఆయన మౌనంగా ఉంటే, ఆవిడ ఆ నిశ్శబ్దాన్ని తన చిరునవ్వుతో కళకళలాడించేవారు. వారి ప్రేమానురాగాలు, ఒకరిని ఒకరు గౌరవించుకోవడం చూస్తుంటే, నాకు నిజమైన ప్రేమ మీద నమ్మకం కలిగేది. రెండు సంవత్సరాల క్రితం గీతాదీ మమ్మల్ని వదిలేసి, మృణాల్దాని ఒంటరిని చేశారు. అప్పుడే ఆయన మనసు, ఆత్మ ఆవిడతో వెళ్లిపోయాయి. ఆవిడ నిష్క్రమణతో నిత్యం తనను వెన్నంటి ఉన్న ఆత్మవిశ్వాసం కూడా నిష్క్రమించిపోయింది. పారితోషికం ఇవ్వలేనన్నారు నాకు మృణాళ్‌దా పరిచయం అయిన రోజు నుంచి ఆయన నాతో ‘‘నేను నీతో ఒక సినిమా తీయబోతున్నాను. నువ్వు నాకు స్మితాజీని గుర్తు చేస్తున్నావు. ఒక నటిగా కాదు, ఒక వ్యక్తిగా ఆవిడ నాకు గుర్తుకు వస్తుంది’’ అనేవారు. 2002లో ఎట్టకేలకు ఆయన నాతో చిత్రం చేశారు, ఆమార్ భువన్. అదే ఆయన చివరి సినిమా. బెంగాల్‌లోని ఒక చిన్న గ్రామంలో నివసించే ఒక ముస్లిం కుటుంబానికి చెందిన కథ ఇది. ఇదొక లవ్ ట్రయాంగిల్ కథ. అందులో నేను సకినా పాత్ర ధరించాను. ఇద్దరు అన్నదమ్ములకి, సకినాకి మధ్య జరిగిన సంఘర్షణ ఈ కథ. షూటింగ్ ప్రారంభం కావడానికి పదిహేను రోజుల ముందు, మృణాళ్‌దా నాకు ఫోన్ చేశారు, నిర్మాతలు ముస్లిం కుటుంబానికి చెందిన కథకు డబ్బులు పెట్టడానికి అంగీకరించట్లేదన్నారు. నాకు చాలా బాధ వేసింది. ఆ కథ గుజరాత్ అల్లర్లు జరిగిన రోజులు కావడంతో, మత విద్వేషాలు బయలుదేరతాయని భావించి ఉంటారు. ముస్లిం సెట్టింగ్ వేసినంత మాత్రాన గొడవలేమీ జరిగిపోవని నేను అన్నాను. ఆయన నా మాటలకు స్పందిస్తారని అనుకోలేదు. ‘‘మనం మన దగ్గర ఉన్న డబ్బుతోనే ఈ సినిమా తీసేద్దాం. నేను నీకు పారితోషికం ఇచ్చుకోలేను’’ అన్నారు. ఇచ్ఛామతి నది ఒడ్డున టాకీ అనే గ్రామంలో షూటింగ్ ప్రారంభించాం. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు షూటింగ్ పూర్తయ్యాక, రిలాక్సేషన్ కోసం ఎవరో ఒకరి ఇంటికి వెళ్లేదాన్ని. ఆ రోజు నేను టాకీ గ్రామానికి చేరుకునేసరికి, గ్రామమంతా ఈ షూటింగ్లో ఇన్వాల్వ్ అయ్యారని అర్థం చేసుకున్నాను. మాలో ఐదుగురు.. మృణాళ్‌దా, ప్రధాన తారాగణం.. ఒక గెస్ట్ హౌస్‌లో ఉన్నాం. దీనికి ఎదురుగా ఇచ్ఛామతి నది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తూ ఉంటుంది. నదికి ఆవలి ఒడ్డున బంగ్లాదేశ్ ఉంది. మృణాల్‌దా బంగ్లాదేశ్‌లో సూర్యోదయం, భారతదేశంలో సూర్యాస్తమయం చూశారు. ఇందుకు ప్రత్యేక కారణం ఉంది. మృణాల్‌దా ఫరీద్పూర్ (బంగ్లాదేశ్)లో జన్మించారు. అప్పుడప్పుడు మృణాల్‌దా తన జీవితానికి సంబంధించిన ఎన్నో కథలు చెప్పేవారు. ఆయనకు ప్రతి విషయం మీద ఆసక్తి ఎక్కువ. డిన్నర్లో మేం తినే చేప గురించి కూడా తెలుసుకునేవారు. తన మనసుకు నచ్చిన ప్రతి విషయాన్ని నాతో పంచుకునేవారు, కళాకారులంటే ప్రత్యేకమైన వారు కాదు, వారు కూడా నిత్య జీవితంలో భాగమే అని ఆయన నమ్మకం. ఆయన పెట్టిన జ్ఞానభిక్షే నేను ఆయన ఇంటికి చేరేసరికి, ఆ ఇల్లు గీతాదీ, మృణాళ్‌దా లేకుండా నిర్జీవంగా కనిపించింది. కాని నేను అక్కడకు వెళ్లాను. ఆయనను కడసారి చూడటానికి మాత్రమే కాదు, ఆయన ఏకైక కుమారుడు కునాల్ సేన్‌ను కలవడానికి. తండ్రి ఔన్నత్యాన్ని, తల్లి శక్తిని తనలో ఇముడ్చుకున్నాడు కునాల్సేన్. కునాల్ తన తండ్రిని బొంధు (స్నేహితుడు) అని పిలిచేవాడు. ఆయన కునాల్‌కి మాత్రమే కాదు ఎంతో మందికి బొంధు. అందరికీ కాకపోవచ్చు. నాకు మాత్రం ఆయన అసలుసిసలైన స్నేహితుడు, మార్గదర్శకుడు, గురువు.. ఇంకా ఎన్నో. సామాన్యులకు సంబంధించిన కథలను చిత్రాలుగా తీయడమే మనం ఆయనకు సమర్పించే నిజమైన నివాళి. మృణాల్‌దా మహాభినిష్క్రమణంతో ఒక శకం ముగిసింది. నేను ఆయనను తరచుగా కలిసి ఉండకపోతే, ఎంతో పరిజ్ఞానాన్ని సంపాదించుకోలేకపోయి ఉండేదాన్ని. ఆయన ఎప్పటికీ జీవించి ఉండాలనేదే నా స్వార్థమైన కోర్కె. ఆయనను, ఆయన పనులను మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. – స్వేచ్ఛానువాదం: వైజయంతి పురాణపండ నిరాడంబర జీవితం... మృణాళ్‌దా చాలా సామాన్య జీవితం గyì పారు. మరణంలోను అదే ఎంచుకున్నారు. తనకు అభిమాన సంఘాలు వద్దని తన కుటుంబీకులకు స్పష్టంగా చెప్పారు. ఆయన స్థాయికి ఎంతో గౌరవం పొందవచ్చు. గన్ శాల్యూట్, లక్షలాది మంది అభిమానుల ప్రేమ, బొకేలు, ప్రణామాలు అన్నీ అందుకోవచ్చు. ఆయన అవేవీ వద్దనుకున్నారు. ఆయనను ప్రేమించేవార ంతా ఆయన కోర్కెను నెరవేర్చారు. ఆయన అంతిమయాత్రలో పాల్గొన్న వారంతా నిశ్శబ్దంగా ఆయన వెంట నడిచారు. ఒక సామాన్య వ్యక్తిలాగే ఆయన అంతిమయాత్ర ముగిసింది. -
ఆస్కార్ బరిలో ‘విలేజ్ రాక్ స్టార్స్’
సినిమా పండగల్లో అతి పెద్ద పండగ ఆస్కార్ అవార్డుల పండగ. ప్రపంచంలో అన్ని ప్రాంతాల సినిమాలను కొలమానంగా భావించే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు. ఈ సంబరాలు జరిగేది ఫిబ్రవరి లేదా మార్చి నెలలో అయినా హడావిడి సెప్టెంబర్ అక్టోబర్ నెలల నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే.. ఆస్కార్ నామినేషన్ ఎంట్రీ పోటీకి బరిలో నిలిచే సినిమాలను ఆయా దేశాలు అనౌన్స్ చేస్తుంటాయి. ఈసారీ స్టార్ట్ అయింది. 2018కిగాను ఇండియన్ సినిమా తరఫున ఆస్కార్ అఫీషియల్ ఎంట్రీగా ఎంపికైన చిత్రం ‘విలేజ్ రాక్‌స్టార్స్’ అని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. ‘విలేజ్ రాక్‌స్టార్స్’ ఒక అస్సామీ సినిమా. కొత్త దర్శకురాలు. పొదుపైన బడ్జెట్. సినిమా తీసింది చిన్న కెమెరాతోనే. మొత్తం దర్శకురాలు రీమా దాస్ స్వగ్రామమే. దాదాపు 28 సినిమాలు ఉన్న లిస్ట్‌లో, వచ్చే ఏడాది జరిగే ఆస్కార్స్‌కి ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో మన దేశం తరఫున అఫీషియల్‌గా పంపబోతున్న సినిమా ‘విలేజ్ రాక్‌స్టార్స్’. ఈ సినిమా విషయానికి వస్తే.. రీమా దాస్ స్వీయ దర్శకత్వం వహించి, ఎడిటింగ్ చేసిన అస్సామీ చిత్రం. రీమా దాస్ ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకర్ కూడా కాదు. సెల్ఫ్ మేడ్ ఫిల్మ్ మేకర్. ఈ ఏడాది వచ్చిన నేషనల్ అవార్డ్లోనూ ‘విలేజ్ రాక్‌స్టార్స్’ సత్తా చాటింది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, చైల్డ్ ఆర్టిస్ట్, ఎడిటింగ్ వంటి పలు విభాగాల్లో అవార్డ్స్ గెలుచుకుంది. అంతేనా పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో కూడా మంచి ప్రశంసలు పొందింది. కథ : ‘విలేజ్ రాక్‌స్టార్స్’ సినిమా కథ చాలా సింపుల్ లైన్స్‌లో ఉంటుంది. దును అనే చిన్నారి చయాగాన్ గ్రామంలో తన తల్లి, తమ్ముడుతో కలిసి ఉంటుంది. సంతలో అమ్మకు స్నాక్స్ అమ్మే పనిలో సాయంగా ఉంటుంది. ఒకసారి గ్రామంలో జరిగిన బ్యాండ్ పర్ఫార్మెన్స్ చూసి మంత్రముగ్ధురాలైన దును ఎలా అయినా గిటార్ కొనుక్కోవాలనుకుంటుంది. అట్లీస్ట్ సెకండ్ హ్యాండ్దైనా ఫర్వాలేదనుకుంటుంది. కామిక్ బుక్స్ చదివి తను కూడా ఓ బ్యాండ్ ఏర్పాటు చేయాలనుకుంటుంది. రూపాయి రూపాయి పోగేసుకుంటుంది. ఇంతలో వరదలు వారి పంటను పూర్తిగా నాశనం చేస్తాయి. అప్పుడు దునుకి తనకు ముఖ్యమైనదేంటో ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సందర్భంలో దును తెలివిగా ఏం చేసిందనేదే సినిమా కథ. దునుగా ప్లే చేసిన బన్నితా దాస్ ‘బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్’గా అవార్డు పొందింది. ఈ విలేజ్ రాక్‌స్టార్స్ మొత్తం దేశాన్నే తమ గ్రామం వైపు తిరిగేలా చేసింది. ఈ కథ ప్రేక్షకుల మనసులను హత్తుకుంది. విశేషం ఏంటంటే.. అస్సామీ పరిశ్రమలో దాదాపు 29 ఏళ్ల తర్వాత జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రం ఇది. ఆ రకంగా అస్సామీ పరిశ్రమకు ఈ సినిమా ఓ తీయని అనుభూతిని పంచితే, ఇప్పుడు ఏకంగా ఆస్కార్ నామినేషన్ ఎంట్రీకి ఎంపిక కావడం మరో మంచి అనుభూతిని మిగ్చిలింది. ‘‘ఓ వైపేమో ఆనంద భాష్పాలు మరోపక్క మనసు గర్వంతో నిండిపోయి ఉంది. చాలా వినయంగా ఈ ఎంట్రీని యాక్సెప్ట్ చేస్తున్నాను. ఈ విషయం జీర్ణించుకోవడానికి కొంచెం సమయం పట్టేలా ఉంది’’ అని ట్వీటర్లో పేర్కొన్నారు దర్శకురాలు రీమా దాస్. మరి మన దేశం తరఫున ఆస్కార్‌కు వెళ్తున్న ఈ చిత్రం ఆస్కార్ బృందాన్ని మెప్పించి, నామినేషన్ దక్కించుకుని, చివరికి అవార్డునూ సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి. ఏది ఏమైనా అంత దాకా వెళ్లడమే గొప్ప విషయం. టైటిల్ విలేజ్ రాక్‌స్టార్స్ అయినా మొత్తం గ్లోబల్ విలేజ్ సెలబ్రేట్ చేసుకునే ఈ పండగలో తన సత్తా చాటితే మాత్రం చరిత్రే అవుతుంది. ఫారిన్ క్యాటగిరీలో హిందీ చిత్రం ‘మదర్ ఇండియా’ నుంచి ఆస్కార్ వైపు ఆశగా చూస్తున్న మనకు ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. గతేడాది ఆస్కార్‌కు అఫీషియల్ ఎంట్రీగా వెళ్లిన హిందీ చిత్రం ‘న్యూటన్’ నామినేషన్ దక్కించుకోలేకపోయింది. పోటీలో నిలిచిన 28 సినిమాలు ఆస్కార్ నామినేషన్స్‌కు భారతదేశం నుంచి ఫిల్మ్ ఫెడరేషన్ పరిగణనలోకి తీసుకున్నవి సుమారు 28 సినిమాలు ఉన్నట్టు సమాచారం. అందులో మన ‘మహానటి’, సంజయ్‌లీలా భన్సాలీ ‘పద్మావత్’, నందితా దాస్ ‘మంటో’, సూజిత్ సర్కార్ ‘అక్టోబర్’, లవ్సోనియే’ ప్యాడ్‌మ్యాన్, తుమ్బాద్ హల్కా, పీకు వంటి సినిమాలు ఫారిన్ క్యాటగిరీలో జరిగిన రేసులో పోటీపడ్డాయి. అవార్డు ఆస్కారం ఎప్పుడు? మన దేశం నుంచి ఆస్కార్ అవార్డ్స్‌లో ‘ఉత్తమ విదేశీ చిత్రం’ విభాగానికి సినిమాలను పంపడం మొదలైంది 1957లో. అప్పటి నుంచి కేవలం మూడు సినిమాలు (మదర్ ఇండియా, సలామ్ బాంబే, లగాన్) మాత్రమే నామినేషన్ దక్కించుకున్నాయి. 1986లో నామినేషన్స్‌కు కె.విశ్వనాథ్ ‘స్వాతిముత్యం’ ఆస్కార్ నామినేషన్ ఎంట్రీ రేస్ వరకూ వెళ్లింది కానీ నామినేషన్ దక్కించుకోలేదు. అంతదాకా వెళ్లి, నామినేషన్ దక్కించుకున్నా అవార్డు వరకూ రాలేకపోతున్నాం. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’కి ఏఆర్ రెహమాన్, రసూల్ పూకుట్టి.. ఇలా మనవాళ్లు ఆస్కార్ తెచ్చినా, అది మన దేశం సినిమా కాదు. బ్రిటిష్ ఫిల్మ్ కింద వస్తుంది. రీమా దాస్ -
హోటల్ పుష్పక్
ఇండియన్ సినిమా చరిత్రలో ఒక ఒక గొప్ప ప్రయోగం అనిపించుకున్న ఓ సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా లేని ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం... అతడు చాలాకాలంగా నిరుద్యోగంలోనే బతుకుతున్నాడు. ఆనంద భవన్ అనే పాతబడ్డ అపార్ట్మెంట్లో చిన్న పెంట్‌హౌస్‌లో ఉంటాడతను. తినడానికి కాదు కదా, కనీసం టీ తాగడానికి కూడా అతని దగ్గర డబ్బుల్లేవు. ‘వేకెన్సీ’ అన్న బోర్డున్న ప్రతిచోటకీ కాలినడకనే వెళ్లి వస్తున్నాడు. ఎక్కడా ఉద్యోగం దొరకడం లేదు. ఒకరోజు రాత్రివరకూ రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాడు. చీకట్లో రోడ్డు పక్కన, మురికి కాలువ దగ్గర ఒక మనిషి బాగా తాగి పడిపోయి కనిపించాడతనికి. ఆ మనిషి ఖరీదైన బట్టలు వేసుకొని ఉన్నాడు. స్పృహ లేదు. అతడు ఆ మనిషిని పూర్తిగా పరిశీలించి, ఆ మనిషి జేబులో ఉన్న ఓ ఫైవ్‌స్టార్ హోటల్లోని గది తాళంచెవిని తీసుకున్నాడు. తాగి పడిపోయిన ఆ వ్యక్తిని ఎత్తుకొని తీసుకెళ్లి ఆనంద భవన్‌లోని తన గదిలో కట్టిపడేశాడు. అతడు ఆ తాళంచెవిని మార్చి మార్చి చూసుకున్నాడు. ఈరోజున్న అతడి ఆర్థిక పరిస్థితికి అలాంటి ఒక హోటల్లోకి అడుగు కూడా పెట్టలేడు. అలాంటిది అదే హోటల్లో లగ్జరీ స్వీట్లో ఉండబోతున్నాడు ఇప్పుడు. పుష్పక్ హోటల్. స్వీట్ నంబర్ 3039. తాగి రోడ్డుమీద పడిపోయిన వ్యక్తి గత కొద్దికాలంగా ఇక్కడే ఉంటున్నాడు. అతడు ఆ తాళంచెవిని తీసుకొని స్వీట్‌లోకి అడుగుపెట్టాడు. ఇక్కడి వాతావరణం అంతా అతడికి కొత్తగా ఉంది. చుట్టూ తిరిగి చూశాడు. చాలారోజులుగా ఖాళీ కడుపుతో ఉన్నవాడు, ఇవ్వాళ మాత్రం కావాల్సింది తెప్పించుకొని తిన్నాడు. బాత్‌టబ్‌లో స్నానం చేశాడు. కొద్దిసేపటికి బాల్కనీకి వచ్చి పరిసరాలను గమనించాడు. బాల్కనీ నుంచి చూస్తే ఆమె కనిపించింది. చాలా రోజుల తర్వాత ఆమెను చూశాడతను. చెయ్యి ఊపాడు. కాసేపు ఇద్దరూ సైగలతోనే మాట్లాడుకున్నారు. అంతకుముందు ఆమెనతను రెండుసార్లు చూశాడుగాని ఇలా ఇద్దరూ ఎప్పుడూ మాట్లాడుకోలేదు. ఆ తర్వాత అతను తిరిగొచ్చి పడగ్గది మొత్తం వెతికితే చాలా డబ్బులు దొరికాయి. అవన్నీ ఒక దగ్గర దాచిపెట్టుకున్నాడు. కొత్త బట్టలు వేస్కొని, చాలాకాలంగా మురికిపట్టి ఒంటిమీదనే ఉన్న బట్టలను మంచం కిందకి విసిరిపారేశాడు. అతని వ్యవహారం మొత్తం మారిపోయింది. స్టయిల్ కళ్లద్దాలు పెట్టుకొని తనని తాను చూసుకొని మురిసిపోయాడు. ఆనంద భవన్‌కు వెళ్లి తాను కిడ్నాప్ చేసిన వ్యక్తిని చూసొస్తున్నాడు. ఈ హోటల్లో సకల వసతులతో సుఖంగా ఉంటున్నాడు. అతడు పరిచయం చేసుకున్న అమ్మాయి ఒక పెద్ద మెజీషియన్ కూతురు. ఆ హోటల్లో ఆయన తన ప్రదర్శనలిస్తున్నాడు. ఆ ఈవెంట్లోనే ఒక విషయంలో ఆమె అతణ్ని తప్పుగా అర్థం చేస్కొని చీ కొట్టింది. కోపంతో అతడి చెంప మీద గట్టిగా కొట్టింది. అతడు ఆ రాత్రంతా ఆమె తనను ఎందుకు కొట్టిందా అని ఆలోచిస్తూ నిద్ర కూడా పోలేదు. ఇదే సమయానికి ఆ హోటల్లో ఒక ప్రొఫెషనల్ కిల్లర్ దిగాడు. కొద్దిరోజులుగా ఇక్కడే ఉంటున్న ఓ వ్యక్తిని హత్య చేయమంటూ ఆ కిల్లర్‌కు సుపారీ అందింది. ప్రొఫెషనల్ కిల్లర్ చంపాల్సిన వ్యక్తి 3039లో ఉంటున్నాడు. ఆమె అదే రోజు, అదే ఈవెంట్లో తన తప్పు తెలుసుకుంది. అతణ్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు తనని తాను తిట్టుకుంది. అతడు ఎదురైతే ‘సారీ’ చెప్పాలని ఎదురుచూస్తోంది.3039లో ఉన్న వ్యక్తి ఎదురైతే అతణ్ని చంపాలని ప్రొఫెషనల్ కిల్లర్ ఎదురుచూస్తున్నాడు. చిన్న టీ స్టాలు నడుపుకుంటూ జీవితాన్ని మొదలుపెట్టి, పుష్పక్ అంతటి ఫైవ్‌స్టార్ హోటల్‌ను నిర్మించిన వ్యక్తి చివరిసారిగా తన హోటల్‌ను ఆసాంతం చూసుకొని కన్నుమూశాడు. ప్రొఫెషనల్ కిల్లర్‌కు అవకాశం దొరికింది, 3039 వ్యక్తిని చంపడానికి. ఆమెకూ ఒక అవకాశం దొరికింది, అతణ్ని కలిసి ‘సారీ’ చెప్పడానికి. ఆమె అతనికి ఎదురుపడి అతని చెయ్యందుకొని కళ్లతోనే సారీ చెప్పేసింది. రోజులు గడుస్తున్నాయి. ఇద్దరికీ మళ్లీ మళ్లీ కలిసే అవకాశాలు తక్కువే అయినా, ఇద్దరూ ఒకరికొకరు బాగా దగ్గరయ్యారు. ప్రేమలో పడిపోయారు. 3039 వ్యక్తిని చంపడానికి ప్రొఫెషనల్ కిల్లర్ అన్ని ప్లాన్స్ గీసుకుంటున్నాడు. రిహార్సల్స్ చేస్తున్నాడు. మంచు కత్తిని కూడా తయారుచేసుకున్నాడు. అతడికి ఆమె మరింత దగ్గరవుతోంది. ఇద్దరూ కలిసి సినిమాలకు వెళుతున్నారు. షికార్లు తిరుగుతున్నారు. అతడామెకు ఖరీదైన బహుమతులు కొనిపెడుతున్నాడు. ఎంత ఖర్చుపెడుతున్నా అతని దగ్గర డబ్బులు మాత్రం అయిపోవడం లేదు. తాను ఆనంద భవన్లో ఉండే, టీ తాగడానికి కూడా డబ్బుల్లేని ఒక నిరుద్యోగ యువకుడినని అతడు మరచిపోయాడు. ప్రొఫెషనల్ కిల్లర్ అతణ్ని చంపడానికి అతని వెనకే చాటుగా వెంబడిస్తున్నాడు. అతడు దీన్ని పసిగట్టాడు. తననెవరో గమనిస్తున్నారని తెలుసుకొని జాగ్రత్తగా ఉంటున్నాడు. ఆ ప్రొఫెషనల్ కిల్లర్ ఎటువైపు వెళుతున్నాడో గమనించి, తనూ వెనకాలే వెళ్లి చూశాడు. అప్పుడు తెలిసింది అతనికి, 3039లో ఉంటున్న వ్యక్తిని చంపడానికి ఒక పెద్ద ప్లాన్ నడుస్తోందని. ఒంటరిగా రోడ్డు మీద నిలబడి చాలాసేపు చుట్టూ ప్రపంచాన్ని చూశాడతను. తాను ఎవరి జీవితాన్నో బతుకుతున్నాడని అర్థమయ్యాక తన మీదే తనకు అసహ్యమేసింది. ఈ డబ్బులో బతకడం అతని వల్ల కాలేదు. హోటల్లో మంచం కిందికి విసిరేసిన తన బట్టలు తీసి వేసుకున్నాడు. దాచిపెట్టుకున్న డబ్బులన్నీ యథాస్థానంలో పెట్టేశాడు. ఆనంద భవన్‌కు వెళ్లి రాత్రివరకూ ఎదురుచూసి తాను కిడ్నాప్ చేసిన మనిషిని ఎత్తుకెళ్లి ఏ రోడ్డు మీదైతే ఆ మనిషి తాగి పడిపోయి కనిపించాడో, అదే రోడ్డు మీద వదిలేశాడు. హోటల్లో తను ప్రేమించిన అమ్మాయి మేజిక్ షోలో బిజీగా ఉంది. ఆమెకు తన గురించి అంతా చెప్తూ ఒక ఉత్తరం రాసి, ఆమెకు కనిపించేలా ఓ టేబుల్ మీద పెట్టి బయటకు వచ్చాడతను. ఆ ఉత్తరం చదివి ఆమె ఎలా స్పందిస్తుందా అని ఎదురుచూస్తూ హోటల్ బయటే నిలబడ్డాడు. షో అయిపోయాక ఆమె వాళ్ల నాన్నతో కలిసి కారులో వెళుతూ అతణ్ని చూసింది. చేతిలో ఒక పువ్వు పట్టుకొని అతనికి ఇవ్వడానికి ఆమె చుట్టూ చూస్తోంది. అతణ్ని గమనించింది. కారు దిగే అవకాశం లేదు. అప్పటికప్పుడు ఓ కాగితమ్మీద తన ఇంటి అడ్రస్ రాసి ఆ పువ్వుతో పాటు కాగితాన్ని రోడ్డు మీద పడేసింది. అతను ఆ పువ్వు తీసుకున్నాడు. కాగితాన్ని అందుకునే లోపే ఆ కాగితం గాల్లో ఎగురుతూ ఎగురుతూ ఒక పెద్ద మురికికాలువలో పడి కొట్టుకుపోయింది. దూరంగా ఆమె కారులో వెళ్లిపోతూంటే అతడు నిస్సహాయంగా చూస్తూ నిలబడ్డాడు. -
విడాకులు కావాలి!
ఇండియన్ సినిమా పాపులర్ డైరెక్టర్స్‌లో ఒకరు తీసిన క్లాసిక్ సినిమాలోని సన్నివేశాలివి. ఈ తమిళ సినిమా తెలుగులో డబ్ అయి ఇక్కడి ప్రేక్షకులకూ ఫేవరెట్ సినిమాల లిస్ట్‌లో ఒకటిగా చేరిపోయింది. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం... మధ్యాహ్నం కావొస్తోంది. బయట వర్షం పడుతోంది. క్లాస్‌రూమ్‌లో ప్రొఫెసర్ పాఠాలు చెబుతోంది. దివ్యకు వినాలని లేదు. నాన్న మాటలే ఆలోచనలుగా గిర్రున తిరుగుతున్నాయి. ‘మధ్యాహ్నం పెళ్లిచూపులు చూడ్డానికి వస్తున్నారట. వాడు చెప్పేవన్నీ చేసి, మెప్పించి, వాళ్లు ఓకే చెబితే తలొంచి తాళి కట్టించుకోవాలట’ తనకు తాను చెప్పుకుంటోంది దివ్య. ‘నేనింట్లో ఉంటేనే కదా చూడగలుగుతారు? ఒకవేళ నేను రెండు గంటలకు ఇంటికి వెళ్లకపోతే? నేను వెళ్లడం లేదు. వెళ్లడం లేదు.. వెళ్లడం లేదు..’ అని తనకు తాను సర్దిచెప్పుకొని గట్టిగా నవ్వింది దివ్య. క్లాసయిపోయింది. వర్షం పడుతూనే ఉంది. దివ్య ఇంటికెళ్లొద్దని ఫిక్సయిపోయింది. ఆడింది. పాడింది. రాత్రి అయ్యే వరకూ ఆడుతూనే ఉంది. ఇంటికెళ్లగానే, పెళ్లిచూపులకు వచ్చిన వాళ్లు వెళ్లిపోయి ఉంటారనుకుంది. కానీ వాళ్లు ఆమె కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.అబ్బాయి దివ్యతో పర్సనల్‌గా మాట్లాడాలని అడిగాడు. అబ్బాయి పేరు చంద్రకుమార్. ఇద్దరూ ఒక గదిలోకి వెళ్లారు. ‘‘మిమ్మల్ని ఇంతసేపు వెయిట్ చేయించినందుకు క్షమించమని అడగడం లేదు.ఎందుకంటే నేను చేసింది తప్పు అని నాకనిపించలేదు. నాకిది నచ్చలేదు. ఇలా పిల్లను చూస్కోవడం సంతలో పశువును బేరమాడినట్టు ఉంది.’’ దివ్య తాను చెప్పాలనుకున్నదంతా చెప్పేస్తూ.. ‘‘నేను మీకు మంచి భార్యను అవుతానని కూడా నేననుకోను.’’ అంది చివరిమాటగా. చంద్రకుమార్ లేచి నిలబడి ఒకే ఒక్క మాట అన్నాడు – ‘‘నువ్వు నాకు నచ్చావు.’’ పెళ్లవ్వగానే చంద్రకుమార్‌తో ఢిల్లీ వచ్చేసింది దివ్య. ఆమె ప్రపంచం మొత్తం మారిపోయిందిప్పుడు. కొత్త మనుషులు. కొత్త ప్రదేశం. తనకు తానే కొత్తగా కనిపిస్తోంది. భర్త ప్రేమిస్తున్నాడు. కానీ ఆమెకు నచ్చడం లేదు. ఆ ప్రేమ నచ్చడం లేదు. ఇప్పటివరకూ ఒంటిమీద చెయ్యి కూడా వెయ్యనివ్వలేదు. ‘‘ఇది ఇటుకలు, సిమెంట్‌తో కట్టబడిన ఒక ఆలయం. అంతే. దీన్నొక ఇంటిగా మార్చడం నీ చేతుల్లో ఉంది..’’అన్నాడు చంద్ర. దివ్య అతను చెప్పే మాటలన్నీ విని కాసేపు ఏం మాట్లాడలేదు. ‘‘నాకు ఇటుకలు, సిమెంటు చాలు.’’ అంది అభావంగా. ఇద్దరి మధ్య నిశ్శబ్దం. ఢిల్లీకి వచ్చిన రెండో రోజే చంద్రకుమార్ ఆఫీస్‌కు వెళ్లిపోయాడు. దివ్య మనసులో ఎన్ని ప్రశ్నలు తిరుగుతున్నాయో, ఆమె తనను ఎందుకు యాక్సెప్ట్ చెయ్యలేకపోతోందో చంద్రకుమార్‌కు తెలియదు. దివ్యకు మాత్రమే తెలుసది.ఆమెను సంతోషపెట్టడానికి తనేం చేయాలా అని బాగా ఆలోచించాడు. డిన్నర్ పార్టీకి తీసుకెళ్లాడు. పెళ్లికానుకగా ఆమెకు ఏదైనా ఇష్టంగా కొనిపెట్టాలనుకున్నాడు. చంద్రకుమార్ ఆర్డర్ చేసిన ఫుడ్ ఇంకా రాలేదు. ఎదురుగా దివ్య ఏం మాట్లాడకుండా కూర్చొని ఉంది. నిమిషాలు మెల్లిగా సెకండ్ల చుట్టూ తిరుగుతున్నాయి. దివ్య అడిగింది – ‘‘నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా.’’ ‘‘అడుగు,’’ ‘‘నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు?’’ చంద్ర సమాధానం చెప్పడానికి సమయం తీసుకుంటున్న వాడిలా తల కాస్త కిందకు వంచాడు. ఆమె కొనసాగించింది – ‘‘పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నేనెన్నో చెప్పాను. అయినా నన్నే ఎందుకు కావాలనుకున్నారు?’’ చంద్ర చాలాసేపు ఆలోచించి చెప్పాడు – ‘‘నువ్వు నాకు బాగా నచ్చావు. మా అన్నయ్యా, వదినల నిర్బంధం వల్ల పెళ్లిచూపులకు వచ్చాను. నిన్ను చూసి ఈ పెళ్లంటే నాకిష్టం లేదు.నన్ను క్షమించమని అడుగుదామని నీకోసం ఎదురుచూశాను. కానీ నిన్ను చూసిన తర్వాత.. నేను చెప్పాలనుకున్నది నువ్వే చెప్పిన తర్వాత.. మాటల్లో చెప్పలేను.. నువ్వు నాకు బాగా నచ్చేశావు.వద్దని చెప్పాలనుకున్న నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి వచ్చేశాను.’’ మళ్లీ చంద్రకుమారే, కాసేపాగి అడిగాడు – ‘‘నీకు ఈ పెళ్లి జరగడం సంతోషమేగా?’’.దివ్య కళ్లు కిందకు దించి చెప్పింది – ‘‘లేదు’’. మళ్లీ ఇద్దరి మధ్యా నిశ్శబ్దం. నిన్నటి నిశ్శబ్దానికి కొనసాగింపు ఇది. డిన్నర్ పార్టీ అయిపోయింది. రోడ్డు మీద ఒక లాంటి నిశ్శబ్దం. వాళ్లిద్దరి భారాన్నీ మోస్తున్న నిశ్శబ్దం. కారు చిన్నగా వెళుతోంది. చంద్రకుమార్ చూపు రోడ్డుకి అటుపక్క ఇటుపక్క ఉన్న షాపుల మీదకి మళ్లి వస్తూ, రోడ్డు మీద పడి ఆగిపోతోంది. ఒక షాపు ముందు కారు ఆపాడు చంద్రకుమార్. ఇంతసేపూ దివ్య ఒక్కమాటా మాట్లాడలేదు. కారాపగానే అడిగింది – ‘‘ఎందుకు ఇక్కడ ఆగారు?’’. చంద్ర తన చేతిని దివ్యకు అందిస్తూ, రెండు వేళ్లు తెరిచిపెట్టి ఇందులో ఒకటి ముట్టుకో అన్నాడు. ఎందుకన్నట్టు చూసింది దివ్య. ‘‘ఏదైనా బహుమతి కొనిద్దామని ఉంది. అది బట్టలా, నగలా నిర్ణయం కాలేదు.’’ అన్నాడు. ‘‘నాకేమీ వద్దు.’’ ‘‘పెళ్లయిన తర్వాత మొదటిసారి బయటకొచ్చాం. నిన్ను ఒట్టి చేతుల్తో తీసుకెళ్లడం నాకిష్టం లేదు.’’ ‘‘అదే.. నాకేమీ అవసరం లేదని చెప్పాగా!’’ ‘‘ఏం కావాలన్నా అడుగు,’’ ‘‘ఏదడిగినా కొనివ్వగలరా?’’ అడిగింది దివ్య. చిన్నగా నవ్వాడు చంద్ర. ‘‘నా శక్తికి మించనిదైతే కొనిస్తా’’. ‘‘నాకు విడాకులు కావాలి. కొనివ్వగలరా? అది ఈ కొట్లో కొనివ్వగలరా?’’ అంది దివ్య, అసహనంగా కదులుతూ. మళ్లీ నిశ్శబ్దం. కారు స్టార్ట్ అయింది. ఆ నిశ్శబ్దంలో దాగిన ఓ కథ అప్పటికి దివ్యకు మాత్రమే తెలుసు. ఆమే చెప్పాలనుకొని, ఆ కథ చెబితే తప్ప చంద్రకుమార్‌కు అదెప్పటికీ తెలియదు. -
దివికేగిన దివ్యతార
భారతీయ సినీ చరిత్రలో అతిలోకసుందరిగా ఓ వెలుగువెలిగిన అందాల తార శ్రీదేవి (54) శనివారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. దుబాయ్ లో ఓ పెళ్లి వేడుకకు కుటుంబసభ్యులతో కలిసి హాజరైన ఆమె అక్కడే తుది శ్వాస విడిచారు. శ్రీదేవి మరణ వార్తతో సినీ ప్రపంచం మూగబోయింది. ఆమె మృతిపట్ల టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. అతిలోక సుందరిగా వెండితెరను ఏలిన శ్రీదేవి.. 1963, ఆగస్టు 13న శివకాశిలో జన్మించారు. నాలుగేళ్ల పసి ప్రాయంలో తొలిసారిగా కెమెరా ముందుకు వచ్చిన శ్రీదేవి, 1969లో తునైవన్ సినిమాతో బాలనటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బాలనటిగానే పలు చిత్రాల్లో మురుగన్‌గా, కృష్ణుడిగా కనిపించి ఆకట్టుకున్నారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ చిత్రాల్లోనూ బాలనటిగా కనిపించారు శ్రీదేవి. అనురాగాలు, మూండ్రు ముడిచ్చు సినిమాలలో హీరోయిన్గా నటించినా.. భారతీరాజ దర్శకత్వంలో తెరకెక్కిన పదునారు వయదినిలే సినిమాతోనే శ్రీదేవికి హీరోయిన్గా గుర్తింపు వచ్చింది. ఈ సినిమాకు రీమేక్ కె.రాఘవేంద్రరావు తెలుగులో రూపొందించిన పదహారేళ్ల వయసు సినిమాతో టాలీవుడ్‌లోనూ సత్తా చాటారు. పదహారేళ్ళ వయసులో అందాలతారగా అలరించిన శ్రీదేవిని స్టార్ హీరోయిన్ గా నిలిపిన చిత్రం వేటగాడు. బడిపంతులు సినిమాలో ఎన్టీఆర్ మనవరాలిగా నటించిన శ్రీదేవి తరువాత ఏడేళ్లకు ఆయన సరసనే హీరోయిన్గా నటించి మెప్పించారు. వేటగాడుతో విజయం సాధించిన యన్టీఆర్, శ్రీదేవి జంట తరువాత వరుసగా నాలుగేళ్ల పాటు వెండితెరపై వరుస విజయాలను నమోదు చేసింది. అక్కినేని నాగేశ్వరరావుతో ఆమె నటించిన ప్రేమాభిషేకం, బంగారు కానుక, శ్రీరంగనీతులు లాంటి సినిమాలు అభిమానుల మదిలో నిలిచిపోయాయి. ఆ తరంలో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి హీరోలందరితోనూ సూపర్‌హిట్ సినిమాల్లో నటించిన శ్రీదేవి తరువాతి తరం హీరోలయిన చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ తోనూ విజయవంతమైన చిత్రాల్లో నటించారు. చిరంజీవికి జోడిగా రాణీకాసుల రంగమ్మ, జగదేకవీరుడు అతిలోక సుందరి, ఎస్పీ పరుశురాం లాంటి తెలుగు సినిమాలతో పాటు చిరు హీరోగా తెరకెక్కిన బాలీవుడ్ సినిమాల్లోనూ నటించారు. ఆఖరి పోరాటం, గోవిందా గోవిందా లాంటి సినిమాల్లో నాగార్జునతో.. క్షణ క్షణం సినిమాలో వెంకటేష్ తో కలిసి నటించి మెప్పించారు. అదే సమయంలో బాలీవుడ్ లో అడుగు పెట్టిన శ్రీదేవి అక్కడ కూడా తన హవాను కొనసాగించారు. 1975లో జూలీ సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అయిన శ్రీదేవికి హిమ్మత్ వాలా సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ దక్కింది. హిమ్మత్ వాలా తరువాత బాలీవుడ్ స్టార్ హీరోలకు హాట్ ఫేవరెట్‌గా మారిన శ్రీదేవి వరుస విజయాలతో ఇండియన్ టాప్ హీరోయిన్గా ఎదిగారు. నెమ్మదిగా దక్షిణాదికి దూరమై పూర్తిగా బాలీవుడ్లోనే సెటిల్ అయ్యారు. 250కి పైగా సినిమాల్లో నటించిన ఆమె.. భారతీయ అగ్రనటులందరితోనూ నటించారు. తెలుగు 85, తమిళం 72, మళయాలం 26, హిందీ 71 సినిమాల్లో నటించి కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు. 15 ఫిలింఫేర్ అవార్డులు ఆమెను వరించాయి. 2013లో శ్రీదేవిని భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. పెళ్లయ్యాక సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వచ్చారు శ్రీదేవి. లాంగ్ గ్యాప్ తరువాత పూర్తి స్థాయి పాత్రలో ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. చాలా కాలం తరువాత వెండితెర మీద కనిపించినా తన నటనలో గ్రేస్ తో పాటు తన ఫాలోయింగ్ కూడా ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నారు. రీ ఎంట్రీలో నటిగా ఆకట్టుకున్నా కమర్షియల్ సక్సెస్ మాత్రం సాధించలేకపోయారు. చివరగా మామ్ సినిమాలో కనిపించిన శ్రీదేవి విశ్లేషకుల ప్రశంసలు అందుకున్నారు. శ్రీదేవి నటించిన చివరి చిత్రం జీరో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. భారతీయ సినీ చరిత్రలో తనకంటూ సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్న శ్రీదేవి మరణం సినీ జగత్తుకు తీరని శోకాన్ని మిగిల్చింది. -
ఆయన సేవలు అజరామరం
భారతీయ సినిమాకు ఆధ్యుడు, సినీ ప్రేమికుడు బి.నాగిరెడ్డి 105వ వర్ధ్దంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి పేరుతో తపాలా బిళ్లను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ బన్వరిలాల్ చెన్నైలో ఆవిష్కరించారు. తమిళసినిమా: నాగిరెడ్డి సేవలు అజరామరం అని, ఆయన్ను ఆదర్శంగా తీసుకుని సమాజానికి మేలు చేసే చిత్రాలు రూపొందించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. భారతీయ సినీ పితామహుడు, దివంగత ప్రఖ్యాత సినీ దర్శక, నిర్మాత, వాహినీ స్టూడియో అధినేత బి.నాగిరెడ్డి పేరుతో తపాలాబిళ్లను శుక్రవారం చెన్నైలో ఆవిష్కరించారు. భారతీయ సినిమాకు ఆధ్యుడు, సినీ ప్రేమికుడు బి.నాగిరెడ్డి విజయా ప్రొడక్షన్స్ పతాకంపై తెలుగు, తమిళం, హిందీ అంటూ పలు భాషల్లో ఎన్నో అద్భుత కళాఖండాలను నిర్మించారు. పాతాళభైరవి, మిస్సమ్మ, మాయాబజార్ వంటి ఆ పాత మధుర చిత్రాలతో పాటు నమ్‌నాడు, ఎంగవీట్టు పిళ్లైవంటి పలు జనరంజక తమిళ చిత్రాల నిర్మించారు. అదేవిధంగా భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన వాహినీ స్టూడియో నిర్మాణ కర్త బి.నాగిరెడ్డినే. విజయా వైద్య, విద్యా సంస్థల వ్యవస్థాపకుడు అయిన నాగిరెడ్డికి ఈ నెల 25న 105వ వర్ధంతి రోజు. ఈ రోజును పురçస్కరించుకుని ఆయన పేరుతో తపాలాబిళ్లను విడుదల చేయడం విశేషం. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోíహిత్ హాజరయ్యారు. బి.నాగిరెడ్డి రూ.5 తపాలాబిళ్లను వెంకయ్యనాయుడు ఆవిష్కరించగా తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ బి.నాగిరెడ్డి ది లెజెండ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ బి.నాగిరెడ్డి అన్నా, ఆయన చిత్రాలన్నా తనకు చాలా ఇష్టం అని పేర్కొన్నారు. సమాజానికి ఉపయోగపడే చిత్రాలనే నాగిరెడ్డి రూపొందించారని కీర్తించారు. ఆయన చిత్రాల్లో భాషకు, యాసకు ప్రాముఖ్యత ఉండేదన్నారు. శృంగారం లాంటి అసభ్య దృశ్యాలు లేకుండానే నాగిరెడ్డి ఎన్నో గొప్పగొప్ప ప్రేక్షకాదరణ పొందిన మంచి సందేశాత్మక కథా చిత్రాలను నిర్మించారని, ఇప్పుడు శృంగారం పేరుతో అపహాస్యం చేస్తున్నారని అన్నారు. నిజానికి ఇప్పటి చిత్రాల్లో శృంగారం కంటే, అంగారమే కనిపిస్తుందని అన్నారు. అలా కాకుండా సమాజానికి మంచి చేసే కథా చిత్రాలతో భావితరానికి మంచి సందేశాన్ని అందించే బాధ్యత నేటి దర్శక నిర్మాతలపై ఉందన్నారు. నైతిక విలువలతో కూడిన భారతీయ సంస్కృంతి, సంప్రదాయాలను పెంపొందించే చిత్రాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. భాష ఏదైనా మనందరం భారతీయులమని వ్యాఖ్యానించారు. మాతృభాష తల్లిపాలు లాంటిదని, ఇతర భాషలు అద్దం లాంటివని పేర్కొన్నారు. అలాంటి తెలుగు భాషను మనమే చెడగొట్టుకుంటున్నామని అన్నారు. ఎన్ని గూగుల్స్ వచ్చినా మన గూగుల్ (ఉపాధ్యాయులు)లను మరవరాదని అన్నారు. నాగిరెడ్డి సినిమాలతోనే కాకుండా రియల్ లెజెండ్ అని వ్యాఖ్యానించారు, ఆయన సేవలు అజరామరం అని, సినీమారంగానికే కాకుండా వైద్య, విద్యారంగాల్లోనూ ఉత్తమ సేవలను అందించిన గొప్ప మానవతావాది ఆయన అని అన్నారు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన నాగిరెడ్డి ఎంతో సాధించారని పేర్కొన్నారు. అందుకే ఆయన దాదా సాహెబ్ పాల్కే అవార్డులాంటి ఎన్నో గొప్పగొప్ప అవార్డులతో సత్కరింపబడ్డారని గుర్తు చేశారు.నాగిరెడ్డిని ఆదర్శంగా తీసుకుని ఈ తరం దర్శక నిర్మాతలు చిత్రాలు చేయాలని హితవు పలికారు. నాగిరెడ్డి పేరుతో తపాలాబిళ్లను విడుదల చేసిన తపాలా శాఖకు, కేంద్రప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. ఈ తపాలాబిళ్లను తన చేతులమీదగా ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నాగిరెడ్డి గొప్ప మానవతావాది అని తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ పేర్కొన్నారు. స్వశక్తితో ఎదిగి ఎంతో సాధించిన గొప్ప వ్యక్తి నాగిరెడ్డి అని శ్లాఘించారు. చందమామ హిందీ పత్రికను తాను చిన్నతనంలోనే చదివాననని, అయితే ఆ పత్రిక సంపాదకుడు బి.నాగిరెడ్డి అన్న విషయం ఇప్పుడే తెలిసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి తనయుడు బి.వెంకటరామిరెడ్డి, ఆయన సతీమణి బి.భారతీదేవి, రాష్ట్ర మంత్రి అన్భళగన్, ప్రముఖ చిత్ర నిర్మాత ఏవీఎం.శరవణన్ వేదికనలంకరించారు. పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.నాగిరెడ్డి మనువడు వినయరెడ్డి వందన సమర్పణ చేశారు. నాగిరెడ్డి ది లెజెండ్ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న వెంకయ్యనాయుడు -
బాహుబలిపై నోరువిప్పిన బాలీవుడ్ హీరో
ఇండియన్ సినిమాను తొలిసారిగా 1000 కోట్ల క్లబ్ లో నిలబెట్టిన భారీ చిత్రం బాహుబలి 2. భారీ వసూళ్లతో భారత్ లోని ఇండస్ట్రీ రికార్డు లన్నింటినీ బద్ధలు కొట్టిన బాహుబలి, బాలీవుడ్ స్టార్స్ కు కూడా చుక్కలు చూపించింది. అందుకే మీడియా సాధారణ ప్రేక్షకులు బాహుబలిని ఆకాశానికి ఎత్తేసినా.. బాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం ఈ సినిమా పై స్పందించలేదు. ప్రస్తుతం హిందీ ఇండస్ట్రీ లో టాప్ ప్లేస్ లో ఒక్క స్టార్ హీరో కూడా బాహుబలి సక్సెస్ పై మాట్లాడలేదు. తాజాగా కిలాడీ అక్షయ్ కుమార్ బాహుబలి 2 సక్సెస్ పై స్పంధించాడు. సినిమా రిలీజ్ అయిన రెండు వారాల తరువాత బాహుబలి 2కు సంబంధించిన ట్వీట్ చేశాడు అక్షయ్ కుమార్. 'ఫైనల్ గా బాహుబలి సినిమా చూశా. వస్తున్న హైప్, సక్సెస్ కు బాహుబలి 2కి అర్హత ఉంది. భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేశాడు అక్షయ్. Finally saw #BaahubaliTheConclusion, it deserves every bit of hype & success,taking Indian cinema 2 an international level.Congrats 2 d team — Akshay Kumar (@akshaykumar) 15 May 2017 -
తెలంగాణలో బాహుబలి 5 షోలే
-
బాహుబలి బెనిఫిట్ షోలకు అనుమతి లేదు
హైదరాబాద్ : ‘సాక్షి’ ‘బ్లాక్‌బలి’ కథనంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. బాహుబలి-2 బెనిఫిట్ షోలకు అనుమతి లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. తాము అయిదు ప్రదర్శనలకు మాత్రమే అనుమతి ఇచ్చామని ఆయన బుధవారమిక్కడ స్పష్టం చేశారు. ఎక్కువ ధరకు టికెట్లు అమ్మితే కఠిన చర్యలు తప్పవన్నారు. అలాగే కాంబో ఆఫర్ల పేరుతో మోసం చేస్తే ఉపేక్షించేది లేదని తలసాని హెచ్చరించారు. ప్రేక్షకులకు ఎలాంటి అసౌకర్యం కలిగినా ఉపేక్షించేది లేదన్నారు. మరోవైపు థియేటర్ల యాజమాన్యాలకు వాణిజ్య పన్నుల శాఖ వార్నింగ్ ఇచ్చింది. ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్మితే చర్యలు తప్పవని వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ తెలిపారు. ఎక్కువ రేట్లకు ఎవరు టికెట్లు అమ్మినా 18004253787 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఆయన తెలిపారు. అయితే పెయిడ్ ప్రీమియం పేరుతో హైదరాబాద్ లో ఈ సినిమాను గురువారం రాత్రి నుంచే ప్రదర్శిస్తున్నారు. కాగా బాహుబలి-2 శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 9వేల స్క్రీన్లపై ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. తమిళనాడు, కేరళలలో 70-75 శాతం బాహుబలి పార్ట్-2 కోసమే బుక్ అవ్వగా.. తెలంగాణ ఆంధ్ర్రప్రదేశ్ లలో 80 శాతం థియేటర్లలో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. మరోవైపు అభిమానులు కూడా తొలిరోజే ఈ సినిమాను చూసేందుకు పోటీలు పడుతున్నారు. పెద్ద మొత్తం వెచ్చించి అయినా టికెట్ కొనేందుకు సిద్ధపడుతున్నారు. -
బాహుబలి-2 తొలి రోజే రికార్డులు సృష్టించనుందా?
ముంబై : బాహుబలి-2 కౌంట్ డౌన్ మొదలైంది. రేపే అన్ని థియేటర్ల సిల్వర్ స్క్రీన్లపైకి వచ్చేస్తోంది. ఇప్పటికే ఆన్ లైన్ టిక్కెట్లను జోరుగా కొనుగోలు చేయగా.. భారీగా థియేటర్ల ముందు ప్రేక్షకులు బారులు తీరారు. దాదాపు సినిమా ప్రదర్శించబోయే అన్ని థియేటర్ల టిక్కెట్లు బుక్ అయిపోయాయి. బాహుబలి పార్ట్-1 లో సస్పెన్షన్‌గా ఉన్న బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్నారు. అయితే 2015లో విడుదలైన పార్ట్-1 బాక్స్ ఆఫీసు వద్ద రికార్డుల మోత మోగించింది. రేపు విడుదల కాబోతున్న బాహుబలి పార్ట్-2 మరెన్ని రికార్డుల సృష్టిస్తోందని ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 9వేల స్క్రీన్లపై దీన్ని ప్రదర్శించబోతున్నారు. తమిళనాడు, కేరళలలో 70-75 శాతం బాహుబలి పార్ట్-2 కోసమే బుక్ అవ్వగా.. తెలంగాణ ఆంధ్ర్రప్రదేశ్ లలో 80 శాతం థియేటర్లలో ఈ సినిమానే విడుదల చేస్తున్నారు. 9వేల స్క్రీన్లలో రోజుకు 5 షోలు. అంటే ఒక్క షోకు 300 మంది చొప్పున తీసుకున్నా.. తొలిరేజే రూ.135 కోట్లకు పైగా బాక్సాఫీసు కలెక్షన్లను వసూలు చేయనుందని ఫిల్మ్ ట్రేడ్ అనాలిస్టులు చెబుతున్నారు. ఫిల్మ్ యూనిట్ అభ్యర్థన మేరకు సింగిల్ స్క్రీన్ థియేటరల్లో 10 రోజులు పాటు రోజుకు ఆరు షోలు వేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఈ వసూలు మరింత పెరుగనున్నాయని అనాలిస్టులు పేర్కొంటున్నారు. అంటే అదనంగా మరో రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల మేర తొలి వీక్ కలెక్షన్లు నమోదుకానున్నాయని ఫిల్మ్ ట్రేడ్ అనాలిస్టు శ్రీధర్ పిలై చెప్పారు. అయితే తెలంగాణలో రోజుకు ఐదు షోలు మాత్రమే వేసేందుకు ప్రభుత్వం ఆమోదించింది. ఈ సినిమా హిందీ వెర్షన్ అద్భుతంగా ఉందని, హిందీ వెర్షన్లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఎక్స్లెంట్ గా నమోదయ్యాయని పిలై పేర్కొన్నారు. ఇప్పటికే అంచనాలను అధిగమించి టిక్కెట్లను ప్రేక్షకులు బుక్ చేసుకున్నారని హిందీ ఫిల్మ్ ట్రేడ్ అనాలిస్టు కోమల్ నహ్తా తెలిపారు. ఈ సినిమా తొలి పార్ట్ దేశీయ బాక్స్ ఆఫీసు కలెక్షన్లు గ్రాస్ రూ.360 కోట్ల నుంచి రూ.370 కోట్ల వసూలయ్యాయి. కంక్లూజిన్ పార్ట్ లో 450 కోట్ల నుంచి 460 కోట్ల వసూలుచేయొచ్చని కోమల్ అంచనావేస్తున్నారు. ఇదే దేశీయ సినిమా చరిత్రలో అత్యధిక కలెక్షన్లని పేర్కొన్నారు. ఓవర్సిస్ మార్కెట్లోనూ ఇది దుమ్మురేపబోతుందట. దుబాయ్ లో ఇప్పటికే లక్షకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయని పిలై తెలిపారు. ఇప్పటివరకు ఏ సినిమాకు లేని అడ్వాన్స్ బుకింగ్స్ దీనికి దక్కినట్టు వెల్లడించారు. సింగపూర్, మలేసియా, నార్త్ అమెరికాలోనూ ఇది రికార్డులు సృష్టిస్తుందని పిలై అంచనావేస్తున్నారు. -
సినీమా నోరిప్పిన రోజు
జీవన కాలమ్ అపూర్వమైన కారణంగా, పాట భారతీయ సినీమాలో తిష్ట వేసుకు కూర్చోగా - నాటకానికి విడాకులిచ్చి తెలుగు సినీమా సొంత గొంతుని అందుకునే ప్రయత్నా లకు గొప్ప శకునాలు ఇప్పుడిప్పుడు కనిపిస్తున్నాయి. ఉదాహరణ.. బాహుబలి. సినీమా నోరు విప్పి 85 సంవ త్సరాలయింది. మరోమాట చెప్పాలంటే సినీమాలోకి నాటకం, పాట దొడ్డితోవన ప్రవేశించి 85 ఏళ్లయింది. ఏవో కొన్ని చిత్రాలని మిన హాయిస్తే - ఇప్పటికీ ఈ రెండు ప్రక్రియలనూ ప్రేక్ష కులు గుండెకు హత్తుకుంటు న్నారు. నాటకానికి దూరంగా వెళ్లాలన్న అవసరాన్ని గుర్తుపట్టి చాలా యేళ్లయింది. కాని ‘ప్రయత్నం’ ప్రారం భమై కొన్ని సంవత్సరాలే అయింది. ఒకాయన ఈ పరిస్థితిని ఇలా వివరించాడు - Indian cinema is an accident on screen. . 1931లో హెచ్.ఎం. రెడ్డిగారు కలకత్తాలో కెమెరా ముందు ‘భక్త ప్రహ్లాద’ నాటకాన్ని ప్రదర్శింపజేశారు. ఎవరికీ ఏమీ ఇబ్బందిలేని పని అది. కెమెరా నడిచింది. బొమ్మ సెల్యులాయిడ్ మీదకి ఎక్కింది. డెరైక్టరుగారు ఎడిటింగ్ టేబుల్ ముందు కూర్చుని పాట తర్వాత పద్యం, పద్యం తర్వాత డైలాగు చేర్చుకుంటూ పోయారు. ప్రేక్షకులు తమకు తెలిసిన వినోదాన్ని తెలి యని ప్రక్రియలో చూసి - అబ్బురపడి, ఆనందించారు. ఇది కొత్త ప్లేట్లలో వడ్డించిన పాత భోజనం. ప్రేక్షకులకి అలవాటయిన, తృప్తినిచ్చే భోజనం. తరువాత సి. పుల్లయ్యగారు ‘పాదుక’ తీశారు. ముందు సినీమా దీనికి వరవడి. చిత్రం విజయం సాధిం చింది. సాధించకుండా ఉండే మార్గం లేదు. దరిమిలాను తెలుగుదేశంలో ఉన్న అన్ని పౌరాణికాలూ తెరకెక్కాయి. లవకుశ, సీతా కళ్యాణం, ద్రౌపదీ వస్త్రాపహరణం, శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం, గయోపాఖ్యానం, ధృవ, అనసూయ - ఇలాగ గమనించాలి. వీటితోపాటు సూత్ర దారుడు, కంచుకి, బృందగానం, కందార్థాలు, ద్విప దలు, స్రగ్ధరలు, కళ్యాణి, భీంపలాస్, భాగేశ్రీ, కానడ, కాపీ - అన్నీ వచ్చాయి. క్రమంగా కొత్త ప్లేటుకి అల వాటుపడ్డ ప్రేక్షకుడు - వడ్డించే భోజనంలో తప్పని సరిగా ఆకర్షించే ‘పాత’ రుచికీ అలవాటుపడ్డాడు. ఎందరో మహానుభావులు - పాట లేకపోతే ఎలా? అనిపించే అపూర్వమైన కృషి చేశారు. నౌషద్, సి. రామచంద్ర, సాలూరు రాజేశ్వరరావు, షకీల్ బదా యునీ, ఘంటశాల, కేవీ మహాదేవన్, మల్లాది రామ కృష్ణ శాస్త్రి, ఆచార్య ఆత్రేయ, వేటూరి, సముద్రాల.. వంటివారు సినీమాలో ‘పాట’ని అజరామరమూ, నిర్వివాదాంశమూ చేశారు. మరోదేశం ప్రేక్షకుడు మన సినీమా చూసి - ఏమిటయ్యా, మీ హీరో మేఘాల్ని చూస్తూ నా ప్రేయసికి కబురు చెప్పమంటాడు -అని నవ్వుకోవచ్చుగాని-1951లో-అంటే సినీమా మాటని మరిగిన 20 సంవత్సరాలకు ‘మల్లీశ్వరి’ చూస్తూ మనం అదే పని చేశాం. ఒక చిన్న ఉదాహరణ. ఈ దేశం గర్వించదగ్గ గొప్ప స్క్రీన్‌ప్లే రచయితలు సలీం-జావేద్ రాసిన ‘జంజీర్’ సినీమాని తెలుగులో ఎన్టీ రామారావుగారి ‘నిప్పులాంటి మనిషి’గా రాశాను. నాటకం పాలు ఎక్కువగా ఉన్నా కొద్దిలో కొద్దిగా సినీమా ప్రక్రియని పట్టుకున్న రచయితలు వీరు. అటు సమృద్ధిగా మెలోడ్రామాను, ఇటు సినీమా ప్రక్రియను సంధించిన అఖండులు వీరు. ఇందులో ఒక సీను. హీరోది dialectical పాత్ర. దుండ గుల లారీ కిందపడి చాలామంది పిల్లలు చచ్చిపో యారు. దుండగుడు దొరికాడు. పగ తీర్చుకోడాని కన్నట్టు హీరో అతన్ని చావబాదాడు. ఆఫీసరు ఆపాడు. హీరో గదిలోకి వచ్చి - ఆవేశాన్ని చల్లార్చుకుంటూ గ్లాసుతో నీళ్లు తాగాడు. ఇప్పుడు హీరోయిన్ వచ్చింది. చూశాడు హీరో. ‘సాబ్.. పైసా’ అంది నోట్ల కట్ట చూపిస్తూ. అతని ముఖంలో ఆశ్చర్యం. ‘వాళ్లు ఇచ్చారు సార్! కాని.. వద్దుసార్’ అంది. హీరో దగ్గరకు వచ్చాడు. డబ్బు కట్టని చూశాడు. ఆమె గుండె ధైర్యాన్ని ప్రశం సించాలి? ‘నీలాంటి నిజాయితీపరులు పదిమంది ఉంటే ఈ దేశం ముందుకు పోతుందమ్మా’ అనాలా ‘నీ ధైర్యాన్ని మెచ్చుకోడానికి మాటలు లేవనాలా?’ ఇది మెలోడ్రామా. సన్నివేశాన్ని సాగదీసి చిలకడం. కాని గొప్ప స్క్రీన్‌ప్లే బెసకదు. ‘థాంక్స్’ అన్నాడు హీరో. ఆమె వెళ్లిపోయింది. దర్శకుడు ఎస్.డి. లాల్‌ని పిలిచి ‘ఇలాగే రాస్తాను. తీస్తావయ్యా’ అనడిగాను. ‘ఎందుకు తియ్యను గురువుగారూ’ అన్నాడు. మూల రచన ఉంది కదా? హీరోగారూ చేశారు. Silence is the most powerful statement in a film. The visual is its strength. while the verbal is the backbone of theatre and weak ness of a film. ఏ విదేశీ సినీమా అయినా చూడండి. సంభాషణల రచయిత పేరు ఉండదు. స్క్రీన్‌ప్లే మాత్రమే ఉంటుంది. మన దేశంలోనే కాదు. మన భాషలోనే కాదు- 85 సంవత్సరాలపాటు ఈ రెండు ధోరణుల మధ్యా కొట్టు మిట్టాడుతున్న మాధ్యమం - సినీమా. అపూర్వై మెన కారణంగా - పాట - by default - భారతీయ సినీమాలో తిష్ట వేసుకు కూర్చోగా - నాటకానికి విడాకు లిచ్చి - తెలుగు సినీమా సొంత గొంతుని అందుకునే ప్రయత్నాలకు గొప్ప శకునాలు ఇప్పుడిప్పుడు కనిపిస్తు న్నాయి. ఉదాహరణ - బాహుబలి. -
వాళ్లు కూడా మనల్ని చూస్తున్నారు
భారతదేశ సినిమాల గురించి అంతర్జాతీయ ప్రేక్షకుల ఆలోచనా తీరు మారిందని బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అన్నాడు. హాలీవుడ్లో దశాబ్దకాలం పూర్తిచేసుకున్న ఇర్ఫాన్.. ఈ అంశంపై మాట్లాడాడు. స్లమ్‌డాగ్ మిలియనీర్, లైఫ్ ఆఫ్ పై లాంటి సినిమాల్లో అతడు తన ప్రతిభను చూపించిన విషయం తెలిసిందే. ప్రమన సినిమాల్లో కూడా నాణ్యత బాగా పెరుగుతోందని, అలాగే అంతర్జాతీయ సినిమా ఉత్సవాలలో కూడా మన సినిమాలు ప్రదర్శితం అవుతున్నాయని.. దాంతో ప్రపంచవ్యాప్తంగా మన సినిమాలకు ప్రాచుర్యం పెరుగుతోందని ఇర్ఫాన్ అన్నాడు. అలాగే అంతర్జాతీయ బాక్సాఫీసులో కూడా భారతీయ సినిమాల కలెక్షన్లు బాగుంటున్నాయని, ప్రాంతీయ భాషా చిత్రాలు కూడా మంచి వసూళ్లు సాధిస్తున్నాయని చెప్పాడు. ఒకప్పుడు విదేశాల్లో ఉండే భారతీయులు మాత్రమే మన సినిమాలు చూసేవారని, ఇప్పుడు మాత్రం పాశ్చాత్యులు కూడా మన సినిమాలు చూస్తున్నారని తెలిపాడు. భారతీయ నటులను గుర్తిస్తున్నారని, ఏవో చిన్న చిన్న పాత్రలకే మనల్ని పరిమితం చేయకుండా మంచి పాత్రలు కూడా ఆఫర్ చేస్తున్నారని అన్నాడు. తాజాగా ఇర్ఫాన్ ఖాన్ టామ్ హాంక్స్‌తో పాటు ఇన్ఫెర్నో అనే హాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు. -
మొదటి లిప్‌లాక్ సీన్ ఏదో తెలుసా?
ముంబై: సిల్వర్ స్క్రీన్ పై మొదటి లిప్‌లాక్ సీన్ ఎపుడు చిత్రీకరించారో తెలుసా? మూకీ సినిమాల టైంలోనే ఈ సీన్లను హీరో హీరోయిన్లు పండించారంటే నమ్ముతారా? ఈ వివరాలతో కూడిన రెండు వీడియోలు ఇపుడు మళ్లీ యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తున్నాయి. తరతరాలుగా సినిమాలలో ముద్దు సీన్లకున్నంత ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. నానాటికీ ఈ సీన్ల గాఢత,నిడివి పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. అయితే 60, 70లలో వచ్చిన సినిమాలలో హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలను సింబాలిక్‌గా చూపించడం మనకు తెలుసు. రెండు పువ్వులను కలపడం ద్వారా ముద్దు సీన్ ను పండించడం ఆప్పటి సినిమాల్లో చూసిందే. అయితే 1929లో అంటే మూకీ సినిమాల కాలంలోనే చుంబన దృశ్యాలు ఉన్నాయంటే నమ్మగలమా.. కానీ ఇది నిజం. 'ఎ థ్రో ఆఫ్ డైస్' అనే సినిమాలో ఓ లిప్ లాక్ సీన్ ను చిత్రించారు. సీతాదేవి, చారు రాయ్ మధ్య ఈ అరుదైన సన్నివేశాన్ని షూట్ చేశారట. ఆ తరువాత ఈ కోవలో చెప్పుకోదగ్గది కర్మ సినిమాలోనిది. దేవికా రాణి, హిమాంశు మధ్య ఓ రొమాంటిక్ సన్నివేశాన్ని చిత్రించారు. 1933లో వచ్చిన ఈ సినిమాలో భారతీయ సినిమాల్లో సుదీర్ఘ ముద్దు సీన్లలో ఒకటిగా నిలిచిందట. నాలుగు నిమిషాల పాటు సాగిన ఈ దృశ్యం అప్పట్లో పెద్ద సంచలనం. అయితే ఈ సినిమాలో దేవికా రాణి, హిమాంశు రాయ్ భార్యభర్తలు కావడం విశేషం. -
మెగాస్టార్‌కి బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన గేల్!
ముంబై: భారతీయ సినిమాకు అంతర్జాతీయంగా పెద్దగా ప్రాచుర్యం లేదని అనుకుంటాం కానీ, బ్యాటింగ్ సెన్సేషన్ క్రిస్ గేల్ ఈ విషయాన్ని తప్పని నిరూపించాడు. తన అభిమానంతో బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ను క్లీన్బోల్డ్ చేశాడు. భారతీయ సినిమాను ప్రపంచంలో పెద్దగా ఎవరు చూస్తారులే అనుకుంటున్న సమయంలో ఈ వెస్టిండిస్ క్రికెటర్ తనకు పెద్ద ఫ్యాన్ అని తెలియడం విస్మయంలో ముంచెత్తిందని బిగ్ బీ అమితాబ్ తెలిపారు. తన అభిమానానికి గుర్తుగా క్రిస్ గేల్ తన సంతకం చేసిన బ్యాటును కానుకగా ఇచ్చాడని, ఈ అభిమానం తనకెంతో ఆనందం కలిగించిందని ఉబ్బితబ్బిబ్బవుతూ బిగ్ బీ చెప్పారు. 'మిస్టర్ క్రిస్ గేల్. ఇది నిజంగా గొప్ప గౌరవం. నువ్వు నన్ను గుర్తుపట్టగలవని నేనెప్పుడూ అనుకోలేదు. నిజంగా ఎంతో ముగ్ధుడినయ్యాను. మేమంతా నీ వీరాభిమానులం. హిందీ సినిమాల అభిమాని క్రిస్ గేల్ తన సంతకంతో ఉన్న గోల్డెన్ బ్యాటును నాకు బహుమానంగా ఇచ్చాడు. ఇది నాకు దైవసందేశంతో సమానం' అని బిగ్ బీ ట్విట్టర్లో తెలిపారు. ఐపీఎల్లో వీరబాదుడు బాదే క్రిస్ గేల్ తనకు బాలీవుడ్ షెహన్షా అంటే ఎనలేని అభిమానమని ట్విట్టర్లో తెలిపాడు. 'లెజండ్ అమితాబ్ బచ్చన్‌కు నా స్పార్టన్ బ్యాటును బహుమానంగా ఇవ్వడం గర్వంగా ఉంది. ఆయన సినిమాలు, స్టైల్‌ను ఎంతోగానో అభిమానిస్తా. థాంక్యూ' అంటూ క్రిస్ గేల్ ట్వీట్ చేశాడు. ఇందుకు ప్రతిగా అమితాబ్ కూడా ట్విట్టర్లో స్పందించడంతో 'త్వరలోనే భారత్‌లో కలుద్దాం' అంటూ బిగ్ బీకి గేల్ మరో మెసేజ్ చేశాడు. -
'ఆ సీన్‌తో ప్రారంభించి కథ పూర్తి చేశా..'
చెన్నై: బాహుబలి చిత్ర విజయం భారతీయ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి నిదర్శనం అని ప్రముఖ కథా రచయిత, దర్శకుడు, ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఒక చిత్రాన్ని ఒక భాషకు, ఒక ఇండస్ట్రీకి పరిమితం చేయాల్సిన అవసరం లేదని బాహుబలి విజయం తర్వాత తనకు అనిపిస్తోందని చెప్పారు. దేశంలోని అన్ని భాషల్లో ఒక చిత్రాన్ని అనువాదం చేసి విడుదల చేయోచ్చని బాహుబలి నిరూపించిందని తెలిపారు. ఈ నెల 10న విడుదలైన ఈ చిత్రం పది రోజుల్లోనే రూ.350 కోట్లు వసూళ్లు చేసి భారతీయ చిత్ర పరిశ్రమలోని రికార్డులన్నీ తిరగరాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒక నదీ ప్రవాహం సీన్‌తో బాహుబలి కథ ప్రారంభించి పూర్తి చేశానని చెప్పారు. బాహుబలి ఇంతటి ఘన విజయం సాధిస్తుందని తాను ఊహించలేదని, ఈ సినిమా ప్రారంభించేముందు తన కుమారుడు ఎస్ఎస్ రాజమౌళికి కూడా అలాంటి ఆలోచన కలగలేదని అన్నారు. మహాభారతాన్ని తీయడానికి బాహుబలి ఒక నమునాలాంటిదని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. అలాగే, తాను అందించిన కథ ఆధారంగా విడుదలైన బాలీవుడ్ చిత్రం బజరంగీ బైజాన్ చిత్రం కూడా ఘన విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తమ దేశంలో వైద్య ఖర్చు భరించలేక భారత్ వచ్చి తమ కూతురుకి గుండె ఆపరేషన్ చేయించుకున్న పాక్ దంపతుల గురించి తాను విన్నానని, ఆపరేషన్ పూర్తయ్యాక భారతీయుల గొప్పతనం గురించి వారు మాట్లాడలేకుండా ఉండిపోయారని, ఆ సందర్భం తనను ఎంతో ఆలోచింపజేసిందని వెంటనే కథరాయాలని ఆలోచించి బజరంగీ బైజాన్ కథ సిద్ధం చేశానని తెలిపారు. బాహుబలి చిత్రం విజయానికి ప్రేక్షకులే కారణమని చెప్పారు. వారు లేకుండా అసలు ఇంత విజయాన్ని ఊహించలేమని అన్నారు. ఒక చిత్ర భవిష్యత్తును తేల్చేది ప్రేక్షకులేనని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. -
ఆయన్నుంచి చాలా నేర్చుకున్నా
అచంచలమైన ఆత్మస్థైర్యంగల నటి ఆండ్రియా సొంతం. ఎవరో ఏదో అనుకుంటారని తన వ్యక్తిత్వానికి అతీతంగా నడుచుకునే స్త్రీకాదు. ముక్కుసూటి ప్రవర్తన ఈమె నైజం. బహుముఖ ప్రజ్ఞ ఇందుకు ఒక కారణం కావచ్చు. మలయాళ యువ నటుడితో ప్రేమ వ్యవహారం, యువ సంగీత దర్శకుడితో రొమాన్స్ అంటూ...కోరుకున్న జీవితాన్ని అనుభవించే ఆండ్రియా ఎప్పటికీ సంచలన తారనే. ఒక్కసారి నటిస్తే చాలని ఆశించే చాలామందికి హీరోయిన్లు మధ్య విశ్వనాయకుడు కమలహాసన్ సరసన మూడుసార్లు నటించే లక్‌ను దక్కించుకున్న ఆండ్రియాతో చిన్న భేటీ... ప్రశ్న: నటుడు కమలహాసన్‌తో వరుసగా చిత్రాలు చేశారు. ఆయన నుంచి ఏమి నేర్చుకున్నారు? జవాబు: ఒక్కో చిత్రంలో నేనాయన నుంచి చాలా నేర్చుకున్నాను. కమలహాసన్ బహుముఖ ప్రజ్ఞాశాలి. నేను సినీరంగ ప్రవేశం చేసిన తొలి రోజుల్లో కమలహాసన్ సరసన నటించే అవకాశం వస్తే అది ఒక్క సీన్ అయినా ఒప్పేసుకుని నటించమని ఒక దర్శకుడు సలహా ఇచ్చారు. అయితే కమలహాసన్ చిత్రాల్లో ఒక్క సన్నివేశంలో నటించినా అది అద్భుతంగా ఉంటుంది. అందువలన ఆయన అవకాశం ఇస్తే ఎలాంటి సందేహం లేకుండా ఎస్ అంటాను. ప్రశ్న: మీలో మంచి గాయని ఉన్నారు. చాలా చిత్రాల్లో పాడారు. అలాంటిది ఉత్తమ విలన్ చిత్రంలో పాడలేదే? జవాబు: మీరు చాలా చిత్రాల్లో పాడారు. ఈ చిత్రంలో వద్దు అని కమల్ అన్నారు. ఆయనే అలా అంటే నేనెలా పాడగలను. ప్రశ్న: ఏ విషయాల ప్రాతిపదికపై చిత్రాలు ఎంపిక చేసుకుంటారు? జవాబు: మొదట చిత్రానికి పని చేసే టీమ్ ఎవరన్నది తెలుసుకుంటాను. ఆ తరువాత చిత్ర కథ ఏమిటి? అందులో పాత్ర సంతృప్తికరంగా ఉందా? అన్న విషయాలపై దృష్టి సారిస్తాను. అలాగే చిత్రానికి దర్శకుడు ఎవరన్నది చూస్తాను. ప్రశ్న : సినిమా గురించి అర్థం చేసుకుంది? జవాబు: నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు నాకేమి అర్థం కాలేదు. షూటింగ్ స్పాట్లో నా పాత్ర చిత్రీకరణ పూర్తి అయితే చాలు అక్కడ నుంచి వెళ్లిపోతాను. ఆ తరువాత నాకంటూ ఒక చిన్న జీవితం ఉంది. అంతేకాని పుస్తకాలు చదువుతాను లాంటి కాకమ్మ కథలు చెప్పను. నాకు సంబంధించినంతవరకు నటన అనేది ఒక వృత్తి అంతే. ప్రశ్న: ఎలాంటి చిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నారు? జవాబు: మణిరత్నం చిత్రాల్లాంటి పూర్తి ప్రేమ కథా చిత్రాల్లో నటించాలనుంది. నేనింత వరకు అలాంటి చిత్రం ఒక్కటి చేయలేదు. ప్రశ్న: ఏ భాషల్లో నచ్చిన పాత్రలు లభిస్తున్నాయి. జవాబు: కరెక్ట్‌గా చెప్పాలంటే మలయాళంలో గ్లామర్ పాత్రలే చేయాలని ఒత్తిడి చేయరు. అదే విధంగా తెలుగులోనూ మంచి ఆదరణ, గౌరవం లభిస్తోంది. అలాంటి చిత్రాల్లో నటించడం సంతోషంగా ఉంది. ప్రశ్న: మీ గురించి తరచూ వదంతులు ప్రచారం అవుతున్నాయి. బాధగా లేదా? జవాబు: మొదట్లో కొంచెం బాధనిపించేది. ప్రస్తుతం అలాంటి వదంతులు తగ్గాయిలెండి. ప్రశ్న: ప్రస్తుతం కథానాయికుల పరిస్థితి? జవాబు: నిజం చెప్పాలంటే తమిళంలో సీనియర్ కథానాయికల గురించి నాకు తెలియదు గాని ఇప్పుడు భారతీయ సినిమాలో హీరోయిన్ల వయసు పెరుగుతున్న కొద్దీ ప్రాధాన్యత తగ్గుతూ పోతుంది. హాలీవుడ్లో అలా కాదు. అక్కడ వయసు పెరుగుతున్న కొద్ది గిరాకీ పెరుగుతుంది. -
ఇప్పటికీ నాకు సిగ్గే!
భారతీయ చిత్రసీమ గర్వించదగ్గ నటుల్లో అమితాబ్ బచ్చన్ ఒకరు. నాలుగున్నర దశాబ్దాల సినిమా కెరీర్లో ఆయన అందుకోని అభినందనలు లేవు. అయితే, కెరీర్లో మొదటి అభినందన అందుకున్నప్పుడు బిడియపడినట్లే ఇప్పటికీ పొగడ్తలంటే బిడియమే అంటున్నారు అమితాబ్. ఇన్నేళ్లయినా ఇంకా అభినందనలకు అలవాటుపడలేదని ప్రముఖ దర్శక, నిర్మాత యశ్ చోప్రా మెమోరియల్ అవార్డు అందుకున్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఆ మాటే అందరితో చెప్పడంతో పాటు తన బ్లాగ్‌లో కూడా ప్రస్తావించారు. వేదికపైన అందరూ అభినందిస్తుంటే, కూర్చుని వింటున్న నేను తెగ ఇబ్బందిపడిపోతుంటాననీ, ఈ అభినందనలకు నేను అర్హుణ్ణి కాదని నా ఫీలింగ్ అనీ అమితాబ్ పేర్కొన్నారు. ఎదుటి వ్యక్తులు అభినందిస్తున్న సమయంలో ఎలాంటి హావభావాలు పెట్టాలో తెలియడం ఓ కళ అనీ, ఆ కళను తానెప్పటికీ నేర్చుకోలేననీ ఆయన అన్నారు. అయితే, అందరూ అభినందిస్తున్నప్పుడు... ఓ నటుడిగా సాధించింది తక్కువ అనీ, ఇంకా సాధించాల్సింది చాలా ఉందనీ అనుకుంటానని తెలిపారు అమితాబ్ బచ్చన్. ఇలా చెప్పడంలోనే అమితాబ్ సంస్కారం ఏంటో తెలుస్తోంది కదూ! -
పదికాలాల... బాలచంద్రికలు
కె.బాలచందర్ - భారతీయ సినిమా సగర్వంగా తలెత్తి చూసే దర్శక శిఖరం. మాలాంటి వాళ్లం పుట్టకముందే ఆయన ప్రముఖ రచయిత, దర్శకుడు. అంటే మాకు ఊహ తెలిసి, సినిమాల మీద మోజు పడేటప్పుటికి బాలచందర్ ఆలోచనలు, సినిమాలు అవుట్‌డేటెడ్ అయిపోయి ఉండాలి. కాని... మొన్న మొన్నటి దాకా ఏ జనరేషన్ ఎమోషన్ - ఆ జనరేషన్ టైమ్‌లోనే పట్టుకుని - మధ్య తరగతి కష్టాలు, యువతరం ఆవేశాలు, ప్రేమ సెల్యులాయిడ్‌పై ఆవిష్కరించిన అద్భుత చిత్రకారుడు బాలచందర్. తమిళుడైనా - తమిళ, తెలుగు, కన్నడ భాషలతో పాటు హిందీలో కూడా సూపర్‌హిట్ సినిమాలు తీశారు. కాని ఎక్కడా ఏ ప్రాంతం, భాష వాసనా రాదు. మానవత్వం, వాస్తవాల పరిమళాలే వీస్తాయి. కొన్ని ఆహ్లాదంగా ఉంటాయి. మరికొన్ని చాలా ఘాటుగా ఉంటాయి. 50 సంవత్సరాల సినిమా కెరీర్లో 101 సినిమాలు - వాటిలో కొన్ని వందల జీవితాలు - ముందు తరాలకి కూడా చేరువయ్యేలా. వాటిలో నుంచి కొన్ని ఎంపిక చేసుకోవడం కష్టమైనదే. వేటిని కాదనగలం? వేటిని వదిలేయగలం? అయినప్పటికీ మనసుపై చెరగని ముద్రవేసిన ఓ పది సినిమాల గురించి... బొమ్మా - బొరుసా? (1971) ‘సుఖదుఃఖాలు’, ‘సర్వర్ సుందరం’, ‘సంబరాల రాంబాబు’ - ఈ సినిమాలతో బాలచందర్ కథలు తెలుగు ప్రేక్షకులని పలకరించాయి. సుఖదుఃఖాలు (మేజర్ చంద్రకాంత్), సర్వర్ సుందరం - ఆయన రాసిన నాటకాలు. ‘భలే కోడళ్లు’, ‘సత్తెకాలపు సత్తయ్య’ చిత్రాలతో తెలుగు తెరకి దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆయన స్టార్డమ్ స్టామినాకి తెలుగులో బాక్సాఫీస్ సాక్షిగా శ్రీకారం చుట్టిన సినిమా ‘బొమ్మా-బొరుసా?’. అంతవరకూ బాలచందర్‌గారి స్క్రిప్టుల్లో నాటకీయత, సెంటిమెంట్‌కి ప్రాధాన్యత ఉండేది. పూర్తిగా వినోదంతో కొంత వ్యంగ్యాన్ని జోడించి చెప్పిన కథ ‘బొమ్మా- బొరుసా?’. 1971లో వచ్చిన ఈ సినిమా ఇప్పటి అత్తా అల్లుళ్ల ఛాలెంజ్‌ల కథలకి ముడిసరుకు. బాలచందర్ సినిమా నేపథ్యానికి కూడా ప్రాధాన్యత ఇస్తారనే దానికి ఈ సినిమా మరో ఉదాహరణ. విజయవాడ, నాగార్జున సాగర్ బాక్డ్రాప్లో కథ నడుస్తుంటుంది. అహంభావి, గర్విష్టి, డబ్బు మీద ఆశ ఉన్న (అత్తగారికీ (ఎస్. వరలక్ష్మి), ముగ్గురు అల్లుళ్లు (జట్కాబండి అల్లుడు - చలం, మిగిలిన వారు రామకృష్ణ, చంద్రమోహన్) ఎలా బుద్ధి చెప్పారనేది లైన్. సాధారణంగా బాలచందర్ సినిమా ప్రారంభంలోనే ప్రధాన పాత్రలని పరిచయం చేసి, కథలో ఇన్వాల్వ్ అయ్యేలా కథనాన్ని పరిగెత్తిస్తారు. ఫస్ట్ షాట్‌లోనే సినిమా ఎలా ఉంటుందనేది చెప్పడం బాలచందర్ స్టయిల్. దానికి మరో అందమైన సాక్ష్యం - ఈ సినిమా ప్రారంభం. బొడ్లో తాళాల గుత్తి దోపుకున్న ఎస్. వరలక్ష్మి మాట్లాడుతుంటే, పక్కనే బీరువా మీద ఉన్న బొమ్మ తలాడిస్తుంటుంది. అత్త మాటలకి అల్లుడు తందానా తానా అనేది చాలా సింబాలిక్‌గా చెప్పారు. ఎ.వి.ఎమ్. సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. అరంగేట్రం (తమిళం) (1973) తమిళనాట పెను సంచలనం సృష్టించిన సినిమా ‘అరంగ్రేటం’. బాలచందర్ సినిమాల్లో స్త్రీ పాత్రలని చాలా బోల్డ్‌గా చూపించడం ఈ సినిమాతోనే ప్రారంభమైనందని చెప్పాలి. ఓ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువతి తన కుటుంబాన్ని పోషించుకోవడానికి వ్యభిచార వృత్తిలోకి దిగడమనేది ఈ సినిమా కథాంశం. ప్రమీల కథానాయిక పాత్ర పోషించారు. అప్పట్లో ఈ సినిమా పలు వివాదాలకి, విమర్శలకి దారి తీసింది. అయినా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కమల్‌హాసన్ నటించిన మొదటి సినిమా ఇదే. ఈ చిత్రాన్ని తెలుగులో ‘జీవిత రంగం’ పేరుతో పి.డి. ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించారు. హిందీలో ముంతాజ్, రాజేష్‌ఖన్నాలతో ‘అయినా’ అని బాలచందరే స్వయంగా రీమేక్ చేశారు. అంతులేని కథ (1976) బాలచందర్ కీర్తి తెలుగునాట పతాక స్థాయికి చేర్చిన సినిమా ‘అంతులేని కథ’. ఓ వర్కింగ్ ఉమెన్ జీవితంలోని ఒడిదుడుకులని, ఆశలని, నిరాశలని చాలా హృద్యంగా చిత్రీకరించారు బాలచందర్.‘మేఘ దాకా తారా’ అనే అస్సామీ చిత్రం ప్రభావం దీనిపై ఉందని కొంతమంది విమర్శకులు అంటుంటారు. జయప్రదకి విశేషంగా పేరు తెచ్చి పెట్టిన ఈ సినిమాలో ఎందరో మహిళా ఉద్యోగినులు తమ వేదనని వెదుక్కున్నారు.మొదట సుజాత హీరోయిన్గా 1974లో ‘అవళ్ ఒరు తోడర్ కథై’ పేరుతో ఈ సినిమా తీశారు. హిందీలో రేఖతో తాతినేని రామారావు ‘జీవన్‌ధార’, కన్నడంలో సుహాసినితో బాలచందరే స్వయంగా ‘బెంకెయిల్లి అరిడ హూవు’ (అగ్నిలో పుట్టిన పువ్వు) పేరిట రీమేక్ చేశారు. బెంగాలీలో కూడా ‘కబిత’ పేరుతో వచ్చింది. ఈ సినిమా ముగింపులో, పబ్లిసిటీలో ‘ఇంకా ఉంది’ అని ప్రచారం చేయడం - ప్రేక్షకులు సరికొత్తగా ఫీలయ్యారు. ఈ చిత్రం మీద ఆసక్తి రెట్టింపయ్యింది. అపూర్వ రాగంగళ్ (1975) తండ్రి మీద ఓ యువతి మనసు పడుతుంది. ఆ తండ్రి కొడుకు ఆ యువతి తల్లిపై ప్రేమ పెంచుకుంటాడు. విచిత్రమైన ఈ పొడుపు కథలాంటి కథతో సినిమా తీయాలంటే ఆ డెరైక్టర్‌కి ఎన్ని గట్స్ ఉండాలి? ఆ ధైర్యం బాలచందర్‌కి ఉంది కాబట్టే - ఆయన అజరామరమైన దర్శకుడయ్యారు. 1975లో వచ్చిన ఈ సినిమా చాలా చర్చనీయాంశమైంది. సామాజిక కట్టుబాట్లని సవాల్ చేసింది. శ్రీవిద్య, కమల్‌హాసన్, జయసుధ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలోనే సూపర్‌స్టార్ రజనీకాంత్ పరిచయమయ్యారు. ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ఈ కథాంశం కొత్తగా ఉంటుంది. అంతే కాదు - స్వతహాగా రచయిత అయిన దర్శకరత్న దాసరి నారాయణరావు తొలిసారి రీమేక్ చేసింది ఈ సినిమానే (తూర్పు-పడమర). జాతీయ అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు ఎన్నో సొంతం చేసుకుంది ఈ ‘అపూర్వ రాగంగళ్’. బాలచందర్ స్వయంగా రాజ్‌కుమార్, కమల్‌హాసన్, హేమమాలిని, పద్మిని కొల్హాపురిలతో ‘ఏక్ నయా పమేలీ’ పేరుతో రీమేక్ చేశారు. ఆకలి రాజ్యం (1981) 80వ దశకంలో యువతరం ముందున్న ప్రధాన సమస్య ఆకలి, నిరుద్యోగం - మరోవైపు కుటుంబం పరువు ప్రతిష్టలు నిలబెట్టడం. అప్పటికే బాలచందర్ ఆడవాళ్ల కన్నీళ్లు (అంతులేని కథ, ఇది కథ కాదు, ఆడవాళ్లు మీకు జోహార్లు) కుర్రాళ్ల కలలు (మన్మథలీల, మరోచరిత్ర, అందమైన అనుభవం) తెరపై చూపించేశారు. రగులుతున్న సమస్యల్ని తనదైన కోణంలో చెప్పాలనుకున్నారు. అందుకు దేశ రాజధాని ఢిల్లీనే నేపథ్యంగా ఎంచుకున్నారు. వ్యవస్థ మీద ఎంత వ్యంగ్యంగా చెప్పాలో అంత వ్యంగ్యంగా చెప్పారు. ఓ సంగీత విద్వాంసుడి కొడుకు పొట్టకూటి కోసం క్షురకవృత్తి చేపట్టడం పరాకాష్ట. మహాకవి శ్రీశ్రీ అభిమానిగా కమల్‌హాసన్ ఆశువుగా చెప్పిన కవితలు, ప్రసిద్ధ గాయకుడు పి.బి. శ్రీనివాస్ రాసిన హిందీ పాట... బురదలో పడ్డ ఆపిల్‌ని కడుక్కుని తినడం - ఒకటా, రెండా.. ఎన్నెన్నో గుర్తుండిపోయే అంశాలు. కమల్‌హాసన్, శ్రీదేవి జంటగా నటించిన ఈ చిత్రంలో ప్రతాప్ పోతన్ తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యాడు. 1981 జనవరి 9న ఈ సినిమా విడుదలయితే, దీనితోపాటు ఎన్టీఆర్-రాఘవేంద్రరావుల ‘గజదొంగ’, జనవరి 14న కృష్ణ-రాఘవేంద్రరావుల ‘ఊరికి మొనగాడు’ విడుదలయ్యాయి. ఆ కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ రెండింటినీ తట్టుకుని ఈ సినిమా ఘన విజయం సాధించిందంటే ‘ఆకలిరాజ్యం’ పొటెన్షియాలిటీ అర్థం చేసుకోవచ్చు. ఎరడు రేఖగళ్ (కన్నడ) (1984) తన ప్రియురాలే తనపై అధికారిణిగా వస్తే... ఆమెని వదిలి, మరొకరిని వివాహమాడిన అతని పరిస్థితి ఏమవుతుంది? ‘ఇరుకోడగళ్’ అనే పేరుతో షావుకారు జానకి, జెమినీ గణేశన్, జయంతిలతో 1969లో కె. బాలచందర్ తమిళంలో తీసిన సినిమా ఇది.ఈ కథాంశంతో తెలుగులో ‘కలెక్టర్ జానకి’ సినిమా వచ్చింది.బాలచందర్ తమిళ-తెలుగు చిత్రాలతో బిజీగా ఉన్నా, 1983లో ‘బెంకెయిల్లి అరడ హొవు’ చిత్రంతో కన్నడంతో ఎంటరయ్యారు. ఆ సినిమా సక్సెస్‌తో - 1984లో శ్రీనాథ్, సరిత, గీతలతో ‘ఎరడు రేఖగళ్’ (రెండు రేకులు) రూపొందించారు. ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మాటల్లో చెప్పలేం. హిందీలో అమితాబ్ ‘సంజోగ్’ చిత్రానికి మూలం ఇదే. అంటే బాలచందర్ ఓ కథ రాస్తే, అది ఏ ఒక్క భాషకో పరిమితం కాదు. భారతదేశమంతటా ఆ కథ భావోద్వేగం కలిగిస్తుందనడానికి ఈ సినిమా మరో ఉదాహరణ. ఏక్ దూజ్ కే లియే (1981) భారతదేశాన్ని ఉర్రూతలూగించిన ప్రేమకథా చిత్రం ‘ఏక్ దూజ్ కే లియే’ మన తెలుగు సూపర్‌హిట్ ‘మరో చరిత్ర’ని హిందీలో రీమేక్ చేశారు బాలచందర్. సినీ లెజెండ్ ఎల్.వి. ప్రసాద్ ఈ చిత్ర నిర్మాత. తెలుగువారు, తమిళుల మధ్య ఎక్కువ అభిప్రాయభేధాలుండవు. కాని హిందీ-తమిళ భాషల మధ్య రాజకీయ నాయకుల పుణ్యమాని చాలా దూరం సృష్టించి ఉంది. అందుకే హిందీలో ఈ చిత్రం మరింత జనరంజకమయ్యింది. ప్రేమకి భాష అడ్డుకాదని వెండితెరపై ఒట్టేసి, చాలా బలంగా చెప్పిన సినిమా ఇది. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంగారిని హిందీకి తీసుకెళ్లి, జాతీయ అవార్డుతో ఆయన ప్రతిభ ఏంటో దేశానికి చాటి చెప్పిన సినిమా ఇది. ఈ సినిమాలోని విరహం, విషాదం మబ్బు తునకలా గుండెని తడుపుతూనే ఉంటుంది. తెలుగులో విషాదాంతమైన ముగింపుని హిందీలో సుఖాంతం చేస్తే ఎలా ఉంటుందని చాలా చర్చలు జరిగాయి. రెండు రకాల క్లైమాక్స్‌లు షూట్ చేసి, చివరికి ట్రాజెడీనే ఎంచుకున్నారు. అందుకే ‘దేవదాసు’లా ఇదో అజరామరమైన ప్రేమకథ. ఇప్పటికీ ప్రేమకథల్లో (తొలిప్రేమ) బాలు యే హీరో. తన్నిరు - తన్నిరు (1981) మనిషికి అత్యవసరమైన వాటిల్లో నీరు ముఖ్యం. గాలి, నీరు అనేవి ప్రకృతి ఇచ్చేవి. కాని వాటిని కూడా రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టిస్తే సామాన్యులు ఎలా నలిగిపోతారనేది ‘తన్నిరు-తన్నిరు’ కథాంశం. ఓ పాపులర్ తమిళ నాటకం ఆధారంగా బాలచందర్ దీనిని తెరకెక్కించారు. 1981లో సరిత ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం గ్రామీణ భారతాన్ని కళ్లకి కట్టినట్లు చూపించింది. యధావిధిగానే ఈ సినిమా సంచలనం రేకెత్తించింది. జాతీయ అవార్డులతో పాటు - చాలా ఫిలిమ్ ఫెస్టివల్స్‌లో ఈ సినిమా ప్రదర్శితమైంది. తెలుగులో ‘ఏ ఎండకా గొడుగు’ పేరుతో అనువాదమైంది. భారతీయ వంద ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా ఈ సినిమాని ఐబిఎన్ ఛానెల్ పేర్కొంది సింధు భైరవి (1985) కళాకారుడికి ఎప్పుడూ ప్రేరణ అవసరం. అది ప్రకృతి నుంచి లభించవచ్చు. లేదా - ఎవరి ప్రేమ నుంచో దొరకొచ్చు. ఆ రెండోది అయితేనే సమస్య వస్తుంది. ఓ కర్ణాటక సంగీత విద్వాంసుడు తన ప్రియురాలిని స్ఫూర్తిగా తీసుకుని రాణిస్తుంటాడు. ఆమె దూరం కావడంతో సంగీతానికి దూరమవుతాడు. తాగుడికి బానిసవుతాడు. ఆ పరిస్థితి నుంచి బయట పడటానికి ఇద్దరు స్త్రీలు చేసిన ప్రయత్నం ఈ సినిమా. సుహాసిని ఉత్తమ నటిగా జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన సినిమా ఇది. అలాగే ఇళయరాజా, చిత్రాలు కూడా జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. తమిళంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో అదే పేరుతో అనువాదమైంది. రుద్రవీణ (1988) ‘ఇది కథ కాదు’ ‘47 రోజులు’ - కె. బాలచందర్ మెగాస్టార్ చిరంజీవితో రూపొందించిన చిత్రాలు. ఆ రెండింట్లో నెగెటివ్ పాత్రలు చేశారు చిరంజీవి. అన్నట్లు ‘ఆడవాళ్లూ - మీకు జోహార్లు’లో అతిథిపాత్రలో తళుక్కున మెరిశారు. చిరంజీవి సోదరుడు నాగబాబు నిర్మాతగా మారి అంజనా ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించినప్పుడు - దర్శకుడిగా వాళ్ల ఫస్ట్ ఛాయిస్ బాలచందర్‌గారే! అన్నాహజారే జీవితం స్ఫూర్తిగా, ‘రుద్రవీణ’ కథని మలిచారు బాలచందర్. మద్యపానం వల్ల కలిగే నష్టాన్ని చెప్పడంతో పాటు - కళ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడానికి ఉపయోగపడాలనే గొప్ప సందేశం ఇచ్చిన సినిమా ఇది. ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రంగా నర్గీస్‌దత్ అవార్డ్ కైవసం చేసుకుంది ‘రుద్రవీణ’. అంతే కాదు - తూర్పు గోదావరి జిల్లాలోని ఓ ఊరిలో ‘రుద్రవీణ’ స్ఫూర్తితో యువకులందరూ కలిసి ఊళ్లోవాళ్ల తాగుడు మాన్పించి, ఆ డబ్బుతో లైబ్రరీ, స్కూల్ ఏర్పాటు చేసుకున్నారు. ఎంత ప్రభావితం చేశారనే దానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి? -
1000 వారాల డిడిఎల్జె
-
భారతీయ సినిమా అంటే... బాలీవుడ్డేనా !?
1970లలో దేశమంతటా మధ్యతరగతిని అమితంగా ఆకట్టుకున్న హీరో అంటే... అమోల్ పాలేకరే. ఆయన నటించిన ‘గోల్మాల్’, ‘చిత్‌చోర్’, ‘ఛోటీ సీ బాత్’ - ఇలా ప్రతి చిత్రం అప్పట్లో ఒక క్రేజ్. అందుకే, మరాఠీ గడ్డ మీద పుట్టిన ఈ మరపురాని నటుడికి ఆ నాటి నుంచి ఈ నాటి దాకా ఒక వర్గంలో చెరగని అభిమానం. ఉత్తమ నటుడిగా ఆరుసార్లు ప్రభుత్వ అవార్డులు అందుకున్న ఆయన ఆ తర్వాత మనసుకు నచ్చిన పాత్రలే చేస్తూ, అరుదుగా తెరపైకొస్తున్నారు. అయితే, దర్శకుడిగా, మంచి చిత్రాల ఉద్యమశీలిగా సినిమా రంగంతోనే మమేకమై జీవితం సాగిస్తున్నారు. ‘యాదృచ్ఛి కంగా నటుణ్ణయ్యా. తప్పనిసరై నిర్మాతనయ్యా. ఏరికోరి దర్శకుడినయ్యా...’ అనే అమోల్‌తో సంభాషణ ఒక ఆలోచనాంతరంగ యానం. రంగస్థలం, సినిమా, టీవీ - ఇలా అన్నిటిలో తనదైన ముద్ర వేసిన ఈ కళాకృషీవలుడికి సినీ మీడియవ్‌ు మీద అతి స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. అటు కళాత్మక చిత్రాలకూ, ఇటు కమర్షియల్ చిత్రాలకూ మధ్య వారధిగా... నేటి మార్కెట్ చోదిత సినీ సృజనపై అమితమైన ఆవేదన ఉంది. ‘చిల్డ్రన్స ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా’కు సారథ్యం వహిస్తూ, దేశంలో బాలల చలనచిత్రోత్స వానికి నాంది పలికిన వ్యక్తిగా... బాలల సినిమా భవిష్యత్తుకు చేయాల్సిన పనిపై అవగాహన ఉంది. అమోల్ పాలేకర్‌ను కదిలిస్తే... ఆ భావాల జల్లులో తడవాల్సిందే. ఆలోచనలో మునగాల్సిందే. నేటితో ఏడుపదులు నిండిన అమోల్ అంతరంగ ఆవిష్కరణ... అభిమాన పాఠకులకు ‘సాక్షి ఫ్యామిలీ’ గిఫ్ట్. నటుడిగా, దర్శకుడిగా నేనెప్పుడూ ప్రధాన స్రవంతి చిత్రాల్లో భాగం కాదు. 47 ఏళ్ళుగా ఏటికి ఎదురీదుతూనే ఉన్నా. ప్రధాన స్రవంతికి దూరంగా ఇన్నేళ్ళుగా ఏదో ఒకటి చేయగలుగుతున్నందుకు హ్యాపీ. నిజానికి, బాసు ఛటర్జీ, హృషీకేశ్ ముఖర్జీల చిత్రాలు అప్పట్లో ఆడాయంటే కారణం - అవి ప్రధాన స్రవంతివి కాకపోవడమే. బస్సులో, లోకల్ ట్రెయిన్లో తిరిగే హీరోగా తెరపై కనిపించిన మొదటివాణ్ణి నేనే. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే 1960ల నుంచి ’80ల వరకు రంగస్థలం, సంగీతం, నృత్యం, శిల్పకళ, సినిమా - ఇలా అనేక రంగాల్లో మన ప్రభ వెలిగింది. ఆ కాలఘట్టంలో మన భారతీయ ఉనికినీ, గుర్తింపునూ చాటుకోగలిగాం. ఆయా రంగాల్లో ఉద్దండులైన మహామహులు చుట్టూ ఉండేవారు. దాంతో మన భారతీయ సమాంతర చలనచిత్ర ఉద్యమం కూడా పరిఢవిల్లింది. కానీ, క్రమంగా ఆ వెలుగు తగ్గింది. వాణిజ్య విజయమే గీటురాయా? భారతీయ సినిమా శతవసంతాలు జరుపుకొన్నా, ఇప్ప టికీ అమ్మాయి, అబ్బాయిల ప్రేమకథల చుట్టూనే తిరుగు తున్నాం. వాటి నుంచి బయటకు రావడం లేదు. ఇవాళ మన సినిమాలు ‘వంద కోట్ల క్లబ్’లో చేరడం ఆనందమే అయినా, అంతకు మించి ఈ మెయిన్ స్ట్రీమ్ చిత్రాల గురించి మాట్లాడు కోవడానికి ఏమీ లేదన్నది బాధగా ఉంది. ఇక, నాన్ మెయిన్ స్ట్రీమ్ చిత్రాల గురించేమో మనమసలు మాట్లాడడమే లేదు. మరోపక్క ప్రాంతీయ భాషల్లోనూ హీరోలకు కోట్లలో పారితోషికాలిచ్చే స్థాయికి సినీ పరిశ్రమ చేరింది. ప్రాంతీయ భాషా చిత్రాలు కూడా పదుల కోట్లలో వసూలు చేస్తున్నాయి. ఆ మధ్య ‘దునియా దారీ’ అనే మరాఠీ చిత్రం రూ. 35 కోట్లు వసూలు చేసింది. వ్యాపార రీత్యా అది శుభపరిణామమే. కానీ, సినిమాకు సంబంధించి అది ఒక కోణమే! కళాత్మకత గురించి పట్టింపు లేకుండా, ఎంతసేపూ కమర్షియల్ విజయాన్నే గీటురాయిగా పెట్టుకోవడం తప్పు అంటాను! సినిమా ఫర్నిచర్లో భాగమైన కథానాయిక ఇవాళ మనదేశంలో మహిళా ప్రధాన చిత్రాలు ఎన్నొస్తున్నాయి చెప్పండి! ప్రస్తుతం మన హీరోయిన్లు సినిమాలో ఉపయోగించే ఫర్నిచర్లో భాగంగా కనిపిస్తున్నారు. అంతే! దురదృష్టవశాత్తూ మన సినీ సంస్కృతి అలాంటిది. అందుకే, బలమైన స్త్రీ పాత్రలే లేకుండా మన చిత్రాలొస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే, ఇవాళ మీడియా కూడా మారింది. మీడియా అడుగుతున్న తొలి ప్రశ్న - ఇవాళ సినిమా ఎంత వసూలు చేసిందనే! మన దృష్టి అంతా ఎన్ని స్క్రీన్స్‌లో రిలీ జైంది, ఎంత వసూలు చేసిందనే అంశాల మీదే! అలాంటి ఆలోచనా ధోరణిలో ఉంటే, మంచి సినిమాలెలా వస్తాయి! అలాంటి చిత్రాలకు ప్రచారమేదీ? అప్పట్లో బాసూ ఛటర్జీ దర్శకత్వంలో నేను, విద్యాసిన్హా నటించిన ‘రజనీగంధా’ (1974) అందరికీ తెలుసు. ’67లోనే మరాఠీలో సినీనటుణ్ణి అయిన నాకు అది తొలి హిందీ చిత్రం. విద్యాసిన్హా తెరపైకి రావడం అదే మొదలు. ఆ చిత్రంలో వాణిజ్యాంశాలు లేవు. నాటకీయ దృశ్యాలూ లేవు. వాస్తవ జీవితాన్ని ప్రతిబింబించడం వల్లే ఆ సినిమా విజయవంత మైంది. అదే తర్కాన్ని ఇవాళ మన సినిమాలకు, కనీసం బాలల చిత్రాలకైనా ఎందుకు వర్తింపజేయం? అయితే, పాతవన్నీ మంచివి. కొత్తవన్నీ చెత్తవనే భావన నాకు లేదు. ఇవాళ మనం గురుదత్ చిత్రాల గురించి గొప్పగా చెప్పుకుంటాం. కానీ, ఆ సమయంలోనూ చెత్త సినిమాలొచ్చా యని మర్చిపోకూడదు. ఇవాళ్టి తరంలోనూ మంచి సినిమాలు తీసే రాజ్‌కుమార్ హిరానీ, అనురాగ్ కాశ్యప్, ఆశుతోష్ గోవా రీకర్, జోయా అఖ్తర్ లాంటివాళ్ళున్నారు. ప్రస్తుత కమర్షియల్ వాతావరణంలోనూ కొన్ని మంచి చిత్రాలొస్తున్నాయి! ‘పాన్ సింగ్ తోమార్’, ‘ఉడాన్’, ‘కహానీ’ లాంటివి మంచివేగా! అయితే, వాటికి తగినంత ప్రచారం రావడం లేదు. 4 కోట్లతో తీసి, రూ. 12 కోట్లు వచ్చినవాటి గురించి మనం మాట్లాడం. వంద కోట్లు రాకపోతే, ఫ్లాప్ అనేస్తున్నాం. అది తప్పు. ఇరానియన్ సినిమాల్లో ఐటమ్ సాంగులున్నాయా? నిజానికి, కళాత్మక సినిమా తీయాలంటే, వసూళ్ళ గురించి మర్చిపోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ, అది వట్టి అపప్రథ. అప్పట్లో నాలాంటి వాళ్ళతో దర్శ కుడు బాసూ ఛటర్జీ తీసినవి నాటకీయత లేకపోయినా, సక్సెస్ సాధించాయి. అంతెందుకు, ఇప్పటికీ గొప్పగా చెప్పుకొనే ఇరానియన్ చిత్రాలు సైతం ఇటు కళాత్మకంగా ఉంటూనే, అటు వాణిజ్య విజయం సాధిస్తున్నాయి. మనం వాణిజ్య ఫార్ములా అనుకొనే ఐటమ్ సాంగులు, ఫైట్లు లేకుండానే ఆ చిత్రాలు వస్తున్నాయి. కాబట్టి, మనవాళ్ళు ‘వాణిజ్యపరంగా సేఫ్‌గా ఉండడాని’కంటూ ఏవేవో లెక్కలేసుకొని మాట్లాడడం, స్టార్లతోనే సినిమాలు తీయాలనుకోవడం తప్పు. అయినా, స్టార్లతో తీసినా సక్సెస్ వస్తుందన్న నమ్మకం ఏముంది! స్టార్లున్నా నూటికి 90 సినిమాలు ఫెయిలవుతున్నాయిగా! ఒక చిన్న ఉదాహరణ. మన అనేక రాష్ట్రాల కన్నా చిన్నది - చెక్ రిపబ్లిక్. ఇవాళ అక్కడి సినిమాలు ప్రపంచమంతటా చెప్పుకొనే స్థాయిలో ఉంటున్నాయి. మంచి చిత్రాలు రావడానికి డబ్బుల కన్నా కొత్త ఆలోచన ముఖ్యం. సాధారణ చిత్రాల మధ్య వినూత్నంగా ఉంటూ, ఆకర్షించాలి. అదే కీలకమంత్రం. సాహిత్యానికి దూరమవడం దెబ్బే! ఇప్పటికీ భారతీయ సినిమా అంటే, ఎప్పుడూ సోకాల్డ్ ‘బాలీవుడ్’ గురించే మాట్లాడుతున్నాం. కానీ, తెలుగు, తమిళ, మలయాళ, బెంగాలీ, మరాఠీ తదితర భాషా చిత్రాల గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ప్రతి పాంతానికీ తనదైన ప్రత్యేక భాష, సంస్కృతి, వ్యక్తిత్వం ఉన్నాయి. అవన్నీ కలిస్తేనే - మన భారతీయ సినిమా. అది గ్రహించకుండా ఎంతసేప టికీ ‘బాలీవుడ్’నే ప్రస్తావిస్తున్నాం. సాహిత్యం నుంచి మన సినిమాలు దూరం కావడం మరో పెద్ద దెబ్బ. నిజానికి, మన భాషల్లో అద్భుతమైన రచనలున్నాయి. సంప్రదాయం, సంస్కృతి ఉన్నాయి. వాటిని తెరపైకి తీసుకొస్తే ఇంకేం కావాలి! సాంకేతిక యుగంలో వచ్చిన తంటా గమ్మత్తేమిటంటే, ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది. పాత తరాలకు వాటిని చూసి భయం కానీ, పిల్లలకది ఈజీ. అయితే, మరింత తెలుసుకోవాలనే కోరిక ఈ తరంలోని కొందరిలో ఆ తొలి దశలోనే ఆగిపోతోంది. దేని గురించైనా తెలుసుకోవాలంటే వికీపీడియాలో చూసి వచ్చే స్తారు. అది సరైనదో కాదో చూసుకోవడం మానేస్తున్నారు. దాంతో, అసలు తంటా వస్తోంది. ఒకప్పుడు లైబ్రరీలకు వెళ్ళి, పుస్తకాలు వెతికి, చదివి, తెలుసుకొని, లోతుగా అధ్యయనం చేసేవాళ్ళం. ఇప్పుడది మానేశాం. ఇవాళ ఎవరైనా సులభంగా సినిమా తీసే డిజిటల్ యుగం వచ్చింది. కానీ, ఏం లాభం! ఉదాహరణకు, మనం కెమేరాలో తీసింది కేవలం ‘బొమ్మ’, అంతేతప్ప ‘ఫోటో’ కాదు. సరైన ఎక్స్పోజర్, సరైన ప్రింటింగ్ లాంటి వన్నీ ఉంటేనే ఏది ‘మంచి ఫోటో’ అనేది తెలుస్తుంది. అలాగే, సినీ రూపకల్పన కూడా! ముఖ్యంగా, ఇవాళ పిల్లల సినిమా తీయాలంటే, వాళ్ళకు ఏది ఆసక్తికరం, ఏది బాగుంటుందని ఆలో చించాలి. దానికి మళ్ళీ మనం ప్రాథమిక అంశాల దగ్గర కెళ్ళాలి. కానీ, అందుకు టైమ్ లేదంటాం. చిక్కంతా అదే! బాలల చిత్రాల్లోనూ... చూపు అటే! నిజంగా, ఇవాళ బాలల చిత్రాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని వస్తున్నాయంటే విచారం కలుగుతుంది. ఇన్ని కోట్ల మంది యువ జనాభా ఉన్నప్పటికీ మనం ఏమీ చేయడం లేదంటే తప్పు మనదే! ఎంతసేపటికీ ‘చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా’ ఏం చేస్తోంది, భారత ప్రభుత్వం ఏం చేస్తోంది అని విమర్శలు గుప్పిస్తే సరిపోదు. మన పిల్లలకు మనం చేయా ల్సింది చేస్తున్నామా అన్నది ముఖ్యం. అది మనం ఆత్మ పరి శీలన చేసుకోవాలి. ఇవాళ్టికీ బాలల చిత్రం అనగానే చాలా మంది మాయలు, దయ్యాల కథ లాంటివనుకుంటున్నారు. అవే తీస్తున్నారు. అది తప్పు. అంతకు మించి అంశాలెన్నో ఉన్నాయి. కానీ, వాటికి మార్కెట్లో అండ కావాలి. నా స్వీయ అనుభవమే చెప్పాలంటే, ఆరేళ్ళ క్రితం ‘దుమ్ కటా’ అనే హిందీ చిత్రం పిల్లల కోసం తీశా. అది మిస్టరీ కథాంశం కాదు. దయ్యాల కథ కాదు. దానికి గుల్జార్ గీత రచయిత. ప్రసిద్ధ శంకర్ -ఎహ్సాన్- లాయ్ త్రయం సంగీతమిచ్చింది. ఓంపురి లాంటి ప్రముఖులు నటించారు. కానీ, ఏం లాభం! ప్రచారం రాలేదు. ఎవరికీ తెలియదు. స్టార్ వ్యాల్యూ ఉన్నా, వాణిజ్య అంశాలు లేవని ఆ సినిమాను మార్కెట్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. అదీ దుఃస్థితి. ఈ విషవలయంతో అంతా మార్కెట్ నడిపించిన వైపు నడిచేస్తున్నారు. కొత్త భాష, భావవ్యక్తీకరణ అవసరం! నిజానికి, కొంతకాలంగా ‘జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ’ (ఎన్.ఎఫ్.డి.సి) చాలా మంచి సినిమాలు అందిస్తోంది. సహ నిర్మాణమైన ‘ది లంచ్ బాక్స్’, స్వయంగా నిర్మించిన ‘ది గుడ్ రోడ్’ లాంటి వాటితో ఇవాళ భారతీయ సినిమా ముఖచిత్రాన్నే అది మార్చేసింది. ఒక గౌరవాన్ని తెచ్చింది. మనందరం గర్వించేలా చేసింది. కానీ, వాటికి మనం అండదండగా నిలవడం లేదు. ఎంతసేపటికీ ‘ఎంతో డబ్బు వృథా అయింది’ అంటూ నెగటివ్ కోణం గురించే చెబుతు న్నాం. పాజిటివ్ కోణం గురించి మాట్లాడడం లేదు. అలాగే, కాఫీ మొదలు సినిమా దాకా ప్రతి ఒక్కటీ ఇన్‌స్టంట్‌గా ఉండాలని ఇవాళ్టి తరం భావిస్తోంది. అదే వాళ్ళ మంత్రం. కానీ, జీవితానికి అది సరిపడదని నా భావన. ప్రతి సమస్యకూ మనం త్వరితగతి పరిష్కా రాలు, సమాధానాలు ఆశిస్తున్నాం. కానీ, అలాంటివి ఉండవు. పిల్లలను తీర్చిదిద్దేందుకూ, వారిలో సున్నిత మైన భావోద్వేగాల స్పృహ కలిగించేందుకూ మంచి సాహిత్యం అవసరం. మంచి రంగస్థలం అవసరం. అలాగే, మంచి సంగీతం, మంచి సినిమా కూడా అవసరం. అప్పుడే పిల్లలు - మంచి పెద్దలుగా, మంచి మనుషులుగా తయారవుతారు. అయితే, పిల్లలు సైతం పరస్పరం ఎస్.ఎం.ఎస్.ల ద్వారా, ఇంటర్నెట్లో ఇ-మెయిల్స్ ద్వారా మాట్లాడుకుంటున్న రోజులివి. అందుకే, వాళ్ళను ఆకట్టుకోవాలంటే, ఈ తరం సినీ రూపకర్తలు తమదైన కొత్త భాషనూ, భావ వ్యక్తీకరణనూ ఆవిష్కరించు కోవాలి. అది కీలకం. ఇప్పుడు మళ్ళీ అన్ని రంగాల్లో ఆ పాత వైభవాన్ని పునరుద్ధరించాలంటే, తగిన కృషి చేయాల్సిన బాధ్యత యువతరానిదే! ఈ సమాజంలోని ఆలోచనాపరులం, బాధ్యతాయుతమైన పౌరులమైన ప్రతి ఒక్కరం ఆలోచించి, ఆ విషయంలో ఏ కొద్దిగానైనా మద్దతుగా నిలిస్తే ఎంతో చేయవచ్చు! అది నా ఆశ, ఆకాంక్ష మాత్రమే కాదు... అభ్యర్థన కూడా!! - సంభాషణ: రెంటాల జయదేవ -
'సినిమా రచయితలంటే అంత చిన్నచూపా?'
భారతీయ సినిమా పరిశ్రమలో సినీ రచయితలను చిన్న చూపు చూస్తున్నారని ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత రమేష్ అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. దర్శకులు మొత్తం తామే చక్కబెట్టేయాలని అనుకోవడం వల్లే ఈ దుస్థితి వస్తోందని అంటున్నారు. 'ఇక్కడ సమస్య ఏమిటంటే, ప్రతి ఒక్కళ్లూ ఇతరుల పనిలో వేలు పెడతామంటారు. దర్శకులు తాము దర్శకత్వం వహించి, రాసి, ఇంకా చాలా పనులు చేస్తున్నారు. అది సరికాదని నా అభిప్రాయం. సినిమాలోని ఇతర శాఖల్లో చాలా టాలెంట్ ఉంది. దాన్ని మనం వెలికితీసి, అందరితో ఆయా పనులు చేయించాలి. మన వద్ద మంచి రచయిత ఉంటే అతడికి రాసే అవకాశం ఇవ్వాలి. నాలుగు రూపాయల కోసం వాళ్ల అవకాశాలు లాక్కోవడం సరికాదు. నేనెప్పుడూ ఇతరుల శాఖల్లో వేలుపెట్టను' అని రమేష్ అరవింద్ చెప్పారు. ఆయన తాజాగా దర్శకత్వం వహిస్తున్న ఉత్తమ విలన్ చిత్ర కథను కమల్ హాసన్ రాశారు. -
మనతరం మహాదర్శకుడు
- శ్యామ్ బెనగళ్ వందేళ్ల భారతీయ సినిమా ప్రస్థానంలో దిగ్గజాల వంటి దర్శకులు అతి కొద్దిమంది మాత్రమే. వారి జాబితాను రూపొందిస్తే, మొదటి పదిమందిలో కచ్చితంగా చోటు పొందే దర్శకుడు శ్యామ్ బెనగళ్. న్యూవేవ్ సినిమాలో ఆయన ‘భూమిక’ నిరుపమానం. నసీరుద్దీన్ షా, షబానా అజ్మీ, ఓంపురి, స్మితా పాటిల్, అమ్రిష్‌పురి, కుల్‌భూషణ్ ఖర్బందా వంటి మేటి నటీ నటులను వెలుగులోకి తెచ్చిన ఘనత ఈ హైదరాబాదీదే. బెనగళ్ రూపొందించిన ‘మంథన్’ చిత్ర నిర్మాణం భారతీయ సినీచరిత్రలోనే ఓ మైలురాయి. సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి ప్రాంతంలో పుట్టి పెరిగిన శ్యామ్ బెనగళ్ విద్యాభ్యాసం ఇక్కడే కొనసాగింది. నిజాం కాలేజీ నుంచి ఎకనామిక్స్‌లో ఎంఏ పూర్తి చేశాక బాంబేలోని లింటాస్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో కాపీ రైటర్‌గా కెరీర్ ప్రారంభించారు. విద్యార్థిగా హైదరాబాద్‌లో ఉన్న కాలంలోనే హైదరాబాద్ ఫిలిం సొసైటీ ఏర్పాటు చేశారు. యాడ్స్ రంగంలో కొనసాగుతుండగానే తొలిసారిగా 1962లో ‘ఘెర్ బెతా గంగా’ (గంగానది ముంగిట) గుజరాతీ డాక్యుమెంటరీని రూపొందించారు. దాదాపు 900 స్పాన్సర్డ్ డాక్యుమెంటరీలు, యాడ్ ఫిలింలు రూపొందించారు. ప్రతిష్టాత్మకమైన పుణే ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్లో 1966-73 కాలంలో విద్యార్థులకు నటన, దర్శకత్వంలో మెలకువలను బోధించారు. ఈ ఇన్స్టిట్యూట్కు 1980-83, 1989-92లో రెండు పర్యాయాలు చైర్మన్‌గా కూడా సేవలందించారు. హోమీబాబా ఫెలోషిప్‌పై అమెరికా వెళ్లి న్యూయార్క్‌లోని చిల్డ్రన్స్ టెలివిజన్ వర్క్‌షాప్, బోస్టన్ డబ్ల్యూజీబీహెచ్-టీవీలలో 1970-72 మధ్య కాలంలో పనిచేశారు. తొలి చిత్రం నుంచే అవార్డుల పరంపర అమెరికా నుంచి బాంబే తిరిగి వచ్చేశాక, 1973లో ‘అంకుర్’ రూపొందించారు. షబానా అజ్మీ, అనంత నాగ్‌లకు కూడా ఇదే తొలిచిత్రం. జాతీయ స్థాయిలో ద్వితీయ ఉత్తమ చిత్రంగా అవార్డు పొందింది. ఇందులోని నటనకు షబానా అజ్మీకి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు లభించింది. తొలి చిత్రం నుంచే బెనగళ్‌కు అవార్డు పరంపర మొదలైంది. ఉత్తమ చిత్రాలకు ఏకంగా ఏడుసార్లు జాతీయ అవార్డులు అందుకున్న ఘనత ఆయనకే దక్కింది. నిశాంత్ (1976), మంథన్ (1977), భూమిక (1978), జునూన్ (1979), ఆరోహణ్ (1982), త్రికాల్ (1986), సూరజ్‌కా సాథ్వా ఘోడా (1993), మమ్మో (1995), ‘ది మేకింగ్ ఆఫ్ మహాత్మ’ (1996), సర్దారీ బేగం (1997) వంటి చిత్రాలు బెనగళ్‌కు జాతీయ అవార్డులతో పాటు అంతర్జాతీయ గుర్తింపునూ తెచ్చిపెట్టాయి. గుజరాత్ క్షీర విప్లవం నేపథ్యంలో బెనగల్ రూపొందించిన ‘మంథన్’కు అక్కడి పాడి రైతులే నిర్మాతలుగా వ్యవహరించడం అరుదైన చరిత్ర. గుజరాత్ పాడి సహకార సంఘంలోని ఐదులక్షల మంది సభ్యులు రెండేసి రూపాయల చొప్పున ఈ చిత్ర నిర్మాణానికి సమకూర్చారు. విడుదలయ్యాక వారందరూ బళ్లు కట్టించుకుని మరీ థియేటర్లకు వచ్చి చూడటంతో ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. బుల్లితెరపైనా తనదైన ముద్ర బెనగళ్ బుల్లితెరపైనా తనదైన ముద్ర వేశారు. ‘భారత్ ఏక్ ఖోజ్’ టీవీ సిరీస్ ఆయనను బుల్లితెర ప్రేక్షకులకు చేరువ చేసింది. రైల్వే శాఖ కోసం రూపొందించిన ‘యాత్ర’, భారత రాజ్యాంగంపై రూపొందించిన ‘సంవిధాన్’ వంటి టీవీ సిరీస్‌లు ఆయనకు పేరు తెచ్చిపెట్టాయి. సత్యజిత్ రే, మహాత్మాగాంధీ, నేతాజీ సుభాష్‌చంద్ర బోస్‌లపై రూపొందించిన బయోగ్రాఫికల్ చిత్రాలు విమర్శకుల మన్ననలు పొందాయి. భారత ప్రభుత్వం బెనగళ్‌కు 1976లో పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్ అవార్డులు ప్రకటించింది. సినీరంగంలో చేసిన కృషికి గుర్తింపుగా 2007లో సినీరంగానికే తలమానికమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. ఇవేకాదు, పలు అంతర్జాతీయ అవార్డులు సైతం ఆయనను వరించాయి. - పన్యాల జగన్నాథదాసు -
మన నూరేళ్ళ సినిమాపై... మంచు విష్ణు డాక్యుమెంటరీ సిరీస్!
భారతీయ సినిమా ఇప్పటికి 101 ఏళ్ళు పూర్తి చేసుకొని, దిగ్విజయంగా ముందుకు వెళుతోంది. మూగగా మొదలై మాటలు నేర్చిన సినిమా తెలుగు భాషలోనూ ఇప్పటికి 82 ఏళ్ళుగా సామాన్యుల్ని అలరిస్తూనే ఉంది. అయితే, వేషభాషలతో సహా మానవ జీవితాన్నే ఎంతో మార్చేసిన ఈ శతాధిక వత్సర అద్భుతం తాలూకు చరిత్ర ఇప్పటికీ సమగ్రంగా రికార్డు కాలేదనే చెప్పాలి. కొద్దిమంది ప్రయత్నాలు చేసినా, ఆర్థిక వనరుల కొరత మొదలు అనేక ఇబ్బందులతో సంతృప్తికర ఫలితాలు తెరపైకి రానే లేదు. ఈ నేపథ్యంలో మన తెలుగు హీరో - నిర్మాత మంచు విష్ణు తాజాగా ఓ ప్రయత్నం చేస్తున్నారు. నూరు వసంతాల భారతీయ సినిమాపై ఓ డాక్యుమెంటరీ సిరీస్‌ను తీయాలని భావిస్తున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే దర్శకత్వంలో రూపొందిన తొలి భారతీయ మూకీ ఫీచర్ ఫిల్మ్ ‘రాజా హరిశ్చంద్ర’ (1913) దగ్గర మొదలుపెట్టి, హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలో 1932 ఫిబ్రవరి 6న విడుదలైన తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ మీదుగా ఇప్పటి వరకు మన సినీ ప్రస్థానాన్ని పలు భాగాల డాక్యుమెంటరీగా తెర కెక్కించనున్నట్లు భోగట్టా. విష్ణు తీసే ఈ డాక్యుమెంటరీ సిరీస్‌కు ఆయన తండ్రి, నటుడు, నిర్మాత అయిన మోహన్‌బాబు ఆర్థికంగా అండగా నిలుస్తున్నట్లూ, తెలుగు సినీ పరిశ్రమకు తమ వంతు సేవగా ఈ ప్రయత్నం చేస్తున్నట్లూ కృష్ణానగర్ కబురు. ఈ విశిష్ట ప్రయత్నంపై వినవస్తున్న వార్తల గురించి ‘సాక్షి’ ప్రతినిధికి విష్ణు వివరణనిస్తూ, ‘‘అవును. డాక్యుమెంటరీ సిరీస్ తీయాలనుకుంటున్నది నిజమే’’ అని అంగీకరించారు. ‘‘నేను కొన్ని భాగాలు తీస్తే, మరో ప్రముఖ దర్శకుడు కొన్ని భాగాలు తీస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నాం’’ అని ఈ యువ హీరో తెలిపారు. మరో వారం రోజుల్లో ఈ డాక్యుమెంటరీ ప్రయత్నం గురించి పూర్తి వివరాలను అధికారికంగా తెలియజేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వివరాల మాట అటుంచితే, మన సినిమా చరిత్ర రికార్డు కాలేదని ఆవేదన చెందుతున్న సినీ ప్రియులకు ఇది శుభవార్తే. సాధికారికమైన సమాచారంతో, సమగ్రంగా ఈ డాక్యుమెంటరీ ప్రయత్నం సాగితే అంతకన్నా ఇంకేం కావాలి! ఆల్ ది బెస్ట్ విష్ణూ! -
దాహపు మనిషి
సత్వం: గురుదత్ ప్రస్తావన లేకుండా భారతీయ సినిమా సంపూర్ణం కాదు. భారతీయ సినిమాకు ముఖంగా పాశ్చాత్యులు పరిగణించే సత్యజిత్ రే మీద ఒక విమర్శ ఏమిటంటే, రే ప్రధాన ప్రేక్షకులు భారతీయేతరులే! కానీ గురుదత్ అలాకాదు. మౌఖిక సంప్రదాయంగా తరతరాలుగా వస్తున్న సంగీత సాహిత్యాలకు పెద్దపీట వేశాడు. భారతీయ సినిమా తనకంటూ రూపొందించుకున్న నిర్దిష్టరూపాన్ని పాటిస్తూనే, సారంలో ఉన్నతిని ప్రదర్శించాడు. కెమెరాను స్వీయ వ్యక్తీకరణకు వాడుకున్నాడు. వసంతకుమార్ శివశంకర్ పదుకోణెగా బెంగళూరులో జన్మించాడు గురుదత్. పూర్తి దక్షిణాదివాడు. పేరు మార్చుకునేలా చేసింది ఆయన ఇష్టంగా పీల్చిన బెంగాలీ గాలి! ఆయన సినిమాల్లో కూడా మార్మికత, అస్పష్టత లాంటి వంగతనం కనబడేది అందుకే! ఒక కథ తట్టగానే అందులో లీనమవడం, అది ఉత్సాహమివ్వడం మానేయగానే దాన్ని వదిలేసి మరో కొత్తదాన్లో పడిపోవడం గురుదత్ స్వభావమట! పిల్లాడు బొమ్మను పొందేదాకా చాలా ముఖ్యమైందన్నంత పట్టింపు కనబరిచి, తీరా చేతిలోకొచ్చాక అటూయిటూ తిప్పి కిందపడేస్తాడు కదా, అలా ఉండేదట గురు శైలి. ఏ సన్నివేశమూ ఆయనకు ఒకపట్టాన నచ్చేది కాదు. ‘ఏక్ ఔర్, ఇంకోటి, ఇంకోటి,’ అంటూ తీస్తూపోయేవాడు. మరింత మెరుగైనది ముందుందని నమ్మేవాడు. ‘ప్యాసా’లోని ఒక సన్నివేశానికైతే 104 టేక్స్ చేశామని గురుదత్ ఆస్థాన సినిమాటోగ్రాఫర్ వి.కె.మూర్తి అంటారు. అందుకే, నిర్మాతలను విసిగించలేకే తొలిహిట్లతో కూడబెట్టిన డబ్బుతో స్వయంగా నిర్మాణానికి పూనుకున్నాడు గురుదత్. ఈ సన్నివేశానికి సిద్ధమవుతూ కూడా, తరువాయి సన్నివేశం గురించి ఆలోచించేవాడట గురుదత్. సృజనాత్మక మెదడు ఎప్పుడూ ఖాళీగా ఉండనట్టుగా, ఏదో లోకంలో ఉండేవాడు. ‘పిలవగానే ఒక్కసారిగా మేల్కొన్నట్టుగా అందులోంచి బయటకు వచ్చేవాడు’.‘ప్యాసా’లో నిజానికి దిలీప్‌కుమార్ నటించాల్సింది! కానీ పారితోషికం విషయంలో వచ్చిన చిక్కులవల్ల తానే ఆ ‘కవి’ పాత్రను పోషించేందుకు సిద్ధపడ్డాడు గురుదత్. అది క్లాసిక్‌గా నిలవడానికి అదీ ఒక కారణమంటారు విమర్శకులు. ఏ దర్శకుడైనా తన జీవితంలో ఉన్నది సినిమాలో కలపకుండా ఉండడు. మెరుగుల ప్రపంచంలో నిలబడలేని తనలాంటి సున్నితమైన దర్శకుడి జీవితాన్నే ‘కాగజ్ కె ఫూల్’లో పాక్షికంగానైనా తెరకెక్కించడం గురుదత్‌కే చెల్లింది. అయితే, చిత్రంగా కాగజ్ కె ఫూల్‌ను అప్పటి ప్రేక్షకులు తిప్పికొట్టారు. తెరమీదకు రాళ్లు విసిరారు. రచ్చ గెలిచాకే, ఇంట్లోనూ హారతి పట్టడం మొదలైంది. కానీ గురుదత్ మనసు తీవ్రంగా గాయపడింది. ఒకటి మాత్రం నిజం. ప్రేక్షకుల ప్రమాణం పాక్షికమే! కాలమే సిసలైన నిర్ణేత. రాళ్లు వేయించుకోవడానికి ‘సిద్ధపడ్డవాడి’కే కాలం పూలు జల్లుతుంది, తన పరీక్ష తాను పెట్టి! ‘పరిశ్రమకు కొత్తగా వచ్చినవాళ్లకు ఆయన మంచి దర్శకుడు. కొత్తవాళ్ల పరిమితుల్ని అర్థంచేసుకుని, వాటిని పరిష్కరించేవారు,’ అంటారు దత్ ఆస్థాన నటి వహీదా రెహమాన్. అంత జీవితాన్ని చూశాక కూడా, ఆయన తన సమస్యల్ని పరిష్కరించుకోలేకపోవడం విధి వైచిత్రి! జానీ వాకర్‌తో కలిసి చేపలు పట్టడానికి వెళ్లేవాడు. వి.కె.మూర్తితో దోశ, భేల్పూరి తినడానికి పోయేవాడు. విపరీతంగా సిగరెట్లు కాల్చేవాడు. మితం లేకుండా మద్యం తాగేవాడు. అటు భార్య గీతాదత్తో సర్దుబాటు కాలేక, ఇటు వహీదాతో కొత్త జీవితంలోకి అడుగిడలేక నలిగిపోయాడు. (భర్తను భరించలేక) భార్య పిల్లల్తో సహా దూరమైపోవడం, వహీదా వేరే దర్శకులతో సినిమాలు తీయాలని నిర్ణయించుకోవడం, కొత్తగా జతచేరిన ఆర్థిక ఇబ్బందులు... అప్పటికే సొంతిల్లు అమ్మాడు. అద్దింట్లోకి మారాడు. ‘నేను అనాథను అయ్యాను. ఇంట్లోవాళ్లు లేరు. నువ్వు(వి.కె.మూర్తి) బెంగుళూరు వెళ్లిపోతున్నావు, అబ్రార్ (అల్వీ-గురుదత్ ఆస్థాన రచయిత) ఇంకో సినిమా రాయడానికి మద్రాసు వెళ్తున్నాడు, నేను ఏం చేయను?’ అన్నాడట, చివరిసారి తనను కలిసిన మిత్రులతో. ‘చూడు, నేను దర్శకుడిని కావాలనుకున్నాను, దర్శకుడిని అయ్యాను; నటుణ్ని కావాలనుకున్నాను, నటుణ్నయ్యాను; మంచి పిక్చర్లు తీయాలనుకున్నాను, మంచివి తీశాను. పైసలున్నాయి, అన్నీ ఉన్నాయి, అయినా నా దగ్గర ఏమీలేదు,’ అనుకునేంత నిరాశలోకి కూరుకుపోయాడు. 39వ ఏట తనను తానే హత్య చేసుకున్నాడు. ‘యార్, జీవితంలో ఉన్నవేమిటి? రెండే రెండు విషయాలు... విజయం, పరాజయం. వీటికి మధ్యన ఏదీలేదు,’ అన్నాడో సందర్భంలో గురుదత్. ఆయన సినిమాల్లో సక్సెస్ అయ్యాడుగానీ జీవితంలో ఫెయిల్ అయ్యాడంటారు. కానీ ఆయనకు జీవితమే సినిమా అయినప్పుడు, జీవితంలో మాత్రం ఫెయిల్ అయ్యాడని అనగలమా! -
టీవీ సీరియల్లో బిగ్ బీ
‘‘భారతీయ సినిమా వయసు వందేళ్లు. ఈ వందేళ్లల్లో సినిమా ఎంతో ఎదిగిన విషయం తెలిసిందే. వెండితెర అంత వయసు బుల్లితెరకు లేకపోయినా.. దాని ఎదుగుదల మాత్రం బ్రహ్మాండంగానే ఉంది. ముఖ్యంగా గత పదిహేను, ఇరవై ఏళ్లల్లో సినిమా వసూళ్లను సైతం తగ్గించే స్థాయికి బుల్లితెర ఎదిగింది’’ అంటున్నారు అమితాబ్ బచ్చన్. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ గేమ్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన అమితాబ్ ఇప్పుడో ధారావాహికలో నటిస్తున్నారు. ‘యుద్ధ్’ పేరుతో రూపొందుతున్న ఈ సీరియల్లో అమితాబ్ పాత్ర పేరు ‘యుధిష్ఠిర్’. ఈ ధారావాహిక గురించి బిగ్ బీ చెబుతూ -‘‘ఎప్పటి నుంచో ఓ సీరియల్లో నటించాలనుకున్నా. ‘యుద్ధ్’ కథాంశం, పాత్ర నచ్చడంతో నటించాలనుకున్నా. దర్శకుడు అనురాగ్ కశ్యప్ విభిన్న తరహాలో ఈ సీరియల్ చేస్తానని మాటిచ్చారు. ఆ మాటను నిజం చేస్తూ, అద్భుతంగా తీస్తున్నారు’’ అని చెప్పారు. ఈ సీరియల్లో నటించడమే కాదు.. యశ్‌రాజ్ ఫిలింస్‌తో కలిసి దీన్ని ఆయన నిర్మిస్తున్నారు కూడా. ఓ వ్యక్తి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. జీవితంలో ఆరోగ్యం, ఇతర విషయాలపరంగా అతను ఎదుర్కొనే సమస్యలు, కుటుంబంతో అతని అనుబంధం నేపథ్యంలో ఈ సీరియల్ సాగుతుంది. అతని జీవితమే ఓ యుద్ధంలాంటిది కాబట్టే, ‘యుద్ధ్’ అని టైటిల్ పెట్టారు. -
‘శత వసంతాల’ డాక్యుమెంటరీలో తెలుగు గళాలు
భారతీయ సినిమాకు శత వసంతాలు పూర్తయి, అప్పుడే ఏడాది అయిపోయింది. అయితే, ప్రపంచంలోని అతి పెద్ద సినీ పరిశ్రమల్లో ఒకటైన మన సినీ రంగానికి సంబంధించి హంగామా మాత్రం తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల వాళ్ళు కూడా శత వసంత భారతీయ సినిమా గురించి మరింతగా తెలుసుకొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకు తగ్గట్లే బ్రిటన్‌లో పుట్టి, అక్కడే పెరిగిన ప్రముఖ హాస్యనటుడు, సమాచార ప్రసార నిపుణుడు సంజీవ్ భాస్కర్ మన దేశానికి వచ్చి, ఓ డాక్యుమెంటరీ రూపొందిస్తున్నారు. అందులో భాగంగా భారతీయ సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తున్నారు. తాజాగా ఆయన మన తెలుగు సినిమాకు సంబంధించి కూడా ఇంటర్వ్యూలు చేశారు. ‘మగధీర’, ‘ఈగ’, తాజాగా సెట్స్‌పై ఉన్న ‘బాహుబలి’ ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించిన సంచలన దర్శకుడు రాజమౌళి కూడా అలా ఇంటర్వ్యూ ఇచ్చిన వారిలో ఒకరు. రాజమౌళితో పాటు హీరో దగ్గుబాటి రానా, ఇంకా ‘బాహుబలి’ టీమ్‌లోని పలువురు నటులు, సాంకేతిక సిబ్బంది ఈ డాక్యుమెంటరీ కోసం తమ భావాలను పంచుకున్నారు. ‘‘గతంలో బి.బి.సి.లో వచ్చిన ‘ది కుమార్స్ ఎట్ నంబర్ 42’, ‘గుడ్నెస్ గ్రేషియస్ మి’ కామెడీ సిరీస్‌ల ఫేమ్ సంజీవ్ భాస్కర్ చిత్రీకరిస్తున్న నూరేళ్ళ భారతీయ సినిమా డాక్యుమెంటరీ కోసం ఆయనతో మాట్లాడాను. అది ఎంతో సంతోషాన్నిచ్చింది’’ అని రాజమౌళి తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. గతంలో భారతదేశమంతటా తిరిగి, మన దేశం గురించి ‘ఇండియా విత్ సంజీవ్ భాస్కర్’ పేరిట డాక్యుమెంటరీ సిరీస్‌ను సమర్పించి, నటించిన అనుభవం యాభయ్యేళ్ళ సంజీవ్‌ది. అలా ఇప్పటి పాకిస్తాన్‌లోని తన తాతల నాటి ఇంటిని కూడా ఆయన చూసి వచ్చారు. బి.బి.సి.లో సమర్పించిన కామెడీ సిరీస్‌లతో పాటు ఈ డాక్యుమెంటరీ ఆయనకు ఎంతో పేరు తెచ్చింది. కాబట్టి, ఆయన తీస్తున్న ఈ తాజా నూరేళ్ళ భారతీయ సినిమా డాక్యుమెంటరీ కూడా చరిత్రలో నిలిచిపోతుందని ఆశించవచ్చు. మరి, ఇన్నేళ్ళ మన సినిమా గురించి, అందులోనూ తెలుగు సినిమా గురించి నవతరం దర్శకుడు రాజమౌళి, ఇతర తెలుగు ప్రముఖులు తమ భావాలు పంచుకోవడం ఆనందించదగ్గ విషయమేగా! -
బీబీసీ 'వందేళ్ల సినిమా' డాక్యుమెంటరీలో రాజమౌళి!
చెన్నై: వందేళ్ల భారతీయ సినిమాపై బీబీసీకి చెందిన సంజీవ్ భాస్కర్ రూపొందిస్తున్న డాక్యుమెంటరీలో ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కనిపించనున్నారు. . ఈ డాక్యుమెంటరీలో బాహుబలి చిత్రంలో నటిస్తున్న కొంతమంది నటులు కూడా డాక్యుమెంటరీలో పాలుపంచుకున్నారు. సంజీవ్ భాస్కర్ ను కలుసుకోవడం గొప్ప అనుభూతిని కలిగించింది. బాహుబలిలో నటిస్తున్న రానా, ఇతర నటీనటులను ఇంటర్వ్యూ చేశారు. అని సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ లో రాజమౌళి పోస్ట్ చేశారు. బీబీసీ కి చెందిన సంజీవ్ భాస్కర్ ఇటీవల హైదరాబాద్ లో పర్యటించి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల అభిప్రాయాలను రికార్డు చేశారు. రాజమౌళి రూపొందిస్తున్న బాహుబలి చిత్రం గురించి సంజీవ్ ఆసక్తిగా తెలుసుకున్నట్టు తెలిసింది. 2015లో విడుదలయ్యే బాహుబలిలో ప్రభాస్, రానా, అనుష్క, సుదీప్, నాజర్, ప్రకాశ్ రాజ్ లు నటిస్తున్నారు. -
మూగకు మాటొచ్చిన వేళ!
తొలి టాకీ ‘ఆలమ్ ఆరా’ విడుదల భారతీయ సినీ రంగానికి ఓ కొత్త దోవ చూపింది. మూగ సినిమాలతో తెరపై బొమ్మల వినోద పరిశ్రమకు తెర తీసిన దాదాసాహెబ్ ఫాల్కే ‘భారతీయ సినిమాకు పితామహుడి’గా పేరు తెచ్చుకుంటే, మాట-పాటతో కూడిన టాకీ చిత్రాన్ని రూపొందించిన అర్దేషిర్ ఎం. ఇరానీ ‘భారతీయ టాకీ పితామహుడి’గా ప్రతిష్ఠనందుకున్నారు. మూకీ చిత్రాల హవా సాగుతున్న రోజుల్లో పాక్షిక టాకీ అయిన హాలీవుడ్ చిత్రం ‘షో బోట్’ చూసి, పాశ్చాత్య దేశాల్లోని టాకీ పరిణామాన్ని గ్రహించి, ఆ స్ఫూర్తితో మన చిత్రాలకు కూడా మాటను జత చేయాలని ఇరానీ ధైర్యం చేశారు. షూటింగ్ సమయంలోనే శబ్దాన్ని కూడా రికార్డు చేసే చిత్రీకరణ సామగ్రిని తీసుకురావడం కష్టమైతే, ఇక ఆ టాకీలను ప్రదర్శించే శబ్ద సాంకేతిక పరిజ్ఞానం మన సినిమా హాళ్ళలో అసలే లేదు. అయినా సరే ఇరానీ వెనక్కి తగ్గలేదు. కష్టనష్టాలకు ఎదురొడ్డి, స్వీయ చిత్ర నిర్మాణ సంస్థ ‘ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ’లో ‘ఆలమ్ ఆరా’ తీశారు. బొంబాయిలోని తమ సొంత సినిమా హాలైన ‘మెజెస్టిక్ సినిమా’లో 1931 మార్చి 14న విడుదల చేశారు. అప్పటి దాకా మన చలనచిత్రాల్లోని పాత్రలు సైగలతో అభినయిస్తూ, దృశ్యానికీ దృశ్యానికీ మధ్య ‘టైటిల్ కార్డుల’ రూపంలో చూపే డైలాగ్ కార్డులతోనే ప్రేక్షకులకు విషయాన్ని చెప్పేవి. అలాంటిది... ప్రేక్షకులను ఆశ్చర్యానందాల్లో ముంచెత్తుతూ, ‘ఆలమ్ ఆరా’లోని పాత్రలన్నీ తమ నోటి మాటతో శ్రవణానుభవాన్ని చ్చాయి. భారత సినీ చరిత్రలో నవ శకానికి నాంది పలికాయి. విదేశీ చిత్రాల దిగుమతితో ఎగ్జిబిటరైన ఇరానీ మన దేశంలోనే మూకీ చిత్రాలు తయారవడం మొదలయ్యాక, 1922 నుంచి నిర్మాతగా పౌరాణికాలు, చారిత్రకాలతో సహా ఎన్నో మూకీ చిత్రాలు తీశారు. ఎన్నెన్నో ఘన విజయాలను అందుకున్నారు. భారతీయ సినీ ప్రముఖులైన పృథ్వీరాజ్ కపూర్, మెహబూబ్ ఖాన్, సులోచన (రూబీ మేయర్స్) ఇరానీ సంస్థ ‘ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ’లో కెరీర్‌కు శ్రీకారం చుట్టుకున్నవారే!‘తొలి’ ఘనత కోసం పోటాపోటీ: దేశంలో తొలి పూర్తి నిడివి టాకీ చిత్రాన్ని తానే తీయాలని ఇరానీ పట్టుదలగా శ్రమిస్తున్నప్పుడు ఓ పక్క కలకత్తా ‘మదన్ థియేటర్స్’, మరోపక్క బొంబాయి ‘కృష్ణా కంపెనీ’ల నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఆఖరుకు ఆట, పాటలతో కొన్ని లఘుచిత్రాలను కూడా ఈ పోటీ సంస్థలు విడుదల చేశాయి. వీటన్నిటినీ తట్టుకొని, ఇరానీ ‘ఆలమ్ ఆరా’తో సరిగ్గా 83 ఏళ్ళ కిందట రికార్డుల్లోకి ఎక్కారు. తీయడంలో సినిమా కష్టాలు: మూకీలను అప్పట్లో రిఫ్లెక్టర్ల సాయంతో సూర్యకాంతిలో చిత్రీకరించేవారు. కానీ, శబ్దమూ రికార్డు చేయాల్సి వచ్చేసరికి, పరిసరాలన్నీ నిశ్శబ్దంగా ఉండేలా రాత్రి వేళ, అరడజను లైట్ల మధ్య ఇండోర్ షూటింగ్ చేశారు. ఆ సినిమా కోసం ఒకే సిస్టమ్‌తో కూడిన ట్యానర్ రికార్డింగ్ సామగ్రిని విదేశాల నుంచి తెప్పించారు. విదేశీ నిపుణుడిని గమనిస్తూ పని నేర్చుకొని, చివరకు ఇరానీయే రికార్డింగ్ కూడా చేశారు. సంస్థలోని దర్శకు లందరూ పనిచేసిన ఈ సినిమాకు రుస్తుమ్ భరూచా, పేసీ కరనీ, మోతీ గిద్వాయ్ల సహకారంతో తాను దర్శకత్వం వహించినట్లు ఇరానీ చెప్పారు. అప్పట్లో మూకీ చిత్ర నిర్మాణం మహా అయితే నెల లోపలే పూర్తయ్యేది. ఆ సమయంలో దృశ్యంతో పాటు, శబ్దాన్ని కూడా రికార్డు చేయాల్సిన నవీన రూపమైన ఈ తొలి టాకీ చిత్ర నిర్మాణానికి చాలా రోజులే పట్టింది. ఎట్టకేలకు నాలుగు నెలల శ్రమతో, నలభై వేల ఖర్చుతో ఈ 10,500 అడుగుల సినిమా పూర్తయింది. ఎనిమిది వారాల పాటు బాక్సాఫీస్‌ను ఊపేసింది. అది ఓ సంచలనం: ప్రసిద్ధ పార్శీ నాటకకర్త జోసెఫ్ డేవిడ్ పాపులర్ రచన ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. సంచార జాతికి చెందిన ఓ అమ్మాయికీ, రాకుమారుడికీ మధ్య ప్రేమ చుట్టూ కథ నడుస్తుంది. మాస్టర్ విఠల్ హీరోగా, జుబేదా హీరోయిన్గా, రంగస్థల ప్రముఖుడు పృథ్వీరాజ్ కపూర్ హీరోయిన్ తండ్రిగా కనిపించే ‘‘సంపూర్ణ మాట, పాట, నృత్యాల’’ ‘ఆలమ్ ఆరా’ విడుదల అప్పట్లో ఓ సంచలనం. రిలీజ్ రోజున తెల్లవారుజాము నుంచే జనం బొంబాయిలోని ‘మెజెస్టిక్ సినిమా’ వద్ద గుంపులు గుంపులుగా చేరారు. ట్రాఫిక్ స్తంభించింది. హాలులోకి వెళ్లడానికి దర్శక, నిర్మాతలే నానా కష్టాలు పడాల్సొచ్చింది. జనాన్ని అదుపు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు. వారాల తరబడి టికెట్లు అమ్ముడైపోయాయి. తెర మీద కదలడమే కాక, తమకు అర్థమైన భాషలో మాట్లాడే బొమ్మ చూడడానికీ, ‘దే దే ఖుదా కే నామ్ పే...’ అంటూ వెండితెరపై వినిపించిన తొలి భారతీయ సినీ గీతంతో సహా మొత్తం 7 పాటలు, పాత్రధారుల డైలాగులు వినడానికీ ప్రేక్షకులు హాళ్ళకు విరగబడ్డారు. మామూలు రేటు కన్నా దాదాపు 20 రెట్ల ఎక్కువకు బ్లాకులో టికెట్లు అమ్ముడయ్యాయి. బిచ్చమెత్తుకుంటున్న ఓ ఫకీరు పాత్ర (వజీర్ మొహమ్మద్ ఖాన్ పోషించారు) పాడుతుండగా, కేవలం ఓ తబలా, ఓ హార్మోనియమ్, ఓ వయొలిన్ సాయంతో ఏకకాలంలో రికార్డింగ్, చిత్రీకరణ జరుపుకొన్న ఆ తొలి పాట ఆ రోజుల్లో అందరి నోటా వినిపించేది. పాటలు, నృత్యాలతో కూడిన ఈ సినిమా మన దేశంలోనే కాక బర్మా, శ్రీలంక, పశ్చిమ ఆసియాలోనూ ప్రాచుర్యం సంపాదించుకుంది. ఇదే కథను దర్శకుడు నానూభాయ్ వకీల్ 1956లో, ’73లో రెండు సార్లు రీమేక్ చేశారు. టాకీ తెచ్చిన మార్పులు: హిందీ, ఉర్దూ భాషల మిశ్రమమైన ‘హిందుస్తానీ’లో తీసిన ‘ఆలమ్ ఆరా’లో అనేక సాంకేతిక లోపాలున్నా, టాకీ అనుభవానికి ప్రేక్షకులు మంత్రముగ్ధులై, కాసులు కురిపించారు. గళం ప్రధానం కావడంతో రంగస్థల నటీనటుల్ని దర్శక - నిర్మాతలు తీసుకోసాగారు. అప్పటి దాకా మూకీల్లో ప్రసిద్ధ తారలుగా వెలిగిన ఆంగ్లో - ఇండియన్ నటీమణులు సైతం ధారాళంగా హిందీ, ఉర్దూ మాట్లాడలేక తెరమరుగయ్యారు. విడదీయరాని అనుబంధం: ‘ఆలమ్ ఆరా’ విడుదలైన సరిగ్గా మూడు వారాల కల్లా తొలి బెంగాలీ టాకీ ‘జమాయ్ షష్ఠి’ (1931 ఏప్రిల్ 11న విడుదల)ని మదన్ థియేటర్స్ విడుదల చేసింది. ఇతర ప్రాంతీయ భాషల్లోనూ ఈ మాట - పాటల చిత్రాలకు గిరాకీ వచ్చింది. దాంతో, తమిళంతో పాటు తెలుగు మాటలు, పాటలు కూడా ఉన్న తొలి దక్షిణ భారత టాకీ ‘కాళిదాస్’ (1931 అక్టోబర్ 31)ని హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలో బొంబాయిలోనే ఇరానీ నిర్మించారు. ‘ఆలమ్ ఆరా’ కోసం వేసిన సెట్స్‌లోనే ‘కాళిదాస్’ చిత్రీకరణ జరగడం విశేషం. అలా తొలి భారతీయ టాకీకీ, మన దక్షిణాది టాకీకీ విడదీయరాని బంధం ఉంది. ‘కాళిదాస్’ కూడా లాభాలు తేవడంతో, మన తొలి పూర్తి నిడివి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ (1932 ఫిబ్రవరి 6) హెచ్.ఎం. రెడ్డి నిర్దేశకత్వంలో వచ్చింది. ఈ క్రమంలో అప్పటి దాకా ‘మూకీ’లను ప్రదర్శించిన హాళ్ళన్నీ శబ్దాన్ని వినిపించే సామగ్రితో సినిమా ‘టాకీస్’ అయ్యాయి.‘ఆలమ్ ఆరా’ అంటే లోకానికి ఆభరణం, దీపం అని స్థూలంగా అర్థం. సాధారణంగా ఆడపిల్లలకు పెట్టే పేరు. ఆ సినిమాలో కథానాయిక పాత్ర పేరు అదే! మన టాకీల చరిత్రకు సంబంధించి కూడా ఆ పేరు అతికినట్లే సరిపోతుంది. ఆ చిత్రం మొదలు ఆట, మాట, పాటలే కీలకమైన దినుసులుగా మారిన మన భారతీయ సినిమా ఇవాళ్టికీ ఆ సక్సెస్ సూత్రాన్నే నిత్యనూతనంగా అనుసరిస్తోంది. అలరిస్తోంది. సహస్ర చంద్ర దర్శనం పూర్తి చేసుకున్నప్పటికీ, మన టాకీ ఎవర్‌గ్రీన్‌గా నిలుస్తోంది! అన్నట్లు, ఈ తొలి భారతీయ టాకీ బొంబాయిలో విడుదలైన రోజునే మన తెలుగునేలపై తొలి పర్మనెంట్ థియేటరైన విజయవాడ ‘శ్రీమారుతీ సినిమా’లోనూ ప్రదర్శితమైంది. ఆ రోజుల్లో ఇరానీ దగ్గర ‘ఇంపీరియల్’లో పనిచేస్తూ, ఆయన నిర్మించిన మూకీలు కొన్నింటికి దర్శకత్వం వహించిన మన హెచ్.ఎం. రెడ్డి కూడా ‘ఆలమ్ ఆరా’కు పనిచేశారు. అప్పటికే బొంబాయి సినీరంగంలో ఉన్న మన ఎల్.వి. ప్రసాద్ సైతం ఈ తొలి భారతీయ టాకీకి పనిచేశారు. చిన్న వేషం కూడా వేశారు రెంటాల జయదేవ -
ఆమిర్‌ఖాన్ స్టార్ కాడట?
భారతీయ సినిమా స్టామినాను రెండొందల కోట్లకు తీసుకెళ్లిన హీరో స్టార్ కాడా? ‘ధూమ్-3’ సినిమా విడుదలై పదిహేను రోజులైంది. ఈ కొద్ది రోజుల్లోనే వసూళ్లు 300 కోట్లు దాటాయి. ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన హీరో స్టార్ కాదా? అసలు ఈ ముసుగులో గుద్దులాట దేనికి.. ఆమిర్‌ఖాన్ స్టార్ కాడా? ఈ మాట ఎవరైనా పొరపాటున అంటే.. ‘చిన్న మెదడు చితికిపోయిందేమో’అన్నట్లుగా ఆ మాటలు అన్న వ్యక్తి వైపు జనాలు జాలిగా చూస్తారు. ఎందుకంటే... స్టార్‌గా ఆమిర్కో రేంజ్ ఉంది. ఆయనో సినీ ఎన్సైక్లోపీడియా. దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరు. అలాంటి ఆమిర్‌ని స్టార్ కాదని ఎవరైనా అంటారా? కానీ అన్నారు. అంత ధైర్యం చేసింది ఎవరనుకుంటున్నారా? ఎవరో కాదు... ఆమిర్‌ఖానే. తాను స్టార్‌ని కాదని మీడియా సాక్షిగా ఆయనే చెప్పారు. ఆమిర్ దృష్టిలో స్టార్ అంటే... చెత్త సినిమాక్కూడా ప్రేక్షకుల్ని రప్పించే సత్తా ఉన్నవాడేనట. అలాంటి స్టార్ బాలీవుడ్లో ఒక్క సల్మాన్‌ఖానే నట. నిజంగా సల్మాన్‌కి ఇంతకు మించిన అవార్డు మరొకటి ఉండదేమో. ‘ధూమ్-3’ చిత్రం ఘనవిజయం నేపథ్యంలో ముంబయ్‌లో ఏర్పాటు చేసిన ఓ విలేకరుల సమావేశంలో ఆమిర్ పై అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇంకా చెబుతూ -‘‘ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించే కెపాసిటీ నిజంగా నాకు లేదు. సెలవుదినమైన ఆదివారం రోజున పెద్ద ఎత్తున ప్రేక్షకులు సినిమా హాళ్లకు తరలివస్తారు. అది ఏ సినిమాకైనా జరిగేదే. అదే విధంగా ప్రతిరోజు ప్రేక్షకులను రప్పించాలంటే... అది గొప్ప స్టార్‌కి మాత్రమే సాధ్యం. నేను కచ్చితంగా అలాంటి స్టార్‌ని కాను. సాధారణ నటుణ్ణి మాత్రమే. సెలవులతో ప్రమేయం లేకుండా ప్రతిరోజూ జనాన్ని థియేటర్‌కి తెప్పించే సామర్థ్యం సల్మాన్‌కి మాత్రమే ఉంది’’ అని సల్మాన్‌ని పొగడ్తలతో ముంచెత్తాడు మిస్టర్ పర్ఫెక్ట్. -
విశ్వరూపం-2 తర్వాత సూపర్‌స్టార్
రాబర్ట్ డి నీరో... వయసు 70. కానీ, హీరోగా ఫుల్ బిజీ. ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటారు. అల్ పాసినో... వయసు 73. హీరోగా ఈయనగారూ బిజీయే. ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేయాల్సిందే. ఇంతకీ ఈ ఇద్దరి పేర్లూ ఎక్కడా విన్నట్లు లేదే? అని హాలీవుడ్ సినిమాలు ఫాలో అవ్వనివారు అనుకోవడం సహజం. హాలీవుడ్ స్టార్స్‌లో ఈ ఇద్దరికీ ప్రముఖ స్థానమే ఉంది. ఇక, మన భారతీయ సినిమా విషయానికి వద్దాం. ఏడు పదుల వయసు దాటినవారు హీరోలుగా చలామణీ అవ్వడం చాలా చాలా అరుదైన విషయం. కమల్‌హాసన్ ఇటీవల ఈ విషయం గురించి ఆలోచించి ఉంటారు. అందుకే, ఇదే విషయాన్ని ప్రధానాంశంగా చేసుకుని సినిమా తీయాలనుకుని ఉంటారు. ప్రస్తుతం ఆయన ‘విశ్వరూపం-2’కి దర్శకత్వం వహిస్తూ, నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత పైన పేర్కొన్న కథాంశంతో కమల్ సినిమా చేయాలనుకుంటున్నారని సమాచారం. ఇందులో సూపర్‌స్టార్‌గా కమల్ నటించబోతున్నారట. వయసు మీద పడినంత మాత్రాన సూపర్ స్టార్‌గా రాణించే అవకాశం లేదనే అభిప్రాయాన్ని మార్చే విధంగా ఈ చిత్రం ఉంటుందట. ఈ చిత్రంలో తన స్నేహితుడు మరియు మేనేజర్ పాత్రకు అనంత్ మహదేవన్‌ని అడిగారట కమల్. పలు హిందీ, మరాఠీ చిత్రాలకు దర్శకత్వం వహించడంతోపాటు పలు చిత్రాల్లో నటించారు అనంత్. ప్రస్తుతం ‘విశ్వరూపం-2’లో కూడా నటిస్తున్నారు. దాదాపు పది రోజుల క్రితం ఆయనకు కమల్ ఫోన్ చేసి, తదుపరి చిత్రం గురించి చెప్పారట. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనేది తెలియాల్సి ఉంది. -
భారతీయ సినిమాల్లో ముద్దు సీన్లు అక్కర్లేదు: సైఫ్ అలీఖాన్
హమ్ తుమ్, సలాం నమస్తే లాంటి సినిమాల్లో హీరోయిన్లతో పెదాలు కలిపి ముద్దుసీన్లు తెగ పండించిన హీరో సైఫ్ అలీఖాన్. కానీ, ఇప్పుడు ఆయనే భారతీయ సినిమాలకు ముద్దుసీన్లు అసలు అక్కర్లేదని చెబుతున్నాడు. అలాంటి వాతావరణం అసలు మనకు సరిపడదని, అవేమీ లేకపోయినా మన సినిమాలు ఎంచక్కా ఆడతాయని అంటున్నాడు. 'ద ఫ్రంట్ రో' అనే టీవీ చాట్ షోలో సైఫ్ మాట్లాడాడు. కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ పెళ్లికి ముందు ఓప్రకటన చేశారు. తామిద్దరం కలిసి గానీ, విడివిడిగా గానీ స్క్రీన్ మీద ముద్దు సీన్లలో నటించబోమని అప్పట్లో వారిద్దరూ చెప్పిన విషయాన్ని టీవీ షో వ్యాఖ్యాత అనుపమా చోప్రా ప్రశ్నించారు. ఇవే కాక ఇద్దరూ కలిసి పెట్టుకున్న ఇతర నిబంధనలు ఏమైనా ఉన్నాయా అని చోప్రా సైఫ్‌ను ప్రశ్నించారు. అయితే, అలాంటిదేమీ లేదని సైఫ్ సమాధానమిచ్చాడు. ఆ నిబంధన కూడా లేదని, కానీ సలాం నమస్తే లాంటి సినిమాలు తాను చేసి చాలాకాలం అయ్యిందని చెప్పాడు. భారతదేశంలో అసలు మన సినిమాల్లో ముద్దుసీన్లు అక్కర్లేదని తెలిపాడు. తషాన్, జబ్ వుయ్ మెట్, 3 ఇడియట్స్, హీరోయిన్ లాంటి సినిమాల్లో కరీనా కూడా ముద్దు సీన్లలో నటించిందని గుర్తుచేశాడు. అలాంటి సీన్లు చేసేటప్పుడు గానీ, చూసేటప్పుడు గానీ ఎవరూ అంత సౌకర్యవంతంగా కనిపించరని సైఫ్ అన్నాడు. హాలీవుడ్ సినిమాల్లో చూస్తే ముద్దు సీన్లు గానీ, శృంగార సన్నివేశాలు గానీ చూసినా ఇబ్బంది అనిపించని రీతిలో ఉంటాయన్నాడు. -
వందేళ్ల భారతీయ సినిమా
-
భారతీయ సినిమా శతవసంతాల వేడుకలు ప్రారంభం
భారతీయ సినిమా శత వసంతాల వేడుకలు చెన్నైలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగు, తమిళ సినీ రంగానికి చెందిన నటీనటులు తరలివచ్చారు. వీరిని ముఖ్యమంత్రి జయలలిత ఘనంగా సత్కరించారు. మెమెంటోలు అందజేశారు. పాత, కొత్త తరం నటీనటులందరినీ ఒకే వేదిక చూడడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. భారతీయ సినిమా శత వసంతాల వేడుకల్లో ప్రసంగిస్తున్న జయలలిత అలనాటి నటి సరోజదేవిఅవార్డు అందుకుంటున్న కమలహాసన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ నందమూరి బాలయ్యజయప్రద సిమ్రాన్జయసుధ షావుకారు జానకిజమున మీనా శారద కాంచన రాధ, సిమ్రాన్‌ల ముచ్చట్లు స్టేడియంలో విక్రమ్, విజయ్, రజనీ తనయ సౌందర్య హాస్యనటుడు వివేక్ ఇళయరాజాతో జయలలిత మనోరమ త్రిష వేడుకలలో బోనీ కపూర్ అభిమానులతో కిక్కిరిసిన స్టేడియం -
ఘనంగా వందేళ్ల భారతీయ సినిమా వేడుకలు