
న్యూఢిల్లీ: గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించిన తెలుగు సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’పై బ్రెజిల్ అధ్యక్షుడు లూలా మనసు పారేసుకున్నారు. తనకెంతో నచ్చిన సినిమా అని మెచ్చుకున్నారు. జీ20 సదస్సు కోసం ఢిల్లీకి వచ్చిన లూయిజ్ ఒక ఆన్‌లైన్ పోర్టల్‌కు ఇచి్చన ఇంటర్వ్యూ వివరాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.
ఆ ఇంటర్వ్యూలో ‘ మీకు నచి్చన భారతీయ సినిమా పేరు చెప్పండి’ అన్న ప్రశ్నకు ఆయన ఠక్కున ఆర్‌ఆర్‌ఆర్ అని చెప్పారు. ‘ఇది చక్కని ఫీచర్ ఫిల్మ్. సరదా సన్నివేశాలు, అలరించే డ్యాన్స్‌లతో కట్టిపడేస్తుంది. బ్రిటిషర్లు భారతీయులను ఎంతగా అణచివేశారనేది కళ్లకు కట్టింది’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment